డియర్ ఎక్స్ .. నీకెలా కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలో తెలియడం లేదు..!

డియర్ ఎక్స్ .. నీకెలా కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలో తెలియడం లేదు..!

మై డియర్ ఎక్స్ (Ex-boyfriend),


అప్పుడప్పుడూ వాట్సాప్‌లో  హాయ్ అంటే హాయ్ అనుకోవడం తప్ప మనిద్దరం ముఖాముఖి మాట్లాడుకొని చాలా కాలమైంది. ఇప్పుడు ఎలా ఉన్నావో నాకు తెలీదు. కానీ బాగానే ఉన్నావని భావిస్తున్నాను. ఫోన్‌లో మాట్లాడుకోవడం, చాటింగ్ చేసుకోవడం వంటివి లేవు కాబట్టి.. నా గురించి నీకు, నీ గురించి నాకు సమాచారం తెలియకపోవచ్చు. మనిద్దరం విడిపోయిన తర్వాత నేనెలా ఉన్నానని నువ్వు ఆలోచించే ఉంటావని నేను భావిస్తున్నాను. దానికి నా సమాధానం - నేను చాలా బాగున్నాను. ఇంతకు ముందు కంటే నా జీవితం చాలా సంతోషంగా సాగిపోతోంది. ఇదంతా నీ వల్లే సాధ్యమైంది. అందుకే నీకు నేను థ్యాంక్స్ చెప్పాలనుకొంటున్నాను.


మీ బాయ్ ఫ్రెండ్ కలలోకి వస్తున్నాడా? మరి దాని అర్థమేంటో మీకు తెలుసా?


నీ వల్ల నేను ఎందుకు సంతోషంగా ఉన్నానని సందేహమా? నిజమే.. నేను ప్రస్తుతం అనుభవిస్తున్న ఆనందకరమైన జీవితానికి పునాది నువ్వే వేశావు. నేను ఎక్కువగా బాధపడే విషయాల్లో మన ఇద్దరి రిలేషన్ షిప్ కూడా ఒకటి. అయితేనేం.. మనిద్దరి మధ్య సాగిన అనుబంధం నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. మనిద్దరం కలిసున్నది చాలా తక్కువ సమయయే అయినా.. నన్ను సంతోషంగా ఉంచడానికే నువ్వు ప్రయత్నించావు. అందుకేనేమో బ్రేకప్ తర్వాత నేను ఓ విషయం గుర్తించాను. నేను సంతోషంగా ఉండాలంటే ఇతరులపై ఆధారపడకూడదు. నా సంతోషం నా చేతుల్లోనే ఉందని తెలుసుకొన్నాను. అందుకే నీకు నేను మొదటి థ్యాంక్స్ చెబుతున్నాను.


మనిద్దరం కలసి ఉన్న రోజుల్లో నేను ఎప్పుడైనా బాధపడితే.. నన్ను నవ్వించడానికి ప్రయత్నించేవాడివి. ఆ సమయంలో నిన్ను చూసి నేను చాలా ఆనందించేదాన్ని. కానీ తర్వాతే తెలిసింది. అది తాత్కాలికమైన ఆనందమని. అదే నన్ను నిజమైన, శాశ్వతమైన ఆనందాన్ని వెతుక్కొనేలా చేసింది. ఆ ఆనందం నా సంతోషంలోనే కాదు.. నా బాధలోనూ నా వెన్నంటి ఉంటోంది. నాకు అండగా నిలబడుతోంది. నాకు తోడుగా, నీడగా మారింది. అందుకే నాతో బ్రేకప్ అయిన నీకు థ్యాంక్స్ చెబుతున్నాను.


మనిద్దరికీ బ్రేకప్ అయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. నువ్వు నా జీవితంలో ఇక ఉండవనే బాధతో ఎన్నో రాత్రులు ఏడుస్తూనే గడిపాను. దానివల్ల నాకు మంచే జరిగింది. మానసికంగా నేను బలంగా తయారయ్యాను. ఎలాంటి సమస్య ఎదురైనా నేను నిబ్బరంగా ఉండగలుగుతున్నాను. నన్ను ఇంత దృఢంగా మార్చిన నీకు కృత‌జ్ఞ‌త‌లు.


అబ్బాయిలూ.. ప్రేమతో మీ భాగస్వామికి చేయాల్సిన పనులివే..


నువ్వు నన్ను వదిలి వెళ్లిన తర్వాత జీవితాంతం నాకు తోడుండే ప్రేమను నేను పొందగలిగాను. ఈ విషయంలో నీకు నేను ఎలా కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలో తెలియడం లేదు. ఆ ప్రేమను గుర్తించగలిగేలా చేసింది నువ్వే. నా విలువను నేను గుర్తించేలా చేశావు. అన్ని విషయాల్లోనూ ది బెస్ట్ వ్యక్తిని నా భాగస్వామిగా పొందాను. అందుకే నీకు మరోసారి ధన్యవాదాలు చెబుతున్నా.


వెనక్కి తిరిగి చూసుకొంటే.. నాకు బాధగా అనిపించడం లేదు. నీపై నాకు కోపం లేదు. నువ్వు సంతోషంగా జీవించాలనే నేను కోరుకొంటున్నాను. నీ కలలు సఫలం కావాలని ఆకాంక్షిస్తున్నాను.


మన:పూర్వక కృత‌జ్ఞ‌త‌లతో,


నీ క్షేమం కోరే నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్


సెల్ఫ్ లవ్: మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ఎందుకు ముఖ్యమంటే..


Image: Shutterstock