పాటలకి సంబంధించిన ఒక మాట సామాన్యజన వాడుకలో ఉంది. అదేంటంటే - మనం సంతోషంగా ఉన్నప్పుడు పాటని ఆస్వాదిస్తాం. అయితే మనం బాధలో ఉన్నప్పుడు మాత్రం.. అదే పాటలో ఉన్న సాహిత్యాన్ని వింటాం. ఏదేమైనా.. మన మనసుకు కాస్త సాంత్వన కలిగించేది పాట మాత్రమే అన్న విషయంలో ఎంతో సత్యం దాగుంది. మనలో ఉన్న 90 శాతం మందికి పాటలంటే ఇష్టమే అనడంలో సందేహం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో జనాలు సినిమా పాటలకు ఎప్పుడో పట్టం కట్టారు. ప్రతీ సంవత్సరం కొన్ని వందల పాటలను గేయ రచయితలు మన సినీ పరిశ్రమకు అందిస్తున్నారు. ఈ క్రమంలో మనం కూడా 2018 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలలో (Telugu Cinema) ప్రేక్షకుల మనసులను దోచుకున్న టాప్ 20 పాటలు (Top 20 Telugu Songs) గురించి తెలుసుకుందాం
ఈ టాలీవుడ్ టాప్ 20 పాటల వరుస క్రమాన్ని కూడా.. ఆయా చిత్రాలు విడుదలైన సమయాన్ని బట్టి అందించడం జరిగింది..తప్పితే వీటికి మేము ఎటువంటి ర్యాంకింగ్ ఇవ్వలేదని గమనించగలరు.
ఈ పాటని రాసింది శ్రీమణి (Srimani) కాగా.. స్వరాలతో పాటు తన గాత్రాన్ని అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravi chander) ఇచ్చాడు.
ఈ పాటకు సాహిత్యాన్ని భాస్కరభట్ల (Bhaskarabatla) అందివ్వగా.. మహతి స్వరసాగర్ (Mahati Swarasagar) స్వరాలూ కూర్చడం జరిగింది. అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni) & సాగర్ (Sagar) తమ గాత్రాన్ని అందివ్వడం జరిగింది.
ఈ పాటకి యువ రచయిత శ్రీమణి లిరిక్స్ ఇవ్వగా.. తమన్ స్వరాలు అందించాడు. అర్మాన్ మాలిక్ (Armaan Malik) & తమన్ (Thaman)లు ఈ పాటని పాడడం జరిగింది.
రాకేందు మౌళి (Rakendumouli) ఈ పాటకి లిరిక్స్ ఇవ్వగా.. విజయ్ ప్రకాష్ (Vijay Prakash) ఈ పాటని ఆలపించారు. అజనీష్ లోకనాథ్ (Ajaneesh Lokanath) ఈ పాటకి సంగీతం అందించారు.
దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) ఈ పాటకి స్వరాలు & గాత్రాన్ని ఇవ్వగా చంద్రబోస్ (Chandrabose) అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు.
చంద్రబోస్ ఈ పాటని రాయగా శివ నాగులు (Shiva Nagulu) ఈ పాటని పాడారు. దేవిశ్రీప్రసాద్ ఈ పాటకి స్వరాలని సమకూర్చారు.
పెంచల్ దాస్ (Penchal Das) ఈ పాటకి సాహిత్యమవ్వడమే కాకుండా.. పాటని కూడా పాడారు. హిప్ హాప్ తమిజా (HipHop Tamizha) ఈ పాటకి స్వరాలు అందివ్వడం జరిగింది.
ఈ పాటకి శ్రీజో లిరిక్స్ అందివ్వగా రేవంత్ (Revanth) & సంజిత్ హెగ్డే (Sanjith Hegde) గాత్రాన్ని అందించారు. హిప్ హప్ తమిజా స్వరాలని సమకూర్చారు.
రామజోగయ్య శాస్త్రి ఈ పాటని రాయగా దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందివ్వడం జరిగింది. ఇక ఈ పాటకి గాత్రదానం చేసింది కైలాష్ ఖేర్ (Kailash Kher)& దివ్య కుమార్ (Divya Kumar).
సిరివెన్నెల సీతారామ శాస్త్రి (Sirivennela Seetarama Sastry) సాహిత్యం అందివ్వగా మిక్కీ జె మేయర్ (Mickey J Meyer)స్వరాలు అందించారు. చారులత మణి (Charulatha Mani) తన గాత్రాన్ని అందివ్వడం జరిగింది.
కృష్ణకాంత్ లిరిక్స్ అందివ్వగా వివేక్ సాగర్ స్వరాలూ సమకూర్చారు. అనురాగ్ కులకర్ణి & మనీషా తమ గాత్రాన్ని అందించారు.
చైతన్య ప్రసాద్ (Chaitanya Prasad) ఈ పాటకి సాహిత్యం ఇవ్వగా.. చైతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj) సంగీతం అందించాడు. అనురాగ్ కులకర్ణి గాత్రదానం చేశాడు.
శ్రీ సాయి కిరణ్ (Sri Sai Kiran) ఈ పాటకి లిరిక్స్ అందివ్వగా చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) తన గాత్రాన్ని అందించారు. ప్రశాంత్ విహారి (Prashanth Vihari) ఈ పాటకి స్వరాలూ కూర్చడం జరిగింది.
శ్రీమణి ఈ పాటకి సాహిత్యం అందివ్వగా SP బాలసుబ్రహ్మణ్యం (SP Balasubramanyam) తన గాత్రాన్ని అందించారు. మిక్కీ జె మేయర్ ఈ పాటకి స్వరాలని అందించారు.
ఈ పాటని అనంత శ్రీరామ్ (Anantha Sriram) రాయగా సిడ్ శ్రీరామ్ ఆలపించారు. గోపి సుందర్ (Gopi Sunder) ఈ పాటకి స్వరాలు సమకూర్చారు.
సిరివెన్నెల సీతారామ శాస్త్రి (Sirivennela Seetarama Sastry) ఈ పాటకి సాహిత్యం ఇవ్వగా మణిశర్మ (Manisharma) స్వరాలు సమకూర్చారు. అనురాగ్ కులకర్ణి & అంజన సౌమ్య ఈ పాటకి గాత్రదానం చేశారు.
ఈ హృద్యమైన పాటని రామజోగయ్య శాస్త్రి రాయగా కాలభైరవ (kalabhairava) పాడారు. తమన్ ఈ పాటకి సంగీతం ఇవ్వడం జరిగింది.
ఈ పాటకి కృష్ణకాంత్ (Krishnakanth) సాహిత్యాన్ని అందివ్వగా జెక్స్ బిజోయ్ (Jakes Bejoy) స్వరాలూ సమకూర్చారు. సిడ్ శ్రీరామ్ (Sid Sriram) ఈ పాట పాడడం జరిగింది.
అనంత శ్రీరామ్ ఈ పాటని రాయగా హరిణి (Harini) & యాజిన్ నిజార్ (Yazin Nizar) ఆలపించారు. ప్రశాంత్ విహారి (Prashanth Vihari) ఈ పాటకి స్వరాలూ సమకూర్చడం జరిగింది.
ఈ పాటని కృష్ణకాంత్ రాయగా అర్మాన్ మాలిక్ & సింధూరి విశాల్ (Sindhuri Vishal) లు ఆలపించారు. విశాల్ చంద్రశేఖర్ (vishal CHandrasekhar) ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
ఈ పైన పేర్కొన్న 20 పాటలు 2018లో మనల్ని అలరించగా వచ్చే సంవత్సరంలో మరిన్ని పాటలు మనల్ని అలరింపచేయాలి అని కోరుకుందాం
ఇవి కూడా చదవండి
2018 తెలుగు చిత్రాల్లో.. టాప్ 9 హీరోయిన్స్ ఎవరో తెలుసా..?
2018లో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన.. టాప్ 6 మూవీస్ ఇవే..!