న్యూ ఇయర్ గిఫ్ట్స్ ఇవ్వాలని భావిస్తున్నారా.. అయితే ఈ సైట్ సందర్శించాల్సిందే

న్యూ ఇయర్ గిఫ్ట్స్ ఇవ్వాలని భావిస్తున్నారా.. అయితే ఈ సైట్ సందర్శించాల్సిందే

మనకి నచ్చిన వారికి లేదా జీవిత భాగస్వామికి ఏదైనా బహుమతి ఇవ్వడానికి ప్రత్యేకమైన సందర్భం అవసరమా? లేదు కదా.!


అలాగే ఒక ప్రత్యేకమైన రోజు అనేది వస్తే తమకి ఇష్టమైనవారికి ఏదో ఒక బహుమతి (Gift) ఇవ్వాలని అందరికీ ఉంటుంది. అయితే ఆ ఆలోచన రాగానే  ఎలాంటి బహుమతి ఇస్తే బాగుంటుందన్న అన్న ప్రశ్న అందరినీ వేధిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ ప్రశ్నకి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.


ముందుగా మనం ఎవరికైతే బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నామో వారి గురించి మనకి ఒక అవాగాహన ఉండడం ముఖ్యం. ఎందుకంటే వారికి అసలు బహుమతులు తీసుకునే అలవాటు ఉందా? లేక అసలు ఏ బహుమతి ఇచ్చినా.. వారు దానిని తీసుకోకుండా ఆ వస్తువు గురించిన విశ్లేషణ చేస్తారా? లేదా మనం ఏ బహుమతి ఇచ్చినా సరే మనస్ఫూర్తిగా తీసుకునే వారా? ఇలా వారి మనస్తత్వాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. 

 


అలాగే ఒక బహుమతి అనేది ఇస్తే.... అది తీసుకునేవారికి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది అనే విషయం కూడా ఆలోచించాలి. మనం ఇవ్వబోయే బహుమతి వారి మనస్తత్వానికి నప్పే విధంగా ఉంటుందా? ఉండదా? అనే విషయం కూడా పరిగణనలోకి తీసుకోవాలి.  ఎందుకంటే ఉదాహరణకి - ధూమపానం చేసే అలవాటు లేని వ్యక్తికి యాష్ ట్రే ఇవ్వడం సబబు కాదు కదా. అలాగే.. మనం ఇవ్వబోయే బహుమతి ఎదుటివారు ఉపయోగించినా లేకపోయినా వారికి అది అసంబద్ధంగా ఉండకపోవడం మంచిది.


బహుమతులు ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మూడవ విషయం ఏమిటంటే - అసలు బహుమతిని ఇవ్వబోయేది ఎవరికి? ఇది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక్కోసారి మనం ఇచ్చే బహుమతుల ఆధారంగానే ఎదుటివారి నుండి మనం ఎటువంటి బంధాన్ని కోరుకుంటున్నామో చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. అందుకనే మనం బహుమతిని ఎంపిక చేసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక్కోసారి మనం ఇచ్చిన బహుమతి వల్ల సదరు వ్యక్తికి మనపైన వ్యతిరేక భావన కూడా కలిగే అవకాశం లేకపోలేదు. అందుకే సదరు మనిషి మనస్తత్వాన్ని బట్టి బహుమతిని ఇస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. 

ఇవ్వన్ని ఒకెత్తయితే ఇప్పుడు చెప్పబోయేది మరొక ఎత్తు. ఎందుకంటే పైన చెప్పిన విషయాలు అన్నిటికన్నా ఇప్పుడు చెప్పబోయేది మరింత ముఖ్యమైనది. అదే బహుమతి ఎంపికకి సంబంధించి మనకు అనేక సందేహాలు ఉండడం. ఉదాహరణకి మన స్నేహితుడికి ఒక బహుమతి ఇవ్వాలనుకుంటే.. మనం తొలుత రెండు నుండి మూడు వస్తువులను ఎంపిక చేసుకుని అందులో నుండి ఒకటి చివరగా ఎంచుకోవాలి. కొందరు బహుమతి ఇవ్వాలన్నా కూడా సరైన వస్తువుని ఎంపిక చేసుకోలేక ఆఖరి నిమిషంలో గందరగోళానికి గురవుతుంటారు. అందుకే ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మనకి కచ్చితంగా కావాల్సింది ఒక క్లారిటీ. ఇది గనుక ఉంటే పైన పేర్కొన వాటిల్లో అత్యధికశాతాన్ని మనం అధిగమించవచ్చు.


అలాగే బహుమతి  ఎక్కడ, ఎలా కొనుగోలు చేయాలని అనుకునే వారి కోసం నేడు అనేక ఆన్ లైన్ షాపింగ్ సైట్లు సిద్ధంగా ఉన్నాయి. మా POPXO Shop పేరిట అంతర్జాలంలోని ఉన్న ఈ షాపింగ్ వెబ్ సైట్ కూడా అలాంటిదే. దీనిని సందర్శించి అనువైన ధరలలో న్యూ ఇయర్ బహుమతులని కొని మీకు నచ్చిన వారికి బహుమతులుగా ఇవ్వొచ్చు.

POPxo Shop లో మీకు స్వెట్ షర్ట్స్ (Sweatshirts), హూడీస్ (Hoodies), ఫోన్ కవర్స్ (Phone Covers), మగ్స్ (Mugs), డోర్ మ్యాట్స్ (Doormats), వాల్ క్లాక్స్ (Wall Clocks), గిఫ్టింగ్ ఐటమ్స్ (Gifting Items), ల్యాప్ టాప్ స్లీవ్స్ (Laptop Sleeves & Skin) ఇలా అనేకరకాలైన వస్తువులు లభిస్తాయి. ఈ సైటులో లాగిన్ అయ్యి.. మీకు నచ్చిన వాటిని మీ సొంతం చేసుకోండి.


ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మీకు నచ్చిన వారికి.. మీరు బహుమతులతో శుభాకాంక్షలు తెలియచేయండి.


మీకు కూడా నూతన సంవత్సర (New Year) శుభాకాంక్షలు.


ఇవి కూడా చదవండి


ఈ ఆన్ లైన్ షాపింగ్ సైట్లు అమ్మాయిలకు ప్రత్యేకం.. ఈ వ్యాసం ఆంగ్లంలో చదవండి