ఇష్టంలేని ల‌వ్‌ ప్ర‌పోజ‌ల్‌కి.. ఇలా తెలివిగా నో చెప్పండి..!

ఇష్టంలేని ల‌వ్‌ ప్ర‌పోజ‌ల్‌కి.. ఇలా తెలివిగా నో చెప్పండి..!

వాలెంటైన్స్ డే (valentines day).. ప్రేమ‌లో ఉన్న జంట‌ల‌కు ఇదో పండ‌గ రోజైతే.. ఒంట‌రిగా ఉన్న అమ్మాయిలు, అబ్బాయిల‌కు త‌మ ప్రేమ‌ను వెల్ల‌డించేందుకు ఇదో చ‌క్క‌టి అవ‌కాశం. కానీ ఒక‌రా.. ఇద్ద‌రా.. మ‌రీ ఎక్కువ మంది ప్ర‌పోజ్ చేస్తుంటే ఎవ‌రికైనా ఇబ్బందిగా అనిపించ‌డం ఖాయం. అందుకే ఈసారి మీకు ఎవ‌రైనా ఐ ల‌వ్ యూ (I love you) అని చెబితే.. ఇష్టంలేని ల‌వ్‌ ప్ర‌పోజ‌ల్ కి సారీ.. నో.. అంటూ కామ‌న్ జ‌వాబులు కాకుండా.. కాస్త ప్ర‌త్యేకంగా, కొత్త‌గా, చ‌మ‌త్కారంగా నో చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించండి. అలాంటి కొన్ని స‌మాధానాలు మీ కోసం


1. ఐ ల‌వ్ యూ.. - అవునా.. షేక్ హ్యాండ్ ఇవ్వు.. ఐ ల‌వ్ మీ టూ.. ఎందుకంటే హ‌నీ ఈజ్ ద బెస్ట్‌..


gifskey


2. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. - కానీ నీకు నాకంటే మంచి అమ్మాయి ల‌భిస్తుంది. అయినా నువ్వు ఈ సెమిస్ట‌ర్‌లో మూడు స‌బ్జెక్టుల్లో ఫెయిల్ కావ‌డానికి ఇదేనా కార‌ణం?


3. నువ్వంటే నాకు ఇష్టం - నువ్వంటే కూడా నాకెంతో ఇష్టం. మ‌నిద్ద‌రం ఎప్ప‌టికీ బెస్ట్‌ఫ్రెండ్స్‌.


4. నేను నిన్ను ఇష్ట‌ప‌డుతున్నా. నువ్వు లేకుండా నేను బ‌త‌క‌లేను. - లేదు. నువ్వు అలా అనుకుంటున్నావంతే.. ఇది కేవ‌లం నీ అపోహ మాత్ర‌మే..


5. ఐ ల‌వ్ యూ - నేను కూడా.. ఐ టూ ల‌వ్ యూట్యూబ్‌..


6. నేను నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నా - అయ్యో.. ఏదో చెబుతున్న‌ట్లున్నావు.. నేను ఉద‌యాన్నే స్విమ్మింగ్‌కి వెళ్లొచ్చిన త‌ర్వాత నాకు ఏమీ విన‌ప‌డ‌ట్లేదు. కొంప‌దీసి ఐల‌వ్యూ అయితే కాదుగా.. అయినా నువ్వు అలా చెప్ప‌వులే..


boyfriend


7. నిన్ను చూడ‌గానే న‌చ్చేశావు. నేను నీ ప్రేమ‌లో ప‌డిపోయా. - ప్లీజ్ ఇదే విష‌యం కాస్త నా బాయ్‌ఫ్రెండ్ ముందు చెప్ప‌వా..త‌నెంత ల‌క్కీనో అత‌డికి కూడా అర్థ‌మ‌వుతుంది.


8. నువ్వంటే నాకు ఇష్టం - న‌న్ను ప్రేమించే వారి జాబితాలో ఇంకో పేరు పెరిగింద‌న్న‌మాట‌. థ్యాంక్యూ.


9. ఐ ల‌వ్ యూ - అబ్బా.. చాలు.. ఇంక జోకులు ఆపు.. నువ్వు నాకు ప్ర‌పోజ్ చేయ‌డ‌మేంటి?


10. నువ్వంటే నాకు చాలా ఇష్టం - అవును. నా లాంటి అంద‌మైన, తెలివైన అమ్మాయిని ఇష్ట‌ప‌డ‌ని వాళ్లు ఎవ‌రైనా ఉంటారా? నాకు తెలుసు నేను చాలా బెస్ట్.


11. నేను నిన్ను చాలాకాలం నుంచి ప్రేమిస్తున్నా.. - ఒక్కసారి ద‌గ్గ‌రికి రా.. ఈ రోజు నీ ఆరోగ్యం బాలేన‌ట్లుంది. ఒక‌సారి డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళ్దామా?


12. ఐ ల‌వ్ యూ - హాహాహా.. జోక్ చాలా బాగుంది.


13. నువ్వంటే నాకు చ‌చ్చేంత ఇష్టం - నువ్వు ఏం చెప్పినా స‌రే.. నేను నీకు డ‌బ్బులు ఇవ్వ‌ద‌ల్చుకోలేదు.


hot


14. నేను నిన్ను ప్రేమిస్తున్నా - అయితే ఏంటి? న‌న్ను అంద‌రూ ప్రేమిస్తారు. ఇష్ట‌ప‌డ‌తారు. అందులో కొత్తేముంది?


15. నేను నిన్ను ఎంత‌గానో ఇష్ట‌ప‌డుతున్నా - ఈ మాట ఎవ‌రికి చెప్పేందుకు ప్రాక్టీస్ చేస్తున్నావు?


16. ఐ ల‌వ్ యూ - ఈ మాట ఇంత‌కుముందు ఎంత మందికి చెప్పావేంటి? నా నంబ‌ర్ ఎంత‌?


6salary


17. నేను నిన్ను ప్రేమిస్తున్నాను - స‌రే. నీ ల‌వ్ అప్లికేష‌న్ ఫాం నాకు మెయిల్ చేయి. అది చూసి నిర్ణ‌యించుకుంటా.


18. నువ్వంటే నాకు ఇష్టం - ప్ర‌పంచంలో ఇంత‌మంది ఉంటే నువ్వు న‌న్నే ఎందుకు ఇష్ట‌ప‌డుతున్నావు? జెస్సీ క‌నిపించ‌లేదా?


19. నేను నిన్ను ఎంత‌గానో ఇష్ట‌ప‌డుతున్నా - ఇవ‌న్నీ టైంవేస్ట్ వ్య‌వ‌హారాలు.


20. ఐ ల‌వ్ యూ - వావ్.. మీ అమ్మానాన్న‌ల‌కు స్వీట్ షాప్ ఏమైనా ఉందా? నీ బుగ్గ‌లు బూరెల్లా చాలా బాగున్నాయి.


ఇవి కూడా చదవండి


పాట పాడి స‌ర్‌ప్రైజ్ చేశాడు.. నెచ్చెలి మ‌న‌సు దోచేశాడు..!


నిజ‌మైన ప్రేమ‌కు మ‌రుప‌న్న‌దే లేదు.. ప్రేమికులందరూ తప్పక చదవాల్సిన ప్రేమకథ


మేజ‌ర్ శ‌శిధ‌ర‌న్ విజ‌య్ నాయ‌ర్‌ జంట ప్రేమ‌క‌థ వింటే.. మీరూ కంట‌త‌డిపెడ‌తారు..!