సౌందర్యాన్ని పరిరక్షించుకోవడానికి వివిధ రకాల బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను ఉపయోగిస్తాం. ఇటీవలి కాలంలో కొందరు Beauty Experts వాటిని ఉపయోగించి Instagram లో వాటికి సంబంధించిన రివ్యూలను ఇస్తున్నారు. అయితే వాటిలో ఎక్కువగా కొరియన్ ఉత్పత్తులకు సంబంధించినవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. చర్మ సౌందర్యం కోసం వీటిని ఉపయోగిస్తే చక్కటి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు. అలాంటి ఓ పది రకాల కొరియన్ బ్యూటీ బ్రాండ్లకు చెందిన ఉత్పత్తుల వివరాలు మీకోసం.
1. లానేజ్ వాటర్ స్లీపింగ్ మాస్క్
లానేజ్ వాటర్ స్లీపింగ్ మాస్క్‌ను రాత్రి పూట చర్మానికి రాసుకొంటే.. దానికి లోతైన పోషణ అందుతుంది. దీనిలో ఉన్న హైడ్రో అయెనైజ్డ్ మినరల్ వాటర్ చర్మానికి మెరుగైన పోషణను అంస్తుంది. పొడిగా మారి పగిలినట్లు కనిపించే చర్మాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తుంది. ఈ మాస్క్‌లో గులాబీ, చందనం, ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటాయి. ఈ స్లీపింగ్ మాస్క్ జిడ్డు చర్మ తత్వం కలిగిన వారు ఉపయోగిస్తే మంచి ప్రయోజనం కనిపిస్తుంది.
ధర: రూ. 1,850. ఇక్కడ కొనండి.
2. AMOREPACIFIC- మాయిశ్చర్ బౌండ్ స్కిన్ ఎనర్జీ హైడ్రేషన్ డెలివరీ సిస్టమ్
చాలా కాలం నుంచీ స్కిన్ కేర్ ఉత్పత్తులను అందిస్తూ వినియోగదారుల అభిమానాన్ని చూరగొన్న బ్రాండ్ AMOREPACIFIC. దీని ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ మనం కోరుకొన్న ఫలితాన్నిస్తుంది. ఈ లైట్ వెయిట్ హైడ్రేటింగ్ మిస్ట్ గ్రీన్ టీ, వెదురు రసం, జిన్సెంగ్(ginseng), మాట్సుటకే మష్రూమ్(matsutake mushrooms)లోని గుణాలు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఆయిల్ ఫ్రీ గుణాలున్న ఈ సౌందర్య ఉత్పత్తి చర్మానికి ఇన్స్టెంట్ హైడ్రేషన్ అందిస్తుంది. అలాగే దీనిలో ఉన్న కలువ పూల గుణాలు పొడి చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి.
ధర: రూ. 8,749. ఇక్కడ కొనండి.
3. VJU గ్రీన్ ఫాంటసీ ఫేషియల్ మాయిశ్చరైజర్ డే అండ్ నైట్ క్రీం
చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి మృదువుగా మార్చే మరో కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్ ఇది. ఈ మైల్డ్ క్రీం చర్మం పీహెచ్ స్థాయిని సమతౌల్యం చేస్తుంది. కలబంద, కాక్టస్, గ్రీన్ టీ వంటి చర్మానికి మేలు చేసే పదార్ధాల కారణంగా ఈ క్రీంను డే అండ్ నైట్ క్రీంగా కూడా పిలుస్తారు.
ధర: రూ. 2,374. ఇక్కడ కొనండి.
4. Oh k! గోల్డ్ డస్ట్ అండర్ ఐ మాస్క్
కొన్నిసార్లు మన కళ్ల కింది చర్మం ఉబ్బినట్టుగా.. మరికొన్నిసార్లు సాగినట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఈ కొరియన్ ఐ మాస్క్ వేసుకోవడం ద్వారా మళ్లీ కళ్లను ఫ్రెష్‌గా మార్చేసుకోవచ్చు. ఈ జెల్లో ఉన్న సీరమ్ కళ్ల కింద చర్మానికి పోషణను అందించి మామూలుగా మారుస్తుంది. కాబట్టి ప్రయాణాల సమయంలోనూ.. తక్కువ నిద్రపోయినప్పుడు అలసిన కళ్లను ఈ మాస్క్ తాజాగా మారుస్తుంది.
ధర: రూ. 433. ఇక్కడ కొనండి.
5. ది ఫేస్ షాప్ ది సొల్యూషన్ మాయిశ్చరైజింగ్ ఫేస్ మాస్క్
కొరియన్ ఉత్పత్తుల్లో ఎక్కువ మంది రికమెండ్ చేసే బ్యూటీ ప్రొడక్ట్ ఈ ఫేస్ మాస్క్. నిజానికి ఇది సీరమ్. దీనిలో బీటా హైడ్రాక్సీ యాసిడ్ (బీహెచ్ఏ), సీరమైడ్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. చర్మం వాడిపోయినట్టుగా కనిపించిన సందర్భాల్లో ఈ ఫేస్ మాస్క్ ఉపయోగిస్తే.. అది ఇన్స్టెంట్ బ్రైట్ నెస్‌ను అందిస్తుంది.
ధర: రూ. 150. ఇక్కడ కొనండి.
6. Innisfree ది గ్రీన్ టీ సీడ్ సీరమ్
భారతీయ సౌందర్య ఉత్పత్తుల మార్కెట్లోకి ప్రవేశించిన తొలి కొరియన్ బ్రాండ్లలో ఇన్నిస్ ఫ్రీ కూడా ఒకటి. ఈ సంస్థ వినియోగదారులకు అందిస్తోన్న గ్రీన్ టీ సీడ్ సీరమ్‌లో అమైనో ఆమ్లాలు, గ్రీన్ టీ ఉన్నాయి. ఇవి చర్మాన్ని తేమ కోల్పోకుండా చేస్తాయి. ఈ సీరమ్ అప్లై చేసుకొన్న వెంటనే చర్మంలోకి ఇంకిపోతుంది. దీన్ని ఉదయం, రాత్రి సమయాల్లో మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు.
ధర: రూ. 1,950. ఇక్కడ కొనండి.
7. Etude House బబుల్ టీ స్లీపింగ్ ప్యాక్
చర్మం పొడిబారినట్లుగా.. డీహైడ్రేషన్‌కి గురైనట్లుగా అనిపిస్తే ఈ బబుల్ టీ స్లీపింగ్ ప్యాకింగ్ ఉపయోగిస్తే.. మన స్కిన్ తిరిగి తేమను సంతరించుకొంటుంది. రాత్రి నిద్రపోయే ముందు దీన్ని ముఖానికి అప్లై చేసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే ముఖంపై ఉన్న మచ్చలను క్రమంగా చర్మం రంగులో కలసిపోయేలా చేస్తుంది. ఈ ప్యాక్ మూడు ఫ్లేవర్లలో లభిస్తుంది. స్ట్రాబెర్రీ టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ – వీటిలో మీ చర్మానికి నప్పే ప్యాక్ ఎంచుకోండి.
ధర : రూ. 2,362. ఇక్కడ కొనండి.
8. నేచర్ రిపబ్లిక్ అలోవెరా జెల్
సహజసిద్ధమైన సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించడానికి ఇష్టపడేవారికి సరైన ఎంపిక ఈ నేచర్ రిపబ్లిక్ అలోవెరా జెల్. దీనిలో 92% కలబంద గుజ్జు ఉన్నట్టుగా తయారీదారులు చెబుతున్నారు. ఏ చర్మతత్వం కలిగినవారైనా సరే ఈ జెల్‌ను వాడొచ్చు. ఈ జెల్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడం మాత్రమే కాకుండా ఏవైనా చర్మ సంబంధ సమస్యలుంటే వాటిని తగ్గిస్తుంది.
ధర: రూ. 1,009. ఇక్కడ కొనండి.
9. Scinic పెప్టైడ్ ఆమ్పూల్
సినిక్ పెప్టైడ్ ఆమ్పూల్లో కాపర్ ట్రై పెప్టైడ్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని సాగిపోకుండా కాపాడతాయి. పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తాయి. దీనిలోని కలబంద, హైలురోనిక్ ఆమ్లం, విటమిన్ బీ5 చర్మకణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ధర: రూ. 2,658. ఇక్కడ కొనండి.
10. The Skin Concept ఇంటెన్స్ రింకిల్ కేర్ స్నెయిల్ క్రీం
ఈ క్రీం స్నెయిల్ ఎక్స్ ట్రాక్ట్ నత్త నుంచి తీసుకొన్న పదార్థాలతో తయారైంది. వినడానికి చిత్రంగానే ఉన్నా.. దీనివల్ల చర్మానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి వృద్దాప్య ఛాయలు దరిచేరకుండా చేస్తుంది. ఈ క్రీంలో ఉన్న మకాడమియా నూనె, నియాసినమైడ్ కొల్లాజెన్ ఉత్పత్తిని క్రమబద్ధీకరించి చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది.
ధర: రూ. 6,328. ఇక్కడ కొనండి.
Images: Shutterstock
ఇవి కూడా చదవండి
కొత్త ఏడాదిలో కొత్త బ్యూటీ ప్రొడక్ట్స్… మీతో షేర్ చేయకుండా ఉండలేకపోతున్నాం
చర్మ, కేశ సంరక్షణ కోసం వాడాల్సిన.. పారాబెన్, సల్ఫేట్ రహిత ఉత్పత్తులివే..!