చర్మ సంరక్షణ కోసం వాడాల్సిన.. పారాబెన్, సల్ఫేట్ రహిత ఉత్పత్తులివే..!|POPxo | POPxo

చర్మ, కేశ సంరక్షణ కోసం వాడాల్సిన.. పారాబెన్, సల్ఫేట్ రహిత ఉత్పత్తులివే..!

చర్మ, కేశ సంరక్షణ కోసం వాడాల్సిన.. పారాబెన్, సల్ఫేట్ రహిత ఉత్పత్తులివే..!

ఆరోగ్యంగా ఉండటానికి మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకొంటూ ఉంటాం. ఆరోగ్యాన్నందించే ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, సరిపడినంత నీరు తాగడం వంటివన్నీ చేస్తాం. ఇలా శారీరక ఆరోగ్యం కోసం ఎంతగా ఆరాటపడతామో.. చర్మం, జుట్టు ఆరోగ్యం విషయంలోనూ అంతే జాగ్రత్తగా వ్యవహరించాలి. అందుకే వాటి సంరక్షణ కోసం ఉపయోగించే ఉత్పత్తులను ఎంచుకొనే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు సరిపోయే వాటిని వాడితేనే మీ అందం ఎప్పటికీ నిలిచి ఉంటుంది.


అయితే ఆ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి పారాబెన్(paraben), సల్ఫేట్(sulfate) రహిత ఉత్పత్తులను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రమాదకరమైన రసాయనాలు అందాన్నే కాదు.. ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తాయి. అందుకే ఇలాంటి  రసాయనాలు లేని కొన్ని ఉత్పత్తులను మీకు పరిచయం చేస్తున్నాం. అంతకంటే ముందు.. ఈ పారాబెన్స్ ఏంటి? వాటివల్ల మనకు ఎలాంటి హాని జరుగుతుందో తెలుసుకొందాం.


పారాబెన్స్ అంటే ఏంటి?


కాస్మెటిక్స్, ఫార్మా ఉత్పత్తుల తయారీలో ప్రిజర్వేటివ్స్‌గా(ఉత్పత్తులు చెడిపోకుండా కాపాడేవి) పారాబెన్స్ ఉపయోగిస్తారు. రసాయన శాస్త్ర పరంగా చెప్పాలంటే.. ఇవి హైడ్రాక్సీ బెంజోయేట్ లేదా పారా హైడ్రాక్సీ బెంజోయిక్ ఆమ్ల లవణాలకు చెందినవి. వీటిని సౌందర్య ఉత్పత్తులైన షాంపూలు, మాయిశ్చరైజర్స్, షేవింగ్ జెల్స్, ల్యూబ్రికెంట్స్, సన్ ట్యాన్ ఉత్పత్తులు, టూత్ పేస్ట్, మేకప్ ఉత్పత్తులు, కొన్ని రకాల ఔషధాల్లోనూ ఉపయోగిస్తారు.


పారాబెన్స్ వల్ల మనకు జరిగే నష్టం ఏంటి?


సౌందర్య ఉత్పత్తుల్లో ఉండే పారాబెన్స్ వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. అవునండీ.. కొన్ని అధ్యయనాలు దీన్ని నిజమనే చెబుతున్నాయి. మన చర్మంపై రాసుకొన్న ఉత్పత్తుల్లోని పారాబెన్స్ మన శరీరంలోకి చేరిన తర్వాత ఇవి ఈస్ట్రోజెన్ మాదిరిగా ప్రవర్తిస్తాయి. రొమ్ము క్యాన్సర్ రావడానికి ఈస్ట్రోజెన్ ముఖ్య కారణం. క్యాన్సర్ కారణంగా రొమ్ములో ఏర్పడిన కణితుల్లో పారాబెన్ అవశేషాలను నిపుణులు గుర్తించారు. పురుషుల్లోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. పారాబెన్స్ వల్ల వారిలో వీర్యం నాణ్యత తగ్గిపోతుంది. అలాగే చర్మంపై దురద, మొటిమలు వంటివి వచ్చే అవకాశం ఉంది. చిన్న పిల్లల్లోనూ అలర్జీలు రావచ్చు.


మరి మనం వాడే బ్యూటీ ప్రొడక్ట్స్‌లో పారాబెన్స్ ఉన్నాయా? లేదా? అని ఎలా గుర్తించాలి?... ఇది చాలా సులభం. ప్యాక్ వెనుక తయారుచేసిన పదార్థాలను పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. వాటిలో బ్యుటైల్ పారాబెన్, మిథైల్ పారాబెన్, ప్రొపైల్ పారాబెన్ ఉంటే అలాంటి ఉత్పత్తులను కొనుగోలు చేయద్దు. మరికొన్ని ఉత్పత్తులపై ఆల్కైల్ పారా హైడ్రాక్సీ బెంజోయేట్స్ అని రాసి ఉంటుంది. వీటిని కూడా వాడకపోవడమే మంచిది.


పర్యావరణంపై పారాబెన్స్ ప్రభావం..


పారాబెన్స్‌తో తయారైన ఉత్పత్తుల వల్ల మనకు మాత్రమే కాదు.. పర్యావరణానికి కూడా హాని జరుగుతుంది. సముద్ర క్షీరదాల్లో పారాబెన్ అవశేషాలను ఈ మధ్యే గుర్తించారు. మనం ఉపయోగించే ఉత్పత్తుల నుంచి వచ్చే పారాబెన్స్ దీనికి కారణమని పరిశోధకులు గుర్తించారు. మనం స్నానం చేసినప్పడు మనం రాసుకొన్న ఉత్పత్తులు డ్రైనేజిల్లోకి... అక్కడి నుంచి చెరువులు, కాల్వలు, నదుల్లోకి చేరుతున్నాయి. ఫలితంగా జలచరాలు వీటి ప్రభావానికి గురవుతున్నాయి. 


అందుకే మన ఆరోగ్యంతో పాటు.. పర్యావరణాన్ని కూడా రక్షించే ఉత్పత్తులు వాడటం మంచిది. మరి పారాబెన్ రహిత ఉత్పత్తులు లభిస్తాయా? అని ఆలోచిస్తున్నారా? మీకోసమే హానికర పదార్థాలు లేని ఉత్పత్తులను మీ ముందుకు తీసుకొస్తున్నాం.


క్లెన్సింగ్ ఉత్పత్తులు


చర్మఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో క్లెన్సింగ్ కీలకపాత్ర పోషిస్తుంది. ముఖంపై పేరుకొన్న మురికి, జిడ్డు వంటి వాటిని తొలగించుకోవడానికి క్లెన్సింగ్ చేసుకొంటాం. లేదంటే చర్మం కాలుష్య ప్రభావానికి గురవుతుంది. అలాగే చర్మ రంధ్రాల్లో మురికి పేరుకుపోయి.. మనఆరోగ్యం దెబ్బ తింటుంది. అందుకే దీనికోసం ఉపయోగించే క్లెన్సర్ ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. వీలైనంత వరకు రసాయన రహితమైనవి ఉపయోగించడం మంచిది.


cleanese-1


POPxo రికమెండ్ చేసే ఉత్పత్తులు


1. సెటాఫిల్ జెంటిల్ స్కిన్ క్లెన్సర్ (Cetaphil Gentle Skin Cleanser)


ప్రతి రోజూ చర్మాన్ని క్లెన్సింగ్ చేసుకొనేలా తయారు చేసిన ఉత్పత్తి ఇది. దీనిని క్లినికల్‌గా కూడా పరీక్షించడం జరిగింది.  సోప్ ఫ్రీ ఫార్ములా, నాన్ ఇరిటేటింగ్ ఫార్ములాతో దీన్ని తయారుచేశారు. పైగా ఇది తక్కువ నురగను ఇస్తుంది. దీనివల్ల చర్మంపై రసాయనాల ప్రభావం పడదు. కాబట్టి చర్మానికి ఎలాంటి హాని జరగదు. ఇది ఎంత సురక్షితమంటే.. దీన్ని చిన్నారులకు సైతం ఉపయోగించవచ్చు. ఏ రకమైన చర్మతత్వం కలిగిన వారైనా సరే దీన్ని వాడచ్చు.


ధర:  ₹ 237


ఇక్కడ కొనండి.


2. కామా ఆయుర్వేద కుంకుమాది బ్రైటనింగ్ ఆయుర్వేదిక్ ఫేస్ స్క్రబ్


బామ్మల కాలం నాటి సౌందర్య చిట్కాల ఆధారంగా Kama Ayurveda ఉత్పత్తులు తయారవుతాయి. వీటి కోసం పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పండినవే ఉపయోగిస్తారు. కుంకుమాది బ్రైటనింగ్ స్క్రబ్‌లో సుమారుగా.. 12 రకాల అరుదైన మూలికలను ఉపయోగించారు. దీన్ని వాడటం వల్ల చర్మం రంగు మెరుగుపడుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. దీనిలో కుంకుమ పువ్వు, స్వీట్ ఆల్మండ్ వంటివి ఉన్నాయి. దీనివల్ల చర్మానికి విటమిన్ ఇ, విటమిన్ డి పుష్కలంగా దొరుకుతాయి. ఈ స్క్రబ్ ఉపయోగించడం వల్ల చర్మం శుభ్రంగా తయారవడం మాత్రమే కాకుండా.. చర్మానికి తగిన పోషణ కూడా దొరికుతుంది.


ధర: ₹1295


ఇక్కడ కొనండి.


3. హిమాలయా నీమ్ ఫేస్ ప్యాక్


జిడ్డు చర్మం కలిగినవారు, మొటిమలున్నవారు హిమాలయా నీమ్ ఫేస్ ప్యాక్ ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. హిమాలయా సంస్థ చాలా ఏళ్ల నుంచి హెర్బల్ ఉత్పత్తులను తయారుచేస్తూ వినియోగదారుల ఆదరణను చూరగొంది. ఈ ఫేస్ ప్యాక్‌లో ఉన్న వేప.. చర్మాన్ని శుభ్రం చేయడంతో పాటు చర్మ సంబంధ సమస్యలు రాకుండా చేస్తుంది.


ధర: ₹ 120


ఇక్కడ కొనండి.


4. ఇట్స్ స్కిన్ స్నెయిల్ మాయిశ్చర్ మాస్క్ షీట్


కొరియన్ స్కిన్ కేర్ సంస్థ It's Skin. పూర్తిగా సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసిన సౌందర్య ఉత్పత్తులను అందిస్తుంది ఈ సంస్థ. వాటిలో ఒకటే.. ఈ స్నెయిల్ మాయిశ్చర్ మాస్క్ షీట్. ఇది కాలుష్య ప్రభావానికి గురైన చర్మాన్ని శుభ్రం చేస్తుంది. అలాగే స్కిన్ పై పేరుకొన్న మురికిని తొలగిస్తుంది. పైగా అలసిన చర్మాన్ని సేదతీరుస్తుంది. ఈ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. ఏ చర్మతత్వం కలిగిన వారైనా ఈ మాస్క్ వేసుకోవచ్చు. ఈ మాస్క్ చర్మానికి పోషణ ఇవ్వడం మాత్రమే కాకుండా.. ముడతలను తగ్గిస్తుంది. పిగ్మెంటేషన్ తగ్గించి మేనిఛాయను మెరుగు పరుస్తుంది.


ధర: ₹150


ఇక్కడ కొనండి.


మాయిశ్చరైజింగ్ ఉత్పత్తులు


చర్మం అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే మాయిశ్చరైజ్ చేసుకోవడం తప్పనిసరి. స్నానం చేసిన తర్వాత కచ్చితంగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు అందడం మాత్రమే కాదు.. స్కిన్ పొడి బారకుండా కూడా ఉంటుంది. మాయిశ్చరైజర్ అప్లై చేసుకోకపోతే చర్మం పొడిబారుతుంది. దీనివల్ల చర్మం మంటగా అనిపించవచ్చు. కొంతమందిలో అయితే చర్మం బాగా జిడ్డుగా తయారవుతుంది. దీనివల్ల మొటిమలు వస్తాయి. ఇలా జిడ్డుగా మారడానికి చర్మం అధిక మొత్తంలో సీబమ్ ఉత్పత్తి చేయడమే కారణం. కాబట్టి క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ చేసుకోవడం మంచిది. దీనివల్ల చర్మం ఎప్పుడూ యవ్వనంగా ఉంటుంది. ముడతలు ఏర్పడవు.


POPxo రికమెండ్ చేస్తున్న మాయిశ్చరైజర్స్


1.ఇన్నిస్ ఫ్రీ జీజు వొల్కానిక్ పోర్ టోనర్


స్కిన్ కేర్ నిపుణుల అభిప్రాయం ప్రకారం చర్మానికి టోనింగ్ తప్పనిసరి. కానీ చాలామందికి ఈ విషయంపై అవగాహన లేదనే చెప్పుకోవాలి. మాయిశ్చరైజ్ చేసుకోవడానికి ముందే చర్మాన్ని టోనర్‌తో శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల చర్మంపై పేరుకొన్న మురికి, జిడ్డు తొలగిపోతాయి. అంతేకాదు చర్మ గ్రంథులు అధికంగా ఉత్పత్తి చేసిన సీబమ్‌ను కూడా టోనర్ తొలగిస్తుంది. అంతేకాదు చర్మానికి కొత్త మెరుపు వచ్చేలా చేస్తుంది. ఆ ఫలితం పొందాలంటే Innisfree Jeju Volcanic Pore Toner ఉపయోగించాల్సిందే. టోనర్‌లో దూదిని ముంచి తుడుచుకొంటే సరిపోతుంది.


ధర: ₹ 1600


ఇక్కడ కొనండి.


2. జస్ట్ హెర్బ్స్ గొటుకొల ఇండియన్ గిన్సెన్గ్ రెజువెనేటింగ్ బ్యూటీ ఎలిక్సిర్


చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించే రసాయన రహిత ఉత్పత్తులను Just Herbs తయారుచేస్తుంది.  చర్మాన్ని మాయశ్చరైజ్ చేసేందుకు ఈ సంస్థ అందిస్తోన్న ఫేసియల్ సీరమే ఈ Gotukola Indian Ginseng Rejuvenating Beauty Elixir. రోజ్ హిప్, కుసుమపూలు, సునాముఖి, యష్టి మధుకము, నాగకేసరం, మునగ గింజలతో పాటు చర్మసౌందర్యాన్ని పెంచే సహజసిద్ధమైన ఉత్పత్తులతో సీరమ్‌ను తయారుచేశారు. వీటివల్ల చర్మానికి విటమిన్ ఎ, సి, ఇ లభిస్తాయి. వీటివల్ల చర్మంపై ఏర్పడిన ముడతలు తగ్గిపోతాయి. చర్మానికి పోషణ అందించి మాయిశ్చరైజ్ చేస్తాయి. ఫలితంగా చర్మం సహజ మెరుపును సంతరించుకొంటుంది. అలాగే యవ్వనంగా కనిపిస్తుంది. కేవలం కొన్ని చుక్కల సీరమ్ ఉపయోగించడం ద్వారా రోజంతా చర్మాన్ని తాజాగా ఉంచుకోవచ్చు.


ధర: ₹1825


ఇక్కడ కొనండి.


3. ది బాడీ షాప్ టీట్రీ ఆయిల్


సహజసిద్ధమైన చర్మ సౌందర్య ఉత్పత్తులను అందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక గన్న సంస్థ The Body Shop. సాధారణంగా టీట్రీ ఆయిల్‌తో తయారైన సౌందర్య ఉత్పత్తులకు డిమాండ్ బాగా ఎక్కువగా ఉంటుంది. కానీ నా పర్సనల్ ఫేవరెట్ మాత్రం ఫేసియల్ ఆయిల్. దీన్ని చర్మానికి అప్లై చేసుకోవడం ద్వారా చర్మానికి పోషణ అందుతుంది. పైగా మొటిమలు, మచ్చలు తగ్గుముఖం పడతాయి.


ధర: ₹ 645


ఇక్కడ కొనండి.


4. ఫారెస్ట్ ఎస్సెన్సియల్స్ లైట్ హైడ్రేటింగ్ ఫేసియల్ జెల్ అలోవెరా.


కలబంద వల్ల చర్మానికి జరిగే మేలు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చర్మ సంరక్షణ విషయంలో మనకు ప్ర‌కృతి అందిన వరం కలబంద. దీనిలో 96% నీరుంటుంది. అమైనో ఆమ్లాలు, విటమిన్ ఎ, బి, సి, ఇ పుష్కలంగా లభిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో Forest Essentials అందిస్తోన్న లైట్ హైడ్రేటింగ్ ఫేషియల్ జెల్‌కి ఆదరణ ఎక్కువగా ఉంది. కాస్త ఖరీదు ఎక్కువే అనిపించినప్పటికీ ఇది చక్కటి ఫలితాలనిస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల చర్మ సౌందర్యం మెరుగు పడటం మాత్రమే కాదు.. దురద, మంట, ఎరుపెక్కడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


మరో విధంగా ఈ చెప్పాలంటే.. ఈ జెల్ మల్టీ టాస్కింగ్ చేస్తుంది. దీన్ని ఫేస్ ప్యాక్‌గా కూడా వేసుకోవచ్చు. ఫారెస్ట్ ఎస్సెన్సియల్ అలోవెరా జెల్‌కు పసుపు, తేనె, పాలు, కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపి మిశ్రమంగా చేసి ప్యాక్‌లా వేసుకోవాలి. కాసేపాగిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం కోల్పోయిన తేమ తిరిగి అందడంతో పాటు.. ఛాయ పెరుగుతుంది. అలోవెరా జెల్‌లో కాస్త పంచదార, నిమ్మరసం కలిపి దాన్ని స్క్రబ్‌లా కూడా ఉపయోగించవచ్చు. తేనె, వాల్ నట్ పొడి కలిపిన అలొవెరా జెల్‌ను ముఖానికి అప్లై చేసుకొంటే మొటిమల సమస్య తగ్గుముఖం పడుతుంది.


ధర: ₹ 1300


ఇక్కడ కొనండి.


5. కామా ఆయుర్వేద ఇలాదీ హైడ్రేటింగ్ ఆయుర్వేదిక్ ఫేస్ క్రీం


Kama Ayurveda ఉత్పత్తుల గురించి మనం ముందుగానే చర్చించుకొన్నాం. ఈ సంస్థ అందించిన మరో ఉత్పత్తి Eladi Hydrating Ayurvedic Face Cream. ఇది కొబ్బరి పాలు, నువ్వుల నూనెతో తయారైంది. ఈ క్రీమ్ రాసుకోవడం ద్వారా చర్మం పొడిబారే సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. దీనిలో ఉన్న కోస్టస్ (costus), యాలకుల్లోని సుగుణాలు మేనిఛాయను పెంచడమే కాకుండా చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.


ఈ క్రీమ్‌లో కలబంద కూడా ఉంది. దీనిలోని యాంటిసెప్టిక్ గుణాలు ముడతలు, మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. అలాగే సూర్యుని నుండి వెలువడే అతినీల లోహిత కిరణాల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ ఫేస్ క్రీమ్‌లో ఆలివ్ నూనె, గులాబీ, మల్లె కూడా ఉన్నాయి. కాబట్టి చర్మం మాయిశ్చరైజ్ అవ్వడం మాత్రమే కాకుండా.. మేనిఛాయను సైతం సహజంగా కనిపించేలా చేస్తుంది.


ధర: ₹ 1395


ఇక్కడ కొనండి.


6. ఫారెస్ట్ ఎస్సెన్సియల్స్ లైటనింగ్ అండ్ బ్రైటనింగ్ తేజస్వి ఎమల్సన్


ఆయిల్ స్కిన్‌తో ఇబ్బంది పడేవారికి చక్కటి పరిష్కారాన్ని ఈ క్రీం అందిస్తుంది. ఇది ఆవు నెయ్యి, స్వీట్ ఆల్మండ్ నూనె, కొబ్బరి నూనెతో పాటు చర్మానికి మంచి చేసే మరిన్ని ప్ర‌కృతి అందించిన పదార్థాలతో తయారయింది. సాధారణంగా జిడ్డు చర్మతత్వం కలిగిన వారు మాయిశ్చరైజ్ చేసుకోవడానికి అంతగా ఇష్టపడరు. అలా చేస్తే చర్మం మరింత జిడ్డుగా కనిపిస్తుంది. అయితే ఫారెస్ట్ ఎస్సెన్సియల్స్ అందిస్తోన్న తేజస్వి ఎమల్సన్ ఉపయోగిస్తే అలాంటి ఇబ్బందేమీ ఉండదు. అంతేకాకుండా.. చర్మగ్రంథులు విడుదల చేసే నూనెలను క్రమబద్ధీకరిస్తుంది. అలాగే చర్మం ఎప్పుడూ ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది.


ధర: ₹1675


ఇక్కడ కొనండి.


7. సెటాఫిల్ మాయిశ్చరైజింగ్ లోషన్


కాళ్లకు, చేతులకు మాయిశ్చరైజర్ రాసుకొన్నప్పటికీ కాస్త సమయం గడిచిన తర్వాత పొడిగా మారిపోతాయి. దీంతో పదే పదే మాయిశ్చరైజర్ రాసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే Cetaphil Moisturising Lotion రాసుకోవడం వల్ల ఇలా చేయాల్సిన అవసరం రాదు. ఇది చర్మంపై ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది. జిడ్డుగా అనిపించదు.


ధర: ₹ 347


ఇక్కడ కొనండి.


ఇప్పటి వరకు మనం పారాబెన్స్ గురించి పారాబెన్ రహిత ఉత్పత్తుల గురించి మనం తెలుసుకొన్నాం. ఇప్పుడు సల్ఫేట్స్ గురించి తెలుసుకొందాం.


సల్ఫేట్స్ అంటే ఏంటి?


మీరు ఉపయోగిస్తున్న షాంపూ వలన చాలా ఎక్కువగా నురగ వస్తోందా? అయితే దానిలో కచ్చితంగా సోడియం లారిల్ సల్ఫేట్ ఉంటుంది. అది సల్ఫేట్ లారిల్ ఆల్కహాల్‌కు స్పటిక లవణ రూపం. ఇది డిటర్జెంట్‌గానూ పనిచేస్తుంది. సోడియం లారిల్ సల్ఫేట్ ద్రవ పదార్థానికి, ఘన పదార్థానికి మధ్య పొరలా మారి అడ్డుగోడలా పనిచేస్తుంది. మనం షాంపూ రుద్దడం మొదలుపెట్టగానే సోడియం లారిల్ సల్పేట్ జుట్టుకి.. షాంపూకి మధ్య పొరలా ఏర్పడుతుంది. దీని కారణంగా వెంట్రుకలను షాంపూ ప్రయోజనాలు చేరవు.


sulphates-1


సల్ఫేట్స్ వల్ల ఎదురయ్యే నష్టాలు


సల్ఫేట్స్ ఉన్న షాంపూలు వెంట్రుకలను బాగానే శుభ్రం చేస్తాయి. వీటితో పాటుగా జుట్టుపై ఉన్న సహజమైన నూనెలను సైతం పోగొడతాయి. దీని వల్ల వెంట్రుకలు పొడిబారడం, జుట్టు రాలిపోవడం, దురద, స్కాల్ఫ్ పై చర్మం పొరలుగా వూడిపోవడం మొదలైన సమస్యలు ఎదురవుతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం సల్ఫేట్స్ వల్ల చిన్న పిల్లల్లో కంటి సమస్యలు సైతం రావచ్చు. చూపు మందగించడం, కొన్ని సందర్భాల్లో కంటి చూపు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి.


అందుకే చిన్నారుల కోసం సల్ఫేట్ ఫ్రీ షాంపూలను ఉపయోగించమని నిపుణులు చెబుతున్నారు. సల్ఫేట్ లేని షాంపూలు వాడటం వల్ల ఈ సమస్యలు రాకుండా ఉంటాయని అనుకోవడానికి లేదు. ఎందుకంటే.. కొన్ని కంపెనీలు సల్ఫేట్లకు బదులుగా ఇతర రసాయనాలను ఉపయోగిస్తున్నారు. అవి సల్ఫేట్స్ కంటే హానికరమైనవి కూడా కావచ్చు. కాబట్టి ఇలాంటి షాంపూలకు బదులుగా పండ్లు, కూరగాయలు, పూలు వంటి వాటితో తయారైన షాంపూలను ఎంచుకోండి.


POPxo రికమెండ్ చేస్తున్న ఉత్పత్తులు


OGX కోకోనట్ మిల్క్ షాంపూ


పొడి జుట్టుతో ఇబ్బంది పడేవారికి ఈ షాంపూ బాగా పనిచేస్తుంది. దీనిలో కొబ్బరిపాలు, గుడ్డు తెల్లసొన మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. ఇది జుట్టుకి అవసరమైన ప్రొటీన్లను అందిస్తుంది. అంతేకాదు జుట్టు సిల్కీగా అయ్యేలా చేస్తుంది.


ధర: ₹625


ఇక్కడ కొనండి.


2. వావ్ స్కిన్ సైన్స్ ఆపిల్ సిడర్ వెనిగర్ షాంపూ సల్ఫేట్ పారాబెన్ ఫ్రీ


కాలుష్య ప్రభావం, మురికి కారణంగా జుట్టు నిర్జీవంగా తయారవుతుంది. మరి రసాయన ప్రభావం లేకుండా శుభ్రం చేసుకోవడం ఎలా? దానికోసమే ఈ ఆర్గానిక్ షాంపూ. ఇది స్వచ్ఛమైన ఆపిల్ సిడర్ వెనిగర్, స్వీట్ ఆల్మండ్, ఆర్గన్ ఆయిల్ వంటి వాటితో తయారైంది. ఇది స్కాల్ఫ్, జుట్టుపై పేరుకుపోయిన టాక్సిన్లను తొలగిస్తుంది. దీనివల్ల జుట్టు బలంగా తయారవుతుంది.


ధర: ₹ 499


ఇక్కడ కొనండి.


3. హెయిర్ మాక్ సల్ఫేట్ ఫ్రీ షాంపూ


సిల్కీ హెయిర్ అయినా.. డ్రై హెయిర్ అయినా.. హెయిర్ మాక్ సల్ఫేట్ ఫ్రీ షాంపూను ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించడం వల్ల స్కాల్ఫ్ సంబంధిత సమస్యలు సైతం తగ్గుముఖం పడతాయి. అలాగే మృదువైన‌ పట్టులాంటి జుట్టు మీ సొంతమవుతుంది. అంతేకాకుండా స్కాల్ఫ్, జుట్టుని సూర్య కిరణాల ప్రభావం నుంచి రక్షిస్తుంది.


ధర: ₹ 630


ఇక్కడ కొనండి.


Also read: సల్ఫేట్ ఫ్రీ షాంపూలు, కండిషనర్ల గురించి ఇక్కడ ఆంగ్లంలో చదవండి.


పారాబెన్ రహిత, సల్ఫేట్ రహిత స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఉత్పత్తుల గురించి సమాచారాన్ని మేం మీకందించాం. రసాయనిక ఉత్పత్తులను వదిలి.. సహజసిద్ధమైన పదార్థాలతో తయారైన వాటిని ఉపయోగించడానికి ప్రయత్నించండి.


Image: Shutterstock


ఇవి కూడా చదవండి


రూ.150 కంటే తక్కువ రేటుకి లభ్యమయ్యే షాంపూల గురించి ఆంగ్లంలో చదవండి


జుట్టు రకాన్ని బట్టి షాంపూ వినియోగం అనే వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు


అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

SHIPPING
We offer free shipping on all orders (Terms & Conditions apply). The orders are usually delivered within 4-6 business days.
REPLACEMENT
Your item is eligible for a free replacement within 15 days of delivery, in an unlikely event of damaged, defective or different/wrong item delivered to you. All the beauty products are non-returnable due to hygiene and personal care nature of the product. Please send an email to  care@popxo.com to have your order replaced.
HELP & ADVICE
For questions regarding any product or your order(s), please mail us at  care@popxo.com and we will get back to you with a resolution within 48 hours. Working Hours: Monday to Friday, from 10 AM to 6 PM.