పెళ్లికి ముందు వాలెంటైన్స్ డే.. పెళ్ల‌య్యాక ఆర్డిన‌రీ డే..!

పెళ్లికి ముందు వాలెంటైన్స్ డే.. పెళ్ల‌య్యాక ఆర్డిన‌రీ డే..!

కొత్త సంవ‌త్స‌రం మొద‌లైన‌ప్ప‌టి నుంచి ప్రేమికులు ఇక వాలెంటైన్స్ డే(valentines day) ఎప్పుడెప్పుడు వ‌స్తుందా? అని వేచిచూడ‌డం స‌హ‌జమే.. తాము ప్రేమించిన వ్య‌క‌్తికి చ‌క్క‌టి గిఫ్ట్, డేట్ వంటివి అందించాల‌ని చాలామంది డబ్బు దాచుకోవ‌డం వంటివి గ‌మ‌నిస్తుంటాం. అదే జంట‌లు పెళ్ల‌య్యాక మాత్రం వాలెంటైన్స్ డేని జ‌రుపుకోవ‌డం చాలా విభిన్నంగా ఉంటుంది. కొంద‌రు దీన్ని ఇత‌ర రోజుల్లాగే సాధార‌ణంగా గ‌డిపేస్తే.. మ‌రికొంద‌రు మాత్రం కాస్త ప్ర‌త్యేకంగా జ‌రుపుకుంటారు. అంద‌రూ ఒకేలా చేసుకోవాల‌ని లేదు. కానీ కొంద‌రు మాత్రం పెళ్లికి ముందు దాన్నో ప్ర‌త్యేకమైన రోజులా చేసుకున్నా.. పెళ్లి త‌ర్వాత మాత్రం మ‌ర్చిపోతారు. అలాంటివారు పెళ్లికి ముందు, త‌ర్వాత (Before and after marriage) జ‌రుపుకునే వేడుక‌ల్లో తేడా ఏంటో చూద్దాం రండి..


rose day


1. రోజ్ డే


పెళ్లికి ముందు - డార్లింగ్ ఈ రోజు రోజ్ డే క‌దా.. గులాబీ లాంటి నా అందాల ప్రేయ‌సి కోసం ఈ గులాబీ బొకే.. ఇది ఎలా ఉంది?


పెళ్లి త‌ర్వాత - ఏవండీ.. ఈరోజు రోజ్ డే క‌దా.. నా కోసం పూలేమీ తేలేదా?
ఆ తెచ్చాను. మార్కెట్ నుంచి రెండు కాలీఫ్ల‌వ‌ర్ తీసుకొచ్చా. రేపు మంచూరియా చెయ్‌..


Propose day


2. ప్ర‌పోజ్ డే


పెళ్లికి ముందు - డార్లింగ్ నువ్వు నా వాలెంటైన్‌గా ఉంటావా? జీవితాంతం నాకు తోడు నిలుస్తావా?
త‌ప్ప‌కుండా..


పెళ్లి త‌ర్వాత - ఏమండీ మీకు గుర్తుందా? పెళ్లికి ముందు ఇదే రోజున మీరు నాకు ఎప్పుడూ జీవితాంతం తోడుంటావా? అని అడుగుతూ ప్ర‌పోజ్ చేసేవారు..
ఆఆ.. గుర్తుంది.. అవ‌న్నీ పాత రోజులు.. ఇప్పుడు అవ‌న్నీ ఎందుకు?


chocolate day


3. చాక్లెట్ డే


పెళ్లికి ముందు - స్వీట్‌హార్ట్‌.. తియ్య‌నైన మ‌న‌సున్న నీ కోసం అలాంటి తియ్య‌నైన ఈ చాక్లెట్లు తీసుకొచ్చా. దీన్ని నువ్వు నాకు.. నేను నీకు తినిపించుకుందాం..


పెళ్లి త‌ర్వాత -నా డియ‌ర్ భార్యామ‌ణి.. నీ కోసం నోరూరించే చాక్లెట్లు తీసుకొచ్చా. ఇద్ద‌రం తినిపించుకుందాం.
అబ్బా. ఇప్ప‌టికే లావైపోతున్నారు. స్వీట్ మానిపించాన‌ని ఇలా తిందామ‌నుకుంటున్నారా? అదేం కుద‌ర‌దు. ఈ చాక్లెట్లు పిల్ల‌లు తింటారు లెండి..!


teddy day


4. టెడ్డీ డే


పెళ్లికి ముందు - మా అందాల బుట్ట‌బొమ్మ‌కి ఈ చ‌క్క‌టి టెడ్డీబేర్‌..
అబ్బా.. ఎంత బాగుందో అయినా ఇంత పెద్ద టెడ్డీ ఎందుకు కొన్నావు.. ఖ‌రీదెక్కువేమో..
అరె.. నీకు ఖ‌ర్చు చేయ‌క‌పోతే ఆ డ‌బ్బుకే విలువుండ‌దు తెలుసా?


పెళ్లి త‌ర్వాత - డార్లింగ్ ఈ రోజు టెడ్డీ డే క‌దా.. నా కోసం టెడ్డీ బేర్ తీసుకురావా?
డ‌బ్బులేమ‌న్నా చెట్ల‌కు కాస్తున్నాయా? అయినా ఇప్ప‌టికే నీ ద‌గ్గ‌ర నాలుగు టెడ్డీబేర్‌లున్నాయి. ఇంకా ఎందుకు?


promise day


5. ప్రామిస్ డే


పెళ్లికి ముందు - నేను జీవితాంతం నీ చెయ్యి వ‌ద‌ల‌న‌ని ఈ ప్రామిస్ డే సంద‌ర్భంగా ప్ర‌మాణం చేస్తున్నా.
నేనూ జీవితాంతం నిన్ను సంతోషంగా చూసుకుంటాన‌ని ప్రామిస్ చేస్తున్నా..


పెళ్లి త‌ర్వాత - హ‌నీ.. ప్లీజ్ వ‌చ్చేనెల నుంచి నా క్రెడిట్ కార్డ్ ముట్టుకోన‌ని ప్రామిస్ చేయి నువ్వు. ఖ‌ర్చులు త‌ట్టుకోలేక‌పోతున్నా.
స‌రే.. కానీ దానికంటే ముందు మీరు ఇంట్లో అంట్లు తోమ‌డం, బ‌ట్ట‌లుత‌క‌డం చేస్తూ ప‌నుల్లో నాకు సాయం చేస్తాన‌ని ప్రామిస్ చేయండి.


hug day


6. హ‌గ్ డే


పెళ్లికి ముందు - హ్యాపీ హ‌గ్ డే బేబీ.. ఎప్ప‌టికి ఇలా నీ కౌగిలిలోనే ఉండిపోతే బాగుండు అనిపిస్తోంది తెలుసా?
నాక్కూడా కాలం ఇలాగే ఆగిపోవాల‌నిపిస్తోంది.


పెళ్లి తర్వాత - హ్యాపీ హ‌గ్ డే డియ‌ర్‌..
ఆ దీనికేం త‌క్కువ లేదు. ఇదొక్క‌టే ఫ్రీగా దొరుకుతోందని హ‌గ్ చేసుకుంటాడ‌ట‌. మిగిలిన‌వి గుర్తుండ‌వు కానీ.. మ‌ళ్లీ ద‌గ్గ‌రికొస్తే చూడు.. నీ ప‌ని చెబుతా.


kiss day


7. కిస్ డే


పెళ్లికి ముందు - డార్లింగ్ ఈ కిస్ డేకి నిన్ను ముద్దు పెట్టుకోవాల‌నుంది.
స‌రే..నీ ఇష్టం.


పెళ్లి త‌ర్వాత - బేబీ.. ఈరోజు కిస్ డే క‌దా.. ఒక ముద్దివ్వ‌చ్చు క‌దా..
ఆగు. ముందు కూర‌గాయ‌ల‌న్నీ త‌రిగి పెట్టి.. మౌత్‌వాష్ చేసుకో. ఆ త‌ర్వాత ఆలోచిస్తా.. అయినా నేను ముద్దు పెట్టినా క‌ప్ప రాకుమారుడిలా మారుతుందా ఏంటి?


valentines day


8. వాలెంటైన్స్ డే


పెళ్లికి ముందు - హ్యాపీ వాలెంటైన్స్ డే హ్యాండ్‌స‌మ్ ఇదిగో నీకో మంచి గిఫ్ట్ తెచ్చా.
నేను కూడా ఈరోజు మొత్తం మ‌నం స‌ర‌దాగా గ‌డిపేలా ఫుల్ ప్లాన్ చేశా తెలుసా?


పెళ్లి త‌ర్వాత - ఏవండీ హ్యాపీ వాలెంటైన్స్ డే.. మీకోసం గిఫ్ట్ కొందామ‌నుకున్నా కానీ ఆ డ‌బ్బులు ఇంటి ఖ‌ర్చుల‌కు పెట్టాల్సి వ‌చ్చింది. సాయంత్రం డిన్న‌ర్‌కి వెళ్దామా?
డిన్న‌ర్‌కా.. ఎందుకు డ‌బ్బులు వేస్ట్‌.. ఇంట్లోనే ఇద్ద‌రం క‌లిసి న‌చ్చిన‌వి వండుకొని తిందాం. సాయంత్రం నీ కోసం మ‌ల్లెపూలు తీసుకొస్తా.


ఇవి కూడా చ‌ద‌వండి.


పాట పాడి స‌ర్‌ప్రైజ్ చేశాడు.. నెచ్చెలి మ‌న‌సు దోచేశాడు..!


బాధ‌ను పంచుకుందాం.. క్యాన్స‌ర్‌ని దూరం చేసేలా ప్రోత్స‌హిద్దాం..


నిజ‌మైన ప్రేమ‌కు మ‌రుప‌న్న‌దే లేదు.. ప్రేమికులందరూ తప్పక చదవాల్సిన ప్రేమకథ


Images - Giphy, tenor


Featured image - shutterstock