స్మోకీ ఐస్.. అమ్మాయిల కళ్లను మెరిపించిన ఈ ఐమేకప్ స్టైల్ అమ్మాయిల ఆల్ టైం ఫేవరెట్. ఇప్పుడు దాన్ని తలదన్నేలా చక్కటి ఐమేకప్ ట్రెండ్స్‌ను మన సెలబ్రిటీలు ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా ఐలైనర్‌తో మ్యాజిక్ చేసేస్తున్నారు. అందులోనూ టూ టోన్డ్ ఐలైనర్ ఎఫెక్ట్‌తో ఫిదా చేసేస్తున్నారు. మీక్కూడా టూ టోన్డ్ ఐలైనర్(two toned eyeliner) వేసుకోవాలనుందా? అయితే మీకోసమే ఈ పది రకాల టూ టోన్డ్ ఐ లైనర్ స్టైల్స్..
1. చుక్కల సోయగం
ఈ టూ టోన్డ్ ఐలైనర్ స్టైల్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది కదా. పర్పుల్ రంగుపై నీలం, పింక్, పచ్చ, పసుపు చుక్కలతో పై కనురెప్ప చాలా కలర్ఫుల్‌గా కనిపిస్తోంది. దానికి పూర్తి కాంట్రాస్ట్‌గా కింది కనురెప్పుకు తెలుపు రంగు ఐ లైనర్ కాటుక మాదిరిగా అప్లై చేశారు. టూ టోన్డ్ ఐలైనర్ స్టైల్ పేరుకి తగ్గట్టుగా ఉంది కదూ..!
2. నల్లని కళ్లకు నీలం హంగులు
Image: Shutterstock
ఈ టూ టోన్డ్ ఐలైనర్ వేసుకోవడం చాలా సులభం. పైగా ఇతరుల దృష్టిని ఇది ఇట్టే ఆకర్షిస్తుంది. నీలం, సీ బ్లూ రంగుల్లో ఉన్న ఈ ఐ మేకప్ సింపుల్‌గా ఉన్నా.. క్యూట్ గా ఉంది.
3. మెరుపుల సొబగులు
ఐమేకప్ విషయంలో పెద్దగా ప్రయోగాలు చేయడానికి ఇష్టపడని వారు ఈ గ్లిట్టర్ స్టైల్ ఫాలో అవ్వచ్చు. నల్లని ఐలైనర్‌కి తోడుగా వేసిన షిమ్మరీ ఐషాడో బ్యూటీఫుల్‌గా కనిపిస్తోంది.
Also Read: అదిరేటి లుక్ ఇచ్చే ఆరెంజ్ బ్లష్ ఎలా అప్లై చేసుకోవాలి?
4. నయనాలు ప్రకాశవంతంగా..
Image: Shutterstock
లేత ఆకుపచ్చ, సీగ్రీన్, వైట్ లైనర్‌తో వేసిన ఈ ఐ మేకప్ చాలా బ్రైట్‌గా కనిపిస్తోంది. ఒకదానికొకటి పూర్తి విరుద్ధంగా ఉన్న ఈ రంగులు చాలా పర్ఫెక్ట్ ఐమేకప్ లుక్ ఇస్తాయి.
5. వెండి వెలుగులు
Image: Shutterstock
సిల్వర్ ఐలైనర్, బ్లాక్ ఐలైనర్ కాంబినేషన్ చాలా క్లాసిక్‌గా ఉంటుంది. దట్టంగా వేసిన ఈ సిల్వర్ లైన్ మీ కళ్లను మెరిపిస్తుంది.
6. బ్లాక్ అండ్ వైట్
నలుపు, తెలుపు క్లాసిక్ కాంబినేషన్ అని మనకు తెలిసిందే. ఇదే కాంబినేషన్ కళ్లకు క్లాసిక్ లుక్ ఇస్తుంది. నలుపు రంగు ఐలైనర్‌తో వింగ్డ్ ఐలైనర్ వేసి చివర్లో వైట్ కలర్ ఐలైనర్‌తో ఫినిషింగ్ టచ్ ఇస్తే సరిపోతుంది.
Also Read: ఒక్క నిమిషంలో పర్ఫెక్ట్ ఐబ్రోస్ కావాలంటే..
7. మిడ్ నైట్ మానియా..
రాత్రి సమయంలో పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లాల్సి వచ్చినప్పడు ఈ తరహా టూ టోన్డ్ ఐలైనర్ ట్రెండ్ పాటిస్తే మీరు మరింత అందంగా మెరిసిపోతారు. బ్లాక్ ఐలైనర్, షిమ్మరీ బ్లూ ఐషాడో చేసిన మ్యాజిక్ ఎలా ఉంటుందో యామీ గౌతమ్‌ను చూస్తే అర్థమవుతోంది.
8. పర్పుల్ మెరుపులు
Image: Shutterstock
టూ టోన్డ్ ఐమేకప్ వేసుకోవడానికి రెండు వేర్వేరు రంగులు ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఒకే రంగులోని వేర్వేరు షేడ్స్ ప్రయత్నించినా సరిపోతుంది. పర్పుల్ రంగులోని రెండు షేడ్స్‌తో వేసిన ఈ ఐమేకప్ చాలా బాగుంది కదా..!
9. గోల్డెన్ గ్లామ్
బ్లాక్ ఐలైనర్‌కి సమాంతరంగా గోల్డ్ కలర్ ఐషాడో అప్లై చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణ ఈ ఐమేకప్.
10. డబుల్ టోన్ స్మోకీ లుక్
Image: Shutterstock
నీలం రంగులోని రెండు షేడ్లతో వేసిన ఈ స్మోకీ ఐమేకప్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. మీరు కచ్చితంగా ప్రయత్నించాల్సిందే..!
Also Read: దీపికా పదుకొణెలా స్మోకీ ఐమేకప్ వేసుకోవడమెలాగో ఇక్కడ చదవండి
Featured Image: Shutterstock