అంద‌మైన, ఆక‌ర్ష‌ణీయ‌మైన‌ ఐబ్రోస్.. మీ సొంత‌మిలా..!

అంద‌మైన, ఆక‌ర్ష‌ణీయ‌మైన‌ ఐబ్రోస్.. మీ సొంత‌మిలా..!

చక్కగా తీర్చిదిద్దిన కనుబొమ్మలు మ‌న‌ లుక్ ని  పూర్తిగా మార్చేస్తాయి. అందుకే వాటిని త్రెడ్డింగ్, ప్లకింగ్ చేస్తూ.. షేప్ మారిపోకుండా చూసుకొంటూ ఉంటాం. అయినప్పటికీ త్రెడ్డింగ్ చేసేటప్పడు జరిగే పొరపాట్ల వల్ల కొన్నిసార్లు వాటి ఆకారం మారిపోతుంది. దీనివల్ల ముఖసౌందర్యం దెబ్బ తింటుంది. అందుకే ముందుగానే వాటి షేప్ సరిగ్గా వచ్చేలా చూసుకోవడం ముఖ్యం.


1. పెరగనివ్వండి


ప్లకింగ్, త్రెడ్డింగ్, వ్యాక్సింగ్ ఏదైనా కానివ్వండి.. తరచూ ఐబ్రోస్ షేప్ చేసుకోవడం ద్వారా కనుబొమ్మల వెంట్రుకలు లోపలికి పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా తరచూ షేప్ చేసుకొంటూ ఉంటే.. వాటి ఆకృతి మారిపోతుంది. ఇలా చేయడం వల్ల మీ ఐబ్రోస్ షేప్ కూడా మారిపోయిందా? అయితే మళ్లీ వాటిని త్రెడ్డింగ్ చేయించుకోవడానికి ముందు కనుబొమ్మల వెంట్రుకలను బాగా పెరగనివ్వండి. ఆ తర్వాతే పార్లర్ కి వెళ్లండి.


2. ముఖానికి నప్పే ఐబ్రోస్ గుర్తించండి..


2-perfect-eye-brows-face-structure


ముఖాకృతికి నప్పేలా ఐబ్రోస్ ఉన్నప్పుడే అమ్మాయి అందం మరింత ఇనుమడిస్తుంది. ఒక్కో రకమైన ముఖాకృతి కలిగిన వారికి ఒక్కో రకమైన ఐబ్రో షేప్ బాగుంటుంది. దాన్ని బట్టి మీకు సరిపోయేదాన్ని ఎంచుకోండి. కోల ముఖం కలిగినవారికైతే ఫుల్ బ్రోస్ బాగుంటాయి.  ముఖం గుండ్రంగా ఉన్నవారికి యాంగిల్డ్ ఐబ్రోస్ అయితే బాగుంటుంది. స్క్వేర్ ఫేస్ ఉన్నవారు యాక్సెంటెడ్ ఆర్క్(వంపు తిరిగినట్లుగా ఉన్నవి) మాదిరిగా త్రెడ్డింగ్ చేయించుకొంటే.. ముఖం కాస్త సన్నగా, చిన్నదిగా కనిపిస్తుంది. మీ కనుబొమ్మలను షేప్ చేసుకోవాలని మీరనుకొంటున్నట్లయితే ఎలాంటి ఐబ్రోస్ కావాలని మీరు కోరుకొంటున్నారో మీ బ్యుటీషియన్ కి స్పష్టంగా చెప్పండి.


3. ప్లక్ చేసేటప్పుడు జాగ్రత్త


కనుబొమ్మలను ప్లక్ చేసుకొనేటప్పుడు మీరు చేయాల్సిన మొదటి పని.. వెలుతురు సరిగ్గా ఉండేలా చూసుకోవడం. రెండోది.. వేణ్నీళ్లతో స్నానం చేసిన తర్వాత ప్లక్ చేసుకోవడం. అప్పుడైతేనే చాలా సులభంగా ప్లక్కర్ సాయంతో వెంట్రుకలను తొలగించుకోవచ్చు. ఇలా తొలగించేటప్పుడు ముందుగా.. మీకు కావాల్సిన షేప్ లో పెన్సిల్ వేసుకోవాలి. ఇప్పుడు మీకు విడిగా ఉన్నట్టుగా కనిపిస్తున్న వెంట్రుకలను తొలగించుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మీ eyebrows షేప్ కరెక్ట్ గా ఉండటమే కాకుండా.. మీకు నచ్చినట్టుగా వాటిని తీర్చిదిద్దుకోవచ్చు.


4. త్రెడ్డింగ్, ట్వీజింగ్ తర్వాత జెల్ తప్పనిసరి


4-perfect-brows-soothing


ఐబ్రోస్ షేప్ చేసుకొన్న తర్వాత అక్కడ కలబంద గుజ్జు లేదా రోజ్ వాటర్ రాసుకోవాలి. ఇలా చేయడం ద్వారా పోరస్ శుభ్రపడటంతో పాటు రక్తప్రసరణ పెరుగుతుంది. అలాగే ఐబ్రోస్ చేసుకోవడం వల్ల వచ్చే మంటను తగ్గిస్తుంది. ఎర్రబడకుండా చేస్తుంది.


5. నూనె రాస్తూ ఉండాలి..


మన తలపై జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి క్రమం తప్పకుండా నూనె రాస్తూ ఉంటాం. అదేవిధంగా కనుబొమ్మల వెంట్రుకలకు కూడా నూనె రాసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఒక చుక్క ఆలివ్ నూనె, కొబ్బరి నూనెతో రాత్రి నిద్రపోయే ముందు మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల నూనె ద్వారా కనుబొమ్మల వెంట్రుకలకు పోషణ అంది అవి ఆరోగ్యంగా ఉంటాయి.


6. బ్రో జెల్స్ రాసుకోవడమూ అవసరమే..


6-perfect-brows-brow-gel


ఐబ్రో షేప్ సరిగ్గానే ఉన్నప్పటికీ.. కనుబొమ్మల వెంట్రుకలు పక్కకు వచ్చేసినట్టుగా తయారవుతాయి. దీనివల్ల అవి సరిగ్గా లేనట్టుగా కనిపిస్తాయి. వాటిని స‌రి చేసుకోవ‌డానికి బ్రోజెల్స్ రాసుకోవాల్సి ఉంటుంది. మస్కారా బ్రష్ తో జెల్ అప్లై చేసుకొంటే అవి అలాగే ఉంటాయి.


7. Eyebrow పెన్సిల్ తో..


కనుబొమ్మల‌ను తీరైన ఆకృతిలో తీర్చిదిద్దుకోవడానికి ఐబ్రోపెన్సిల్ ఉపయోగిస్తే మంచిది. కనురెప్ప‌లు పెరుగుతున్న దిశలో పెన్సిల్ రాస్తే చూడటానికి బాగుంటుంది.


8. కాంటౌరింగ్ చేస్తున్నారా?


8-perfect-brows-brow-contouring


ఐబ్రోస్ కి కాంటౌరింగ్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? కాంటౌరింగ్ చేస్తే మీ ఐబ్రోస్ చాలా అందంగా కనిపిస్తాయి. దీనికోసం కనుబొమ్మలు మొదలయ్యే చోట లైట్ షేడ్ లో, వంపుగా ఉన్న చోట డార్క్ షేడ్లో కాంటౌరింగ్ చేసుకోవాలి. చివర హైలైటర్ అప్లై చేస్తే కనుబొమ్మల ఆకృతి అందంగా ఉంటుంది.


9. ఈ నియమం పాటించండి..


త్రెడ్డింగ్, ట్రిమ్మింగ్ చేసుకొనేటప్పుడు ఓ నియమాన్ని గుర్తుపెట్టుకోండి. మీ నుదుటిపై ఉన్న కనుబొమ్మలు.. నాసికా రంధ్రాలకు సమాంతరంగా ఉండేలా చూసుకొని త్రెడ్దింగ్ చేసుకోవాలి.


10. ఫౌండేషన్ తో చమక్కు


10-perfect-brows-brow-foundation


మీ కనుబొమ్మలు అందంగా, ఆకర్షణీయంగా ఉండాలంటే.. వాటికి పెన్సిల్ లేదా ఐబ్రో మస్కారా అద్దే ముందు ఫౌండేషన్ అప్లై చేయండి. ఐబ్రోకి వేసిన రంగు రోజంతా నిలిచి ఉంటుంది.


కనుబొమ్మలను ఒక్క నిమిషంలో అందంగా మార్చుకోవాలంటే ఏం చేయాలి?


టీనేజ్ అమ్మాయిలను ఫిధా చేస్తోన్న దీపిక స్టైల్ స్మోకీ ఐమేకప్


పర్ఫెక్ట్ ఫౌట్ లిప్స్ కోసం లిప్స్టిక్ ఎలా వేసుకోవాలి?