ఈ రెసిపీల‌తో మీ వాలెంటైన్‌కి.. రొమాంటిక్ స‌ర్‌ప్రైజ్ ఇవ్వండి..

ఈ రెసిపీల‌తో మీ వాలెంటైన్‌కి.. రొమాంటిక్ స‌ర్‌ప్రైజ్ ఇవ్వండి..

వాలెంటైన్స్ డే (valentines day).. అద్భుత‌మైన మీ ప్రేమ‌ను సెల‌బ్రేట్ చేసుకోవ‌డానికి మీకోసం ఉన్న మ‌రో ముఖ్య‌మైన రోజు ఇది. ఈ రోజుని ఎంతో ప్ర‌త్యేకంగా జ‌రుపుకోవాలని ప్రేమ‌లో ఉన్న‌వారు.. పెళ్లైన జంట‌లు భావించ‌డం స‌హ‌జం. అయితే దీనికోసం ప్ర‌త్యేకంగా డ‌బ్బు ఖ‌ర్చు చేసి టూర్ల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. రెస్ట‌రంట్ల‌కు, రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్న‌ర్ల‌కు ప్ర‌త్యేకంగా వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. ఇంట్లోనే కాస్త క‌ష్ట‌ప‌డి మీ ఇద్ద‌రికీ ఇష్ట‌మైన వంట‌కాలు(recipes) చేసుకుంటే స‌రి.. ఏం చేసుకోవాలో అర్థం కావ‌ట్లేదా? అయితే ఈ వాలెంటైన్స్ డే రోజు మీ మూడ్‌ని పెంచేలా.. ఇద్ద‌రికీ న‌చ్చేలా ఈ రెసిపీల‌ను ఓసారి ప్ర‌య‌త్నించండి.


valrecipe1


గ్రిల్డ్ ప‌నీర్ విత్ చిల్లీ ప్ల‌మ్ సాస్‌


కావాల్సిన‌వి
ప‌నీర్ - 200 గ్రా.
ప్ల‌మ్స్ - కేజీ
చిల్లీ ఫ్లేక్స్ - టీస్పూన్‌
కారం - టీస్పూన్‌
అల్లం పేస్ట్ - టీస్పూన్‌
ఆమ్‌చూర్ - ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్‌
నూనె - రెండు టేబుల్ స్పూన్‌
ఉప్పు - త‌గినంత‌
గ‌రం మ‌సాలా - పావు టీస్పూన్‌
తేనె - రెండు టేబుల్ స్పూన్లు


త‌యారీ


ముందుగా ప్ల‌మ్స్‌ని మిక్సీ ప‌ట్టి మిశ్ర‌మంగా చేసుకొని అందులో కారం, చిల్లీ ఫ్లేక్స్‌, ఆమ్‌చూర్‌, అల్లం పేస్ట్ వేసి మెత్త‌గా రుబ్బుకోవాలి. ఈలోపు ప‌నీర్‌ని పెద్ద ముక్క‌లుగా క‌ట్ చేసి పెట్టుకోవాలి. స్ట‌వ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసి ఇందాక మిక్సీ ప‌ట్టుకున్న మిశ్ర‌మం వేసి వేయించుకోవాలి. ఇందులో ఉప్పు, గ‌రం మ‌సాలా వేసి చిక్క‌బ‌డేవ‌ర‌కూ ఉంచాలి. ఇప్పుడు మ‌రో పెద్ద ప్యాన్ తీసుకొని చుట్టూ ఈ మిశ్ర‌మంలో పోసి మ‌ధ్య‌లో ప‌నీర్ ముక్క‌లు వేసి కొద్దికొద్దిగా నూనె వేస్తూ వేయించుకోవాలి. కాస్త ఎరుపు రంగులోకి మారేవ‌ర‌కూ అలాగే ఉంచుకోవాలి. ఆ త‌ర్వాత మిశ్ర‌మాన్ని మొత్తం క‌లిపి కాసేపు మూతపెట్టి ఉడ‌క‌నివ్వాలి. ఆ త‌ర్వాత గ్రేవీ వ‌దిలేసి ప‌నీర్ మాత్ర‌మే తీసి ప‌క్క‌న పెట్టి స‌ర్వ్ చేసుకోవాలి.


valrecipemain2


హార్ట్ షేప్‌డ్ రెడ్ వెల్వెట్ కేక్‌


కావాల్సిన‌వి
వెన్న - అర క‌ప్పు
చ‌క్కెర - ఒక‌టిన్న‌ర క‌ప్పులు
గుడ్లు - రెండు
నూనె - పావు క‌ప్పు
కొకొవా పౌడ‌ర్ - టేబుల్ స్పూన్‌, డ‌స్టింగ్ కోసం కొద్దిగా
రెడ్ ఫుడ్ క‌ల‌ర్ - రెండున్న‌ర టీస్పూన్లు
వెనిలా ఎస్సెన్స్ - రెండు టీస్పూన్లు
వైట్ వెనిగ‌ర్ - టేబుల్ స్పూన్లు
మైదా - రెండున్న‌ర క‌ప్పులు
బేకింగ్ సోడా - టీస్పూన్‌
ఉప్పు- కొద్దిగా
పెరుగు - పావు లీట‌ర్‌


ఫ్రాస్టింగ్ కోసం
క్రీమ్ ఛీజ్ - 400గ్రా.
వెన్న - అర క‌ప్పు
వెనిలా ఎస్సెన్స్ - రెండు టీస్పూన్లు
ఐసింగ్ షుగ‌ర్ - నాలుగు క‌ప్పులు
నిమ్మ‌ర‌సం - టీస్పూన్‌


త‌యారీ
ముందుగా ఒవెన్‌ని 350 డిగ్రీల ఫార‌న్‌హీట్ వ‌ద్ద ప్రిహీట్ చేసి పెట్టుకోవాలి. ఆ త‌ర్వాత హార్ట్ షేప్‌లో ఉన్న రెండు కేక్ టిన్స్ కి వెన్న రుద్ది పెట్టుకోవాలి. కొకొవా పౌడ‌ర్ జ‌ల్లించుకొని ఆపై వెన్న‌, చ‌క్కెర వేసి బీట్ చేసుకోవాలి. ఇందులో ఒక్కొక్క‌టిగా గుడ్లు వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఇంకో బౌల్‌లో నూనె, కొకొవా పౌడ‌ర్‌, రెడ్ ఫుడ్ క‌ల‌ర్‌, వెనిలా ఎస్సెన్స్ క‌లుపుకోవాలి. ఆ త‌ర్వాత మైదా, బేకింగ్ సోడా, ఉప్పు క‌లిపి పెట్టుకోవాలి.


ఇప్పుడు ఈ మూడు మిశ్ర‌మాల‌ను క‌లుపుకోవాలి. ఇందులో పెరుగు కూడా వేసుకోవాలి. ఆ త‌ర్వాత మిశ్ర‌మాన్ని రెండు ప్యాన్స్‌లోకి తీసుకొని అర‌గంట పాటు బేక్ చేసుకోవాలి. ఒవెన్ నుంచి బ‌య‌ట‌కు తీసి చ‌ల్లార్చుకోవాలి. ఫ్రోస్టింగ్ కోసం క్రీమ్ ఛీజ్‌, వెన్న‌, వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ క‌లుపుకోవాలి. ఇందులో ఐసింగ్ షుగ‌ర్ వేసి తెల్ల‌గా నుర‌గలా మారేవ‌ర‌కూ విప్ చేసుకోవాలి. ఇందులో నిమ్మ‌ర‌సం, రెడ్‌ఫుడ్ క‌ల‌ర్‌ కూడా వేసుకోవ‌చ్చు. ఆ త‌ర్వాత కేక్ ల‌ను తీసుకొని చుట్టూ ఉన్న అంచుల‌ను క‌ట్ చేసుకోవాలి. దీనిపై ఇందాక తయారుచేసిన విప్‌డ్ క్రీమ్ వేసి మ‌రో లేయ‌ర్ పెట్టాలి. ఆ త‌ర్వాత పైన కూడా ఈ క్రీమ్‌ని పూసి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీసి స‌ర్వ్ చేసుకోవచ్చు.


valrecipe


క‌శ్మీరీ పులావ్‌


కావాల్సిన‌వి
బాస్మ‌తీ బియ్యం - అర‌కేజీ
చికెన్ లెగ్స్ - ఆరు
జీల‌క‌ర్ర - రెండు టీస్పూన్లు
ధ‌నియాల పొడి - రెండు టీస్పూన్లు
యాల‌కులు - నాలుగు
దాల్చిన చెక్క‌- నాలుగు
జాప‌త్రి - రెండు
మిరియాలు - కొన్ని
ల‌వంగాలు - ఐదారు
వెల్లుల్లి - ఐదారు
కిస్‌మిస్‌లు - ఐదారు
పెరుగు - క‌ప్పు
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ - క‌ప్పు
కారం - టీస్పూన్‌
అల్లం - ఒక ముక్క‌
నూనె - కొద్దిగా
ఉప్పు - కొద్దిగా
ప‌చ్చిమిర్చి - నాలుగైదు


త‌యారీ
ముందుగా బియ్యాన్ని క‌డిగి ఇర‌వై నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు చికెన్ ముక్క‌ల‌ను క‌ట్ చేసి ఆ త‌ర్వాత క‌డగాలి. పెరుగు, ఉప్పు, కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి, మిరియాల పొడి వేసుకోవాలి. దీన్ని బాగా బీట్ చేసి పెట్టుకోవాలి. ఆ త‌ర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, వెల్లుల్లి, ఉల్లిపాయ‌లు, దాల్చిన చెక్క‌, జాప‌త్రి ఇత‌ర వ‌స్తువులు వేయాలి. ఆ త‌ర్వాత ప‌చ్చిమిర్చి వేసి వేసి వేయించాలి. ఇందులో పెరుగు వేసి కాస్త వేడెక్కి చివ‌ర్లు నూనె వ‌దులుతుంటే చికెన్ ముక్క‌లు, ఉప్పు వేసి ఉడికించాలి. ఇలా రెండు నిమిషాలు వేగ‌నిచ్చి ఆ త‌ర్వాత అందులో రెండు క‌ప్పుల నీళ్లు పోసి కాస్త ఉడికిన త‌ర్వాత బియ్యం వేసి ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన త‌ర్వాత కొత్తిమీర జ‌ల్లి స‌ర్వ్ చేసుకుంటే స‌రిపోతుంది.


valrecipe3


కేర‌ళ ఫిష్ క‌ర్రీ


కావాల్సిన‌వి
నూనె - మూడు టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్‌
క‌రివేపాకు - పది
ఉల్లిపాయ‌లు - కొన్ని
అల్లం - రెండు టీస్పూన్లు
వెల్లుల్లి - రెండు టేబుల్ స్పూన్లు
ప‌చ్చిమిర్చి - రెండు
ధ‌నియాల పొడి - టేబుల్ స్పూన్‌
ప‌సుపు - అర టీస్పూన్‌
కారం - రెండు టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి - పావు టీస్పూన్‌
మెంతి పొడి - చిటికెడు
గార్సీనియా - రెండు మూడు ముక్క‌లు (దీన్ని కేర‌ళ‌ చింత‌పండు అంటారు)
ఉప్పు - త‌గినంత‌
చేప‌లు - అర‌కేజీ


త‌యారీ
ముందుగా ప్యాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, క‌రివేపాకు వేసి అవి వేగాక ఉల్లిపాయ‌లు, అల్లం, వెల్లుల్లి, ప‌చ్చిమిర్చి వేసి బంగారు రంగు వ‌చ్చేవ‌ర‌కూ వేయించాలి. ధ‌నియాల పొడి, ప‌సుపు, కారం, మిరియాల పొడి, మెంతిపొడి ఒక బౌల్‌లో వేసి కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని నూనెలో వేసి బంగారు రంగు వ‌చ్చేవర‌కూ వేయించాలి. ఆ త‌ర్వాత ఇందులో రెండు క‌ప్పుల నీళ్లు గార్సినియా వేసి పొంగు వ‌చ్చేవర‌కూ ఉంచాలి. ఆ త‌ర్వాత స్ట‌వ్ సిమ్‌లో ఉంచి చేప‌ముక్క‌లు వేసి ప‌ది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ త‌ర్వాత రెండుమూడు గంట‌ల పాటు ప‌క్క‌నే ఉంచి స‌ర్వ్ చేసుకోవాలి.



ఇవి కూడా చదవండి


గ్రీన్ టీ కేవ‌లం అందానికే కాదు.. ఆరోగ్యానికీ మంచిదే..!


ఎప్పుడూ రెస్టారెంట్లు, రిసార్ట్‌లేనా? ప్రేమికులారా.. ఈ కొత్త ఐడియాలు మీకోసమే..!


గ‌ణ‌తంత్ర దినోత్స‌వానికి మువ్వ‌న్నెల రుచుల‌తో రంగుల‌ద్దండి..!