నిక్, ప్రియాంక పెళ్లిలో.. డైమండ్ రింగ్ గెలుచుకున్న బాలీవుడ్ భామలు

నిక్, ప్రియాంక పెళ్లిలో.. డైమండ్ రింగ్ గెలుచుకున్న బాలీవుడ్ భామలు

గ‌తేడాది బాలీవుడ్‌లో విడుద‌లైన సినిమాల కంటే అక్క‌డ జ‌రిగిన పెళ్లిళ్లే ఎక్కువ‌గా పాపులారిటీని సంపాదించుకున్నాయి. గ్లోబ‌ల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్ర‌ముఖ న‌టి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) వివాహం కూడా వాటిలో ఒక‌టి. అమెరిక‌న్ పాప్ సింగ‌ర్ నిక్ జొనాస్ (Nick Jonas)ను ఈ అమ్మ‌డు ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే!


జైపూర్‌లోని ఉమైద్ ప్యాల‌స్ (Umaid Palace) వేదిక‌గా వీరి పెళ్లి గ‌తేడాది అంగ‌రంగవైభ‌వంగా జ‌రిగింది. మూడు రోజుల పాటు జ‌రిగిన ఈ వివాహ వేడుక‌ల నిమిత్తం నిక్ త‌ర‌ఫు కుటుంబ స‌భ్యులు, బంధువులు అమెరికా నుంచి ఇక్క‌డ‌కు చేరుకోగా; పీసీ త‌ర‌ఫు బంధువులు పంజాబ్, ముంబ‌యి నుంచి రాజస్థాన్‌కు చేరుకొని ఈ పెళ్లిలో పాల్గొన్నారు.


సామాజిక మాధ్య‌మాల్లో (Social media) సైతం #NickYanka & #NickPriyanka వంటి హ్యాష్ ట్యాగ్స్‌తో వీరి పెళ్లికి సంబంధించిన ప‌లు వార్త‌లు, ఫొటోలు విప‌రీతంగా వైర‌ల్ అయ్యాయంటే నిక్- ప్రియాంక‌ల పెళ్లి ఎంత‌మంది దృష్టిని ఆక‌ర్షించిందో ఇట్టే అర్థ‌మైపోతుంది.


పీసీ- నిక్‌ల వివాహం హిందూ & క్రైస్త‌వ సంప్ర‌దాయాల ప్ర‌కారం క‌న్నుల‌పండువ‌గా జ‌రిగింది. ఈ వివాహ తంతులో భాగంగానే వ‌రుడి పాద‌ర‌క్ష‌ల‌ను వ‌ధువు సోద‌రీమ‌ణులు దాచిపెట్టి క‌నుక్కోమన్నారు. ఒక‌వేళ వాటిని క‌నిపెట్ట‌లేక‌పోతే వారికి ఏదైనా బ‌హుమ‌తి లేదా వారు కోరిన వ‌స్తువుల‌ను ఇవ్వాల్సి ఉంటుంది. దీనినే జూతా చుర‌య్ అని అంటారు. భార‌తీయ వివాహ సంప్ర‌దాయాల్లో ఇదీ ఒక‌టి. ఈ తంతు చాలా స‌ర‌దాగా సాగుతుంది. ఇందులో భాగంగా కాబోయే బావ పాద‌ర‌క్ష‌లను దాచిపెట్టి.. పెళ్లికూతురి చెల్లెళ్లు ఎక్కువ‌గా వ‌రుడి త‌ర‌ఫువారిని ఆట‌ప‌ట్టిస్తుంటారు.


parineeti-1z


ప్రియాంక - నిక్ జొనాస్‌ల వివాహ వేడుక‌లో కూడా ఈ తంతు చాలా స‌ర‌దాగా సాగింద‌ట‌! ప్రియాంక సోద‌రి ప‌రిణీతి చోప్రా (Parineethi Chopra) త‌న బావ నిక్ జొనాస్ పాద‌ర‌క్ష‌లను అతనికి తిరిగి ఇచ్చేందుకు.. భారీగానే న‌గ‌దు అందుకుంద‌ని వార్త‌లు కూడా వినిపించాయి. కానీ అవి ఎంత వ‌ర‌కు వాస్త‌వం అన్న‌దానిపై ఎవ‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. తాజాగా ప‌రిణీతి త‌న అక్క ప్రియాంక పెళ్లిలో జ‌రిగిన ఈ జూతా చుర‌య్ గురించి ఓ షో వేదిక‌గా అంద‌రితోనూ పంచుకుంది.


ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టీమ‌ణి నేహాధూపియా వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రిస్తోన్న బీఎఫ్ఎఫ్స్ విత్ వోగ్ అనే కార్య‌క్ర‌మంలో ప‌రిణీతి పాల్గొంది. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా నేహా పీసీ పెళ్లి వేడుక‌లో భాగంగా నిక్ ఇచ్చిన బ‌హుమ‌తి గురించి అడగ్గా- ప‌రిణీతి మా బావ ది బెస్ట్ అంటూ కితాబిచ్చింది. జూతా చుర‌య్‌లో భాగంగా ఆమె అందుకున్న బ‌హుమ‌తి గురించి కూడా చెప్పుకొచ్చింది.


nickmarriage


Image: People Magazine


ప్రియాంక ద్వారా పెళ్లిలో ఇలాంటి తంతు ఒక‌టి ఉంటుంద‌ని ముందే తెలుసుకున్న నిక్ అందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ విష‌యం మాకు తెలియ‌దు. దాంతో మేము పాద‌ర‌క్ష‌లు ఇచ్చేందుకు ఒప్పుకోక‌పోయేస‌రికి.. నాతో పాటు ఉన్న బ్రెయిడ్ మెయిడ్స్ అంద‌రికీ ఒక్కొక్క‌రికీ ఒక్కో డైమండ్ రింగ్ ఇచ్చారు.


ఈషా అంబానీ, స‌ల్మాన్ ఖాన్ సోదరి అర్పితాఖాన్.. త‌దిత‌రులు కూడా ఈ ఉంగరాలు అందుకున్న వారి జాబితాలో ఉన్నారు. నిక్ త‌మ‌నే ఇంత ఆశ్చ‌ర్య‌ప‌రిచాడంటే.. ఎంత‌గానో ప్రేమిస్తోన్న త‌న సోద‌రిని ఇంకెంత సర్ ప్రైజ్ చేసి ఉంటాడో ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు అంటూ త‌న బావ‌పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించింది.


గ‌తేడాది అర్జున్ క‌పూర్ స‌ర‌స‌న న‌టించిన "న‌మ‌స్తే ఇంగ్లండ్"తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ప‌రిణీతి.. ఈ ఏడాది సిద్ధార్థ్ క‌పూర్ స‌ర‌స‌న జ‌బ‌రియా జోడి అనే చిత్రంతో పాటు కేసరి, సందీప్ అవుర్ పింకీ ఫ‌రార్.. అనే సినిమాల్లో కూడా న‌టిస్తోంది. మ‌రోవైపు ప్రియాంక త‌న త‌దుప‌రి చిత్ర‌మైన "స్కై ఈజ్ పింక్" సినిమా చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉంది. ఈ సినిమాలో ఫ‌ర్హాన్ అఖ్త‌ర్, జైరా వ‌సీం.. తదిత‌రులు కూడా ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అలాగే ఆమె న‌టించిన ఈజిన్ట్ ఇట్ రొమాంటిక్ చిత్రం వాలంటైన్స్ డే సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


ఇవి కూడా చ‌ద‌వండి


శ్రీదేవి బయోపిక్ పై.. కన్నేసిన రకుల్ ప్రీత్..?


క్రీడాకారులుగా దూసుకుపోవడానికి.. మన యువ హీరోలు రెడీ..!


కమల్ హాసన్, అక్షయ్ కుమార్ బాటలోనే.. మాధవన్ కూడా..!