సమంత అక్కినేని (Samantha Akkineni).. టాలీవుడ్ టాప్ కథానాయికల్లో ఒకరీ అందాల సుందరి. సహజంగానే మెరిసే చర్మంతో కనిపించే సమంత.. దానికి తన అందమైన మేకప్‌తో చక్కటి లుక్‌ని జోడిస్తుంది. తన అద్బుతమైన ఫ్యాషన్లతో టాలీవుడ్ ఫ్యాషనిస్టాగా పేరొందిన ఈ ముద్దుగుమ్మ.. మేకప్ (Makeup) విషయంలో మాత్రం సహజంగా ఉండేందుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది.
అందుకే తన మేకప్ లుక్స్‌ని సాధారణ యువతులు కూడా ఇట్టే పాటించేందుకు వీలుంటుంది. తక్కువ మేకప్‌తో అందంగా కనిపించేందుకు సమంత మేకప్ లుక్స్‌ని ఫాలో అయిపోతే సరి.. మరి, తన లుక్స్‌తో పాటు తనకిష్టమైన మేకప్ ఉత్పత్తుల గురించి కూడా తెలుసుకుందామా?
1. ఎర్రని పెదాల కోసం
సమంత ఎప్పుడూ సింపుల్‌గా మేకప్ వేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. తన లిప్‌స్టిక్‌ని కూడా సాధ్యమైనంత వరకూ సింపుల్‌గా ఉంచుకునే సమంత ఎక్కువగా న్యూడ్ లిప్ స్టిక్స్ ఉపయోగిస్తుంది. అప్పుడప్పుడూ విభిన్నమైనవి ఉపయోగించి కూడా తన లుక్‌ని కొత్తగా మార్చుకుంటుంది.
అయితే ఎన్ని రంగుల లిప్‌స్టిక్ వాడినా సమంత వాడే లిప్‌స్టిక్ బ్రాండ్ మాత్రం ఎప్పటికీ మారదు. అదేంటో మీకు తెలుసా? నార్స్ వాకీరీ లిప్ పెన్సిల్. ఈ బ్రాండ్ ఉపయోగించేందుకు సమంత ఎక్కువగా ఇష్టపడుతుందట. దీని మ్యాట్ ఫినిషింగ్ ఆమెకు అందమైన లుక్‌ని అందించడంతో పాటు తన పెదాలను మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది కాబట్టి.. ఇదంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతుంది సమంత.
2. చక్కటి వింగ్‌డ్ ఐలైనర్ లుక్
సమంతకు వింగ్‌డ్ ఐస్ అంటే ఎంతో ఇష్టం. ఆమె ఐలైనర్ స్టైల్‌ని గమనిస్తే చాలాసార్లు ఈ తరహా స్టైల్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా చక్కటి అందమైన, నల్లని కళ్లను సొంతం చేసుకునేందుకు ఆమె ఐ మేకప్‌ని చాలా జాగ్రత్తగా ఎంచుకుంటుందట. కళ్లు మన శరీరంలోనే అతి సున్నితమైన భాగం. దానికోసం ఎంచుకునే ఉత్పత్తులు అటు అందాన్ని పెంచడంతో పాటు ఇటు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. అందుకే సమంత తన కళ్ల కోసం మ్యాక్ కాస్మెటిక్స్ ఐలైనర్‌తో పాటు ఐకో వారి బ్లాక్ మ్యాజిక్ మస్కారాని ఉపయోగిస్తుంది. వీటితో పాటు ద బామ్ సంస్థ రూపొందించిన ఐషాడోని కూడా ఉపయోగిస్తుంది సమంత.
3. ఆ మెరుపు మీకూ కావాలా?
అవర్‌గ్లాస్ గ్లో ప్యాలెట్.. అన్ని రంగులూ కలిసిన ఈ బ్లష్ ప్యాలెట్ సమంత మెరుపుకి కారణం. కేవలం ఇదే కాదు.. చర్మ సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే సమంత తన మేకప్‌ని కూడా జాగ్రత్తగా ఎంచుకుంటుంది. ఛానెల్ పర్ఫెక్షన్ లుమైర్ ఫ్లూయిడ్ లాంటి లైట్‌వెయిట్ ఫౌండేషన్‌తో తన మేకప్‌ని ప్రారంభించి.. లారా మెర్సియర్ ట్రాన్స్‌లుసెంట్ పౌడర్‌ని ఉపయోగిస్తుందట.
దీన్ని బ్లెండ్ చేయడానికి చక్కటి బ్యూటీ బ్లెండర్ స్పాంజ్‌ని కూడా ఉపయోగిస్తుంది. దీంతో తన మెరిసే చర్మపు మేకప్ అయిపోతుంది. దీన్ని తీసివేయడానికి గార్నియర్ వారి మిసెల్లార్ వాటర్‌ని ఉపయోగిస్తుందట ఈ బ్యూటీ.. ఇక చక్కటి సువాసన కోసం సమంత బైరెడోస్ వెల్వెట్ హేజ్ పర్ఫ్యూమ్‌ని ఉపయోగిస్తుందట. దీని వాసన కాస్త ఘాటుగానే ఉన్నా.. రోజంతా నిలిచి ఉంటుంది.
4. చర్మ సంరక్షణకు ఇలా..
కేవలం మేకప్ మాత్రమే కాదు.. మేకప్ లేకపోయినా అందంగా మెరిసిపోయే చర్మం సమంత సొంతం. దీనికోసం ఆమె కొన్ని పాపులర్ సంస్థల ఉత్పత్తులను ఉపయోగిస్తూ తన అందాన్ని కాపాడుకుంటుందట. బీహెచ్ఏ బ్లాక్‌హెడ్ పవర్ లిక్విడ్‌ని ఉపయోగిస్తూ తన చర్మంపై బ్లాక్‌హెడ్స్ రాకుండా.. అధిక మొత్తంలో నూనెలు విడుదల కాకుండా కాపాడుకుంటుంది సమంత. పగలంతా ఎక్కువ వెలుతురు ఉండే లైట్ల మధ్యలో పనిచేసే ఆమె సాయంత్రం జేజున్ రోసెల్లే టీ ఐ జెల్ ప్యాచెస్‌ని అలసిపోయిన కళ్లపై ఉంచుకొని కళ్ల చుట్టూ నల్లని వలయాలు రాకుండా కాపాడుకోవడమే కాదు.. అలసటను దూరం చేసుకుంటుంది.
ఇక ప్యూరిటో స్నెయిల్ రిపేర్ అడ్వాన్స్డ్ సీరమ్ సాయంతో చర్మంపై ముడతలు రాకుండా కాపాడుకుంటుంది సమంత. ఇది చర్మఛాయను కూడా మెరుగుపర్చడంతో.. ట్యాన్‌కి గురైనా ఎలాంటి ప్రభావం చర్మంపై పడదన్నమాట. దీంతో పాటు చర్మంలో తేమను పెంచేందుకు.. అది వదులుగా తయారవకుండా ఉండేందుకు ప్యూరిటో గెలాక్టో నియాసిన్ పవర్ ఎస్సెన్స్‌ని ఉపయోగిస్తుంది సమంత.
ఇందులో మీకు నచ్చిన ఉత్పత్తులను మీరూ ఉపయోగించి సమంత లాంటి అందాన్ని మీ సొంతం చేసుకోండి.
ఫేషియల్ బ్లీచ్‌తో.. మెరిసే అందాన్ని సొంతం చేసుకుందాం.. !
మీరు ఐలైనర్ వేసుకునేటప్పుడు.. ఈ పొరపాట్లు చేయకండి..!
ట్యాన్ స్కిన్‌ను మెరిపించే.. సెలబ్రిటీ మేకప్ టిప్స్ మీ కోసం..!
Images – instagram