వెల్ కమ్ టూ 2019: పార్టీల సందడిలో బాలీవుడ్

వెల్ కమ్ టూ 2019: పార్టీల సందడిలో బాలీవుడ్

కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ సందర్భంగా తమ అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ చెబుతూ బాలీవుడ్ నటులు అనేకమంది సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టారు. కొందరు తమ రిజల్యూషన్స్ గురించి కూడా తెలిపారు. కొందరు తమ పార్టీ ఫోటోలను కూడా పోస్టు చేశారు. ఇలా బాలీవుడ్ సెలబ్రిటీలు పోస్టు చేసినవాటిలో కొన్ని ఆసక్తికరమైన పోస్టులు మీకోసంప్రస్తుతం రణ్ బీర్ కపూర్ న్యూయార్క్‌లో ఉన్నారు. తనతో పాటు నటి అలియా భట్‌ని కూడా తీసుకెళ్లారు. అక్కడే కుటుంబ సభ్యుల మధ్య న్యూ ఇయర్ పార్టీని సెలబ్రేట్ చేసుకున్నారు.


Image: Instagram


 


 

చిత్రమేంటంటే.. ఇటీవలే పెళ్లైన రణ్ వీర్ సింగ్, దీపికల జోడి కూడా న్యూయార్క్‌లో గడపడానికి వెళుతూ.. ఎయిర్ పోర్టులో కెమెరా కళ్లకి చిక్కింది.


Image: Instagramబాలీవుడ్‌లో అర్జున్ కపూర్, మలైరా అరోరా ఖాన్ ఒక పార్టీకి అటెండ్ అవ్వగా.. అదే పార్టీలో సంజయ్ కపూర్, మహదీప్ కపూర్, కరణ్ జోహార్ కూడా పాలుపంచుకున్నారు.


Image: Instagramప్రస్తుతం కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ తమ పుత్ర రత్నం తైమూర్ పుట్టినరోజును సౌతాఫ్రికాలో ఘనంగా జరుపుకొని.. తర్వాత స్విట్జర్లాండ్ దేశానికి పయనమవుతున్న సమయంలో తీసుకున్న ఫోటో ఇది. ఈ చిత్రంలో సారా కూడా ఉన్నారు.


 

సుస్మితా సేన్ జైపూర్ ప్రాంతంలో తన కుటుంబ సభ్యుల మధ్య న్యూ ఇయర్ పార్టీని వైభవంగా సెలబ్రేట్ చేసుకుంది.ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్‌తో కలిసి ప్రస్తుతం స్విట్జర్లాండ్ వీధుల్లో హాయిగా తన ప్రేమాయణం సాగిస్తూ.. హ్యాపీగా ఫీలవుతుంది.


Image: Instagram


 అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖాన్ ప్రస్తుతం థాయిలాండ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.


Image: Instagramప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు తన భార్య, ప్రేయసి అనుష్క శర్మ కూడా ఆస్ట్రేలియా వెళ్లింది. వీరిద్దరూ సిడ్నీలో చక్కర్లు కొడుతున్నారు.


Image: Instagram

హృతిక్ రోషన్ ఈ సారి ప్రత్యేకంగా న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నారు. ఇటీవలే క్యాన్సర్ చికిత్స చేయించుకున్న సోనాలి బింద్రేని ప్రత్యేకంగా ఆయన కలిశారు.
 

 

 


View this post on Instagram


#happybirthday #vidyabalan #happynewyear


A post shared by Manav Manglani (@manav.manglani) on
విద్యాబాలన్ ఈ సంవత్సరం తన మిత్రుల కోసం ప్రత్యేకంగా న్యూ ఇయర్ బ్యాష్ ఏర్పాటు చేయగా.. ఆమె సన్నిహితులందరూ అందులో పాల్గొన్నారు.


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది. ఆంగ్లం, హిందీ, తమిళం, మరాఠీ, బంగ్లా భాషల్లో తమ పాఠకులకు సేవలందిస్తోంది.


ఇది ఆనందకరమైన వార్త. POPxo SHOP ఓపెన్ అయ్యింది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ పై 25 % డిస్కౌంట్ ఇస్తోంది. మహిళల ఆన్ లైన్ షాపింగ్ రంగంలో దూసుకుపోతోంది.


ఇవి కూడా చదవండి


2019 స్పెషల్: ఈ రోజు వైరల్ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలివే..!


2018‌ టాలీవుడ్ సినిమాల్లో.. హాస్యపు జల్లులు కురిపించిన వారెవరంటే..?


కొత్త సంవత్సరం వచ్చేస్తున్న వేళ.. మీరూ కొత్త నిర్ణయాలు తీసేసుకోండి..!