ఈ టాలీవుడ్ బ్యూటీస్.. పెంపుడు జంతువులు అంటే ప్రాణమిస్తారు..

ఈ టాలీవుడ్ బ్యూటీస్.. పెంపుడు జంతువులు అంటే ప్రాణమిస్తారు..

పెంపుడు జంతువులు (pets).. కుటుంబంలోని సభ్యుల్లా కలసిపోయి.. మనల్ని మరోసారి చిన్నపిల్లల్ని చేసేస్తాయి. వాటితో ఆడుకొంటుంటే అసలు సమయమే తెలీదు. అవి మనల్ని ఉత్సాహంగా ఉంచడమే కాదు.. బాధల్లోనూ తోడుగా ఉంటాయి. పైగా మన పట్ల విశ్వాసంగానూ ఉంటాయి.


అందుకే ఇటీవలి కాలంలో పెట్స్‌ను పెంచుకొనేవారి సంఖ్య పెరుగుతోంది. దీనికి మన స్టార్ హీరోయిన్లు కూడా అతీతం కాదు. తమకు నచ్చిన మూగజీవాలను దత్తత తీసుకొని వాటి బాగోగులు చూసుకొంటున్నారు. వాటిని ప్రేమగా పెంచుతున్నారు. కాస్త సమయం దొరికితే చాలు.. వాటి సంరక్షణకూ సమయం కేటాయిస్తున్నారు. వాటితో సమయం గడుపుతూ షూటింగ్ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. మరి పెట్స్ అంటే ప్రాణమిచ్చే.. మన టాలీవుడ్ హీరోయిన్స్ గురించి తెలుసుకొందామా..


కీర్తి సురేష్


సావిత్రి పాత్రలో మనందరినీ మెప్పించిన కీర్తి సురేష్ ఓ బుజ్జి పప్పీని పెంచుకొంటోంది. ఇటీవలే దాన్ని తన కుటుంబంలోకి ఆహ్వానించింది. ఇంతకూ ఆ బుజ్జి కుక్క పిల్ల పేరు ఏంటో తెలుసా? నైక్.


 
 

 

 


View this post on Instagram


A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) on
అనుష్క శెట్టి


అనుష్క శెట్టి జంతు ప్రేమికురాలు మాత్రమే కాదు. వాటిని సంరక్షించే విషయంలో బ్లూ క్రాస్‌తో కూడా కలసి పనిచేస్తుంది. ఆమె కొన్ని శునకాలను దత్తత తీసుకొని వాటి బాధ్యతలను చూసుకొంటోంది.త్రిష


సీనియర్ నటి త్రిష.. జంతు ప్రేమికురాలు. ఆమె జోయూ అనే పెట్‌ను చాలా ప్రేమగా, ప్రాణప్రదంగా పెంచుకొంటోంది. దానికి చిన్న అనారోగ్యం కలిగినా తట్టుకోలేదు త్రిష. పెటా సభ్యురాలైన త్రిష బ్లూ క్రాస్ సంస్థతో కలసి జంతు సంక్షేమం కోసం పాటుపడుతోంది.
 

 


View this post on Instagram


A post shared by Trish (@dudette583) on
ప్రణీత


వాలు కళ్ల చిన్నది ప్రణీతా సుభాష్ కూడా పెట్ లవరే. ఆమె బ్లూ అనే ఓ బుజ్జి కుక్కను పెంచుకొంటోంది. మీకో విషయం తెలుసా? ఈ బ్లూకి ఓ Instagram పేజీ కూడా ఉంది. బ్లూ తో ఆడుకొంటున్న ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో పంచుకొంటుంది ప్రణీత.
 

 

 


View this post on Instagram


A post shared by Blu The Husky (@blu_diaries) on
అను ఇమ్మాన్యుయేల్


"కిట్టూ ఉన్నాడు జాగ్రత్త" సినిమాలో పెట్ లవర్‌గా కనిపించిన అను నిజజీవితంలోనూ పెట్ లవరే.  ఆమె ఓ చిన్నకుక్కపిల్లను పెంచుకుంటోంది.
 

 

 


View this post on Instagram


A post shared by Anu Emmanuel (@anuemmanuel) on
దిశా పటానీ


"లోఫర్" హీరోయిన్ దిశాపటానీ కూడా పెట్ లవరే. ఆమె శునకాలతో పాటుగా పిల్లిని కూడా పెంచుకొంటోంది. ఆమెకు జంతువులంటే ఎంత ఆపేక్ష ఉందో తెలుసుకోవాలంటే ఆమె Instagram ఖాతా చూడాల్సిందే.
 

 

 


View this post on Instagram


A post shared by disha patani (paatni) (@dishapatani) on
హన్సిక మోత్వానీ


అందాల భామ హన్సిక మోత్వానీ బ్రూజో, మర్పీ అనే రెండు శునకాలను పెంచుకొంటోంది. వీలు కుదుర్చుకొని మరీ వాటితో సమయం గడుపుతుంది హన్సిక.
 

 

 


View this post on Instagram


A post shared by Hansika M (@ihansika) on
కృతి స‌న‌న్‌


వన్ నేనొక్కడినే, దోచేయ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసిన కృతి స‌న‌న్‌ కూడా ఓ పెట్ పెంచుకొంటోంది. దాని పేరు డిస్కో.
 

 

 


View this post on Instagram


A post shared by Kriti (@kritisanon) on
కలర్స్ స్వాతి


కలర్స్ స్వాతి ఓ పగ్ జాతి కుక్కను పెంచుకొంటోంది. దాని పేరు పీనట్. ఇదే కాకుండా.. మరో రెండు శునకాలను స్వాతి పెంచుకొంటోంది.
 

 

 


View this post on Instagram


A post shared by Swati (@swati194) on
అదా శర్మ


అందాల రాశి అదాశర్మ కూడా జంతు ప్రేమికురాలే. ఆమె పెంచుకొంటున్నశునకం పేరు షేర్ ఖాన్. మీకో విషయం తెలుసా? గతంలో అదాశర్మ కాకిని కూడా పెంచుకుంది. ఇవే కాకుండా.. ఆమె కొన్ని ఇండియన్ బ్రీడ్ డాగ్స్‌ను దత్తత తీసుకొని వాటిని సాకుతోంది. 
 

 

 


View this post on Instagram


A post shared by Adah Sharma (@adah_ki_adah) on
అమలాపాల్


అమలాపాల్‌కు పెట్స్ అంటే బాగా ఇష్టం. తన ఖాళీ సమయాన్ని తన పెంపుడు జంతువు వాఫెల్స్‌తో గడపడానికి ఇష్టపడుతుంది అమలా పాల్.
 

 

 


View this post on Instagram


A post shared by Amala Paul ✨ (@amalapaul) on
వీరితో పాటుగా ప్రియమణి, సదా, రాయ్ లక్ష్మీ, కృతి కర్భందా వంటి తారలు సైతం పెంపుడు జంతువులను ప్రేమగా సాకుతున్నారు.


ఇవి కూడా చదవండి


ఇలాంటి చిత్ర విచిత్రమైన వ్యక్తులు మీకూ మార్కెట్‌లో ఎదురయ్యారా..


స‌మంత మేక‌ప్ సీక్రెట్లు తెలుసుకుందాం.. మ‌న‌మూ సెలబ్రిటీ లుక్ పొందేద్దాం..!


మీ బాయ్ ఫ్రెండ్ క‌ల‌లోకి వ‌స్తున్నాడా? దాని అర్థం ఏంటో మీకు తెలుసా?