నవ వధువులకు.. ఈ సెలబ్రిటీ హెయిర్ స్టైల్స్ చాలా స్పెషల్

నవ వధువులకు.. ఈ సెలబ్రిటీ  హెయిర్ స్టైల్స్ చాలా స్పెషల్

తాను మనసుపడిన వ్యక్తితో తన జీవితం ముడిపడబోయే రోజు కోసం ప్రతి అమ్మాయి వేయి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటుంది. అందుకే పెళ్లి రోజు ప్రతి అమ్మాయికి ప్రత్యేకం. ఆ రోజు ఎవరైనా నవవధువుగా ఫ్యాషనబుల్‌గా కనిపించడానికి దుస్తుల నుండి హెయిర్ పిన్ వరకు అన్నీ ప్రత్యేకంగా ఉండేలా ఎంచుకొంటారు. చక్కటి హెయిర్ స్టైల్‌తో మరింత ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటారు. అందుకే మేం కొంతమంది సెలబ్రిటీలకు సంబంధించిన వెడ్డింగ్ హెయిర్ స్టైల్స్‌ని మీ ముందుకి తీసుకొస్తున్నాం.


ఈ ఏడాదంతా సెలబ్రిటీల పెళ్లిళ్ల సందడి కొనసాగింది. ఈ వేడుకలకు స్టార్ హీరోయిన్లు బన్ హెయిర్ స్టైల్‌లోనే(ముడి) కనిపించారు. అవి ఎవరికైనా ఇట్టే నప్పుతాయి. మీరు లెహంగా ధరించినా.. చీర కట్టుకొన్నా.. మీ జుట్టుని ముడి వేసుకొంటే.. చాలా అందంగా కనిపిస్తారు. మరింకెందుకాలస్యం.. మిస్ నుంచి మిసెస్‌గా మారబోతోన్న మీకు నచ్చే హెయిర్ స్టైల్ ఎంచుకొని వధువుగా మరింత అందంగా మెరిసిపోండి.


(Celebrity Approved updos for your wedding day)


సెలబ్రిటీ వెడ్డింగ్ హెయిర్ స్టైల్ 1: హ్యూమా ఖురేషి


ఈ ఫొటోలో హ్యూమా ఖురేషీని చూడండి.. రెండు వైపులా వదులుగా జడ మాదిరిగా అల్లుకొని వెనక ముడి వేసుకొంది. చెక్కిలిని ముద్దాడేలా ముంగురులు ఆమె సొగసును మరింత పెంచుతున్నాయి. ఆమె మాదిరిగానే మీరు కూడా.. పెదవులకు ఎర్రటి లిప్ స్టిక్ అప్లై చేస్తే.. మీరు మరింత అందంగా కనిపిస్తారు.


Huma-Qureshi


సెలబ్రిటీ వెడ్డింగ్ హెయిర్ స్టైల్ 2: ఐశ్వర్యారాయ్


చక్కగా ముడి వేసుకొని దాని చుట్టూ గులాబీలు పెట్టుకొంటే.. చాలా బాగుంటుంది. ఈ హెయిర్ స్టైల్ పెళ్లి కూతురిని మరింత కళగా కనిపించేలా చేస్తుంది.


Aishwarya-Rai


Image: Aishwarya Rai_Fc (Instagram నుంచి)


సెలబ్రిటీ వెడ్డింగ్ హెయిర్ స్టైల్ 3:  శ్రీదేవి


అతిలోక సుందరి శ్రీదేవి ఎలాంటి స్టైల్ ఫాలో అయినా.. అది ఆమెను మరింత అందంగా చూపిస్తుంది. ఇక్కడ చూడండి. బన్ హెయిర్ స్టైల్‌లో ఎంత రాజసంగా కనిపిస్తుందో? అయితే ముందు భాగంలో ట్విస్ట్ చేసుకోవాలా? వద్దా? అనేది మాత్రం మీరే నిర్ణయం తీసుకోండి.


Sri-devi-wedding-hairstyles


సెలబ్రిటీ వెడ్డింగ్ హెయిర్ స్టైల్ 4: మలైకా అరోరా


మలైకా అరోరా మాదిరిగా ముడి వేసుకొని.. పాపిట తిలకం దిద్దుకొంటే.. అటు స్టైలిష్‌గానూ.. ఇటు సంప్రదాయబద్దంగానూ కనిపించవచ్చు. ముఖ్యంగా పెళ్లి తర్వాత ఏర్పాటు చేసే రిసెప్షన్‌కు వెళ్లేటప్పుడు ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది.


Learn More: Trending hairstyles for ladies


Malaika-Arora-Khan


Image: Maneka Harisinghani (Instagram నుంచి)


సెలబ్రిటీ వెడ్డింగ్ హెయిర్ స్టైల్ 5: కరిష్మా కపూర్


క్లాసిక్ ట్రెడిషనల్ లుక్ కోసం ప్రయత్నించే వారికి ఈ హెయిర్ స్టైల్ బాగా నప్పుతుంది. జుట్టు మొత్తం వెనక్కి దువ్వి కాస్త మెడపైకి వచ్చేలా ముడి వేసి.. చుట్టూ పూలు పెడితే సూపర్‌గా ఉంటుంది.


Karishma-Kapoor-1


Image: The Real Karisma Kapoor (Instagram నుంచి)


సెలబ్రిటీ వెడ్డింగ్ హెయిర్ స్టైల్ 6: అదితి రావు హైదరీ


మిల్క్ మెయిడ్ బ్రైడ్ కూడా పెళ్లి కూతుళ్లు వేసుకోదగిన హెయిర్ స్టైల్. ముఖ్యంగా షార్ట్ హెయిర్ ఉన్నవారికి బాగా సూటయ్యే స్టైల్ ఇది. మిల్క్ మెయిడ్ బ్రైడ్ అంటే రెండు జడలు వేసి.. వాటిని తల ముందు వైపు తీసుకొచ్చి కదలకుండా బాబీ పిన్నులు పెడితే సరిపోతుంది.


Aditi-Rao-Hydari


సెలబ్రిటీ వెడ్డింగ్ హెయిర్ స్టైల్ 7: దియా మీర్జా


హైదరాబాదీ భామ దియామీర్జా ఎలాంటి ఫ్యాషన్ ట్రెండ్ ఫాలో అయినా.. ఆమె సౌందర్యం మరింత ఇనుమడిస్తుంది. ముఖ్యంగా హెయిర్ స్టైల్స్ విషయంలో ఆమెకు సాటి ఎవరూ రారు. ఇక్కడ చూడండి.. తలపై ఫ్రెంచ్ బ్రైడ్ అల్లి వెనక ముడి వేసింది.


Dia-Mirza


Image: Dia Mirza (Instagram నుంచి)


సెలబ్రిటీ వెడ్డింగ్ హెయిర్ స్టైల్ 8: సోనమ్ కపూర్


బాలీవుడ్ భామ సోనమ్ కపూర్‌కి ఫ్యాషన్ ఐకాన్‌గా మంచి పేరుంది. ఇక్కడ చూడండి. సోనమ్ ఎంత చక్కగా ముడి వేసుకుందో? లెహంగా ధరించినా.. చీర కట్టుకొన్నా ఈ హెయిర్ స్టైల్ బాగా సూటవుతుంది.


Sonam-Kapoor


Image: Rhea Kapoor (Instagram నుంచి)


సెలబ్రిటీ వెడ్డింగ్ హెయిర్ స్టైల్ 9: దీపికా పదుకొణె


కొందరు జుట్టుని ముడి వేసుకోవడం వల్ల అందంగా మాత్రమే కాదు.. కాస్త రొమాంటిక్‌గానూ కనిపిస్తారు. కావాలంటే దీపికను చూడండి. వధువు మరింత సౌందర్యంగా కనిపించాలంటే.. ఈ హెయిర్ స్టైల్ వేసుకోవాల్సిందే.


Deepika-Padukone


Image: Viral Bhayani


ముడి మాత్రమే కాదు.. వధువుకి నప్పే ఇతర హెయిర్ స్టైల్స్ గురించి ఆంగ్లంలో చదవండి.


బ్రైడల్ చెక్ లిస్ట్: వెడ్డింగ్ హెయిర్.. చేయాల్సినవి..చేయకూడని వాటి గురించి చదవండి.


సమ్మర్ బ్రైడల్ హెయిర్ స్టైల్స్ గురించి ఈ ఆర్టికల్ చదవండి