ADVERTISEMENT
home / వినోదం
2018లో  టాలీవుడ్‌ ఇండస్ట్రీని షేక్ చేసిన.. టాప్ 6 మూవీస్ ఇవే..!

2018లో టాలీవుడ్‌ ఇండస్ట్రీని షేక్ చేసిన.. టాప్ 6 మూవీస్ ఇవే..!

“సంవత్సరానికి 200 సినిమాలు తీస్తుంటే అందులో 3 సినిమాలు హిట్ అవ్వడమే గగనమైపోయింది. కేవలం 2% సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీలో ఉన్నాము”… ఇదీ  పూరి జగన్నాధ్ తీసిన “నేనింతే” సినిమాలో నటుడు షాయాజీ షిండే చెప్పిన డైలాగ్.  2008లో ఈ సినిమా వచ్చింది. అయినా అప్పటి పరిస్థితికి, ఇప్పటికి పరిస్థితికి ఎలాంటి తేడా లేదని కచ్చితంగా చెప్పవచ్చు.

ఎందుకంటే ఈ సంవత్సరం తెలుగులో దాదాపు 125 స్ట్రెయిట్ మూవీస్ విడుదల కాగా.. అందులో కేవలం 6 సినిమాలు మాత్రమే బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలిచాయి.  మరో 7 చిత్రాలు బ్రేక్ ఈవెన్ అవ్వడం చూస్తే సక్సెస్ రేట్ 10% మించి లేదన్నది మనకి లెక్కలతో సహా కనిపిస్తున్న సత్యం.

ఇక ఇటువంటి పరిస్థితిలో కూడా 6 చిత్రాలు బ్లాక్ బస్టర్ స్టేటస్ సాధించడం విశేషమే. అవే – రంగస్థలం , గూఢచారి , RX 100, మహానటి , గీత గోవిందం & ట్యాక్సీవాలా.

ముందుగా మనం ఈ ఏడాది మొదటి బ్లాక్ బస్టర్ అయిన రంగస్థలం (Rangasthalam) చిత్రం గురించి మాట్లాడుకుందాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  తొలిసారిగా ఒక రొటీన్ కమర్షియల్ పాత్రని కాదని ఒక విభిన్నమైన పాత్ర చేసేందుకు ఈ చిత్రంతో ముందుకు వచ్చాడు. అయితే ఆయన ఇంత ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం.. సుకుమార్ చెప్పిన  కథ పైన ఉన్న నమ్మకం అని చెప్పాలి. ఇక  చరణ్‌ని ఒక చెవిటివాడిగా  చూపిస్తూ కూడా ఎక్కడా కూడా ఆయన హీరోయిజాన్ని  తగ్గించకుండా తీర్చిద్దిన చిట్టిబాబు  పాత్ర ఈ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. రామ్ చరణ్‌కు జోడీగా నటించిన సమంత కూడా పల్లెటూరి అమ్మాయిగా పాత్రలో బాగా ఒదిగిపోయి నటించింది. తను ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. అదే విధంగా 1980లో జరిగే కథ అంటూ ప్రేక్షకులకి అప్పటి పరిస్థితులని  పరిచయం చేస్తూ.. సుకుమార్ తనలోని విలక్షణతను ఈ చిత్రం ద్వారా చూపించాడు. మొత్తానికి ఈ చిత్రం 2018లో వచ్చిన తొలి బ్లాక్ బస్టర్ అని చెప్పాలి.

ADVERTISEMENT

 

ఈ బ్లాక్ బస్టర్ జాబితాలో ఉన్న రెండో చిత్రం – మహానటి (Mahanati). మన తెలుగులో ఒక నటిపై వచ్చిన తొలి బయోపిక్‌గా ఈ చిత్రాన్ని మనం పేర్కొనవచ్చు. మహానటి సావిత్రి జీవితాన్ని ఆధారంగా చేసుకుని యువ దర్శకుడు నాగ్ అశ్విన్  తీసిన ఈ చిత్రం ఓ అద్భుతం అనే చెప్పాలి.  సావిత్రి  బాల్యం నుండి ఆమె ఈ లోకాన్ని విడిచే వరకు ఆమె జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాలని ఒక పూలమాలగా అందంగా చేర్చి అల్లిన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా  సావిత్రి పాత్రలో జీవించేసిన  నటి కీర్తి సురేష్ ఈ ఒక్క చిత్రంతో ఎన్నో ప్రశంసల్ని అందుకుంది. ఇక ఈ ఏడాదికి గాను ప్రకటించబోయే అవార్డులలో కచ్చితంగా  ఆమెకి సింహభాగం అవార్డులు వస్తాయి అని చెప్పగలం.

 

RX 100 వంటి ఒక బోల్డ్ కథాంశంతో  వచ్చిన  చిత్రాన్ని మన తెలుగు ప్రేక్షకులు పెద్ద ఎత్తున  ఆదరించడం కొంతమందిని ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఇటువంటి ఒక కథని తెరపైకి తీసుకురావాలంటే ఒకరకంగా ఛాలెంజ్ అనే చెప్పాలి. అలాంటిది యువ దర్శకుడైన  అజయ్ భూపతి (Ajay Bhupathi) RX 100 చిత్రంతో చేసిన సాహసానికి మంచి ఫలితమే దక్కింది. తొలి చిత్రమైనప్పటికి కూడా ఒక బోల్డ్ కథని  తెరకెక్కించిన విధానాన్ని అందరూ మెచ్చుకున్నారు.

ADVERTISEMENT

 

తెలుగులో వచ్చిన మొట్టమొదటి బాండ్ చిత్రం – గూఢచారి 116. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ సీక్రెట్ ఏజెంట్ పాత్ర పోషించగా అప్పట్లో ఈ చిత్రం ఒక సంచలనంగా మారింది. ఆ తరువాత కొందరు హీరోలు ఈ తరహా కథలతో ప్రేక్షకుల ముుందుకు వచ్చినప్పటికీ వారు అంతగా విజయం సాధించలేకపోయారు. అయితే యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh).. తాను సొంతంగా ఒక కథ రాసుకుని హీరోగా చేసిన చిత్రం గూఢచారి (Goodachari). దాదాపు 6 కోట్లతో తీసిన ఈ చిత్రం 30 కోట్లకు పైగా వసూలు చేసి ఒక చరిత్రని సృష్టించింది అని చెప్పుకోవచ్చు. ఈతరం వారికి నచ్చేలా  హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో గూఢచారి చిత్రం ఆడియన్స్‌ని ఆకట్టుకోగలిగింది. 

 

అందరు హీరోలు ఒక హిట్ కొట్టడానికి కష్టపడుతున్న సమయంలో (Mr రౌడీ).. అదే విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మాత్రం ఏకంగా ఈ ఏడాది  చేసిన మూడు చిత్రాల్లో  2 చిత్రాలని  బ్లాక్ బస్టర్ చేయగలిగాడు. అందులో ముందుగా విడుదలైన గీత గోవిందం గురించి మాట్లాడుకుంటే – అర్జున్ రెడ్డి (Arjun Reddy) తో ఒక రఫ్ పాత్రలో కనిపించిన  విజయ్ ఈ చిత్రంలో దానికి పూర్తి విరుద్ధమైన సాఫ్ట్ పాత్రలో నటించాడు.

ADVERTISEMENT

హీరోయిన్ వెనక మేడమ్ .. మేడమ్ అంటూ తిరుగుతూ అతను చేసిన అభినయం అందరిని విపరీతంగా ఆకట్టుకుంది.ఇక ఆ తరువాత విజయ్ నటించిన NOTA చిత్రం ఆడియన్స్‌ని తీవ్రంగా నిరాశపరిచగా.. ఈ ఏడాది చివరలో విడుదలైన  ట్యాక్సీ వాలా చిత్రం మాత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ సినిమాకి పనిచేసిన టెక్నికల్ టీం చాలా అద్భుతంగా పనిచేయడం, కథ కూడా కాస్త కొత్తగా ఉండడంతో ప్రేక్షకులకి ఈ చిత్రం భలేగా నచ్చేసింది.

 

అయితే గీత గోవిందం (Geetha Govindam) & ట్యాక్సీవాలా (Taxiwaala) చిత్రాలు విడుదలకి ముందే లీక్ కావడంతో ఈ రెండు చిత్రాల భవిష్యత్తు పైన అందరికి నమ్మకం పోయింది. అయితే ఈ రెండు చిత్రాలు విడుదలయ్యాక మాత్రం.. బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో విజయ్‌తో పాటు ఆయా చిత్రాల టీమ్స్ కూడా ఊపిరిపీల్చుకున్నాయి.

 

ADVERTISEMENT

ఇదీ ఈ సంవత్సరం తెలుగులో వచ్చిన  ఆరు చిత్రాల విజయానికి సంబంధించిన  విశ్లేషణ. వచ్చే ఏడాది ఈ ఆరు  సినిమాల సంఖ్య రెండంకెలు దాటాలని  కోరుకుందాం..

ఇవి కూడా చదవండి

టాలీవుడ్‌‌లో సత్తా చాటిన.. బాలీవుడ్ ముద్దుగుమ్మలు వీరే.. !

టాప్ 5 టాలీవుడ్ క్వీన్స్ ఎవరో తెలుసా..?

ADVERTISEMENT

టాలీవుడ్ మహిళా దర్శకుల గురించి ఆసక్తికర విషయాలివే..!

24 Dec 2018

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT