వరుణ్ తేజ్, అదితి రావుల.. స్పేస్ మ్యాజిక్ "అంతరిక్షం" ఎందుకు చూడాలంటే?

వరుణ్ తేజ్, అదితి రావుల.. స్పేస్ మ్యాజిక్ "అంతరిక్షం" ఎందుకు చూడాలంటే?

మెగా హీరో వరుణ్ తేజ్  హీరోగా తెరకెక్కిన అంతరిక్షం 9000 KMPH (Antariksham 9000KMPH) చిత్రం రేపు విడుదలకానుంది. ఈ సినిమా మన తెలుగులో నిర్మితమైన తొలి స్పేస్ థ్రిల్లర్ చిత్రం అని చెప్పుకోవచ్చు. ఘాజి (Ghazi) చిత్రంతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకోవడమే కాకుండా జాతీయ అవార్డుని సైతం సొంతం చేసుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి తీసిన రెండవ చిత్రం ఈ అంతరిక్షం.


సాంకేతికంగా ఈ చిత్రం మనకి అద్భుతంగా వచ్చేందుకు ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ సూపర్ వైజర్ రాజీవ్ రాజశేఖరన్ నేతృత్వంలో ఈ సినిమాకి సంబంధించిన సాంకేతిక పనులు చేయడం జరిగింది. అలాగే టాలెంటెడ్ కెమెరామెన్ జ్ఞానశేఖర్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ప్రశాంత్ విహారి సంగీతం అందించడం జరిగింది. అదేసమయంలో లావణ్య త్రిపాఠి & అదితి రావు హైదరిలు ఈ సినిమాలు రెండు ప్రధాన పాత్రలు పోషించడం జరిగింది.
 

 

 


View this post on Instagram


See you tomorrow... 🚀#antariksham9000kmph #trailer #comingsoon


A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) on
 


ఇక ఈ చిత్రం ప్రేక్షకులు తప్పకుండా ఎందుకు చూడాలో మీకు తెలియజేస్తున్నాం. 


 * "అంతరిక్షం" తెలుగులో వస్తున్న తొలి స్పేస్ థ్రిల్లర్.


 * ఈ సినిమా కోసం మొదటిసారిగా "జీరో గ్రావిటీ" లో షూటింగ్ చేయడం జరిగింది.


* అంతరిక్షం చిత్రంలో ఉండే "జీరో గ్రావిటీ" సన్నివేశాలలో నటించడానికి నలుగురు ప్రధాన పాత్రధారులు ఒక నెల పాటు విదేశీ నిపుణుల పర్యవేక్షణలో  ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.


 * దాదాపు 1200-1500 వరకు VFX షాట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి .


 * ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.


 * ఈ సినిమాలో  ఒక సీక్వెన్స్‌లో దాదాపు 20 నిమిషాల పట్టు ఒక్క డైలాగ్ కూడా లేకుండా మొత్తం హావభావాలతో కథనం సాగుతుందట.


 * ఇంతటి క్లిష్టమైన కథతో కూడుకున్న చిత్రాన్ని కేవలం 8 నెలల్లోనే పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. 


 * తొలిసారిగా ఒక తెలుగు హీరో "వ్యోమగామి " పాత్రలో ఈ చిత్రంలో మనకి కనిపిస్తాడు.