హనీమూన్‌కి వెళుతున్నారా..? హాట్ లుక్ ఇచ్చే క్యూట్ డ్రస్సులు మీకోసమే.. - Beautiful Honeymoon Dresses For Women

హనీమూన్‌కి వెళుతున్నారా..?  హాట్ లుక్ ఇచ్చే క్యూట్ డ్రస్సులు మీకోసమే..  - Beautiful Honeymoon Dresses For  Women

కొత్తగా పెళ్లయిన జంటలు హనీమూన్ (honeymoon)కి కచ్చితంగా వెళుతున్నారు. హనీమూన్‌లో ఏకాంతంగా ఇద్దరూ సమయం గడపడంతో పాటు.. ఒకరి గురించి మరొకరు తెలుసుకొంటారు. చెప్పాలంటే ఇది కొత్తగా పెళ్లయిన దంపతుల మధ్య ప్రేమను మరింత పెంచుతుంది. వారి బంధాన్ని బలంగా మారుస్తుంది.  మీకు కూడా కొత్తగా వివాహం అయిందా? మీరు కూడా హనీమూన్‌కి వెళుతున్నారా? మరి అక్కడ ఎలాంటి దుస్తులు ధరించాలనుకొంటున్నారు? మీరు ధరించే దుస్తులు మీరు హనీమూన్‌కి వెళుతున్న ప్రాంతానికి తగినట్టుగా ఉండటమే కాకుండా మీ భాగస్వామిని ఆకట్టుకొనేలా ఉండాలి


కొత్త పెళ్లికూతురి కోసం 40 రకాల హనీమూన్ డ్రస్సులు (40 Beautiful Honeymoon Dresses For Women)


మీరు హనీమూన్‌కి వెళ్లే ప్రదేశాన్ని బట్ట ిదుస్తులను ఎంచుకోవాల్సి ఉంటుంది. బీచ్, హిల్ స్టేషన్, క్రూయిజ్, ఇలా హనీమూన్ కోసం కొత్తగా పెళ్లయిన జంటలు వెళుతుంటారు. ఆయా ప్రాంతాలకు తగినట్లుగా సరిపోయే 40 రకాల దుస్తులను మీకు పరిచయం చేస్తున్నాం. వాటిలో మీకు నచ్చినవి ఆన్లైన్‌లో కొనుక్కొని మరీ  ప్యాక్ చేసుకోండి.


బీచ్ హనీమూన్ డ్రెసెస్ (Honeymoon Dresses For Beach)


బీచ్ హనీమూన్ డెస్టినేషన్‌కి వెళ్లినప్పడు మినీస్, స్ట్రాపీ స్లీవ్స్, కట్-అవుట్ డ్రసెస్, ఫ్లోరల్ ప్రింట్స్ వంటివాటిని ధరిస్తే బాగుంటుంది. ఇవి మీకు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు మిమ్మల్ని హాట్‌గా కనిపించేలా చేస్తాయి.


నీలం రంగుల హంగులు.. (Blue Printed Floral Dress)


1-beach-honeymoon-dress


నీలి ఆకాశాన్ని తనలో కలిపేసుకొన్న సముద్ర ఒడ్డున భర్తతో కలసి నడుస్తుంటే.. అలసటే అనిపించదు. మరి ఆ నీలి సంద్రాన్ని మించిన అందగత్తెగా మీరు కనిపించాలంటే.. ఇదుగో ఈ నీలి రంగు డ్రస్ మీరు ధరించాల్సిందే. ఫ్లిప్ ప్లాప్స్, ఓవర్ సైజ్డ్ టోట్ బ్యాగ్ ధరిస్తే చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు.


ఇక్కడ కొనండి: బ్లూ ప్రింటెడ్ ఫిట్ అండ్ ఫ్లేర్ డ్రస్ బై గ్లోబస్ (రూ. 299)


ఫ్యాన్సీ ఫ్లెమింగోస్ (Fancy Flamingos)


2-beach-honeymoon-dress


ఫ్లెమింగో ప్రింట్ ఉన్న ఈ ట్యూబ్ డ్రస్ బీచ్ హనీమూన్‌కి సరైన ఎంపిక. దీనికి ఓవర్ సైజ్డ్ వైట్ షర్ట్, గోల్డ్ టోన్డ్ చైన్ లేదా చెవులకు పెద్ద రింగులు పెట్టుకొంటే బాగుంటుంది.


ఇక్కడ కొనండి: ఫ్లెమింగో ప్రింట్ డ్రస్ బై ఫరెవర్ 21(రూ. 749)


కోల్డ్ షోల్డర్ డ్రస్‌లో కూల్ గా (Cool In Cold Shoulders)


3-beach-honeymoon-dress


కోల్డ్ షోల్డర్స్, అందమైన ఫ్లోరల్ ప్రింట్, వేసవికి తగిన రంగు.. ఇంతకు మించిన బీచ్ హనీమూన్ దుస్తులుంటాయా? జుట్టుని పైకి ముడి వేసుకొని, పాదాలకు స్ట్రాపీ శాండల్స్ వేసుకుంటే మీ లుక్ అదిరిపోతుంది.


ఇక్కడ కొనండి:  గ్రీన్ ప్రింటెడ్ ఫిట్ అండ్ ఫ్లేర్ డ్రస్ బై ససాఫ్రాస్ (రూ 559)


కొత్త కోడలికి సరికొత్త లుక్ ఇచ్చే డిజైనర్ నగల గురించి ఇక్కడ చదవండి


ఆకుల లతల సోయగాలు (Foliage leaves)


4-beach-honeymoon-dress


లీఫ్ ప్రింట్‌తో చూడముచ్చటగా ఉన్న ఈ డ్రస్ ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా? ఇది ఎవరికైనా చాలా అందంగా ఉంటుంది. లో స్టీప్ స్నీకర్స్, మినీ బ్యాక్ ప్యాక్ వేసుకొంటే మరింత అందంగా కనిపిస్తారు.


ఇక్కడ కొనండి: ప్లాంట్ ప్రింట్ ఎసెమెట్రికల్ హెమ్ డ్రస్ బై షిఇన్(రూ. 1,084)


హాట్‌గా సూపర్ షార్ట్‌గా (Hot Super Short)


5-beach-honeymoon-dress


హనీమూన్‌లో మీ భర్తను కాస్త కవ్వించేలా మీ వస్త్రధారణ ఉంటే.. ఇక అతన్ని ఆపతరమా? అందుకే ఈ పసుపు రంగు ఎంబ్రాయిడరీ షార్ట్ డ్రస్ వేసుకోండి. దీనికి తోడుగా గ్లాడియేటర్ ఫ్లాట్స్, పాపింగ్ ఇయర్ రింగ్స్  పెట్టుకొంటే మరింత హాట్‌గా కనిపిస్తారు.


ఇక్కడ కొనండి: ఎంబ్రాయిడర్డ్ ఎ-లైన్ డ్రెస్ విత్  టాసెల్ టై అప్ బై అజియో(రూ 720)


ఎరుపు రంగులో ముగ్ధమనోహరంగా.. (Grim In Red)


6-beach-honeymoon-dress


చిన్న ఫ్లోరల్ ప్రింట్ తో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ డ్రస్ మీకు హాట్ లుక్ ఇస్తుంది. 


ఇక్కడ కొనండి: రెడ్ ప్యాటర్న్డ్ డ్రస్ బై హెచ్ అండ్ ఎమ్(రూ 749)


షీర్ డ్రస్లో షైనీగా.. (Shiny In Whites)


7-beach-honeymoon-dress


ఈ డ్రెస్ మిమ్మల్ని బేబీడాల్ లా మెరిపిస్తుంది. ఈ ఎంబ్రాయిడరీ షీర్ డ్రస్ మీరు బెడ్రూంలోనే కాదు.. బీచ్ కు కూడా వేసుకెళ్లచ్చు. కాకపోతే డ్రెస్ ఓవర్ డ్రస్ ట్రెండ్ ఫాలో అవ్వాలి.


ఇక్కడ కొనండి: షీర్ మెస్ ఫ్లోరల్ ఎంబ్రాయిడర్డ్ డ్రస్ బై ఫరెవర్ 21(రూ 1,699)


సెక్సీ బ్లాక్ డ్రస్ (Sexy Black Dress)


8-beach-honeymoon-dress


ఫ్లోరల్ ప్రింట్ తో అందంగా ఉన్న ఈ బ్లాక్ డ్రస్ మీకు సెక్సీ లుక్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నలుపు రంగు హీల్స్ లేదా ఫ్లాట్ శాండల్స్ మీ పాదాలకు వేసుకొంటే బాగుంటుంది.


ఇక్కడే కొనండి: ఫ్లోరల్ ప్రింట్ బ్యాక్ లెస్ టైర్డ్ లేయర్ కామీ డ్రస్ బై షిిఇన్(రూ 1,158)


ఆలివ్ గ్రీన్ లో ఆకర్షణీయంగా.. (Attractive In Olive Green)


9-beach-honeymoon-dress


అందమైన డ్రస్ లు కొనాలనుకొనేవారిని Zara ఎప్పుడూ నిరుత్సాహపరచదు. ఆలివ్ గ్రీన్ మెష్ డ్రస్ చూడండి. ఎంత స్టైలిష్ గా ఉందో. దీనికి పామ్ పామ్స్ అదనపు ఆకర్షణను జ ోడిస్తున్నాయి.


ఇక్కడ కొనండి: డాటెడ్ మెష్ డ్రస్ విత్ పామ్ పామ్ ట్రిమ్స్ బై జారా (రూ 790)


పూల సింగారం (Floral Singing)


10-beach-honeymoon-dress


ఈ ట్యూబ్ ఫిట్ అండ్ ఫ్లేర్ డ్రస్ తో మీ హనీమూన్ ను మరింత స్పెషల్ గా మార్చుకోండి. తెల్లని వస్త్రంపై అందంగా ఉన్న ఫ్లోరల్ ప్రింట్ మీ సొగసుకు మరిన్ని వన్నెలద్దుతుంది.


ఇక్కడ కొనండి: ఫ్లోరల్ ప్రింట్ డ్రస్ బై టాలీ వైజిల్(రూ 2,250)


పెళ్లికి సన్నద్ధమవుతున్నారా? ఈ మెహందీ డిజైన్లపై ఓ లుక్కేయండి


హిల్ స్టేషన్ హనీమూన్ డ్రసెస్ (Honeymoon Dresses For Hill Stations)


మీ హనీమూన్ డెస్టినేషన్ హిల్ స్టేషన్ అయితే మాక్సీస్, ఫుల్ నెక్ బాడీ కాన్స్, ఫుల్ స్లీవ్ డ్రస్ లు సరైన ఎంపిక. అలాగే స్వెట్టర్ డ్రసెస్ కూడా ధరించవచ్చు. మీ హిల్ స్టేషన్ హనీమూన్ ను మరింత రొమాంటిక్ గా మార్చే 10 రకాల ఫర్ఫెక్ట్ అవుట్ ఫిట్స్ ఇవే..


హై నెక్.. ఫుల్ స్లీవ్ (Pretty High Neck)


1-hillstation-honeymoon-dress


నీలం రంగులోని ఈ హై నెక్, ఫుల్ స్లీవ్ బాడీ కాన్ డ్రస్ హిల్ స్టేషన్ హనీమూన్ కి వెళ్లేవారికి సరైన ఎంపికగా చెప్పుకోవచ్చు. దీనికి ఫర్రీ లాంగ్ లైన్ కోట్, సాక్ ఫిట్ బూట్స్ జతగా ధరిస్తే అదిరిపోయే లుక్ మీ సొంతమవుతుంది.


ఇక్కడ కొనండి: టర్టిల్ నెక్ ఫామ్ ఫిట్టింగ్ సాలిడ్ డ్రస్ బై షిఇన్(రూ 792)


పింక్ మ్యాజిక్.. (Pink Magic )


2-hillstation-honeymoon-dress


పింక్ రంగు దుస్తుల్లో అమ్మాయిలు దేవతల్లా మెరిసిపోతారు. మరి అలాంటి పింక్ డ్రస్ హనీమూన్ సమయంలో వేసుకొంటే చాలా బాగుంటుంది. ఈ డ్రస్కున్న కుచ్చుళ్లు మరింత అందాన్నిస్తున్నాయి.


ఇక్కడ కొనండి: సాలిడ్ ఫిట్ అండ్ ఫ్లేర్ డ్రస్ బై ఫరెవర్ 21(రూ 999)


వెల్వెట్ మెరుపులు (Velvet Lightning)


3-hillstation-honeymoon-dress


ఏ సందర్భానికైనా బ్లాక్ డ్రస్ వేసుకోవచ్చు. మరి హనీమూన్ కి? ఈ బ్లాక్ వెల్వెట్ డ్రస్, లేస్ హ్యాండ్స్ మిమ్మల్ని ఆకర్షణీయంగా మార్చేస్తాయి. హనీమూన్ లో భాగంగా మీరు ఏర్పాటు చేసుకొన్న క్యాండిల్ లైట్ డిన్నర్ కు దీన్ని ధరించండి.


ఇక్కడ కొనండి: బ్లాక్ వెల్వెట్ లేస్ స్లీవ్ డ్రస్ బై ఫాబ్ అల్లీ(రూ 950)


ఆఫ్ షోల్డర్ లో అందంగా (beautiful In Off SHoulder)


4-hillstation-honeymoon-dress


ఈ మెరూన్ కలర్ బాడీకాన్ మిడీ డ్రస్ హిల్ స్టేషన్ హనీమూన్ కు సరైన ఎంపిక. ఈ ఆఫ్ షోల్డర్ డ్రస్ పై ప్రింటెడ్ మఫ్లర్ వేసుకొంటే స్టైలిష్ గా కనిపిస్తారు.


ఇక్కడ కొనండి: పోర్ట్ కార్డెలియా బాడీకాన్ డ్రెస్ బై స్టాక్ బై లవ్(రూ 999)


బిషప్ స్లీవ్స్ లో మురిపిస్తూ.. (Bishop SLeeves)


5-hillstation-honeymoon-dress


ఆకుపచ్చని స్కేటర్ డ్రస్ హనీమూన్ సమయంలో ధరించడానికి బాగుంటాయి. ఈ డ్రస్ కి ఉన్న బిషప్ హ్యాండ్స్ ప్రధాన ఆకర్షణ. ఈ డ్రస్ కు ఉన్న ఎంబలిష్డ్ బటన్స్ మరింత అందాన్నిస్తున్నాయి. ఈ డ్రస్ కు జతగా థై హై బూట్స్ వేసుకొంటే.. మరింత స్టైలిష్ గా కనిపిస్తారు.


ఇక్కడ కొనండి: సింగిల్ బ్రెస్టెడ్ బిషప్ స్లీవ్ డ్రస్ బై షిఇన్(రూ 1,332)


స్వెట్టర్ తో స్వీట్ గా.. (Sweet In Sweaters)


6-hillstation-honeymoon-dress


స్వెట్టర్ డ్రస్ కూడా హనీమూన్ కోసం చక్కని ఎంపిక. ఈ హాఫ్ వైట్ సెల్ప్ డిజైన్ ప్రియాంక చోప్రా మెచ్చిన అవుట్ ఫిట్. మరింకెందుకాలస్యం హనీమూన్ లో సెలబ్రిటీ లుక్ లో మెరిసిపోండి.


ఇక్కడ కొనండి: ఆఫ్ వైట్ సెల్ప్ డిజైన్ లాంగ్ లైన్ స్వెట్టర్ డ్రస్ బై ఆల్ ఎబౌట్ యు (రూ 1,799)


సెలబ్రిటీ స్టైల్ స్టేట్మెంట్ స్లీవ్స్ (Celebrity Style Statement Sleeves)


7-hillstation-honeymoon-dress


హనీమూన్ లో సెలబ్రిటీ స్టైల్లో మెరిసిపోవాలనుకొంటే.. దీపిక ఫ్యాషన్ ఫాలో అవ్వాల్సిందే. స్టేట్మెంట్ స్లీవ్స్, సైడ్ స్లిట్, రిబ్బ్డ్ టెక్స్చర్ తో అందంగా మెరిసిపోతోంది. హనీమూన్ కోసం హిల్ స్టేషన్ కు వెళుతున్నప్పుడు ఈ డ్రస్ మీ వెంట తీసుకెళ్లండి.


ఇక్కడ కొనండి: మస్టర్డ్ యెల్లో సాలిడ్ మాక్సీ స్వెట్టర్ డ్రస్ బై ఆల్ ఎబౌట్ యు (రూ 1,649)


బ్లేజర్ తో బ్యూటీఫుల్ గా.. (Beauty With Blazer)


8-hillstation-honeymoon-dress


ఈ బ్లేజర్ స్టైల్ డ్రస్ ఖరీదు కాస్థ ఎక్కువే అయినప్పటికీ చాలా అందంగా కనిపిస్తోంది కదా..


ఇక్కడ కొనండి: షీత్ డ్రస్ విత్ నాట్చ్డ్ లాపుల్ బై ట్రెండీయోల్(రూ 1,799)


వైల్డ్ గా.. బ్యూటీఫుల్ గా (ANimal Prints)


9-hillstation-honeymoon-dress


యానిమల్ ప్రింట్ డ్రస్ మిమ్మల్ని స్టైల్ గా మార్చేస్తుంది. బ్లాక్ ట్రెంచ్ కోట్, బూటీస్, బ్లాక్ సన్ గ్లాసెస్ లో మీరు ఆడపులిలా కనిపిస్తారు.


ఇక్కడ కొనండి: యానిమల్ ప్రింట్ డ్రస్ బై జారా (రూ 990)


60ల నాటి ట్వీడ్ డ్రస్ (Tweed to 60s)


10-hillstation-honeymoon-dress


అరవైల నాటి కాలంలో బాగా పాపులర్ అయిన ఈ మోడల్ హనీమూన్ కి పర్ఫెక్ట్ ఎంపిక. ఈ మిడీ డ్రస్ కు జోడించిన స్కార్ఫ్ మరింత స్టైల్ ను జోడిస్తుంది.


ఇక్కడ కొనండి: గ్రే ట్వీడ్ ప్లెయిడ్ మిడీ డ్రస్ బై ది లేబుల్ లైఫ్(రూ 2,145)


ఈ వెడ్డింగ్ కేక్స్ మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి


మీ హనీమూన్ డెస్టినేషన్ సిటీ అయితే.. (Honeymoonn Dresses For Your Destination City)


మీ హనీమూన్ (honeymoon) కోసం ఏదైనా నగరానికి వెళుతున్నట్లయితే.. అన్ని రకాల దుస్తులను వేసుకోవచ్చు. కానీ నగరవాతావరణానికి తగినట్లుగా స్టైల్ గా తయారవ్వడం ముఖ్యం. హైదరాబాద్ లో మనం ధరించే దుస్తులను.. దుబాయ్ లో పాటించే ఫ్యాషన్ సరళికి తగినట్టుగా ధరించాల్సి ఉంటుంది. ప్యారిస్.. బార్సిలోనా విషయంలోనూ అంతే. కాబట్టి స్టేట్మెంట్ స్లీవ్స్, హెమ్ లైన్స్, ట్రెండీ ప్రింట్స్, మిడీస్ వంటివాటిని వేసుకొంటే బాగుంటుంది. దానికి తగిన పది రకాల హనీమూన్ దుస్తులు మీకోసం..


మెట్రో సిటీలో రెట్రో ఫ్యాషన్ (Retro Fashion In Metro City)


1-city-honeymoon-dress


సీగ్రీన్ రంగులో ఉన్న ఈ ఫ్లోరల్ ప్రింటెడ్ డ్రస్ చాలా స్టైలిష్ గా ఉంది కదా.. ఈ డ్రస్ కు ఉన్న కాలర్ క్లాసీ రెట్రో లుక్ మీకందిస్తుంది. ఈ డ్రస్ ధరించినప్పుడు వైట్ ఫ్రేమ్డ్ సన్ గ్లాసెస్, block heels వేసుకొంటే మరింత స్టైలిష్ గా కనిపిస్తారు.


ఇక్కడ కొనండి: సీ గ్రీన్ ప్రింటెడ్ ఫిట్ అండ్ ఫ్లేర్ డ్రస్ బై కాజో(రూ 1196)


ఫ్రంట్ నాట్ తో ట్రెండీగా.. (Front Nut)


2-city-honeymoon-dress


ఫ్రంట్ నాట్ డ్రస్ లు నేటి యువతరం మనసును దోచేస్తున్నాయి. కాబట్టి మీ హనీమూన్ కోసం ఈ బ్లూ బటన్ అప్ కామీ డ్రస్ ను ప్యాక్ చేసేయండి. ఎందుకంటే ఈ డ్రస్ లో మీరు మూన్ లా మెరిసిపోతారు.


ఇక్కడ కొనండి: నాట్ ఫ్రంట్ బటన్ అప్ కామీ డ్రస్ బై షి ఇన్(రూ 1,452)


స్టీవ్స్ తో స్టేట్మెంట్ లుక్ (Gathered Sleeves)


3-city-honeymoon-dress


స్క్వేర్ నెక్ లైన్, పొడవైన స్లీవ్స్ తో ఉన్న ఈ డ్రస్ మీకు రస్టిక్ లుక్ ఇస్తుంది. ఈ డ్రస్ వేసుకొన్నప్పుడు బ్రౌన్ హీల్స్, హ్యాండ్ బ్యాగ్ ధరిస్తే మీకు పర్ఫెక్ట్ లుక్ వస్తుంది.


ఇక్కడ కొనండి: గ్యాథర్డ్ స్లీవ్ ఫ్రిల్ ట్రిమ్ షిర్డ్ డ్రస్ బై షిఇన్(రూ 1,008)


ఫ్లోరల్ ప్రింట్ తో ప్రెట్టీలుక్ (Floral Midi)


4-city-honeymoon-dress


పూల ప్రింట్ తో అందంగా కనిపిస్తున్న ఈ డ్రస్ మీకు ప్లెజెంట్ లుక్ ఇస్తుంది. హనీమూన్ (honeymoon) కోసం యూరోప్ వెళుతున్నట్లయితే ఈ డ్రస్ కచ్చితంగా మీ వెంట ఉండాల్సిందే. అక్కడి ఉద్యానవనాల మధ్య విహరించడానికి ఈ డ్రస్ చాలా అనువుగా ఉంటుంది.


ఇక్కడ కొనండి: ప్లోరల్ రాప్ రెడ్ మిడీ డ్రస్ బై కూవ్స్(రూ 945)


నలుపుతో రొమాంటిక్ లుక్ (Romantic Black)


5-city-honeymoon-dress


ఈ బ్లాక్ డ్రస్ చూశారా? చాలా అందంగా ఉంది కదా.. దీన్ని వేసుకుంటే మీరు క్లాసిక్ లుక్ లో మెరిసిపోతారు. నలుపు రంగుకు పూర్తి భిన్నంగా ఉన్న ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ తో దీన్ని జత చేయడం వల్ల చాలా అందంగా కనిపిస్తోంది. దీనికి మ్యాచింగ్ గా చంకీ నెక్లెస్ పంప్స్ ధరిస్తే బాగుంటుంది.


ఇక్కడ కొనండి: కంబైన్డ్ ప్రింటెడ్ డ్రస్ బై జారా(రూ 790)


డెనిమ్ లో స్టైలిష్ గా.. (Stylish Denims)


6-city-honeymoon-dress


డెనిమ్ ఎవరికైనా అందంగానే ఉంటుంది. దీనికి జతగా మోకాలి వరకు ఉన్న బూట్స్ వేసుకొంటే ఆ అందం మరింత పెరగుతుంది. పైగా ఈ డెనిమ్ షర్ట్ డ్రస్ సిటీ స్టైల్ కు తగినట్లుగా ఉంటుంది.


ఇక్కడ కొనండి: నేవీ బ్లూ సాలిడ్ డెనిమ్ షర్ట్ డ్రస్ బై మాంగో(రూ 2,694)


పసుపు రంగులో ప్రత్యేకంగా.. (Cafe Length Dress)


7-city-honeymoon-dress


మీది ఏ రకమైన బాడీ టైప్ అయినా సరే ఈ డ్రస్ ధరించడానికి అనువుగా ఉంటుంది. ఈ డ్రస్ అంచులకున్న కుచ్చులు మీకు మరిన్ని వన్నెలద్దుతాయి.


ఇక్కడ కొనండి: కాఫ్ లెంగ్త్ డ్రస్ బై హెచ్ అండ్ ఎమ్(రూ 2,699)


క్యూట్ గా ఉండే హాల్టర్ నెక్ డ్రస్ (Halter Neck)


8-city-honeymoon-dress


హనీమూన్ (honeymoon) కోసం మీరు విదేశాలకు వెళుతున్నట్లయితే ఈ డ్రస్ కచ్చితంగా మీరు కొనాల్సిందే. తెలుపు, ఆరెంజ్ రంగుల కాంబినేషన్ లో ఉన్న ఈ హాల్టర్ నెక్ డ్రస్ మీకు స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఈ డ్రస్ కు మ్యాచింగ్ గా ఓవర్ సైజ్డ్ సన్ గ్లాసెస్ తో పాటు.. తలలో వైట్ లిల్లీ పెట్టుకొంటే మరింత అందంగా మెరిసిపోతారు.


ఇక్కడ కొనండి: ప్రింటెడ్ హాల్టర్ నెక్ ఎ లైన్ డ్రస్ బై క్లోసెట్ లండన్(రూ 2,500)


ఎసెమెట్రికల్ హెమ్ (Assymetrical Dress)


9-city-honeymoon-dress


హాల్టర్ నెక్ మ్యాక్సీ డ్రెస్ తెలుపు, నీలం రంగుల కలబోతలో ఉన్న ఈ డ్రస్ నా పర్సనల్ ఫేవరెట్. దీని ఎసెమెట్రికల్ హెమ్ లైన్ మీకు డ్రీంగర్ల్ లుక్ ఇస్తుంది.


ఇక్కడ కొనండి: హాల్టర్ నెక్ డ్రస్ విత్ ఎసెమెట్రికల్ హెమ్ బై ఎండీఎస్(రూ 2,475)


క్రూయిజ్ లో మీ హనీమూన్ అయితే.. (Dresses  For Honeymoon On Cruise)


క్రూయిజ్ లో మీ హనీమూన్ అయితే.. మీరు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో తెలుసా? దిల్ ధడకనే దో సినిమాలో ప్రియాంక చోప్రా వేసుకొన్న దుస్తుల లాంటివి. ఆధునికంగా కనిపిస్తూనే.. కాస్త సెక్సీ లుక్ ఇచ్చే దుస్తులు ధరించాల్సి ఉంటుంది. సాలిడ్ ప్రింట్స్, ఫ్లేర్ డ్రస్(కుచ్చుల మాదిరివి), ర్యాప్ డ్రసెస్, షర్ట్ డ్రసెస్ చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.


రెండు రంగుల కలబోత (Colour Combination)


1-cruise-honeymoon-dress


మనసులో మెరూన్ రంగు దుస్తులు వేసుకోవాలనుంటుంది. కానీ సముద్రం చూస్తే నీలంగా ఉంది. ఇలాంటప్పుడు ఈ రెండు రంగుల్లో రూపొందించిన డ్రస్ వేసుకొంటే.. చాలా బాగుంటుంది.


ఇక్కడ కొనండి: నేవీ బ్లూ, మెరూన్ కలర్ బ్లాక్డ్ ఏ లైన్ డ్రస్ బై స్టైల్ కోషెంట్(రూ 719)


ఆరెంజ్ గాడెస్ (Orange Maxi Dress)


2-cruise-honeymoon-dress


అటాచ్డ్ స్కార్ఫ్ ఉన్న ఈ హాల్టర్ నెక్ ఆరెంజ్ డ్రస్ లో మీరు చాలా అందంగా మెరిసిపోతారు. దీనికి మ్యాచింగ్ గా డార్క్ బ్రౌన్ క్లచ్, టింటెడ్ సన్ గ్లాసెస్ పెట్టుకొంటే మరింత స్టైలిష్ గా కనిపిస్తారు.


ఇక్కడ కొనండి: నేవీ సెల్ఫ్ డిజైన్ మ్యాక్సీ డ్రస్ బై స్ట్రీట్ 9(రూ 749)


కుచ్చుల ముచ్చట (Gotta Maxi Dress)


3-cruise-honeymoon-dress


నేవీ బ్లూ రంగులో ఉన్న ఈ సెల్ప్ డిజైన్ స్ట్రాపీ మ్యాక్సీ క్రూయిజ్ హనీమూన్ (honeymoon) కు చక్కటి ఎంపిక. క్రూయిజ్ లో ఏర్పాటు చేసిన పార్టీకి దీన్ని ధరించి వెళితే చాలా బాగుంటుంది.


ఇక్కడ కొనండి: నేవీ సెల్ప్ డిజైన్ మ్యాక్సీ డ్రస్ బై ఆల్ ఎబౌట్ యు(రూ 1,079)


సెక్సీ మ్యాక్సీ (Sexy Maxi)


4-cruise-honeymoon-dress


లేత రంగుల కలయికలో రూపొందిన ఈ మ్యాక్సీ డ్రస్ సాయంత్రం వేళల్లో క్రూయిజ్ డెక్ పై ఏర్పాటు చేసిన ఈవెనింగ్ పార్టీకి ధరించి మీ భర్తతో కలసి వెళ్లండి. అందరిలోనూ మీరు చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు.


ఇక్కడ కొనండి: కలర్ బ్లాక్ స్పగెట్టీ స్ట్ర్రాప్ మ్యాక్సీ డ్రస్ బై షిఇన్(రూ 1,875)


నైట్ క్వీన్ (Night Queen)


5-cruise-honeymoon-dress


స్టైలిష్ సెక్సీ లుక్ ఇచ్చే ఈ డ్రస్ మీ క్రూయిజ్ హనీమూన్ (honeymoon) లో కచ్చితంగా ధరించాల్సిందే. పర్పుల్ రంగులోని ఈ డ్రస్ పై స్లిమ్ హీల్స్ ధరించి, గ్లిట్టర్ క్లచ్ చేత్తో పట్టుకొంటే రాయల్ లుక్ లో మెరిసిపోతారు.


ఇక్కడ కొనండి: జాక్వర్డ్ ీవీవ్ డ్రస్ బై హెచ్ అండ్ ఎమ్(రూ 3,999)


వైట్ ఏంజెల్ (White Angel)


6-cruise-honeymoon-dress


బెల్ స్లీవ్స్ తో ఉన్న ఈ ఎంబలిష్డ్ పుల్ ఓవర్ డ్రస్ మిమ్మల్ని కూల్ గా కనిపించేలా చేస్తుంది. ఈ డ్రస్ వేసుకొన్నప్పుడు పాదాలకు వెడ్జెస్ ధరించండి. అలాగే పెదవులకు పింక్ లిప్స్టిక్ అప్లై చేసుకోవడం మరచిపోవద్దు.


ఇక్కడ కొనండి: ఎంబలిష్డ్ పుల్ ఓవర్ డ్రస్ బై ది మంకీ బ్రైన్ కో(రూ 4,300)


అద్భుతమైన వార్త.. POPxo Shopలో ఇప్పుడు 25% ఆఫర్లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్, ఇంకా మరెన్నో లభిస్తున్నాయి. కూపన్ కోడక్ POPXOFIRST ఉపయోగించి షాపింగ్ చేసేయండి.