ADVERTISEMENT
home / Celebrity gossip
కొత్త సంవత్సరంలో.. కత్రినా  సరికొత్త సాహసం..!

కొత్త సంవత్సరంలో.. కత్రినా సరికొత్త సాహసం..!

2019 సంవత్సరానికి ప్రపంచమంతా చాలా ఉత్సాహంగా స్వాగతం పలకగా.. కొంతమంది మాత్రం కాస్త వైవిధ్యంగా ఈ నూతన సంవత్సరానికి నాంది పలికారు. ప్రముఖ నటీనటులంతా తమ కుటుంబసభ్యులతో కలిసి విదేశాలకి వెళ్ళగా.. మరికొంతమంది మాత్రం ఇండియాలోనే ప్రఖ్యాత బీచ్‌లను సందర్శించడం జరిగింది. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ తన భర్త విరాట్ కోహ్లీతో కలిసి ఆస్ట్రేలియా సిరీస్‌లో భాగంగా సిడ్నీ (Sydney) ప్రాంతాన్ని సందర్శించి.. ఈ సంవత్సరానికి స్వాగతం చెప్పడం జరిగింది. 

నవ దంపతులు దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్‌లు.. అలాగే ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌లు ప్రస్తుతం న్యూ ఇయర్ వేడుకలను విదేశాల్లోనే జరుపుకొని.. అక్కడే చక్కర్లు కొడుతున్నారు. సుస్మితా సేన్, కాజోల్, సోనాలి బింద్రే లాంటి నటీమణులు కూడా ఈ సారి న్యూ ఇయర్ పార్టీని ఘనంగా జరుపుకున్నారు.

అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, నటి కత్రినా కైఫ్ తన కుటుంబసభ్యులతో కలిసి ఇంగ్లాండ్‌లోని (England) ఇంగ్లీష్ ఛానల్ (English Channel)ను సందర్శించడానికి వెళ్లారు. అక్కడే కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈత కొట్టారు. అయితే ఈత కొట్టడం కూడా ఒక వైవిధ్యమైన విషయమేనా.. అని మీరు అనవచ్చు. కానీ కత్రినా తన సోదరితో కలిసి ఈత కొట్టే సమయంలో.. ఇంగీష్ ఛానల్‌లో నీటి ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది.

 

ADVERTISEMENT

సాధారణంగా అత్యంత తక్కువ ఉష్ణోగ్రత నమోదైన సమయంలో ఈత కొట్టడమంటేనే ఒక పెద్ద సాహసం కదా. అందుకే న్యూ ఇయర్ సందర్భంగా కత్రినా కైఫ్ చేసిన ఈ వినూత్న సాహసం గురించి అందరు చర్చించుకుంటున్నారు.

ఇక కత్రినా కూడా.. ఈ వీడియోని తన సోషల్ మీడియా మాధ్యమాల పై పోస్ట్ చేసి ఈ కొత్త సంవత్సరం సందర్భంగా పాటించాల్సిన ఒక 4 విషయాలని అందరితో పంచుకుంది. అవేంటంటే –

1. సముద్రాలలో ఈత కొట్టడానికి వేసవి కాలం అనువైన సమయం 

2. పెద్ద వాళ్ళ సలహాలని పాటించాల్సిందే (మరీ ముఖ్యంగా ఈత కొట్టే సమయంలో)

ADVERTISEMENT

3. ఎప్పుడు కూడా ఎదుటివారిని ద్వేషించకండి.

4. మీ దృష్టిని & మనసుని ఒకే దగ్గర ఉంచేందుకు ప్రయత్నించండి.

ఈ నాలుగు మాటలు చెప్పి ఈ కొత్త సంవత్సరంలో తాను ఎలా ఉండబోతుందనే విషయాన్ని చెప్పకనే చెప్పింది కత్రినా. ఒకవైపు ఈ మాటలు చెబుతూనే..  నూతన సంవత్సర వేడుకలని తన కుటుంబసభ్యుల మధ్య లండన్ నగరంలో చాలా డిఫరెంట్‌గా జరుపుకుంది కత్రినా.

ఇక కత్రినా కైఫ్ సినిమాల విషయానికి వస్తే, ఈ మధ్యనే విడుదలైన జీరో (Zero) చిత్రంలో ఆమె ఒక కీలక పాత్రలో నటించింది. ఆ పాత్రకి గాను కత్రినా కైఫ్‌కి మంచి ప్రశంసలే దక్కాయి. చాలా కాలం తరువాత ఆమె అభినయానికి ఎక్కువ మంది ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఆమె చేతిలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న భారత్ (Bharat) చిత్రం ఉండగా.. వరుణ్ ధావన్‌తో చేయాల్సిన ABCD చిత్రం సీక్వెల్ నుండి ఆమె తప్పుకుంటున్నట్టుగా ప్రకటించింది. దీనికి కారణం ఈ చిత్రం కోసం సరిపడినన్ని కాల్షీట్స్ ఇవ్వలేకపోవడమే అని సమాచారం.

ADVERTISEMENT

మొత్తానికి ఈ అందాల తార 2019ని ఎంత వైవిధ్యంగా అయితే ప్రారంభించిందో.. అంతే వైవిధ్యంగా ఈ సంవత్సరమంతా ఆమె కెరీర్ దూసుకుపోవాలని కోరుకుందాం.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ పార్టీ చేసుకోవాలంటే.. ఈ 15 బెస్ట్ స్పాట్స్‌‌కి వెళ్లాల్సిందే..!

హైదరాబాద్‌లో క్రిస్మస్ & న్యూ ఇయర్ ‘కేక్స్’కి.. ఈ బేకరీలు ప్రత్యేకం 

ADVERTISEMENT

కొత్త సంవత్సరం వచ్చేస్తున్న వేళ.. మీరూ కొత్త నిర్ణయాలు తీసేసుకోండి..!

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

03 Jan 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT