ADVERTISEMENT
home / సౌందర్యం
హెల్త్ సరిగ్గా లేకున్నా ఆఫీసుకి వెళ్లాల్సొస్తే.. ఏం చేయాలి..?

హెల్త్ సరిగ్గా లేకున్నా ఆఫీసుకి వెళ్లాల్సొస్తే.. ఏం చేయాలి..?

రుతువులు మారుతుంటే వాతావరణం కూడా మారుతుంది. ఆ సమయంలో ఆ మార్పుల ప్రభావం మన హెల్త్ పై కూడా పడుతుంది. కొందరికి జలుబు చేస్తే మరికొందరికి దానితో పాటూ తలనొప్పి కూడా వస్తుంది. కాస్త విశ్రాంతి తీసుకొందామనుకొన్నా ఆఫీసుకి వెళ్లక తప్పని పరిస్థితి ఎదురవ్వచ్చు. మరి ఆ నీరసం ముఖంలో కనిపిస్తే అంత బాగుండదు కదా.. ఎప్పటిలానే మీ ముఖం తాజాగా ఉండాలి. అందుకే లేచి ఓ గ్రీన్ టీతో మిమ్మల్ని మీలో ఉత్సాహాన్ని నింపుకొని.. నేను చెప్పే మేకప్ (Makeup) టిప్స్ ఫాలో అవ్వండి.

1. క్లెన్సింగ్

అనారోగ్యం బారిన పడితే ఆ ప్రభావం మన చర్మంపై కూడా పడుతుంది. చర్మం పొడిబారిపోయి.. పొలుసులుగా ఊడిపోతుంటుంది. ముఖ్యంగా జలుబు చేస్తే ముక్కు చుట్టూ ఎర్రగా మారిపోతుంది. కాబట్టి మేకప్ వేసుకొనే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవడం అవసరం. అందుకోసం మైల్డ్ ఫేసియల్, ఆయిల్ బేస్డ్ క్లెన్స్ ఉపయోగించడం బెటర్. ఇలా క్లెన్స్ చేసుకొనే ముందు చేతులను ఒకటికి రెండు సార్లు శుభ్రం చేసుకోవడం మాత్రం మరచిపోవద్దు.

2. మాస్క్

ADVERTISEMENT

సాధారణ రోజుల్లో మేకప్‌కి ముందు చర్మాన్ని టోన్ చేసుకొంటూ ఉంటాం. కానీ స్కిన్ డల్‌గా ఉండే ఈ సమయంలో టోనింగ్ ఒకటే సరిపోదు. కాబట్టి ముఖానికి షీట్ మాస్క్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడానికి ముందు ఓ పది నిమిషాలు మాస్క్‌ను ఫ్రిజ్‌లో ఉంచాలి. కాసేపు మసాజ్ చేసుకొని నిర్ణీత సమయం తర్వాత దాన్ని తొలగించాలి. 

3. మాయిశ్చరైజ్

షీట్ మాస్క్ వేసుకొన్న తర్వాత చర్మం కాస్త మెరుగు పడుతుంది. కాబట్టి రోజూ చర్మానికి రాసుకొనే మాయిశ్చరైజర్‌నే అప్లై చేసుకోవాలి. కాస్త ఐక్రీం కూడా రాసుకోవాలి. లిప్ బామ్‌నూ అప్లై చేసుకోవాలి. 

ADVERTISEMENT

4. బేస్ మేకప్

మాయిశ్చరైజర్, లిప్ బామ్‌తో  బ్యూటీ రొటీన్ పూర్తయిపోతుంది. కానీ ఇలా పాలిపోయిన ముఖంతో ఆఫీసుకి వెళితే బాగోదు కదా. అందుకే కొద్దిగా మేకప్ వేసుకొని వెళ్లాలి. తర్వాత కన్సీలర్ అప్లై చేసుకొని.. లైట్‌గా కాంపాక్ట్ పౌడర్ అద్దుకోవాలి. 

5. ఐ మేకప్

ADVERTISEMENT

జలుబు చేస్తే నా కళ్లు ఉబ్బిపోతాయి. అలా కనిపించకుండా ఉండాలి కదా. ఇప్పటికే నేను అప్లై చేసుకొన్న కన్సీలర్ కొంత మేర ఆ పని చేస్తుంది. మరి కాస్త ఐ మేకప్ వేసుకొంటే.. కళ్లు ఉబ్బినట్టుగా కనిపించవు. దీనికోసం బ్రౌన్ ఐ షాడో స్టిక్‌ని ఐ లైనర్‌గా వేసుకుంటే మంచిది. ఆ తర్వాత కనురెప్పలను(ఐలాష్) కర్ల్ చేసి వాటర్ ప్రూఫ్ మస్కారాను రెండు సార్లు అప్లై చేసుకుంటే బెటర్. దీనివల్ల కళ్లు కాస్త పెద్దవిగా కనిపిస్తాయి.

6. బ్లష్

అస్తమానూ ముక్కు తుడుచుకోవడం, తుమ్మడం వల్ల ముఖం ఎర్రగా మారిపోతుంది. అందుకే కాస్త చెంపలకు చీక్ టింట్ అద్దుకుంటే మంచిది. 

ADVERTISEMENT

7. పెదవులు

చివరిగా పెదవులకు కొద్దిగా టింటెడ్ చబ్బీ స్టిక్ అప్లై చేసుకుంటే బెటర్. ఇది పొడిబారిన పెదవులను మామూలుగా కనిపించేలా చేస్తుంది.

అమ్మాయిలూ.. ఇదీ సిక్ డే మేకప్ రొటీన్. మీ ఆరోగ్యం కుదుట పడటానికి రోజంతా విటమిన్ సి ఉన్న ద్రవాలను తీసుకొంటూ ఉండాలి. మీరు మరీ ఇబ్బంది పడుతుంటే వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసుకోండి.

ఈ ఆర్టికల్ అవసరం మీకు మున్ముందు ఏర్పడచ్చు. కాబట్టి దీన్ని బుక్ మార్క్ చేసి పెట్టుకోండి.

ADVERTISEMENT

ఇవి కూడా చదవండి

అదిరేటి లుక్ కావాలంటే.. ఆరెంజ్ బ్లష్ అప్లై చేయాల్సిందే..

ఓ కామన్ గర్ల్.. నేటితరానికి చెప్పిన అతిగొప్ప సౌందర్య చిట్కా ఇదే..!

బ్యూటీ రిజల్యూషన్స్: సులభమైన చిట్కాలతో అందం మీ సొంతం..    

ADVERTISEMENT

 

18 Jan 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT