ADVERTISEMENT
home / Humour
మీరూ లేట్ ల‌లిత‌లేనా? అయితే మీ జీవితంలోనూ ఇవి జ‌రుగుతూ ఉంటాయి..

మీరూ లేట్ ల‌లిత‌లేనా? అయితే మీ జీవితంలోనూ ఇవి జ‌రుగుతూ ఉంటాయి..

కొంత‌మంది ఎంత ప్ర‌య‌త్నించినా స‌రే.. అనుకున్న స‌మ‌యానికి బ‌య‌ల్దేర‌డం, నిర్ణీత స‌మ‌యానికి చేరాల్సిన ప్ర‌దేశానికి చేరడం మాత్రం వారి వ‌ల్ల కాద‌నే చెప్పుకోవాలి. వారికే కాదు.. ఈ విష‌యం వారి కుటుంబ‌స‌భ్యుల‌కు, స్నేహితుల‌కు, ఆఫీస్‌లో అయితే బాస్‌కి, కాలేజీలో అయితే లెక్చ‌ర‌ర్ల‌కి కూడా  తెలిసే ఉంటుంది. ఈపాటికే మీ స్నేహితులు కూడా మీకు లేట్ (always late) ల‌లిత అనే పేరు పెట్టే ఉంటారు.

రోజూ ఆఫీసుకు ఎంత ముందుగా వెళ్లేందుకు ప్ర‌య‌త్నించినా స‌రే.. టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్(Time management skills) స‌రిగ్గా లేక‌పోవ‌డం వ‌ల్ల అనుకున్న ప‌నుల‌ను స‌రైన స‌మ‌యానికి చేయ‌లేక‌పోతుంటారు. ఇది కొన్నిసార్లు మ‌న‌ల్ని ఇబ్బందిపెట్టినా.. అల‌వాటైపోయిన సంద‌ర్భాల్లో మాత్రం అది ఏమాత్రం త‌ప్పుగా కూడా అనిపించ‌దు. మీకూ ఇలా ప్ర‌తి సంద‌ర్భంలోనూ ఆల‌స్యంగా వెళ్ల‌డం అల‌వాటా? అయితే మీ జీవితంలోనూ ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతూనే ఉంటాయి.. ఓసారి గ‌మ‌నించండి.

1. మీరు కావాల‌ని అలా చేయ‌క‌పోయినా ఆల‌స్య‌మ‌వుతుంది.

కావాల‌ని చేయ‌ట్లేదండీ.. అలా జ‌రిగిపోతోందంతే..!

1

2. ఎప్పుడూ ఐదు నిమిషాలే ఆల‌స్య‌మ‌వుతుంది..

రోజూ నేను గంట ముందుగా లేచినా స‌రే.. ఆ ఐదు నిమిషాలు మాత్రం ఎప్పుడూ ఆల‌స్య‌మ‌వుతూనే ఉంటుంది.

ADVERTISEMENT

3. ఎప్పుడూ మీరు చేయాల్సిన ప‌నులు మిస్స‌వుతుంటారు.

స్నేహితుల‌తో సినిమాకి వెళ్లాల్సి వ‌చ్చినా.. ఇంకేదైనా షోకి వెళ్లినా మీరు ముందు కాస్త మిస్స‌వడం ఖాయం. అయితే మీకు ఇబ్బందేంటి? మీ దగ్గ‌ర 6.2 అంగుళాల హెచ్‌డీ ప్ల‌స్ స్క్రీన్ ఉన్న‌ ఓప్పో ఏ7 ఉంటే చాలు.. మీరు ఏ షో మిస్స‌వ్వాల్సిన అవ‌స‌రం లేదు. మీ టీవీ లేదా థియేట‌ర్‌లో క‌నిపించేలా హెచ్‌డీ రిజ‌ల్యూష‌న్‌తోనే వాటిని చూసేయ‌వ‌చ్చు. అంటే ఆల‌స్య‌మైనా ఇబ్బంది ఉండ‌ద‌న్న‌మాట‌. ఇందులో 64జీబీ స్టోరేజీ కూడా ఉండ‌డంతో ఏదైనా స‌రే సేవ్ చేసుకునే వీలు కూడా ఉంటుంది.

4. దారిలో ఉన్నాను అంటే అప్పుడే స్నానం చేసిన‌ట్లు..

మీకు ఎవ‌రైనా ఫోన్ చేసి ఎక్క‌డున్నావు అని అడిగితే దారిలో ఉన్నాను అని అబ‌ద్ధం చెబుతారు. కానీ మీరు అప్పుడే స్నానం చేసి బాత్రూం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఉంటారు. ఇక ఫోన్ పెట్టేసి ర‌డీ అవుతున్నంత‌సేపు అనుకున్న స‌మ‌యానికి అక్క‌డికి చేరుకోవ‌డం ఎలా అని టెన్ష‌న్ ప‌డుతూ ఉంటారు. ఈ టెన్ష‌న్‌లో మీ మేక‌ప్ స‌రిగ్గా వేసుకోలేరు. దాంతో మ‌రింత ఆల‌స్యం అవుతుంది. ఇది మీకు ఎప్పుడూ ఎదుర‌య్యే సంఘ‌ట‌నే.

2

5. ప‌ది నిమిషాల్లో ఉంటానంటూ అబద్ధాలు కూడా చెబుతారు..

మీరు ఇలా మేక‌ప్ వేసుకుంటూ ఉండ‌గానే మీ స్నేహితులు మ‌ళ్లీ ఫోన్ చేస్తే ప‌ది నిమిషాల్లో అక్క‌డ ఉంటా అంటూ అబ‌ద్ధ‌మాడుతారు. అది అబద్ధ‌మ‌ని మీకూ తెలుసు. కానీ అలా చెప్ప‌క‌పోతే ఇబ్బందులెదుర‌వుతాయ‌ని మీ భావ‌న‌. మీరు ఇలా మాట్లాడి ఫోన్ తిరిగి ఛార్జింగ్ పెట్ట‌డం మ‌ర్చిపోతారు. అయితే 4230 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉన్న ఓప్పో ఫోన్ వాడితే మీరు ఛార్జింగ్ గురించి కంగారు ప‌డాల్సిన అవ‌స‌ర‌మే లేదు. మీకు న‌చ్చిన‌వ‌న్నీ చేసినా ఛార్జింగ్ అస్స‌లే అయిపోదు.

6. సెల్పీతో ఆల‌స్యమైనా టెన్ష‌న్ ప‌డ‌కుండా ఉంటారు..

కొన్నిసార్లు ఆల‌స్య‌మైపోతుంద‌న్న టెన్ష‌న్ నుంచి త‌ప్పించుకోవ‌డానికి మీరు అంద‌మైన యాంగిల్స్‌లో సెల్ఫీలు దిగుతూ ఉంటారు. ఓప్పో ఏ7 ఫోన్ మీ బ్యాట‌రీపై ప్ర‌భావం చూప‌కుండా అద్భుత‌మైన హెచ్‌డీ క్వాలిటీతో మీ ఫొటోలు తీస్తుంటే ఆగాల‌ని ఎందుకు అనిపిస్తుంది మ‌రి..! దీని అద్భుత‌మైన డిజైన్‌తో ఫోన్ కూడా మీ అంద‌మైన ఫొటోల్లా అందంగా క‌నిపిస్తుంది.

ADVERTISEMENT

7. మీరు స‌మ‌యానికి చేరితే అంతా ప్ర‌శంసిస్తారు..

అనుకున్న స‌మ‌యానికి చెప్పిన ప్ర‌దేశానికి మీరు వెళ్తే అంతా మిమ్మ‌ల్ని ప్ర‌శంస‌ల్లో ముంచెత్తుతారు. మీరూ అదేదో పెద్ద గొప్ప ప‌ని చేసిన‌ట్లుగా భావిస్తారు.

3

8. మీ స్నేహితులు మీకు అబ‌ద్ధం చెబుతారు..

మీరు అక్క‌డ ఉండాల్సిన స‌మ‌యానికి ఒక గంట ముందే ఉండాల‌ని మీ స్నేహితులు మీతో అబ‌ద్ధం చెబుతారు. అయినా మీరు అనుకున్న స‌మ‌యం కంటే కాస్త ఆల‌స్యంగానే అక్క‌డికి వెళ్తార‌నుకోండి. ఎలాగూ ఇంకా చాలా స‌మ‌యం ఉంది క‌దా అనుకుంటూ మీ ఓప్పో ఏ7 ఫోన్‌లో గేమ్స్ ఆడుతూ గ‌డిపేస్తారు.. ఇందులోని హెచ్‌డీ గేమింగ్ ఆప్ష‌న్ మిమ్మ‌ల్ని స‌మ‌యం తెలియ‌కుండా గేమ్‌లోనే మునిగిపోయేలా చేస్తుందంటే అతిశ‌యోక్తి కాదు.

9. వారి అబ‌ద్ధాలు మీకు తెలుసు..

మీ స్నేహితులు మీరు ముందుగా రావాల‌ని మీకు అబ‌ద్ధం చెప్పినా మీకు అది తెలిసిపోతుంది. అందుకే మీరు అలా అద్దాన్ని చూస్తూ ఓ గంటసేపు ఉండిపోతారు.

10. వ‌ద్ద‌నుకున్నా ఆప‌లేరు..

మీరు ఎంత వ‌ద్ద‌నుకున్నా.. అలా అద్దం చూస్తూ ఆలోచించ‌డాన్ని మీరు ఆప‌లేక‌పోతారు. మీరు ముందుగానే బ‌య‌ల్దేర‌దామ‌ని భావించినా ఆలోచ‌న‌ల‌ను ఆప‌డం మీ వ‌ల్ల కాదు. అలా ఆల‌స్య‌మైపోతూనే ఉంటుంది.

ADVERTISEMENT

4

11. ఒక్కోసారి ప‌రిస్థితులూ మీకు అనుకూలించ‌వు.

మీరు ఎంత తొంద‌ర‌గా బ‌య‌ల్దేరినా.. ఒక్కోసారి ప‌రిస్థితులు కూడా మీకు అనుకూలించ‌వు. క్యాబ్ డ్రైవ‌ర్ అప్పుడ‌ప్పుడు ఆల‌స్యం చేస్తే.. ఒక్కోసారి ట్రాఫిక్ జాం వ‌ల్ల కూడా మీకు ఆల‌స్యం అవుతుంటుంది.

12. ఆల‌స్యం కావ‌డానికి ప్ర‌పంచంలో ఉన్న అన్ని కార‌ణాలూ మీరు చెప్పి ఉంటారు..

ఒక్కోసారి కార‌ణం వెతుక్కోవ‌డానికి కూడా మీకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఇలా కొత్త కార‌ణాలు సృష్టించి చెప్ప‌డం కూడా ఓ ర‌క‌మైన‌ క్రియేటివిటీనే..! ఒక్కోసారి రాణి ఎప్పుడూ ఆల‌స్యంగా రాదు.. మిగిలిన వాళ్లు తొంద‌ర‌గా వస్తారంతే.. అని మిమ్మ‌ల్ని మీరే ప్ర‌శంసించుకుంటారు.

5

13. అర్జంట్ అన‌గానే మీకు టెన్ష‌న్ ప్రారంభ‌మ‌వుతుంది..

అర్జంట్‌గా చేయాల్సిన ప‌నుల‌న్నా.. అర్జంట్‌గా వెళ్లాల్సిన‌ మీటింగ్ అయినా మీలో టెన్ష‌న్ పెంచుతుంది. టైమ్‌కి ఎలా చేయాలా అని టెన్ష‌న్ ప‌డుతూ ఉంటారు.

14. మీ గురించి మీ స్నేహితులు బెట్టింగ్ కూడా క‌డుతుంటారు.

మీరు ఏ స‌మ‌యానికి వ‌స్తారు అని మీ స్నేహితులు అప్పుడ‌ప్పుడూ బెట్స్ కూడా క‌డుతుంటారు. ఆల‌స్యంగా వ‌స్తార‌ని క‌ట్టిన‌వారు గెలుస్తారు కూడా.

ADVERTISEMENT

15. ముఖ్య‌మైన వాటికి క‌ష్ట‌మైనా స‌మ‌యానికి వెళ్తారు.

ముందే అనుకున్న‌ట్లు ముఖ్య‌మైన మీటింగ్స్, ఫంక్ష‌న్లు, మీటింగ్‌లు అంటే మీరు కంగారు ప‌డ‌తారు. ఆ కంగారులో ముందు బ‌య‌ల్దేరి స‌మ‌యానికి వెళ్లిపోతారు కూడా.

6

16. ఇది చ‌దువుతూ ఉండ‌గా కూడా మీరు ఆల‌స్యంగా ఎక్క‌డికో వెళ్ల‌డ‌మో లేదా ఏదో ప‌నిచేయ‌డ‌మో చేస్తూ ఉంటారు.

ఎలాగూ ఆల‌స్య‌మైందిగా.. ఇంకాస్త ఆల‌స్యం చేస్తే స‌రి..!

* ఇది ఓప్పో వారి ప్రాయోజిత క‌థ‌నం.

ఇవి కూడా చ‌ద‌వండి.

ADVERTISEMENT

సెల్ఫ్ లవ్ : మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడానికి ఈ పనులు చేయాల్సిందే

తొలి సంపాదన అందగానే.. అమ్మాయి మ‌దిలో మెదిలే ఆలోచ‌న‌లివే..!

అమ్మాయిలూ.. 2019లో ఈ మాట‌లు మీరు త‌ప్ప‌క‌ చెప్పాల్సిందే..

 

ADVERTISEMENT
28 Jan 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT