కొత్త సంవత్సరం వచ్చేసింది. మళ్లీ సోషల్ మీడియా సందడి మొదలైంది. సెలబ్రిటీలు మళ్లీ సామాజిక వేదికల ద్వారా యాక్టివ్‌గా తమ ఛాయాచిత్రాలను పోస్ట్ చేసేస్తున్నారు. కొందరు న్యూ ఇయర్ పార్టీ ఫోటోలు పోస్టు చేస్తుంటే.. మరి కొందరు యధావిధిగా రొటీన్ ఫోటోలు పోస్టు చేస్తున్నారు. కొందరు సోషల్ మీడియా ద్వారా సందేశాలు ఇస్తుంటే..ఇంకొందరు ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వేదికగా వైవిధ్యమైన పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా.. కొత్త సంవత్సరం (2019) నాడు వైరల్ అవుతున్న పోస్టులను, ఫోటోలను చూస్తుంటే ఆ మజాయే వేరు. ఈ క్రమంలో ఈ రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఫోటోలను మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం.
కొత్త జంట ప్రియాంక, నిక్ స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటో ఇప్పడు బాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. గత సంవత్సరం ఈ సెలబ్రిటీ కఫుల్ ఒకింటి వారయ్యారన్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ హనీమూన్ ట్రిప్‌లో ఉన్నారు.
అలాగే నటి దిశా పటానీ న్యూ ఇయర్ సందర్భంగా పోస్ట్ చేసిన ఓ హాట్ ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతోంది. తానైతే తింటూ, నిద్రపోతూ..స్విమ్మింగ్ చేస్తూ బిజీగా ఉన్నానని.. మిగతా వారు న్యూ ఇయర్ సందర్భంగా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలపాలని ఈ బాలీవుడ్ సుందరి పెట్టిన పోస్టు ఈ రోజు తెగ వైరల్ అవుతోంది.
అలాగే నటి కాజోల్ న్యూ ఇయర్ సందర్భంగా స్విమ్ సూట్‌లో ఉన్న తన కుమార్తె న్యాసా ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం వీరి ఫ్యామిలీ మాల్దీవుల్లో సరదాగా గడుపుతోంది.
తమ అభిమానులకు హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెబుతున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల జోడీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటో కూడా బాగానే వైరల్ అవుతోంది.
View this post on Instagram
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల న్యూ ఇయర్ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ డిఫరెంట్ పిక్చర్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది.
View this post on InstagramAu revoir 2018! You’ve been a good year..🙂 Let’s all LIVE and LET LIVE! 🙏🏼👼🏼
న్యూ ఇయర్ సందర్భంగా టెన్నిస్ రాకెట్‌తో ఫోజ్ ఇచ్చిన నటి తాప్సీ పన్ను ఫోటో కూడా ఈ రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఆదరణనే పొందింది.
న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏమిటని ఎవరైనా అడిగితే.. తాను ఇచ్చే రియాక్షన్ ఇలాగే ఉంటుందని యాంకర్ సుమ కనకాల తన ఫోటోతో చెప్పిన విషయం కూడా ఈ రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి పాపులారిటీనే సొంతం చేసుకుంది.
View this post on InstagramLooks when people ask me ,what’s my new year resolution???Happy new year!!!
ఇవి కూడా చదవండి
హైదరాబాద్‌లో క్రిస్మస్ & న్యూ ఇయర్ 'కేక్స్'కి.. ఈ బేకరీలు ప్రత్యేకం
2018 టాలీవుడ్ సినిమాల్లో.. హాస్యపు జల్లులు కురిపించిన వారెవరంటే..?
కొత్త సంవత్సరం వచ్చేస్తున్న వేళ.. మీరూ కొత్త నిర్ణయాలు తీసేసుకోండి..!