పెళ్లికి సన్నద్ధమవుతున్నారా? ఈ మెహందీ డిజైన్లపై ఓ లుక్కేయండి

పెళ్లికి సన్నద్ధమవుతున్నారా? ఈ మెహందీ డిజైన్లపై ఓ లుక్కేయండి

మెహందీ.. వధువుకి అందాన్నే కాదు.. చక్కటి కళనూ అందిస్తుంది. అందుకే పెళ్లికోసం చక్కటి డిజైన్లను ఎంపిక చేసుకొని మరీ వేసుకొంటారు. మీరు కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నారా? అయితే మీ ముందుకు మేం కొన్ని మెహందీ డిజైన్లను మీ ముందుకు తీసుకొస్తున్నాం. అందులోనూ గతేడాది అంటే 2018లో బాగా పాపులర్ అయిన డిజైన్లివి. మీరూ వాటిపై ఓ లుక్కేయండి.


1. ఎక్కువ, తక్కువ కాకుండా..


1-bridal-mehendi-designs-2019


Image Credits: Purvi shah on Instagram


ఈ డిజైన్ చూడండి.. ఎంత గ్రాండ్ గా కనిపిస్తుందో..! ఎక్కడ డిజైన్ వేస్తే అందంగా కనిపిస్తుందో అక్కడ మెహందీ వేశారు. అవసరం లేని చోట ఖాళీగానే వదిలేశారు. అయినప్పటికీ ఎంతో అందంగా కనిపిస్తోంది.


2. సింపుల్ గా.. గ్రాండ్ గా..


2-bridal-mehendi-designs-2019


Image Credits: The Indian Wedding on Instagram


సింపుల్ గా కనిపిస్తూనే గ్రాండ్ లుక్ ఇచ్చే డిజైన్ కోసం చూసే వధువులకు చక్కటి ఎంపిక ఈ డిజైన్. పర్ఫెక్ట్ గా ఉంది కదా..!


3. నిండుగా కనిపించేలా..


3-bridal-mehendi-designs-2019


Image Credits: The Cheese Cake Project on Instagram


వివాహం జరిగే రోజు.. పెళ్లికూతురు ధరించిన వస్త్రాలు, నగలతో పాటుగా అందరూ కచ్చితంగా చూసేది మరొకటి కూడా ఉంది. అదే వధువు చేతి గోరింటాకు. అందుకే అందరూ మెచ్చే విధంగా మెహందీ నిండుగా ఉండాలని భావిస్తుంది పెళ్లికూతురు. మీరు కూడా ఇలాగే అనుకొంటే.. ఈ డిజైన్ బాగుంటుందేమో ఓ సారి చూడండి.


4. ప్రేమ తెలియజేసేలా..


4-bridal-mehendi-designs-2019


Image Credits: Purvi Shah on Instagram


తాను కలసి జీవించబోయే వ్యక్తిపై ఎంత ప్రేమ ఉందో తెలియజేయాలనుకొనే వధువులు కోరుకొంటారు. ఆ ప్రేమనే మెహందీ డిజైన్ గా మలిస్తే..? ఆలోచనే సూపర్ గా ఉంది కదా..! అయితే ఈ డిజైన్ చాలా బాగుంటుంది.


5. పువ్వుల మెరుపులు..


5-bridal-mehendi-designs-2019


Image Credits: 361 Degree Production on Instagram


పెళ్లి కూతురిగా.. లెహంగా ధరించినా.. చీర కట్టుకొన్నా.. ఎక్కువగా పూలు, లతలు డిజైన్లు ఉన్నవాటికే మొగ్గు చూపుతారు. మరి వెడ్డింగ్ అవుట్ ఫిట్ కు సరిపోయేలా మెహందీ కూడా ఉంటే చాలా బాగుంటుంది.


6. క్లాసిక్ లుక్ లో అందంగా..


6-bridal-mehendi-designs-2019


Image Credits: Photoz Aapki on Instagram


సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోతున్న వధువు చేతికి వేసే మెహందీ డిజైన్ కూడా అదే రీతిలో ఉంటే.. ఎంతో అందంగా ఉంటుంది. కోల్కా పద్ధతిలో వేసిన ఈ డిజైన్ చూడండి. ఇది మీకు క్లాసిక్ లుక్ కూడా అందిస్తుంది.


ఈ ఏడాది(2019)లో మీరు వివాహం చేసుకొంటున్నారా? అయితే ఈ కథనాన్ని బుక్ మార్క్ చేసి పెట్టుకోండి.