ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
గ్రీన్ టీ కేవ‌లం అందానికే కాదు.. ఆరోగ్యానికీ మంచిదే..! (Green Tea Benefits In Telugu)

గ్రీన్ టీ కేవ‌లం అందానికే కాదు.. ఆరోగ్యానికీ మంచిదే..! (Green Tea Benefits In Telugu)

గ్రీన్ టీ(Green tea) ప్ర‌పంచంలోనే అద్బుత‌మైన పానీయాల్లో ఒక‌టి. మిగిలిన టీల‌తో పోల్చితే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు(Antioxidants) చాలా ఎక్కువ‌గా ఉంటాయి. ఫైటో కెమిక‌ల్స్‌, ఫైటో ఫినాల్స్‌, అమైనో యాసిడ్లు, పాలీఫినాల్స్(polyphenols) వంటివి మ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో ఎంతో తోడ్ప‌డ‌తాయి. ఇది మ‌న జీవక్రియ‌ల‌ను కూడా వేగ‌వంతం చేస్తుంది. గ్రీన్ టీ కేవ‌లం మ‌న మాన‌సిక‌, శారీర‌క ఆరోగ్యాన్ని సంర‌క్షించ‌డం మాత్ర‌మే కాదు.. మ‌నల్ని అన్ని విధాలుగా కాపాడుతుంది. 

భార‌త్, చైనాల్లో పుట్టిన ఈ టీ ప్ర‌పంచమంతా ఆదరణను సొంతం చేసుకొని.. త‌నలోని ఆరోగ్యాన్ని కాపాడే గుణాల‌కు పేరు సంపాదించింది. గ్రీన్ టీ ఆక్సిడైజ్ కాని తేయాకుల నుంచి త‌యార‌వుతుంది. దీని బ‌రువులో 20 నుంచి 45 శాతం వ‌ర‌కూ పాలిఫినాల్స్ ఉంటాయి. అందులో 60 నుంచి 80శాతం ఈజీసీజీ ( ఎపిగాలోకాట్చిన్ గాలేల్‌) ఉంటుంది. ఇది మ‌న శ‌రీరంలోని క‌ణాలు పాడ‌వకుండా కాపాడుతుంది. ఇందులోని పాలీఫినాల్స్ మ‌న మెట‌బాలిజంని వేగ‌వంతం చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. గ్రీన్ టీలో చాలా ర‌కాలుంటాయి. ఇవ‌న్నీ ఆకులు ఏ ప్రాంతం నుంచి వ‌చ్చాయి.. ఏ సీజ‌న్‌కి చెందిన‌వి.. లేత‌వా? ముదురువా? అన్న‌దాన్ని బట్టి వేర్వేరు ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటాయి. మనం కూడా గ్రీన్ టీ గురించి మ‌రింత తెలుసుకొని దాన్ని మ‌న జీవితంలో భాగం చేసుకుందామా

అస‌లు గ్రీన్ టీ ఎందుకు తాగాలి?

గ్రీన్ టీ ఎక్క‌డ పుట్టింది?

ADVERTISEMENT

గ్రీన్‌టీ పోష‌క విలువ‌లు

గ్రీన్‌టీ ఆరోగ్య ప్ర‌యోజనాలు

చ‌ర్మానికీ మంచి నేస్తం గ్రీన్ టీ.

గ్రీన్ టీ జుట్టుకు ఎలా ఉప‌యోగ‌ప‌డుతుందంటే..

ADVERTISEMENT

ఇంట్లోనే గ్రీన్ టీ ఎలా త‌యారుచేసుకోవాలి?

గ్రీన్ టీ దుష్ప్ర‌భావాలు

ఎక్కువగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు

green tea benefits in telugu-1

 అస‌లు గ్రీన్ టీ ఎందుకు తాగాలి? (Why You Should Drink Green Tea)

గ్రీన్ టీ గురించి తెలుసుకోవాలంటే అస‌లు దాన్ని మనం ఎందుకు తాగాల‌న్న విష‌యం దగ్గర నుంచి.. మ‌నం దాని గురించి తెలుసుకోవ‌డం ప్రారంభించాలి. ఇది మ‌న ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చ‌ర్మాన్ని కాంతిమంతం చేస్తుంది. శరీరాన్ని ఫిట్‌గా మారుస్తుంది. ఇందులోని బ‌యోయాక్టివ్ కాంపౌండ్ మ‌న శ‌రీరానికి సంబంధించి వివిధ రోగాల‌ను క‌లిగించే బ్యాక్టీరియాను దూరం చేస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు గ్రీన్ టీలోని ఈజీసీజీ అనే పాలీఫినాల్ మ‌నకు వివిధ ర‌కాల రోగాలు రాకుండా అడ్డుకోవ‌డం మాత్ర‌మే కాదు.. వివిధ ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా త‌గ్గిస్తుంది. ఇంకా గ్రీన్ టీ గురించి తెలియాలంటే దాని ప్ర‌యోజ‌నాల గురించి మ‌నం లోతుగా తెలుసుకోవాలి.

ADVERTISEMENT

గ్రీన్ టీ ఎక్క‌డ పుట్టింది? (Where Green Tea Originated)

గ్రీన్ టీ మొద‌టిసారి చైనాలో త‌యారైంది. క్రీశ. 600-800 మ‌ధ్య‌లో మొద‌టిసారిగా ఈ టీ త‌యారైన‌ట్లు ఆధారాలున్నాయి. షెన్నాంగ్ చ‌క్ర‌వ‌ర్తి పాల‌న‌లో ఇది మొద‌టిసారి త‌యారైంద‌ట‌! ఆ కాలానికి చెందిన ర‌చయితలు రాసిన టీ క్లాసిక్ అనే పుస్త‌కంలో దీని ప్ర‌స్తావ‌న ఉంది. అంతేకాదు.. ఆ త‌ర్వాత 1191లో జెన్ ప్రీస్ట్ ఈసాయి రాసిన కిస్సా యోజోకి లేదా బుక్ ఆఫ్ టీ అనే పుస్త‌కంలోనూ దీని గురించి పూర్తిగా వివ‌రించారు. దీనివ‌ల్ల మ‌న శ‌రీరంలోని కీల‌క అవ‌య‌వాల ప‌నితీరు మెరుగుప‌డుతుంద‌ని ఆ పుస్త‌కంలో రాసి ఉంది.

గ్రీన్‌టీ పోష‌క విలువ‌లు (Nutritional Values Of Green Tea)

గ్రీన్ టీలో దాదాపు 400 ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయ‌ట‌. ఇందులో ముఖ్య‌మైన‌వి సీ, ఎ, బీ1, బీ12 వంటి విట‌మిన్ల‌తో పాటు ఫ్లోరైడ్‌, ఐర‌న్‌, మెగ్నీషియం, క్యాల్షియం, స్ట్రాన్షియం, కాప‌ర్‌, నికెల్‌, జింక్ వంటివి ఎక్కువ మోతాదులో ఉంటాయ‌ట‌. వీటితో పాటు మాలిబ్డిన‌మ్, ఫాస్ప‌ర‌స్‌, ఫాలీఫినాల్స్‌, కెఫీన్, టానిన్‌, థియోబ్రోమిన్, థియోఫైటిన్‌ వంటివి కూడా త‌క్కువ మోతాదులో ఉంటాయి. గ్రీన్ టీలోని పోష‌కాల గురించి పూర్తిగా తెలుసుకొని అవి రోగాల‌ను క‌లిగించే బ్యాక్టీరియా మ‌న శ‌రీరంపై దాడి చేయ‌కుండా ఎలా అడ్డుకుంటాయో తెలుసుకుందాం రండి.

కెఫీన్‌ (Caffeine)

పావు లీట‌ర్ గ్రీన్ టీ లో కనీసం 50 ఎం.ఎల్ కెఫీన్ ఉంటుంద‌ట‌. అయితే దీనివ‌ల్ల కలిగే ఇబ్బందుల గురించి మీరు అంత‌గా ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే గ్రీన్ టీలోని ఈజీసీజీ, ఎల్- థానిన్ కెఫీన్ వ‌ల్ల ఎలాంటి నెగెటివ్ ప్ర‌భావాలు మ‌న‌పై ప‌డ‌కుండా కాపాడ‌తాయి.

ఇక గ్రీన్ టీలోని కెఫీన్ విలువ ఆకులు ఏ ప్రాంతానికి చెందిన‌వి, ఏ స్థాయిలో ఉండ‌గా సేక‌రించారు అన్న‌దానిపై ఆధార‌ప‌డి ఉంటుంద‌ట‌. లేత ఆకుల‌లో కెఫీన్ ఎక్కువ శాతం ఉండ‌గా.. ఆకు ముదురుతున్న కొద్దీ కెఫీన్ శాతం త‌గ్గుతుంద‌ట‌. అయినా దీని ప్ర‌భావం ఏమీ ఉండ‌దు కాబ‌ట్టి గ్రీన్ టీని ఎలాంటి సందేహం లేకుండా తాగ‌వ‌చ్చు.

ADVERTISEMENT

ట్యానిన్‌ (Tannin)

ఇవి గ్రీన్ టీలోని స‌ర‌ళ‌, సంక్లిష్ట ఫినాల్స్‌, పాలీఫినాల్స్‌, ఫ్లేవ‌నాయిడ్ కాంపౌండ్స్ క‌లిపి త‌యార‌వుతాయి. ఇవి మ‌న జీర్ణ వ్య‌వ‌స్థ‌లో జీర్ణ‌మ‌య్యేందుకు కాస్త స‌మ‌యం తీసుకుంటాయి. అంతేకాదు.. మ‌న‌ల్ని వివిధ ఇన్ఫెక్ష‌న్ల బారిన ప‌డ‌కుండా కాపాడ‌తాయి.

విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌ (Vitamins & Minerals)

గ్రీన్ టీలో కొవ్వు శాతం ఏమాత్రం ఉండ‌దు. క్యాల‌రీలు కూడా చాలా తక్కువ‌. ఇంత త‌క్కువ క్యాల‌రీల‌తో శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో ర‌కాల పోష‌కాలు అందిస్తుంది గ్రీన్ టీ. ఇందులో విట‌మిన్ సి, ఎ, బి1, బి12 వంటి విట‌మిన్లు ఉంటాయి. ఇందులోని విట‌మిన్ సి నిమ్మ‌కాయ‌తో దాదాపు స‌మానంగా ఉంటుంది. ఇందులో ల‌భించే విట‌మిన్ల‌న్నీ నీటిలో క‌రిగేవే కాబ‌ట్టి వేడినీరు పోసిన‌ప్పుడు టీలోకి చేరి మ‌న శ‌రీరానికి సులువుగా అందుతాయి.

green tea benefits in telugu2

గ్రీన్‌టీ ఆరోగ్య ప్ర‌యోజనాలు (Health Benefits Of Green Tea In Telugu)

ర‌క్త‌పోటును అదుపులో ఉంచుతుంది (To Reduce Blood Pressure)

సాధార‌ణంగా యాంజియోటెన్సిన్ క‌న్వ‌ర్టింగ్ ఎంజైమ్ ద్వారా మ‌న రక్త‌పోటు ఎక్కువవుతుంది. గ్రీన్ టీ ఈ ఎంజైమ్ విడుద‌ల‌ను అదుపులో ఉంచ‌డంతో పాటు ర‌క్త‌నాళాలు వెడ‌ల్పుగా మారేలా చేస్తుంది. దీంతో ర‌క్త‌పోటు త‌గ్గుతుంది.

Also Read: తులసి వల్ల కలిగే ఆరోగ్యపరమైన ప్రయోజనాలు (Health Benefits Of Basil Leaves)

ADVERTISEMENT

డ‌యాబెటిస్ ముప్పు త‌గ్గుతుంది (Diabetes Risk Reduction)

డ‌యాబెటిస్ ప్ర‌స్తుతం వేగంగా పెరుగుతోన్న స‌మ‌స్య‌. శ‌రీరంలో ఇన్సులిన్ ఉత్ప‌త్తి స‌రిగ్గా లేక‌పోవ‌డం, ర‌క్తంలో చ‌క్కెర నిల్వ‌లు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య ఎదుర‌వుతుంది. అయితే కొరియాలో నిర్వ‌హించిన ఓ స‌ర్వే ప్ర‌కారం రోజూ ఆరు క‌ప్పుల గ్రీన్ టీ తాగిన వారిలో డ‌యాబెటిస్ స‌మ‌స్య 33 శాతం తక్కువ‌గా ఉంద‌ట‌! అయితే ఇన్ని క‌ప్పుల టీ తాగే ముందు ఓసారి వైద్యుల‌ను సంప్ర‌దించ‌డం మంచిది.

యాంటీఆక్సిడెంట్ల‌ను అందిస్తుంది (Antioxidants)

గ్రీన్ టీలో ఎన్నో ర‌కాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో ప్ర‌ధానం. ఇవి ర‌క్తంలో ఆక్సిజ‌న్ మోసే శ‌క్తిని పెంచుతాయి. అంతేకాదు.. శ‌రీరంలోని క‌ణాలు, అవ‌య‌వాల డ్యామేజీని అడ్డుకుంటాయి. గ్రీన్ టీ తాగేవారిని, తాగ‌ని వారితో పోల్చుకుంటే గుండెజ‌బ్బుల ముప్పు 31 శాతం త‌క్కువ‌గా ఉంటుంద‌ని ప‌రిశోధ‌న‌లు తేల్చాయి.

క్యాన్స‌ర్‌ని అడ్డుకుంటుంది (Reduces Risk Of Cancer)

శ‌రీరంలోని వివిధ అవ‌య‌వాల్లో క‌ణాలు ప‌రిమితి లేకుండా పెరుగుతూ పోతే దాన్నే క్యాన్స‌ర్‌గా చెప్పుకోవ‌చ్చు. అయితే గ్రీన్ టీ రెగ్యుల‌ర్‌గా తాగ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ ముప్పు కూడా త‌గ్గుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క‌ణాల డీఎన్ఏ నాశ‌నం కాకుండా కాపాడ‌తాయి. అంతేకాదు. ఇందులోని పాలీఫినాల్స్‌ రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేస్తాయి.

green tea benefits in telugu3

ADVERTISEMENT

బ‌రువును కూడా త‌గ్గిస్తాయి (Reduces Weight)

ఇది దాదాపు అంద‌రికీ తెలిసిందే. గ్రీన్ టీ మ‌న మెట‌బాలిజాన్ని వేగ‌వంతం చేసి కొవ్వులు త్వ‌ర‌గా క‌రిగేలా చేస్తుంది. కొన్ని ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం ఓ మోస్తరు వ్యాయామంతో పాటు రోజూ గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల బ‌రువు త్వ‌రగా త‌గ్గే వీలుంద‌ట‌. ఇది ముఖ్యంగా పొట్ట భాగంలో ఉన్న కొవ్వును క‌రిగించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఆర్థ‌రైటిస్ త‌గ్గిస్తుంది (Lower Arthritis)

ఆర్థ‌రైటిస్ ముప్పు ఉన్న‌వాళ్ల‌కు విట‌మిన్ సి, ఇ తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల కంటే గ్రీన్ టీ తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ఫలితాలే ఎక్కువ‌ని నిరూపిత‌మైంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఆర్థ‌రైటిస్ ముప్పును చాలావ‌ర‌కూ త‌గ్గిస్తాయి.

ఆయుష్షు పెంచుతుంది (Increse Life Expectancy)

గ్రీన్ టీ వ‌ల్ల గుండెజ‌బ్బులు, క్యాన్సర్ వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే ముప్పు త‌గ్గుతుంది. ఎలాంటి స‌మ‌స్య‌లు లేవంటే ఎక్కువ‌కాలం ఆనందంగా జీవించిన‌ట్లే క‌దా.. అంతేకాదు.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ వారు నిర్వ‌హించిన స‌ర్వే ప్ర‌కారం గ్రీన్ టీ తాగేవారిలో ఎక్కువ‌శాతం మంది వ‌య‌సు పైబ‌డినా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా జీవించార‌ట‌. వీరిలో ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌క్కువ‌ని తేలింది.

రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌రుస్తుంది (Improves Immune System)

గ్రీన్ టీలోని ఈజీసీజీ వంటి క్యాట్చిన్లు మ‌న శ‌రీరంలో టీ సెల్స్ ఎక్కువ‌గా పెరిగేలా సాయ‌ప‌డ‌తాయ‌ట‌. ఇవి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థను మెరుగుప‌రిచి వివిధ ర‌కాల ఆటోఇమ్యూన్ స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా కాపాడుతుంది.

ADVERTISEMENT

మెద‌డు ప‌నితీరు మెరుగుప‌రుస్తుంది (Improves Brain Functioning)

గ్రీన్ టీలోని కెఫీన్ మ‌నల్ని యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. అంతేకాదు.. ఇది మ‌న మెద‌డు ప‌నితీరుని మెరుగుప‌రుస్తుంది. దీంతో ఏకాగ్ర‌త‌, జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. అంతేకాదు.. ఇది అడినోసిన్ అనే న్యూరోట్రాన్స్‌మిట‌ర్ పనిని బ్లాక్ చేసి మెద‌డు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

green tea benefits in telugu4

జీర్ణ‌వ్య‌వ‌స్థ‌నూ కాపాడుతుంది (Improves Digestive System)

గ్రీన్ టీ జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరును కూడా మెరుగుపరుస్తుంది. జీర్ణ క్రియ‌కు సంబంధించిన ఎంజైమ్‌ల ప‌నితీరు మెరుగుప‌రిచి ఆహారంలోని పోష‌కాలు శ‌రీరానికి పూర్తిగా అందేలా చేస్తుంది. దీంతోపాటు జీర్ణ‌క్రియ‌ను స‌జావుగా సాగేలా చేస్తుంది.

ప‌ళ్ల పిప్పిని ఆపుతుంది (Clears Mouth)

గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల నోటి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇందులోని పాలీఫినాల్స్ టీ తాగుతున్న‌ప్పుడు నోటిలో కూడా ఉండిపోయి బ్యాక్టీరియా పెర‌గ‌కుండా ఆపుతుంది. గ్లూకోసిల్ ట్రాన్స్‌ఫ‌రేజ్ ని త‌గ్గించి నోటిలో చ‌క్కెర‌పై ఆధార‌ప‌డి పెరిగే బ్యాక్టీరియాను హ‌తం చేస్తుంది.

ADVERTISEMENT

డిప్రెష‌న్‌ని దూరం చేస్తుంది (Lowers Depression)

ఓ స‌ర్వే ప్ర‌కారం రోజూ క‌నీసం నాలుగు క‌ప్పుల గ్రీన్ టీ తాగిన‌వారు డిప్రెష‌న్‌కి చాలా దూరంగా ఉంటార‌ని తేలింద‌ట‌! ఇందులోని ఎల్‌-థియ‌నైన్ మ‌న శ‌రీరంలో సెర‌టోనిన్‌, డోప‌మైన్‌ల ఉత్ప‌త్తిని పెంచి డిప్రెష‌న్ బారిన ప‌డ‌కుండా కాపాడుతుంద‌ట‌.

డౌన్స్ సిండ్రోమ్ ఇబ్బందిని త‌గ్గిస్తుంది (Reduces Down Syndrome)

డౌన్స్ సిండ్రోమ్ అంటే సాధార‌ణంగా అంద‌రిలో ఉండే రెండు క్రోమోజోమ్స్ కాకుండా 21వ క్రోమోజోమ్‌లో మూడు క్రోమోజోమ్స్‌తో పుడ‌తారు. ఈ స‌మ‌స్య వ‌ల్ల వారి మాన‌సిక ఎదుగుద‌ల స‌రిగ్గా ఉండ‌దు. ఇలాంటివారు గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల మానసిక ఎదుగుద‌ల‌కు తోడ్ప‌డ‌డ‌మే కాకుండా ఈ స‌మ‌స్య వ‌ల్ల ఎదుర‌య్యే శారీర‌క ఇబ్బందుల‌ను కూడా దూరం చేస్తుంది.

హ్యాంగోవ‌ర్ త‌గ్గిస్తుంది (Reduces Hangover)

గ్రీన్‌టీలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల ఇది లివ‌ర్‌ని త్వ‌ర‌గా డీటాక్సిఫై చేసి హ్యాంగోవ‌ర్‌ని త్వ‌ర‌గా త‌గ్గిస్తుంది. అయితే మ‌రీ ఎక్కువ టీ తీసుకునేముందు మాత్రం వైద్యుల‌ను క‌ల‌వ‌డం మంచిది. ఎందుకంటే మ‌రీ ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల లివ‌ర్ టాక్సిసిటీ స‌మ‌స్య ఎదురై లివ‌ర్ పాడయ్యే ప్ర‌మాదం కూడా ఉంది.

శ‌క్తిని చాలా పెంచుతుంది (Increses Energy)

గ్రీన్‌టీలో క్యాట్చిన్స్ మ‌న‌లో శ‌క్తిని, రోగాల‌ను త‌ట్టుకునే సామ‌ర్థ్యాన్ని కూడా పెంచుతాయ‌ట‌. అందుకే మీకు ఎప్పుడైనా త‌క్ష‌ణ శ‌క్తి కావాల‌నుకుంటే వెంట‌నే కాఫీకి బ‌దులుగా గ్రీన్ టీ తాగ‌డం మంచిది.

ADVERTISEMENT

చ‌ర్మానికీ మంచి నేస్తం గ్రీన్ టీ.. (Benefits Of Green Tea For Skin)

green tea benefits in telugu5

మీకు గ్రీన్ టీ రుచి న‌చ్చ‌క‌పోతే ఎలా అనుకుంటున్నారా? ఏం ఫ‌ర్వాలేదు. ఈ ఆకుల‌ను పేస్ట్ చేసి ఆ పేస్ట్‌ని ముఖానికి రుద్దుకుంటే సరి. ఇది మీ చ‌ర్మాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. దీనివ‌ల్ల మ‌న చ‌ర్మం, జుట్టుకి క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి తెలుసుకుందాం రండి..

1. క‌ళ్ల కింద ఉబ్బడం, న‌ల్ల‌ని వ‌ల‌యాలు దూర‌మ‌వుతాయి (Reduces Dark Circles)

గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు, ట్యానిన్లు క‌ళ్ల కింద ఉన్న ర‌క్త‌నాళాలు ఉబ్బ‌డాన్ని త‌గ్గిస్తాయి. ఫ‌లితంగా క‌ళ్ల కింద లావుగా ఉన్న భాగం తిరిగి మామూలు స్థితికి చేరుకుంటుంది. అంతేకాదు.. ఇందులోని విట‌మిన్ కె క‌ళ్ల కింద న‌ల్ల‌ని వ‌ల‌యాల‌ను కూడా త‌గ్గిస్తుంది. ఇందుకోసం గ్రీన్ టీ బ్యాగ్‌ల‌ను ఫ్రిజ్‌లో ఓ గంట పాటు ఉంచి ఆ త‌ర్వాత దాన్ని క‌ళ్ల‌పై అరగంట పాటు ఉంచుకోవాలి. ఇలా వారానికి ఓసారి చేస్తే చాలు.. క‌ళ్లు మెరిసిపోతాయి.

2. య‌వ్వ‌న‌కళ‌ని అందిస్తుంది (Provides Young Looking Skin)

మీరు 25లో ఉన్నా ప‌ద‌హారేళ్ల అమ్మాయిలా క‌నిపించాల‌నుకుంటున్నారా? అయితే గ్రీన్ టీని ఉప‌యోగించాల్సిందే. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ల వ‌ల్ల `మీ చ‌ర్మంపై ఉన్న మ‌చ్చ‌లు, ముడ‌త‌లు, ట్యాన్‌, పిగ్మంటేష‌న్ వంటివ‌న్నీ త‌గ్గిపోతాయి. య‌వ్వ‌న‌వంత‌మైన‌, ఫ్రెష్ చ‌ర్మం మీ సొంత‌మ‌వుతుంది. ఇందుకోసం మ‌ట్చా గ్రీన్ టీని పేస్ట్ చేసుకొని అందులో కొద్దిగా కొబ్బ‌రి నూనె వేసి బాగా క‌లిపి ముఖానికి ప‌ట్టించండి. దీన్ని 20 నిమిషాల పాటు ఉంచుకొని త‌ర్వాత గోరువెచ్చ‌ని నీటితో క‌డిగేస్తే స‌రి.

ADVERTISEMENT

3. టోన‌ర్‌గా ప‌నిచేస్తుంది (Works As A Toner)

చ‌ర్మం ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా మెరుస్తూ ఉండాల‌ని కోరుకోని అమ్మాయి ఉంటుందా? అయితే దీనికోసం పార్ల‌ర్ల చుట్టూ తిరగాల్సిన అవ‌స‌రం లేదు. గ్రీన్ టీతో ముఖం క‌డుక్కుంటే స‌రిపోతుంది. ఇది మ‌న చ‌ర్మంలోని మ‌లినాల‌ను తొల‌గించి చ‌ర్మ‌రంధ్రాల‌ను శుభ్ర‌ప‌రుస్తుంది.

4. చ‌ర్మ‌కాంతిని పెంచుతుంది (Enhances The Moisture)

గ్రీన్ టీ చ‌ర్మాన్ని మృదువుగా, కాంతిమంతంగా మారుస్తుంది. ఇది న‌ల్ల‌మ‌చ్చ‌లు, మొటిమ‌లను త‌గ్గిస్తుంది. ఇందుకోసం రోజూ గ్రీన్ టీని తాగ‌డంతో పాటు టీ ఆకుల‌ను పేస్ట్ చేసి తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి ఈ ప్యాక్‌ని 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచుకొని ముఖం క‌డుక్కుంటే సరిపోతుంది.

green tea benefits in telugu6

5. జిడ్డు ఇక ఉండ‌దు (Removes Oily Skin)

మీది జిడ్డు చ‌ర్మమా? అయితే గ్రీన్ టీ తాగ‌డం ద్వారా మీ చ‌ర్మంపై ఎక్కువ‌గా విడుద‌ల‌వుతున్న జిడ్డును కంట్రోల్ చేయ‌వ‌చ్చు. గ్రీన్ టీ జిడ్డును త‌గ్గించి మెరిసే చ‌ర్మాన్ని అందించ‌డంతో పాటు చ‌ర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

ADVERTISEMENT

6. స‌న్‌స్క్రీన్‌గా ప‌నిచేస్తుంది (Works As Sunscreen)

గ్రీన్ టీలో యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ గుణాలు ఎక్కువ‌గా ఉంటాయి. గ్రీన్ టీతో త‌యారుచేసిన ఉత్ప‌త్తుల‌ను ఉప‌యోగిస్తే సూర్య‌కాంతి నుంచి అవి మ‌న చ‌ర్మాన్ని కాపాడుతాయి. ఇవి రాషెస్‌, కాలిన గాయాల నుంచి కూడా కాపాడుతాయి. చ‌ర్మానికి తేమ‌ను అందించి ఆరోగ్యంగా మారుస్తాయి.

7. జుట్టును కాపాడుతుంది (Protects The Hair)

మ‌న జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు కూడా గ్రీన్ టీ తోడ్ప‌డుతుంద‌ని చాలామందికి తెలీదు. ఇందులోని పాలీఫినాల్స్ ఆల్ఫా రిడ‌క్టేజ్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. ఇవి జుట్టు రాలేందుకు తోడ్ప‌డే డైహైడ్రోటెస్టోస్టిరాన్ ని త‌గ్గిస్తాయి. అందుకే రోజూ గ్రీన్ టీ తాగ‌డంతో పాటు నెల‌కు ఒక‌సారి గ్రీన్ టీని త‌ల‌కు ప‌ట్టించాలి. దీనివ‌ల్ల మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

green tea benefits in telugu8

గ్రీన్ టీ జుట్టుకు ఎలా ఉప‌యోగ‌ప‌డుతుందంటే.. (Benefits Of Green Tea For Hair)

గ్రీన్ టీ జుట్టు పెరుగుద‌ల‌ను పెంపొందించ‌డంతో పాటు దాన్ని మృదువుగా మారుస్తుంది. జుట్టు ఎదుగుద‌ల‌ను అడ్డుకొని, వెంట్రుక‌లు రాలేలా చేసే డైహైడ్రోస్టిరాన్ (డీహెచ్‌టీ)ని నిరోధించి, జుట్టు రాల‌కుండా కాపాడుతుంది. గ్రీన్ టీలోని కాంపౌండ్స్ టెస్టోస్టిరాన్‌తో చ‌ర్య జ‌రుపుతాయి. త‌ద్వారా ర‌క్తంలో టెస్టోస్టిరాన్ స్థాయుల‌ను గ్రీన్ టీ అదుపులో ఉంచుతుంది. హార్మోన్లు మ‌న శ‌రీరంలోని 5-ఆల్ఫా రిడ‌క్టేజ్‌తో చ‌ర్య జ‌రిపి డీహెచ్‌టీ ఉత్ప‌త్తి కాకుండా చూస్తుంది.. ఇందులోని యాంటీసెప్టిక్ గుణాలు సొరియాసిస్, చుండ్రు వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. గ్రీన్ టీలో విట‌మిన్ ఇ, సిల‌తో పాటు పాలీఫినాల్స్ కూడా ఉండ‌డం వ‌ల్ల ఇది బ‌ట్ట‌త‌ల‌ను కూడా త‌గ్గిస్తుంది. దీనికోసం గ్రీన్ టీని షాంపూ త‌ర్వాత కండిష‌న‌ర్‌గా ఉప‌యోగిస్తే స‌రి. ఇందుకోసం నాలుగైదు గ్రీన్ టీ బ్యాగ్ ల‌ను అర‌లీట‌ర్ నీటిలో వేసి వేడి చేసి ఆ త‌ర్వాత చ‌ల్లారిన నీటితో త‌ల‌ను క‌డిగేస్తే స‌రి. ఇది మంచి కండిష‌న‌ర్ గా ప‌నిచేస్తుంది. 

 గ్రీన్ టీ మ‌న ఆరోగ్యానికి అద్భుత‌మైన పదార్థం. అయితే అందం కోసం ఉప‌యోగించే వివిధ ప‌దార్థాల్లోనూ దీన్ని వాడ‌తారు. ఆ ప‌దార్థాల‌తో పాటు ఫేస్‌మాస్క్‌లు, వెట్ వైప్స్ వంటి వాటిలోనూ దీన్ని ఉప‌యోగిస్తారు. గ్రీన్ టీ ఉప‌యోగించిన ఈ ఉత్ప‌త్తులు అందాన్ని కాపాడేందుకు చాలా బాగా ఉప‌క‌రిస్తాయి..

ADVERTISEMENT

green tea benefits in telugu7

ఇంట్లోనే గ్రీన్ టీ ఎలా త‌యారుచేసుకోవాలి? (How To Make Green Tea At Home)

గ్రీన్ టీ ఆకుల‌తో టీ త‌యారుచేస్తుంటే దాన్ని సాధార‌ణ టీలాగే త‌యారుచేయ‌వ‌చ్చు. ముందు కాస్త నీటిని వేడి చేసి అందులో టీ ఆకుల‌ను వేసి మ‌రిగించాలి. మామూలు టీలో అయితే సాధార‌ణంగా పాలు పోసి చ‌క్కెర వేస్తాం. కానీ గ్రీన్ టీలో ఆ రెండు అవ‌సరం లేదు. మామూలుగా దాన్ని మరిగిస్తే స‌రిపోతుంది. అదే టీ బ్యాగ్ అయితే క‌ప్పులో కాస్త వేడి నీళ్లు పోసి బ్యాగ్ అందులో వేసి రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది. వేడి వేడి గ్రీన్ టీ సిద్ధ‌మ‌వుతుంది.

గ్రీన్ టీ చైనాలో పుట్టినా ఆసియా దేశాల‌న్నింటిలోనూ ప్రాచుర్యం పొందింది. గ్రీన్ టీ మొద‌ట క్రీస్తు పూర్వం 2737లో షెన్నాంగ్ చ‌క్ర‌వ‌ర్తి కాలంలో త‌యారైంది. ఇందులో 99.9శాతం నీళ్లే ఉంటాయి కాబ‌ట్టి క్యాల‌రీలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. 100ఎం.ఎల్ గ్రీన్ టీలో కేవ‌లం ఒక క్యాల‌రీ మాత్ర‌మే మ‌న‌కు ల‌భిస్తుంది.

గ్రీన్ టీ దుష్ప్ర‌భావాలు (Side Effects Of Green Tea)

గ్రీన్ టీ మ‌న ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఏదైనా స‌రే ఎక్కువ మోతాదులో తీసుకున్నా.. స‌రిగ్గా త‌యారుచేయ‌క‌పోయినా ఆరోగ్యానికి మంచిది కాద‌ని మ‌న‌కు తెలిసిందే. గ్రీన్ టీని ఎక్కువ‌గా తీసుకున్నా అలాగే అవుతుంది.

ADVERTISEMENT

green tea benefits in telugu9

గ్రీన్ టీ ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల న‌ష్టాలు (Drinking Too Much In A Single Day)

గ్రీన్ టీని ఎక్కువ మొత్తంలో తాగితే అంటే రోజుకి 4 నుంచి 6 క‌ప్పుల కంటే ఎక్కువ‌గా తాగితే దీని వ‌ల్ల ఆరోగ్యానికి ప్ర‌మాదం. ఇలా గ్రీన్ టీ ఎక్కువ‌గా తీసుకుంటే త‌ల‌నొప్పి, ఆందోళ‌న‌, నిద్ర‌ ప‌ట్ట‌క‌పోవ‌డం, వాంతులు, గుండె వేగంగా కొట్టుకోవ‌డం, క‌ళ్లు తిర‌గ‌డం, మూర్ఛ వంటివి ఎదుర‌వుతాయి. దీనికి ఇందులోని అధిక కెఫీన్ కార‌ణం. ఇవి చిన్న‌పిల్ల‌ల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి.

గ‌ర్బిణులు, పాలిచ్చే త‌ల్లుల‌కు.. (For Breast Feeding Mothers)

గ‌ర్భిణులు, పాలిచ్చే త‌ల్లులు రోజుకి రెండు క‌ప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తీసుకోవ‌డం ప్ర‌మాద‌క‌రం. ఇలా తీసుకుంటే ఒక‌సారి వైద్యుల‌ను సంప్ర‌దించ‌డం మంచిది.

రక్త‌స్రావ స‌మ‌స్య‌లు (Bleeding Problems)

గ్రీన్ టీలోని కెఫీన్ వ‌ల్ల ర‌క్త‌స్రావం ఎక్కువ‌వుతుంది. అందుకే అధిక ర‌క్త‌స్రావంతో బాధ‌ప‌డేవారు గ్రీన్ టీని ఎక్కువ‌గా తాగ‌కూడ‌దు.

కంటి స‌మ‌స్య‌లు (Eye Problems)

గ్రీన్ టీని ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల క‌ళ్ల‌పై ఒత్తిడి ఎక్కువ‌వుతుంది. అందుకే కంటి స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఉంటే గ్రీన్ టీని పూర్తిగా తీసుకోక‌పోవ‌డం లేదా చాలా త‌క్కువ‌గా తీసుకోవ‌డం చేయాలి.

ADVERTISEMENT

ఎక్కువగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు (FAQ’s)

1. రోజూ ఎన్ని కప్పుల గ్రీన్ టీ తాగవచ్చు?

ఇది ప్రతి బ్రాండ్ కి వేరుగా ఉంటుంది. అయితే గ్రీన్ టీ నుంచి మంచి ప్రయోజనాలు పొందాలంటే రోజూ రెండు లేదా మూడు కప్పులు మాత్రమే తాగాలి.

2. గ్రీన్ టీ మన శరీరాన్ని డీటాక్స్ చేస్తుందా?

మన శరీరం దానికి అదే డీటాక్స్ చేసుకునే మెకానిజంని కలిగి ఉంటుంది. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు ఈ ప్రక్రియను వేగవంతం చేస్తాయి.

3. కొన్ని గ్రీన్ టీలు ఎందుకు ఆకుపచ్చగా ఉండవు?

ప్రాసెసింగ్ సమయంలో కొన్ని గ్రీన్ టీలు ఆక్సిడైజ్ అవుతుంది. అంటే అందులో ఎలాంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉండవట. ఇది కాకుండా వేడి తగిలినప్పుడు కూడా గ్రీన్ టీ ఆకులు ఆకుపచ్చ రంగును కోల్పోతాయి.

4. గ్రీన్ టీ ఎందుకు చేదుగా ఉంటుంది?

గ్రీన్ టీ చేదుగా ఉండేందుకు అందులోని కెఫీన్ కారణమవుతుంది. కెఫీన్ ఎంత ఎక్కువగా ఉంటే గ్రీన్ టీ అంత ఎక్కువ చేదుగా ఉంటుంది.

ADVERTISEMENT

ఇలా చేస్తే జిమ్ అవ‌స‌రం లేకుండానే.. బ‌రువు త‌గ్గొచ్చు..

ఇరానీ ఛాయ్ – కేర్ అఫ్ హైదరాబాద్

30 రోజుల పాటు షుగర్‌కి దూరంగా ఉంటే.. ఏం జరుగుతుందో తెలుసా?

02 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT