తెలుగు సాహిత్యంలో కాల్పనిక భావ కవిత్వానికి పెద్దపీట వేసిన రొమాంటిక్ పొయెట్రీ రైటర్స్‌లో నండూరి సుబ్బారావు ఒకరు. ఓ పల్లె పడుచు అందాలను, ఆమె గుణగుణాలను, ఆమె మనసు లోతుల్లో దాగున్న ఆలోచనలను తనదైన శైలిలో వర్ణించిన ఆయన.. గోదావరి మాండాలికాన్ని.. విశాఖ రూపకబేధాలతో కలిపి ఉపయోగించి.. ఎంకి (Enki) పాటలను రాశారు.
ఎంకిపాటల్లో పల్లె జనుల దాంపత్య జీవితం, ఆలుమగల ఊసులు, బాసలు, వేదనలు, విరహాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పాటల్లో కథానాయిక ఎంకి, నాయుడు బావ పాత్రలు ప్రధానమైనవి. పల్లెటూరి జంట మనస్తత్వాలను, వారి చిలిపి సరదాలను, వారి గడుసు గుణాలను, వారి పల్లె పదాలను ఈ పాత్రల ద్వారా పాటల్లో చెప్పడానికి ప్రయత్నించారు నండూరి.
1925లో ఎంకి పాటలు తొలిసారిగా ప్రచురణకు నోచుకున్నాయి. మంగళంపల్లి బాలమురళీక్రిష్ణ లాంటి సంప్రదాయ శాస్త్రీయ సంగీత విద్వాంసులు కూడా నండూరి వారి ఎంకిపాటలను పాడడం ఆశ్చర్యకరం.పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి వంటి వారు ఎంకి, నాయుడు బావ పాత్రలను రతీ మన్మధులతో పోల్చారు.ఎంకిపాటలకు బొమ్మలు వేయడం కూడా పెద్ద కళే. ఆనాటి బాపు నుండి.. ఈనాటి కళా భాస్కర్ వరకూ ఎంకిపాటలకు అందమైన బొమ్మలు వేసిన చిత్రకారులెందరో.
Images: Bapu Paintings
.”ఎంకి వంటి పిల్ల లేదోయి లేదోయి.. మెళ్ళో పూసల పేరు.. తల్లో పువుల సేరు..కళ్ళెత్తితే సాలు.. రసోరింటికైనా.. రంగు తెచ్చే పిల్ల” అని ఎంకిని పొగిడిన నండూరి ఆమె గుణగణాలనూ బాగానే వర్ణించారు.
“పదమూ పాడిందంటె..కతలూ సెప్పిందంటె కలకాలముండాలి, అంసల్లె, బొమ్మల్లే అందాల బరిణల్లే సుక్కల్లె నా యెంకి అంటూ ”ఎంకి” తప్ప తనకు ఈ లోకంలో వేరే అందగత్తే తారసపడలేదన్నట్లు భావాలను అలవోకగా కురిపించిన నండూరి రియల్ రొమాంటిక్ పొయిట్ అనిపించుకున్నారు.
పల్లెటూరి ఎంకిలో అమాయకత్వం కనిపించినా.. మహా అల్లరి పిల్ల. నాయుడు బావ అంటే తనకు వల్లమాలిన ప్రేమ. నాయుడికి కూడా ఎంకి అంటే అంతే ఇష్టం. అందుకే “జాము రాతిరి యేళ జడుపూ గిడుపూ మాని.. సెట్టు పుట్టా దాటి సేనులో నేనుంటే.. మెల్లగా వస్తాది నా యెంకి.. సల్లంగా వస్తాది నాయెంకి” అంటాడు నాయుడు.
“యెంకి రాలేదని యెటో సూత్తావుంటే.. యెనకాలుగా వచ్చి యెవరునోరంటాది… యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు..యేటి సెప్పేది నా యెంకి ముచ్చట్లు”- అని కూడా ఎప్పుడూ ఎంకినే తలుచుకుంటూ ఆనందాన్ని పొందుతాడు నాయుడు బావ.
ఒక రకంగా చెప్పాలంటే కాయకష్టం చేసుకొని బతికే పల్లెజీవుల బంధాలను, రొమాంటిక్‌గా చెప్పిన ఘనత నండూరిదే అనవచ్చు.
ఏదేమైనా.. తెలుగువారు కలకలం గుర్తుపెట్టుకోదగ్గ పల్లె పడుచు “ఎంకి” అనడంలో సందేహం లేదు కదా..
ఇంకెందుకు ఆలస్యం.. మీకూ ఎంకిపాటలను చదివాలని ఉందా.. అయితే ఎమెస్కో ప్రచురణలో ప్రచురితమైన “ఎంకి పాటలను” మీ స్థానిక బుక్ షాపుల్లో కొని చదివి ఆస్వాదించండి.
Featured Image: Enki Patalu/Kala Bhaskar
ఇవి కూడా చదవండి
పెద్దలు కుదర్చిన పెళ్లిలో ఉండే సౌలభ్యాలేమిటి
తెలుగమ్మాయిలను అపురూపంగా చూపిన ఘనత బాపు చిత్రాలదే
సంక్రాంతి వేళ.. ఈ పసందైన పిండి వంటలు మీకోసమే