home / సౌందర్యం
మేకప్  ట్రయల్ వేసే ముందు మేకప్ ఆర్టిస్ట్ ను ఈ ప్రశ్నలు అడగండి

మేకప్ ట్రయల్ వేసే ముందు మేకప్ ఆర్టిస్ట్ ను ఈ ప్రశ్నలు అడగండి

వివాహం జరిగే రోజు సాధ్యమైనంత అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తుంది నవ వధువు. అందు కోసం మేకప్ వేసుకోవడమే కాదు.. అది సహజంగా కూడా కనిపించాలని ఆరాటపడుతుంది. అందు కోసం మేకప్ ఆర్టిస్ట్ ను ఆశ్రయిస్తుంది. ఆమె కూడా పెళ్లి కూతురుని చక్కగా అలంకరిస్తుంది.

అయితే కొన్ని సందర్భాల్లో అలంకరణ మనం అనుకున్నంత బాగా లేకపోవచ్చు. అలా జరగకుండా ఉండాలంటే పెళ్లికి కొన్ని రోజుల ముందే మేకప్ ట్రయల్స్ వేయాల్సి ఉంటుంది. అలా ప్రయత్నాలు మొదలుపెట్టే ముందు మీకు మేకప్ వేసేవారిని కొన్ని ప్రశ్నలు అడగండి. అప్పుడు మీ మేకప్ మరింత అందంగా, సహజంగా ఉంతుందనడంలో అతిశయోక్తి లేదు.

1. ముందే సిద్ధంగా ఉండాలా?

కొంతమంది మేకప్ ఆర్టిస్ట్ లు తమ దగ్గరికి వచ్చే వారు ముందుగానే మేకప్ కోసం సిద్ధమై ఉండాలని భావిస్తారు.అందుకే వారి వద్దకు వెళ్లడానికి ముందే మీరు వారి నుండి కొన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది. మీ చర్మానికి ఏదైనా పూసుకోవాల్సి ఉందా? ముఖానికి ఫేషియల్ చేయించుకోవాల్సిన అవసరం ఉందా? మాయిశ్చరైజర్ రాసుకొంటే సరిపోతుందా? ప్రైమర్ అప్లై చేసుకోవాలా? ఇలాంటి ప్రశ్నలు అన్ని అడగండి. వారు చెప్పిన దానికి అనుగుణంగా ముందే సిద్ధమై వెళ్లండి.

2. పోర్ట్ పోలియో ఉందా?

1 Makeup Artist

పెళ్లికి ఎలాంటి మేకప్ వేసుకొంటే బాగుంటుందోననే విషయంపై అవగాహన రావడానికి వారి దగ్గర పోర్ట్ పోలియో ఉందేమో అడగండి. దానిని చూడటం ద్వారా వారు మేకప్ ఎలా వేస్తారో తెలుసుకోవడంతో పాటు మేకప్ ట్రెండ్స్ పై అవగాహన పెరుగుతుంది. తదనుగుణంగా మీ వెడ్డింగ్ మేకప్ విషయంలో ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుంది.

3. నా నెచ్చెలికి కూడా మేకప్ వేస్తారా?

వివాహ సమయంలో పెళ్లి కూతురుకి తోడుగా ఉండే స్నేహితురాళ్లను బ్రైడ్స్ మెయిడ్స్ అని పిలుస్తున్నారు. వారు కూడా ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా మేకప్ వేసుకొంటున్నారు. అందుకోసం ప్రత్యేకంగా మేకప్ ఆర్టిస్టుల వద్దకు వెళుతున్నారు. అయితే కొందరికి ఈ అవకాశం ఉండదు. మీ స్నేహితురాళ్లలో కూడా అలాంటి వారున్నట్లయితే వారికి కూడా మేకప్ వేస్తారో లేదో మీ మేకప్ ఆర్టిస్ట్ ను అడగండి. అలాగే మీ స్నేహితురాళ్ళకి కూడా తెలపండి. ఇలాంటి సందర్భాల్లో మేకప్ ఆర్టిస్టులకు వీలైతే తగిన ఏర్పాట్లు చేసుకొంటారు. అవసరమైతే తమతో పటు సహాయకురాలిని కూడా వెంట తీసుకొస్తారు.

4. ఎలాంటి ఉత్పత్తులను వాడతారు?

2 Makeup Artist

మేకప్ వేసుకొనే ముందు మీరు మేకప్ ఆర్టిస్టులను ఈ ప్రశ్న కచ్చితంగా అడిగి సమాధానం తెలుసుకోవాలి. అప్పడే వారు సురక్షితమైన బ్రాండెడ్ ఉత్పత్తులు వాడుతున్నారో లేదో తెలుస్తుంది. వాటిలో మీకు నచ్చినవాటిని.. మీ చర్మానికి నప్పే వాటిని ఎంచుకోవచ్చు.

5. నేనేమైనా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందా?

మేకప్ కోసం మీరు మీకు నచ్చిన ఉత్పత్తిని వాడదామనుకొంటే ఆ విషయాన్ని మీ మేకప్ ఆర్టిస్టుకి తెలపండి. అవి వారి దగ్గర ఉన్నాయేమో కనుక్కోండి. ఒకవేళ లేకపోతే.. ఆ సమయానికి వాటిని వారు సిద్ధం చేస్తారా? లేక మీరే కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందా? అనే విషయాన్ని కూడా కనుక్కోవడం మంచిది. కొత్త ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు మీ చర్మతత్వాన్ని దృష్టిలో ఉంచుకోండి.

6. డిపాజిట్ కట్టాల్సిన అవసరం ఉందా? డబ్బు ఎలా చెల్లించాలి?

4 Makeup Artist

పెళ్లి కోసం మేకప్ వేసే వారిలో కొందరు ముందుగానే అడ్వాన్స్ లేదా డిపాజిట్ అడుగుతారు. ఈ విషయంపై కూడా స్పష్టత తెచ్చుకోవాల్సి ఉంటుంది. వారికి డబ్బును ఏ రూపంలో జమ చేయాల్సి ఉంటుందో కూడా మీరు తీసుకోవాలి. ఎందుకంటే కొందరు చెక్కులు అడిగితే.. మరికొందరు నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించమంటారు. అందుకే వారికి.. మీరు జమ చేసిన ప్రతి మొత్తానికి బిల్లు తీసుకోవడం మాత్రం మరిచిపోవద్దు.

7. నా పెళ్లి రోజు ఇంకెవరికైనా మేకప్ వేస్తున్నారా?

పెళ్లి హడావుడిలో పడి చాలా మంది మేకప్ ఆర్టిస్టులను ఈ ప్రశ్న అడగడం మరచిపోతారు. కానీ అన్నింటి కంటే అతి ముఖ్యమైన విషయం ఇది. మీతో పాటు మరొకరికి కూడా మేకప్ వేయడానికి ఆమె అంగీకరిస్తే.. కొన్ని సందర్భాల్లో సమయం సర్దుబాటు కాక.. మీరు కాస్త ఇబ్బందిని ఎదుర్కోవాల్సి రావచ్చు. మీకవసరమైన సమయానికి ఆమె కూడా మీకు అందుబాటులో లేకపోవచ్చు. అందుకే మీ పెళ్లి రోజు ఆమె షెడ్యూల్ ని తెలుసుకోవాల్సి ఉంటుంది. వీలైతే రోజు మొత్తాన్ని మీ కోసమే కేటాయించేలా మాట్లాడుకోండి.

8. నా వెంట స్నేహితురాలిని తెచ్చుకోవచ్చా?

6 Makeup

మేకప్ ట్రయల్ వేస్తున్నప్పుడు మీ వెంట మీ స్నేహితురాలిని తీసుకెళ్లచ్చేమో తెలుసుకోండి. ఎందుకంటే మీకు వేసిన మేకప్ ని చూసి వారి అభిప్రాయం చెబుతారు. తద్వారా మీ లుక్ మరింత అందంగా వచ్చేలా చూసుకోవచ్చు.

9. ఫొటోలు తీసుకోవచ్చా?

మేకప్ వేసుకోవడం ప్రారంభించాక.. మీకు వీలైనన్ని ఫొటోలు తీసుకోండి. మేకప్ సరిగ్గా వచ్చిందా? లేదా? అనే విషయాన్ని దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ మేకప్ సరిగ్గా లేకపోతే.. దానికి అనుగుణంగా మార్పులు కూడా చేసుకోవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే.. మీ పెళ్లి రోజున మీరు దేవతలా మెరిసిపోవచ్చు.

10. మీరే వస్తారా? ఇంకెవరైనా వస్తారా?

మీకు మేకప్ ట్రయల్ వేసిన వ్యక్తే మీ పెళ్లిరోజున కూడా మేకప్ వేస్తే బాగుంటుంది. ఎందుకంటే వారికే మేకప్ విషయంలో మీకు ఏం కావాలో పూర్తిగా అవగాహన ఉంటుంది. పైగా వారితో ఎంతో కొంత పరిచయం ఏర్పడటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఎదురవదు. కొన్ని కారణాల వల్ల వారు రాకపోయినట్లైతే ఎవరిని పంపిస్తారో అడగాలి. వారిని కూడా మేకప్ ట్రయల్స్ లో భాగస్వామిని చేయాలి. దానివల్ల వారికి కూడా మీకు వేయాల్సిన మేకప్ పై అవగాహన ఏర్పడుతుంది.

04 Dec 2018

Read More

read more articles like this
good points

Read More

read more articles like this