పార్టీ టైంలో పీరియ‌డ్ వ‌చ్చిందా? అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..!

పార్టీ టైంలో పీరియ‌డ్ వ‌చ్చిందా? అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..!

ఏవైనా ఫంక్షన్లకు వెళ్లాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఎక్కువ మంది మహిళల మనసులో మెదిలే మొదటి విషయం.. ‘అప్పటికి నా నెలసరి గడుస్తుందా?’ అని. కొన్నిసార్లైతే.. మనం చాలా ముఖ్యం అని భావించే రోజునే పీరియడ్స్ వస్తుంటాయి. అప్పుడు ప్లాన్ మొత్తం ఫ్లాపయిందని బాధపడటం తప్ప పెద్దగా ప్ర‌యోజ‌నం కూడా ఉండ‌దు.


ఎందుకంటే.. పీరియడ్స్ వ‌చ్చిన‌ప్పుడు అమ్మాయిలకు నడుం, పొట్ట, కాళ్లు, చేతులు లాగేస్తుంటాయి. ఆ సమయంలో జరిగే రక్తస్రావం కారణంగా కాస్త చిరాగ్గా కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు పార్టీలకు, ఫంక్షన్లకు హాజరవ్వడమంటే చాలా కష్టంగానే అనిపిస్తుంది. మ‌రి, ఇలాంటి స‌మ‌యంలో కూడా తప్పనిసరిగా పార్టీకి వెళ్లాల్సి వస్తే ఏం చేయాలి? డోంట్ వర్రీ.. మేం చెప్పే ఈ చిట్కాలతో హాయిగా party time ఎంజాయ్ చేసేయండి..


 1. కడుపుబ్బరం తగ్గేలా..


1-periods-on-party


పీరియడ్స్(periods) రావ‌డానికి ముందు కొందరమ్మాయిల్లో కడుపు ఉబ్బరంగా ఉన్నట్టనిపిస్తుంది.  ఇది చాలా ఇబ్బంది పెడుతుంది. అందుకే ఆ రోజు మనం తీసుకొనే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీనికోసమే పొటాషియం, ప్రొటీన్లు అధికంగా ఉండే అరటి పండు, చేపలు, బొప్పాయి వంటివి తినడం మంచిది.


2. నొప్పిని తగ్గించే ఔషధాలు


నెలసరి సమయంలో పొత్తి కడుపులో నొప్పి రావడం సహజం. ఆ నొప్పిని తట్టుకొనేలా మీరుండాలి కదా! అందుకే దానికోసం ముందుగానే మీరు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. పెయిన్ కిల్లర్స్, మజిల్ రిలాక్సెంట్ వంటివి మీ దగ్గర సిద్ధంగా ఉంచుకోండి. ఎందుకంటే ఉత్సాహంగా ఉండాల్సిన రోజున నొప్పితో విలవిల్లాడితే ఎలా?


3. ప్యాడ్స్‌కి బదులుగా మెనుస్ట్రువల్ కప్స్


3-periods-on-party


ఈ సమయంలో ప్యాడ్స్ కంటే మెనుస్ట్రువల్ కప్స్ ఉపయోగించడం మంచిది. అవకాశం ఉంటే.. వాటిని ఉపయోగించడానికి ప్రయత్నించండి. వీటికి బదులుగా టాంఫూన్స్ అయినా వాడొచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా  పార్టీ టైం ఎంజాయ్ చేయచ్చు.


Also read: మెనుస్ట్రువల్ కప్స్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆంగ్లంలో చదవండి


4. రెండు ప్యాడ్స్ వాడండి..


టాంఫూన్స్, మెనుస్ట్రువల్ కప్స్ ఇప్పటి వరకూ మీరు ఉపయోగించనట్లయితే.. వాటికి బదులుగా హెవీ డ్యూటీ ప్యాడ్స్ ఉపయోగించవచ్చు. లేదా ఒక ప్యాడ్‌కి బదులుగా రెండు ప్యాడ్స్ వాడండి. ఇలా చేయడం వల్ల మీ దుస్తులకు మరకలు అవుతాయనే భయం ఉండదు.


5. ఎక్స్‌ట్రా ప్యాడ్ వెంట ఉంచుకోండి..


5-periods-on-party


సాధారణంగా మీ వెంట మీ స్నేహితులు కచ్చితంగా ఉంటారు కదా. మీకు అవసరమైన ప్యాడ్ లేదా పిల్ వారి దగ్గర ఉంచమని ఇవ్వండి. అంతేకాదు.. కనీసం గంటకోసారైనా మీకు ఆ విషయాన్ని గుర్తు చేయమని చెప్పండి.


6. అప్పుడప్పడూ వాష్రూంకి వెళ్లాల్సిందే..


పార్టీ నుంచి అస్తమానూ వాష్రూంకి వెళ్లాల్సి రావడం ఇబ్బందే. అలా చేస్తే అందరి చూపూ మీ మీదే ఉంటుంది. అందుకే మీ బెస్టీకి ఏదో పని ఉన్నట్లుగా మిమ్మల్ని పిలవమని చెప్పండి.  ఇలా చేయడం వల్ల మీకు అవసరమైనప్పుడు వాష్రూంకి వెళ్లే అవకాశం ఉంటుంది. అవసరమైతే ప్యాడ్ మార్చుకోవచ్చు.


7. హై హీల్స్‌కి దూరంగా..


7-periods-on-party


పీరియడ్స్ సమయంలో మనకు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో హై హీల్స్ వేసుకొంటే చాలా అసౌకర్యంగా ఉంటుంది. అందుకే ఆ సమయంలో ఫ్లాట్స్ వేసుకోవడానికి ప్రాధాన్యమివ్వండి.


Also read: షూ బైట్స్ ఇబ్బంది పెడుతున్నాయా? ఈ చిట్కాలు పాటించండి


8. వాటర్ ప్రూఫ్ మేకప్


పీరియడ్స్ సమయంలో కొన్ని సందర్భాల్లో భరించలేనంత నొప్పిగా ఉంటుంది. మరి, పార్టీ టైంలో ముఖంపై కన్నీటి చారలుంటే.. అంత బాగోదు కదా..! అందుకే మీ మేకప్ ఆర్టిస్ట్‌ని వాటర్ ప్రూఫ్ మేకప్ వేయమని చెప్పండి. అలాగే మీ వెంట కాంపాక్ట్ పౌడర్ సిద్ధంగా ఉంచుకోండి. అవసరమైతే వాడుకోవచ్చు.


9. మొటిమలు కనబడకుండా..


9-periods-on-party


పీరియడ్స్ సమయంలో మొటిమలు రావడం సహజం. మరి, వాటిని కనబడకుండా చేసేదెలా? మొటిమలు వచ్చిన చోట.. టూత్ పేస్ట్ లేదా ఐస్ క్యూబ్ ఉంచితే.. వాపు తగ్గుతుంది. అలాగే మీ మేకప్ ఆర్టిస్ట్‌ను మొటిమలు కనబడకుండా మేకప్ వేయమని చెప్పండి.


Also read: మేకప్ ట్రయల్స్ వేసే ముందు మేకప్ ఆర్టిస్ట్ ను అడగాల్సిన ప్రశ్నలు


10. సౌకర్యవంతంగా కూర్చోండి


కొన్ని సందర్బాల్లో పార్టీలో ఎక్కువ సమయం కూర్చోవాల్సి ఉంటుంది. నెలసరి సమయంలో ఇలా ఎక్కువ సమయం కూర్చోవాలంటే చాలా ఇబ్బందే.  అందుకే మీకు సౌకర్యవంతంగా ఉండే కుర్చీలో కూర్చోండి. దీనివల్ల కాళ్ల నొప్పులు కూడా రావు.


11. ప్రశాంతంగా ఉండండి


11-periods-on-party


అమ్మాయిలూ చివరిగా మీకు మేం చెప్పేదేంటంటే.. మీకొచ్చినవి పీరియడ్స్ మాత్రమే. అది నెలనెలా మనల్ని పలకరించి వెళ్లే బంధువే. అందుకే దాని గురించి భయపడటం మాని.. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.


Internal Images: Shutterstock


Featured Image: Pexels