కమ్మని ఈ ప్రేమలేఖలే రాసింది హృద‌య‌మే.. ఇవి అత‌నికి న‌చ్చే ప్రేమ‌లేఖ‌లు..

కమ్మని ఈ ప్రేమలేఖలే  రాసింది హృద‌య‌మే.. ఇవి అత‌నికి న‌చ్చే ప్రేమ‌లేఖ‌లు..

మనసులోని మాటను అక్షరాలు చెప్పినంత మనోహరంగా మాటలు కూడా చెప్పలేవు. అందుకే ప్రేయసీప్రియులు తమ మనసులోని మాటలను అక్షరాలుగా మలచి ప్రేమలేఖలుగా (love letters) ఒకరికొకరు అందించుకొంటారు. వీలు చిక్కినప్పుడల్లా వాటిని చదువుకొంటూ.. మురిసిపోతూ కలల లోకంలో ఊహల పల్లకీ ఎక్కి విహరిస్తుంటారు. ఇదంతా ఒకప్పుడు.. అయినా ఇప్పుడు ఉత్తరాలు రాసే తీరిక ఎక్కడుంది. అంతా సంక్షిప్త సందేశాలే కదా అంటారా?? ఒకప్పుడు లేఖలు రాస్తే ఇప్పుడు వాటినే వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నారు. అవును..  కావాలంటే మీ భ‌ర్త‌/ బాయ్ ఫ్రెండ్ కు ఈ షార్ట్ లవ్ లెటర్స్ ని పంపించండి. కచ్చితంగా మీకు ఫిదా అయిపోతారు.


1. నేను నీకో విషయం చెప్పాలనుకొంటున్నాను. నువ్వు ప్రేమగా నా చేతిని అందుకొన్నావు. నన్ను నీతో పాటే నడిపిస్తున్నావు. ఇంతకు ముందెవ్వరూ ఆ ధైర్యం చేయలేదు. ఇకపై ఎవరూ ఆ సాహసం చేయరు. నీతో పాటే జీవనం సాగించడం కోసం ఎదురు చూస్తున్నాను. ఐ లవ్యూ


మరింతగా ప్రేమలో మునిగిపోవడానికి సిద్ధంగా ఉండండి.


2. హేయ్.. నీకో విషయం తెలుసా? నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్ అని నేను లవ్ చేశాను. కానీ నీ గురించి తెలిసే కొద్దీ.. నువ్వు అంత పర్ఫెక్టేమీ కాదని తెలిసింది. అయినా ఇంతకు ముందు కంటే ఎక్కువగానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను.


బహుశా ఆ ల ోపాల కారణంగానే అతన్ని మీరు మరింత ఎక్కువ ప్రేమించేస్తున్నారేమో.


3 mini love letters jennifer lawrence


3. మన హృద‌య‌ం ఏం కావాలని కోరుకుంటుందో.. దాన్నే మనం కావాలనుకొంటాం. నిజమే.. నా హృద‌య‌ం నిన్ను మాత్రమే కోరుకుంటోంది. ఇప్పుడే కాదు.. ఎప్పుడూ.. ఎల్లప్పుడూ.. నీ స్థానాన్ని మరొకరు తీసుకోలేరు. నిన్నెవరూ నేను ప్రేమించినంతగా ప్రేమించలేరు.


అవును ఎప్పటికైనా గెలిచేది హృద‌య‌మే.


ప్రేమ వివాహం.. ప్రేమతో మీకు నేర్పించే విషయాలు ఇవే..


4. ప్రేమలో పడినవారు అదృష్ట‌వంతులు. బెస్ట్ ఫ్రెండే బాయ్ ఫ్రెండ్ గా ఉన్నవారు మరింత అదృష్ట‌వంతులు. నేను మాత్రం అందరికంటే అదృష్ట‌వంతురాలిని. ఎందుకంటే.. నా బెస్ట్ ఫ్రెండ్.. నా లవర్.. రెండూ నువ్వే..


హి ఈజ్ ది బెస్ట్. కాదంటారా?


5. ప్రేమ ఓ ఛాన్స్ కాదు. అది మన ఛాయిస్. నువ్వు ప్రేమించడానికి నన్ను ఎంచుకొన్నావు. నేను ప్రేమించడానికి నిన్ను ఎంచుకొన్నాను. ప్రేమించడానికే కాదు.. కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి కూడా నిన్నే నేను ఎంచుకొన్నాను. ప్రతి రోజూ.. ప్రతి క్షణం నిన్నే ఎంచుకొంటాను.


మీ మనసుకి నచ్చిన వ్యక్తిని ఎంపిక చేసుకోండి. అతన్నే ప్రేమించండి.


6 mini love letters blushing


6. నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నానో చెప్పడానికి నా దగ్గర బోలెడన్ని కారణాలున్నాయి. అందులో కొన్ని కారణాలు.. నీ దగ్గర ఉన్నంత సేపు నేను చాలా సురక్షితంగా ఉన్నట్టనిపిస్తుంది. నేను కోపంగా ఉంటే నన్ను శాంతింపచేస్తావు. నేను అసహనం ప్రదర్శిస్తుంటే నువ్వు సహనంగా ఉంటావు. ఇంతకు మించి నిన్ను ప్రేమించడానికి ఇంకేం కావాలి?


ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే.. చాల్లే ఇది చాల్లే..


మధురమే... మధురమే... ఈ ప్రేమ జ్ఞాపకాలు ఎప్పటికీ మధురమే..


7. మనిద్దరం ప్రేమలో ఎలా పడ్డామో ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది. ప్రేమ నాకు అవసరం లేని సమయంలో నువ్వు నా జీవితంలోకి వచ్చావు. నువ్వు లేనిదే నా జీవితం లేదనేలా మార్చేశావు. ఇది నీకు ఎలా సాధ్యమైంది?


సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉండండి.


8. ఒక వ్యక్తి పదే పదే వచ్చి మనసు తలుపును తడుతుంటే.. అది ప్రేమ కాక మరేమవుతుంది? అస్తమానూ.. నా కళ్ల ముందే ఎందుకు కదులుతున్నావు? నేను నీతో ప్రేమలో మునిగిపోయా కదా.. అందుకేనేమో..


ప్రేమలో పడితే అంతే.. మనసు పడి పడి లేస్తుంది.


9. నిరంతరం నన్ను ప్రోత్సహిస్తూ.. నా కలను నీ గమ్యంగా శ్వాసిస్తూ.. నన్ను నడిపిస్తున్న నీకు ఎలా కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలి? నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్, నా రోల్ మోడల్, నా మార్గదర్శి, నా ప్రాణం. ఇంతకుమించి ఆ దేవుణ్ని మాత్రం ఇంకేం అడగను?


నిన్ను కోరి వస్తే అలాగే ఉంటుందిలే..


చూపులతోనే మాటలు.. పుస్తకాల్లో ప్రేమలేఖలు.. ఆనాటి ప్రేమ అద్భుతం..


9 mini love letters emma stone blushing


10. నీ వెచ్చ‌ని కౌగిలిలో నిద్రపోయి.. మెలకువ వచ్చిన తర్వాత నీ కోసం వెతుక్కొనే రోజు కోసం నేను ఎదురుచూస్తున్నాను. అయినా దూరం ప్రేమను పెంచుతుందంటారు కదా.. 


అతనితో కలసి అడుగేయడం కోసం ఎదురుచూస్తున్నారు కదూ..


GIFs: Giphy


Featured Image: Pexels


మీరు సోషల్ మీడియాలో రాక్ స్టార్ గా వెలుగిపోతున్నారా? అయితే Plixxo లో వెంటనే చేరిపోండి - www.plixxo.com


ఇండియాలోనే అతి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ నెట్వర్క్ లో చేరి టాప్ బ్రాండ్స్ తో కలసి పనిచేసే అవకాశం అందుకోండి.