అదిరేటి లుక్ కావాలంటే.. ఆరెంజ్ బ్లష్ అప్లై చేయాల్సిందే..

అదిరేటి లుక్ కావాలంటే.. ఆరెంజ్ బ్లష్ అప్లై చేయాల్సిందే..

బ్లష్ (blush).. మేకప్ రొటీన్‌లో దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది కోర‌ల్, టాంజెరిన్, బెర్రీ, రైసిన్, పింక్, బ్రౌన్, రెడ్, పర్పుల్ వంటి రంగుల్లో విభిన్నమైన షేడ్స్‌లో మనకు ల‌భ్య‌మ‌వుతుంది. సాధార‌ణంగా మ‌న స్కిన్‌ టోన్‌కు త‌గిన‌ట్లుగా ఉండే బ్ల‌ష్ ‌నే మ‌నం ఎంపిక చేసుకుంటాం. అయితే ఈ మధ్య ఆరెంజ్ కలర్ షేడ్ బ్లష్ బ్యూటీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అన్ని రకాల స్కిన్ టోన్స్‌కి నప్పే షేడ్‌గా దీన్ని పేర్కొంటున్నారు. ఈ క్ర‌మంలో మీ స్కిన్ టోన్‌కి తగిన ఆరెంజ్ బ్లష్‌ని ఎలా ఎంచుకోవాలో కొన్ని చిట్కాలు మీకోసం..


మీ స్కిన్ టోన్ లైట్‌గా ఉంటే..


1-orange-blush-makeup


మీ చర్మం టోన్ లైట్‌గా ఉంటే.. దాన్ని మరింత బ్రైట్‌గా కనిపించేలా చేసే బ్లష్ ఎంచుకోవాల్సి ఉంటుంది. పీచ్, పగడం, టాంజెరిన్ షేడ్స్‌లోని బ్లష్ మిమ్మల్ని ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. అయితే సాచ్యురేటెడ్ ఆరెంజ్ రంగులోని బ్లష్‌కి మాత్రం మీరు దూరంగా ఉండాలి.


POPxo Recommends: లాక్మే కరీనా కపూర్ ఖాన్ అబ్సల్యూట్ చీక్ కాంటౌర్ కోరల్ దివా(రూ. 910)


స్కిన్ టోన్ మధ్యస్థంగా ఉంటే..


2-orange-blush-makeup


మీ చర్మం చామనఛాయలో ఉంటే ఆరెంజ్ బ్లష్ (Orange Blush) మీకు చాలా బాగుంటుంది. అయితే కోరల్, పీచ్ షేడ్ బ్లష్ అప్లై చేసుకుంటే మీ లుక్ చాలా సహజంగా కనిపిస్తుంది.


POPxo Recommends: మిలానీ రోజ్ పౌడర్ బ్లష్ - 05 కోరల్ కోవ్ (రూ. 1,170)


మీది డస్కీ స్కిన్ అయితే..


3-orange-blush-makeup


ఆరెంజ్ రంగులో కాస్త రెడ్‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే షేడ్ మీ అందాన్ని పెంచుతుంది. అయితే బ్లష్ అప్లై చేసుకొనేటప్పుడు మీ నేచురల్ లుక్ దెబ్బ తినకుండా అప్లై చేసుకోవాలి.


POPxo Recommends: ఎన్ వైఎక్స్ ప్రొఫెషనల్ ఆంబర్ బ్లష్ - ఫీల్ ది హీట్(రూ. 960)


ఆరెంజ్ బ్లష్ వేసుకొనేటప్పుడు పాటించాల్సిన చిట్కాలు


Tip 1: ఆరెంజ్ బ్లష్ వేసుకొన్నప్పుడు అదే రంగులోని లిప్ స్టిక్, ఐషాడో వేసుకోవద్దు. ఎందుకంటే.. ఇలా చేస్తే మొదటికే మోసం వస్తుంది. అందుకే ఆరెంజ్ బ్లష్ వేసుకొన్నప్పుడు మీ మేకప్ న్యూట్రల్‌గా ఉండేలా చూసుకోండి.


Tip 2: ఆరెంజ్ బ్లష్‌తో పాటుగా బ్రాంజర్, హైలైటర్ కూడా వేసుకొంటే.. మీ లుక్ చాలా సహజంగా ఉంటుంది.


Tip 3: బ్యూటీ బ్లెండర్ స్పాంజ్‌ను బ్లష్‌లో ముంచి అప్లై చేసుకొంటే మీ లుక్ సహజంగా ఉంటుంది.


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు


అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.


 


ఇవి కూడా చ‌ద‌వండి


చాక్లెట్ వ్యాక్స్ లేదా రెగ్యులర్ వ్యాక్స్.. ఏ చర్మానికి ఏది బాగుంటుంది?


చర్మ, కేశ సంరక్షణ కోసం వాడాల్సిన.. పారాబెన్, సల్ఫేట్ రహిత ఉత్పత్తులివే..!


15 రకాల బెస్ట్ బీబీ క్రీమ్స్ మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి..


ఓ కామన్ గర్ల్.. నేటితరానికి చెప్పిన అతిగొప్ప సౌందర్య చిట్కా ఇదే..!


పసుపు వాడేద్దాం.. ఈ ప్రయోజనాలు పొందేద్దాం..!


బ్యూటీ రిజల్యూషన్స్: సులభమైన చిట్కాలతో అందం మీ సొంతం..