ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
సంక్రాంతికి తెలంగాణలో..  ఈ వంటకం చాలా స్పెషల్..?

సంక్రాంతికి తెలంగాణలో.. ఈ వంటకం చాలా స్పెషల్..?

సంక్రాంతి (Sankranthi) అంటేనే పెద్ద పండగ. ఇలా ఆ పండగను పిలవడానికి ప్రధాన కారణం – రైతు ఎంతో కష్టపడి వ్యవసాయం చేశాక.. తన కష్టార్జితమైన పంట చేతికి రావడంతో ఆ సంతోషాన్ని కుటుంబంతో పంచుకుంటాడు. ఆ సంతోష సమయంలో వచ్చే పండగ కావడంతో సంక్రాంతిని పెద్ద పండగ అని అంటారు. 

ఇక ఈ పండగ సందర్భంగా అనేక రుచికరమైన పదార్ధాలని ఇళ్ళలో చేసుకోవడం.. వాటిని తమతో పాటు తమ స్నేహితులకి & బంధువులకి పంచిపెట్టి పండగ శుభాకాంక్షలు తెలపడం ఒక ఆనవాయితీగా వస్తోంది. అయితే సంక్రాంతి పండగకి చేసే పిండివంటల్లో ప్రధానంగా – మురుకులు, చెక్క గారెలు, అరిసెలు ఉంటాయి. అయితే ఇదే పండగ సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో ఓ వంటకాన్ని ప్రత్యేకంగా చేస్తారు. దానికి తెలంగాణ మార్కెట్‌లో చాలా డిమాండ్ కూడా ఉంది. అందరినీ నోరూరించే ఆ హాట్ హాట్ వంటకమే “సకినం”. తెలంగాణ ప్రాంతాల్లో సకినాలకుండే పాపులారిటీ అంతా ఇంకా కాదంటే అతిశయోక్తి కాదు.

 

సకినాలు కేవలం తెలంగాణ ప్రాంతానికే ఎందుకు పరిమితమయ్యాయి అన్న విషయంలో స్పష్టత లేకపోయినప్పటికి వాటి రుచి చూసేందుకు మాత్రం అన్ని ప్రాంతాల వారు తాపత్రయపడుతుంటారు. ఇక సకినాలను కూడా అన్ని పిండివంటలు చేసే  విధానంలోనే చేస్తుంటారు. అయితే సకినాల పిండిని గుండ్రంగా చుట్టే విధానం కాస్త వైవిధ్యంగా ఉండటంతో.. ఈ పదార్దానికి ఆ పేరు వచ్చినట్టుగా చెబుతుంటారు.

ADVERTISEMENT

ఇక సంక్రాంతి సందర్భంగా తెలంగాణలో సకినాలను చేసే విధానాన్ని కాస్త సంక్షిప్తంగా మీకోసం అందిస్తున్నాం – ఈ సకినాల తయారీలో ముందుగా కొత్త  బియ్యం లేదా పాత బియ్యాన్ని నీటిలో నానపెట్టాలి. ఒకరాత్రి మొత్తం నానబెడితే ఇంకా మంచిది . అంత సమయం లేకపోతే కనీసం 5 గంటలైనా నానబెట్టాలి. ఆ తరువాత ఆ బియ్యం పట్టించాక.. పిండిని కాస్త తడి ఆరేదాకా ఎండబోయాలి. ఎందుకంటే తడి పిండితోనే గనుక మనం సకినాలు (Sakinalu) చేసేందుకు ప్రయత్నిస్తే అవి అంత రుచికరంగా ఉండవు.

 

ఆ పిండి ఆరిన తరువాత, 1 కేజీ పిండికి ఉజ్జాయింపుగా కొలతల లెక్క తీసుకుంటే – 100 గ్రాముల నువ్వులు, వాము – 10 గ్రాములు.. అలాగే ఉప్పు సరిపడినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక ఒక కాటన్ చీర లేదా ఏదైనా కాటన్ బట్టని పరిచి దాని పైన ఈ పిండితో గుండ్రంగా చుడుతూ వచ్చేలా వేయాలి.. ఆ  ఆకారం వచ్చేలా సకినాలు పేర్చుకుంటూ వెళ్ళాలి.

అయితే ఇందుకు కాటన్ వస్త్రాన్నే ఎందుకు వాడాలంటే, ఆ పిండిలో ఇంకాస్త తేమ శాతం ఎక్కువగా ఉంటే  కాటన్ వస్త్రం నీటిని పీల్చుకుంటుంది.  ఇక ఫ్రై చేయడానికి తీసే సమయంలో  కాటన్ వస్త్రం పైన వేసిన సకినం విరగకుండా జాగ్రత్తపడాలి.  మెల్లగా ఒక్కొక్క సకినాన్ని రిఫైండ్ ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే నోరూరించే సకినాలు రెడీ అయిపోయినట్టే. సకినాలని ఫ్రై చేసే సమయంలో కాస్త దోరగా వేయిస్తే మనకి బంగారపు రంగులో సకినం వస్తుంది. కావాలంటే అలా కూడా ట్రై చేయొచ్చు.

ADVERTISEMENT

ఇది తెలంగాణ సంక్రాంతి స్పెషల్ సకినాలు తయారుచేసే విధానం. ఇలాగే కేవలం తెలంగాణాలో  దొరికే మరొక రుచికరమైన పదార్థం సర్వపిండి. దీని గురించి మరోసారి మాట్లాడుకుందాం.

Image: Wikipedia, Instagram

ఇవి కూడా చదవండి

ఇరానీ ఛాయ్ – కేరాఫ్ హైదరాబాద్

ADVERTISEMENT

హైదరాబాద్‌లో క్రిస్మస్ & న్యూ ఇయర్ ‘కేక్స్’కి.. ఈ బేకరీలు ప్రత్యేకం

యూట్యూబ్ వేదికనే షేక్ చేసిన సూపర్ స్టార్.. మస్తానమ్మ

11 Jan 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT