ఈ రోజు రాశిఫలాలు చదివేయండి - మీ జీవిత గమనానికి బాటలు వేయండి

ఈ రోజు రాశిఫలాలు చదివేయండి - మీ జీవిత గమనానికి బాటలు వేయండి

ఈ రోజు 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం


మేషం (Aries) - గ‌తంలో చేసిన పొర‌పాట్ల నుంచి నేర్చుకున్న పాఠాల ద్వారా ఆ పొర‌పాట్లు మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా జాగ్రత్తపడండి. ఒకవేళ మీకు ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు వ‌స్తే.. వాటి నుంచి బ‌య‌ట‌పడేందుకు గ‌ల మార్గాల గురించి అన్వేషించండి. సంతోష‌క‌ర‌మైన అంశాల గురించి ఆలోచించండి.


వృషభం (Tarus) - ప్రస్తుతం మీకు మంచి స‌మ‌యం న‌డుస్తోంది. మీ ఇంటిని నిర్మించుకోవ‌డం ద్వారా లేదా మీ బిజినెస్‌ను విస్తరించడం ద్వారా భ‌విష్యత్తుకు బ‌ల‌మైన పునాదులు వేసుకోండి. ఇవి మీకు తప్పకుండా భ‌విష్యత్తులో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.


మిథునం (Gemini) - మీరు అనుకున్నది సాధించ‌డం ద్వారా మీరు, మీ చుట్టూ ఉన్నవారు కూడా సంతోషంగా ఉండేలా చూసుకుంటారు. అయితే మీరు మాన‌సికంగా బ‌లంగా ఉండ‌డం చాలా అవ‌స‌రం. అప్పుడే ప‌రిస్థితుల‌ను బ‌ట్టి మిమ్మల్ని మీరు మార్చుకోగ‌ల‌రు.


కర్కాటకం (Cancer) - మీరు ఇప్పుడు ఉన్న గంద‌ర‌గోళ ప‌రిస్థితుల‌కు కార‌ణం ఏంటో తెలియ‌క ఎంత‌గానో స‌త‌మ‌త‌మైపోతున్నారు. అయితే దాని నుంచి బ‌య‌ట‌ప‌డ‌డానికి ఏం చేయాలో ముందు ఆలోచించండి.


సింహం (Leo) - మీరు సాధించాల‌ని అనుకుంటున్న ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు ఉన్న అవ‌కాశాన్ని వినియోగించుకోండి. అదృష్టం మీ వైపు ఉంది. ప్రయత్నలోపం లేకుండా మీ పూర్తి శ‌క్తి, సామ‌ర్థ్యాలతో ఒక‌సారి ట్రై చేయండి.


కన్య (Virgo) - మీ మ‌న‌సు చెప్పిన మాట విని మీరు ఇత‌రుల‌కు స‌హాయం చేస్తున్నారు. ఇది చాలా మంచిది. మీ కుటుంబ స‌భ్యులు/ స్నేహితులు లేదా మీ స‌హాయం కోరి వ‌చ్చే వారు ఒక‌రు ఒక క్రియేటివ్ బిజినెస్ ఐడియాతో మీ వ‌ద్దకు రావ‌చ్చు. జాగ్రత్తగా గ‌మ‌నించండి.


తుల (Libra) - మీరు ఏం చేస్తున్నారో ఒక‌రు ఒక కంట జాగ్రత్తగా గ‌మ‌నిస్తున్నారు. కాబ‌ట్టి జాగ్రత్తగా ఉండండి. అన్ని విష‌యాల గురించి బ‌హిరంగంగా చ‌ర్చించ‌కండి. ఇబ్బందుల్లో ప‌డిన‌ప్పుడు మీ మ‌న‌సు మాట వినండి.


వృశ్చికం (Scorpio) - మీకు ఎలాంటి ప‌నులు చేస్తే న‌చ్చుతుందో మీరు చేయ‌డం ద్వారా ఇత‌రుల‌కు తెలియ‌జేసే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీ ప‌ట్ల మీరు కాస్త శ్రద్ధ చూపండి.


ధనుస్సు (Saggitarius) - మీరు కోరుకున్న గుర్తింపు మీకు ల‌భించే స‌మ‌యం ఇది. మిమ్మల్ని మీరు అన్వేషిస్తూ, ప‌నిలో మీ బెస్ట్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేయండి. దాని ద్వారా గుర్తింపు మాత్రమే కాదు.. మీరు ప్రేమించేవారు కూడా బాగా ఇంప్రెస్ అవుతారు.


మకరం (Capricorn) - మీ వ్యక్తిగత, వృత్తిప‌ర‌మైన జీవితాలను బ్యాల‌న్స్ చేసుకోవ‌డంలో మీరు మ‌రింత క‌ష్టపడాల్సి ఉంటుంది. ఇది సాధించ‌డం చాలా ముఖ్యం. లేదంటే ఇబ్బందులు త‌ప్పవు. కాబ‌ట్టి కాస్త స‌మ‌యం తీసుకుని దీని గురించి ఆలోచించండి.


కుంభం (Aquarius) - మీ ఆర్థిక స‌మ‌స్యలు క్రమంగా స‌ర్దుకుంటాయి. వాటి కోసం ఆందోళ‌న‌ప‌డుతూ మీ ఆరోగ్యం పాడుచేసుకోవ‌ద్దు. మీ ప‌ట్ల మీరు శ్రద్ధ వ‌హించడం చాలా ముఖ్యం.


మీనం (Pisces) - మీకు ఇప్పుడున్న అవ‌కాశాలు, వాటిని అందుకోవ‌డంలో ఉన్న సాధ్యాసాధ్యాలు ఏంటో ఒక్క‌సారి ఆలోచించండి. అలాగే మిమ్మల్ని ప్రేమించేవారు, మీరు దూరం పెట్టాల్సిన వ్యక్తులు ఎవ‌రో చూసుకోండి. వీటి గురించి ఆలోచించేందుకు కాస్త స‌మ‌యం తీసుకోండి.                                                                                                  


ఇవి కూడా చదవండి


మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!


లక్ష్యం చేరుకొనే ప్రయాణంలో మనం నేర్చుకొనే విషయాలివే..


యోగా గురించి ఈ అపోహ‌లు మీకూ ఉన్నాయా?