ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

రాశులు, రాశి ఫలాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మనలో చాలామందికి ఉంటుంది. తమ రాశి ఆధారంగా దినఫలం ఎలా ఉందో తెలుసుకోవడం కొందరి దినచర్యలో భాగం కూడా. అందుకే ప్రతి టీవీ ఛానల్లోనూ రాశి ఫలాలు ప్రత్యేకంగా ప్రసారం చేస్తుంటారు. ఇక రాశుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. మిగిలిన రాశులకు చెందిన వారంతా ఒకెత్తు.. మకరరాశి వారు మరో ఎత్తు అని చెప్పుకోవాలి.  వీరు స్నేహం కోసం ప్రాణమిస్తారు.


తమ విషయంలో పొరపాటు చేస్తే చీల్చి చెండాడేస్తారు. వారి వ్యక్తిత్వమే కాస్త భిన్నంగా ఉంటుంది. ఒకసారి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడితే మరోసారి.. ఎంత బతిమాలినా చిన్న సాయం కూడా చేయరు. మకరరాశి వారి గురించి తెలుసుకొనే కొద్దీ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడుతుంటాయి. అవేంటో తెలుసుకోవాలని మీక్కూడా అనిపిస్తుంది కదా.. ఇంకెందుకాలస్యం.. మకరరాశి అమ్మాయిల(Capricorn women) మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..


చిత్రమైన స్వభావం


మకర రాశి అమ్మాయిలు చాలా చిత్రంగా ప్రవర్తిస్తారు. ఒకసారి అంచంచలమైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా ఉంటారు. మరోసారి ఆత్మన్యూనతతో బాధపడుతుంటారు. ఈ రెండింటి మధ్య వారు ఊగిసలాడుతుంటారు. చేపట్టిన పని ఎలాగైనా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంటారు. నిరాశ ఎదురైన సందర్భాల్లో సైతం తమను తాము మోటివేట్ చేసుకోగలుగుతారు. మరుక్షణమే ఏమీ చేయలేకపోతున్నామని బాధపడిపోతారు. ఎవరినైనా సరే ఇట్టే నమ్మేస్తారు. ఎదుటి వ్యక్తి వారి నమ్మకాన్ని కోల్పోతే వారి ముఖం కూడా చూడరు. తాము ఇతరుల విషయంలో ఎంత నమ్మకంగా ఉంటున్నారో ఇతరులు కూడా తమ విషయంలో అలాగే ఉండాలని వీరు భావిస్తారు.


పట్టువదలని విక్రమార్కులు


మకర రాశి అమ్మాయిలను ది ఎఛీవర్స్ అని, కార్యసాధకులని పిలుస్తారు. ఎందుకంటే వారికి అప్పగించిన లేదా చేపట్టిన పని ఏదైనా సరే దాన్ని పూర్తి చేయకుండా వదిలిపెట్టరు. దానికోసం వారు చక్కటి వ్యూహరచన చేయగలుగుతారు. నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకొని మరీ కార్యాచరణలోకి దిగుతారు. దాన్ని అమలు చేసే తీరులోనూ ఇతరులకు భిన్నంగానే వ్యవహరిస్తారు. ఎంత వరకు చేశాం? ఇప్పుడు ఏం చేస్తన్నాం? ఇంకా ఎంత చేయాలి? అనే వాటిని ఏ రోజుకారోజు చెక్ చేసుకొంటూ ఉంటారు. అందుకే ఇతరుల కంటే త్వరగా పనిని పూర్తి చేయగలుగుతారు.


1-capricorn-woman-traits


స్నేహానికి ప్రతిరూపం


మకరరాశి అమ్మాయిలు స్నేహం అంటే ప్రాణమిస్తారు. అందరితోనూ స్నేహపూర్వకంగా మెలగుతారు. స్నేహాన్ని ఎల్లకాలం పదిలంగా ఉంచుకోవడానికే ప్రాధాన్యమిస్తారు. చిన్న అంశాన్ని సైతం చక్కగా విశ్లేషించే ఈ రాశి వారికి స్నేహితులు ఎక్కువగానే ఉంటారు. తాము స్నేహితులకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో.. స్నేహితులు సైతం తమ విషయంలో అదే తీరుగా వ్యవహరించాలని కోరుకొంటారు.


వీరిని మోసం చేయడం కష్టం


ఎదుటి వారు చెప్పే మాటలన్నీ వీరు చాలా చక్కగా వింటారు. అలా అని మనం చెప్పే కబుర్లన్నీ నమ్మేస్తారనుకొంటే పొరపాటే. మనం మాట్లాడిన ప్రతి పదం వెనక ఉన్న గూడార్థాన్ని వారు ఇట్టే పసిగట్టగలుగుతారు. మన మాటతీరు, హావభావాలను బట్టి సైతం వారు మనల్ని అంచనా వేయగలుగుతారు. కాబట్టి మకర రాశి అమ్మాయిల దగ్గర నటించకుండా నిజాయతీగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇదే నియమం ప్రేమ సంబంధిత వ్యవహారాల్లోనూ వర్తిస్తుంది. వారితో ప్రేమబంధాన్ని కొనసాగించడం మీకు ఇష్టం లేకపోతే వారితో నేరుగా విషయాన్ని చెప్పేయడమే మంచిది. నమ్మించి మోసం చేయాలని ప్రయత్నిస్తే మాత్రం మీ అంతు చూడకుండా వదలరు.


ఓటమిని అంగీకరించలేరు కానీ..


వృత్తిప‌ర‌మైన‌, వ్య‌క్తిగ‌త‌ జీవితాల్లో వైఫల్యాన్ని వారు అసలు ఇస్టపడరు. నిజం చెప్పాలంటే వీరు ఓటమిని అంగీకరించలేరు. అలాగని పూర్తిగా బాధలో మునిగిపోయి నిరాశలో కూరుకుపోరు. ఆ వైఫల్యాన్ని మనస్పూర్తిగా స్వీకరిస్తారు. ఆ తర్వాత వారు వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఉంటుంది. గతంతో పోలిస్తే వారి పనితీరు మెరుగపడుతుంది. అంతేకాదు.. తమ ఓటమి గురించి ఇతరులకు తెలిసినా వారు పెద్దగా బాధపడరు. బాధలో కూరుకుపోయి ఉండటం కంటే.. చేస్తున్న పనిపై శ్రద్ధ పెట్టడం మంచిదని వీరి ఉద్దేశం. అందుకే తమను తాము బిజీగా ఉంచుకొంటారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడుపుతూ, పుస్తకాలు చదువుతూ తమ మనసుని తేలికపరచుకొనే ప్రయత్నం చేస్తారు.


2-capricorn-woman-traits


ఆఫీసులో ఎలా ఉంటారంటే..


మకర రాశి అమ్మాయిలు పని విషయంలో చాలా నిబద్ధత కలిగి ఉంటారు. ఓపికగా వ్యవహరిస్తారు. నియమ నిబంధనలను పాటించే విషయంలో అస్సలు రాజీపడరు. సహోద్యోగులతో చక్కటి స్నేహబంధాలు పెంపొందించుకొంటారు. పనులు పూర్తి చేసే విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. కానీ కొన్నిసార్లు తీవ్రమైన నిరాశలో కూరుకుపోతారు. ఉత్పాదకత తగ్గిపోతుంది.


భోజనప్రియులు


మకరరాశి అమ్మాయిలు భోజనప్రియులు. కానీ తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దానికి తగిన ఆహారాన్ని తినడానికి ప్రాధాన్యమిస్తారు. ఆహారం తినే విషయంలో సమయపాలన పాటిస్తారు. జంక్ ఫుడ్ బాగా ఇష్టపడతారు. కానీ తమ నాలుకను అదుపులో ఉంచుకోగలుగుతారు.


శృంగార‌మంటే ఆసక్తి


మకర రాశి అమ్మాయిలకు శృంగార‌మంటే ఆసక్తి ఎక్కువ. వారి లైంగిక జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా సాగిపోతుంది. సెక్స్ విషయంలో మకరరాశి అమ్మాయిలు చాలా క్రేజీగా ఉంటారు. తమ భాగస్వామికి కోరుకొన్న సౌఖ్యాన్ని అందించగలుగుతారు.


ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. దీనికి ఎవరూ అతీతులు కాదు. మకరరాశి అమ్మాయిలు కూడా అంతే. వీరు తమకు అనుకూలంగా ఉన్న వాతావరణం నుంచి బయటకు రావడానికి ఇష్టపడరు. ఏ విషయంలోనైనా ఎవరి మీదనైనా అయిష్టం పెంచుకొంటే.. పూర్తిగా వారిని దూరం పెట్టేస్తారు. వీరిలో నిరాశావాదం ఎక్కువగా కనిపిస్తుంది.


మకర రాశి అమ్మాయిల గురించి మరింత విపులంగా తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


Featured Image: Shutterstock


Running Images: Unsplash


Also Read: సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?


ఏమయ్యా వార్నర్.. మా తెలుగు వారి దోశ రుచి చూస్తావేంటి?