ADVERTISEMENT
home / సౌందర్యం
ట్యాన్ స్కిన్‌ను మెరిపించే.. సెల‌బ్రిటీ మేక‌ప్ టిప్స్ మీ కోసం..!

ట్యాన్ స్కిన్‌ను మెరిపించే.. సెల‌బ్రిటీ మేక‌ప్ టిప్స్ మీ కోసం..!

రేపో మాపో వేసవి వచ్చేస్తుంది. ఇక సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెడతాడు. అందుకే షార్ట్స్, స్లీవ్ లెస్ వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపించరు. దీనికి కారణం చర్మంపై ట్యాన్ పెరిగిపోతుందనే భయమే. మీరెప్పుడైనా గమనించారా? ప్రముఖ మోడల్స్, హీరోయిన్స్, సెలబ్రిటీలు(celebrity) ఏ కాలమైనా సరే  షార్ట్స్‌లో హాట్ హాట్‌గా మెరిసిపోతుంటారు.

అందులోనూ ప్రముఖ మోడల్ లిసా హేడెన్‌ని ఈ విషయంలో ఆదర్శంగా తీసుకోవాల్సిందే. ఆమె చర్మంపై ట్యాన్ (Tan) కూడా అందంగా మెరిసిపోతుంది. షార్ట్స్ వేసుకొన్నప్పుడు ఆమెలా ఆకర్షణీయంగా కనిపించాలంటే ఏం చేయాలో తెలుసా? ఆమెలా మేకప్(makeup) వేసుకోవడమే.

3-celebrity-makeup-lisa-haydon

1. ఎక్స్ఫోలియేషన్

ADVERTISEMENT

సూర్యకాంతిలో మీ కాళ్లు మెరిసేలా కనిపించాలంటే.. ముందు మీరు చేయాల్సిన పని ఒకటుంది. అదే ఎక్స్ఫోలియేషన్. బాడీ స్క్రబ్ ఉపయోగించి గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. దీనికోసం ఎక్స్ఫోలియేటింగ్ గ్లవ్ కూడా ఉపయోగించవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత చర్మానికి బేబీ ఆయిల్ రాసుకొని ఆరనివ్వాలి. ఆ తర్వాత మీకు నచ్చిన షార్ట్స్ వేసుకోవచ్చు.

2. బ్రాంజర్

1-celebrity-makeup-lisa-haydon

ముఖం ప్రకాశవంతంగా కనిపించడానికి బ్రాంజర్ అప్లై చేసుకొంటాం. అదే విధంగా మీరు హైలైట్‌గా కనిపించాలనుకొంటున్న శరీరభాగాలకు బ్రాంజర్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎండలో ఎక్కువగా హైలైట్ అయ్యే భాగాలైన చేతులు, కాలర్ బోన్, భుజాలు, మోకాళ్లు, కాళ్లపై దీన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మేకప్ రివల్యూషన్ లండన్ డ్యుయో ఫేస్ స్క్లప్ట్(రూ 421) సరైన ఎంపిక. ఇది హైలైటర్ కమ్ బ్రాంజర్. లార్జ్ ఫ్లఫ్ఫీ బ్రష్(రూ 220) ఉపయోగించి దీన్ని అప్లై చేసుకోండి.

ADVERTISEMENT

3. లిక్విడ్ హైలైటర్

2-celebrity-makeup-lisa-haydon

లీసా హేడెన్ షార్ట్స్ వేసుకొన్నప్పుడు ఆమె కాళ్లు ఎంత సొగసుగా కనిపిస్తాయో కదా.. వాటిని మీరూ సొంతం చేసుకోవడానికి సులభమైన మార్గం ఒకటుంది. అదే మీరు ఉపయోగించే మాయిశ్చరైజర్లో లిక్విడ్ బ్రాంజర్ కలిపి దాన్ని శరీరానికి రాసుకొంటే సరిపోతుంది. దీనికోసం మీ స్కిన్ టోన్ కంటే డార్క్ షేడ్‌లో ఉన్న బ్రాంజర్ ఎంచుకోవడం మంచిది. అలాగే మిస్ క్లైర్ ఇల్యూమినేటర్ మేకప్ బేస్ – 04 బ్రాంజ్‌ను మాయిశ్చరైజర్ లేదా బేబీ ఆయిల్ కలిపి చర్మానికి రాసుకొన్నా మంచి ఫలితం కనిపిస్తుంది.

4. లెగ్ మేకప్

ADVERTISEMENT

మీ కాళ్లపై గాయాల మచ్చలుంటే వాటిని కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీరు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు. దీనికి లెగ్ మేకప్ స్ప్రే చాలా ఉపయోగపడుతుంది. దీనికోసం సేల్లీ హాన్సెన్ ఎయిర్ బ్రష్ లెగ్స్ వాటర్-రెసిస్టెంట్-మీడియం గ్లో(రూ 1,310) సరైన ఎంపిక. ఇది మీ చర్మంపై ఉన్న గాయాలను, అసమానంగా ఉన్న చర్మం రంగుని కవర్ చేసి అంతా ఒకేలా కనిపించేలా చేస్తుంది.

మీకు తెలుసా ఈ లెగ్ మేకప్ స్ప్రేను చాలా మంది సెలబ్రిటీలు, విక్టోరియా సీక్రెట్ ఏంజెల్స్ రన్ వే షోస్‌లో, బీచ్ వెకేషన్‌కి వెళ్లినప్పుడు ఉపయోగిస్తారు. ప్రత్యేకించి లెగ్ మేకప్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి అంత ఆసక్తి లేకపోతే.. మీ దగ్గర ఉన్న బ్యూటీ ప్రొడక్ట్స్‌నే దానికోసం వాడుకోవచ్చు. ఫౌండేషన్, లిక్విడ్ హైలైటర్‌ను మాయిశ్చరైజర్లో కలిపి దాన్ని అప్లై చేసుకొంటే సరిపోతుంది.

Images: Lisa Haydon Instagram

Also Read

ADVERTISEMENT

మేకప్ ట్రయల్ వేసే ముందు మేకప్ ఆర్టిస్ట్ ను ఈ ప్రశ్నలు అడగండి

మీ అందాన్ని రెట్టింపు చేసే బెస్ట్ బీబీ క్రీమ్స్                                                                                                                                                                                                                               

27 Jan 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT