పెళ్లి తర్వాత జీవితాన్ని ఆనందంగా కొనసాగించేందుకు శృంగారం (Sex) ఎంతో అవసరం. శృంగారం అనేది ఒక జంట (couple) ఆనందంగా జీవించేందుకు ఎంతో ఆవశ్యకం. అయితే మొదటిసారి శృంగారంలో పాల్గొనే ముందు చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలకు సెక్స్ గురించి ఎన్నో అనుమానాలుంటాయి.
సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏవైనా ఇబ్బందులుంటాయా? శృంగారంలో పాల్గొన్న వెంటనే గర్భం వస్తుందా? వంటివే కాదు.. సెక్స్ గురించి ఎన్నో సందేహాలు మన బుర్రల్ని తొలిచేస్తూ ఉంటాయి. మరి, ఇప్పటివరకూ మీరు శృంగారంలో పాల్గొని ఉండకపోతే.. మొదటిసారి సెక్స్‌లో పాల్గొనడం గురించి మీ మనసులో ఉన్న సందేహాలకు సమాధానాలేంటో తెలుసుకుందాం రండి..
1. సెక్స్ తర్వాత తప్పకుండా రక్తస్రావం జరుగుతుందా?
సాధారణంగా ఎక్కువశాతం మహిళలకు మొదటిసారి సెక్స్‌లో పాల్గొన్న తర్వాత రక్తస్రావం జరుగుతుంది. కానీ అలా రక్తస్రావం జరగకపోతే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. చాలామంది అనుకుంటున్నట్లు మొదటిసారి కలిసినప్పుడు హైమెన్ తెగిపోవడం అనేది నిజం కాదు. ఇది కేవలం కాస్త వెడల్పుగా మారుతుంది.
ఇది సెక్స్ కంటే ముందే వెడల్పుగా మారే అవకాశం ఉంటుంది. దీనికి ఆటలాడడం, గుర్రపు స్వారీ వంటివి కారణమవుతాయి. ఇలాంటివి చేసినప్పుడు మీ హైమెన్ ముందుగానే వెడల్పుగా ఉంటుంది కాబట్టి మొదటిసారి సెక్స్‌లో పాల్గొన్నప్పుడు మళ్లీ వదులు అవ్వకపోవచ్చు. రక్తస్రావం జరగడం, జరగకపోవడం.. రెండూ సాధారణ విషయాలే.. ఈ రెండింటికీ మీరు భయపడాల్సిన అవసరం లేదు.
2. సెక్స్ ఎంతసేపు జరుగుతుంది?
సాధారణంగా సెక్స్ ఎంతసేపు కొనసాగించాలన్న విషయంలో చాలామందికి పెద్దగా అవగాహన ఉండదు. అయితే ఇది మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. మీకు సెక్స్‌లో పాల్గొనడం వల్ల చాలా నొప్పిగా అనిపించి తట్టుకోలేనంత బాధతో కన్నీళ్లు వస్తుంటే మీరు వెంటనే దాన్ని ఆపి కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అర్థం.
అలా కాకుండా మీరూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు అనిపిస్తే సెక్స్ ఇంత సమయం మాత్రమే చేయాలన్న నియమమేమీ లేదు. ఎంతసేపైనా పాల్గొనవచ్చు. అయితే మీకు నొప్పిగా అనిపిస్తున్నా.. మీ భాగస్వామి కోరుకున్నాడు కదా అని ఆ నొప్పిని భరిస్తూ సెక్స్‌ని కొనసాగించాల్సిన అవసరం అయితే లేదు.
3. మొదటిసారి సెక్స్ నొప్పిగా అనిపిస్తుందా?
సాధారణంగా మొదటిసారి సెక్స్‌లో పాల్గొంటే కాస్త నొప్పి ఉండడం సహజం. అయితే సెక్స్‌కి ముందు ఫోర్‌ప్లే చేయడం వల్ల ఈ నొప్పిని చాలా వరకు తగ్గించవచ్చు. దీనికోసం భాగస్వామిని హత్తుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, మత్తెక్కించేలా మాట్లాడుకుంటూ ఒకరినొకరు మూడ్‌లోకి తీసుకురావడం వంటివి చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. పూర్తిగా మూడ్‌లోకి వచ్చి యోనిలో ద్రవాలు వచ్చిన తర్వాత సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఆ ప్రాంతంలోని కండరాలు వదులవుతాయి కాబట్టి నొప్పి చాలా తక్కువగా ఉంటుంది.
4. కండోమ్ తప్పనిసరా?
చాలామంది కండోమ్ ఉపయోగిస్తే సెక్స్‌లో ఆనందం ఉండదు అని వాటికి దూరంగా ఉంటారు. చాలామంది సెక్స్‌లో పాల్గొనేటప్పుడు పుల్లింగ్ అవుట్ (స్కలనం సమయానికి బయటకు తీసేయడం) పద్ధతిని పాటించి గర్భం రాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే కండోమ్‌కి దూరంగా ఉంటారు. కానీ కండోమ్ కంటే సురక్షితమైన పద్ధతి మరొకటి ఉండదు. అంతేకాదు.. సెక్స్‌లో పాల్గొనే ముందు ఇద్దరూ ఎస్‌టీడీ (సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్) ఏమైనా ఉన్నాయేమో అని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.
5. రుతుస్రావం సమయంలో సెక్స్‌లో పాల్గొనవచ్చా?
చాలామంది రుతుస్రావం జరిగే సమయాన్ని సేఫ్ పిరియడ్‌గా భావిస్తుంటారు. ఈ సమయంలో సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. గర్భం వచ్చే అవకాశం ఉండదు అని అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. ఈ సమయంలో సెక్స్‌లో పాల్గొనడం వల్ల గర్భం వచ్చే అవకాశాలు కొంతమేరకు ఉంటాయి. కొంతమంది వైద్యులు ఈ సమయంలో సెక్స్‌లో పాల్గొనకపోవడం మంచిదని సలహా ఇస్తుంటారు. ఈ సమయంలో మన శరీరం చాలా మార్పులకు లోనవుతూ ఉంటుంది. అందుకే ఈ సమయంలో దూరంగా ఉండడం మంచిది. మరీ అంతగా కలవాలనుకుంటే మూడు రోజులు పూర్తయ్యాక కలవడం మంచిది.
6. ఒకసారి సెక్స్‌లో పాల్గొంటేనే గర్భం వచ్చేస్తుందా?
చాలామంది ఒక్కసారి సెక్స్‌లో పాల్గొనగానే గర్భం ఏం వచ్చేయదులే.. అంటూ ఎలాంటి సురక్షితమైన పద్ధతులను పాటించకుండా శృంగారంలో పాల్గొంటారు.కానీ ఒకసారి సెక్స్‌లో పాల్గొన్నా.. పుల్లింగ్ అవుట్ పద్ధతిని పాటించినా కండోమ్ ఉపయోగించకపోతే గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి.
7. మహిళలకు మూడ్ రావాలంటే ఏం చేయాలి?
మహిళలకు సంబంధించి సెక్స్, ఫీలింగ్స్ వంటివి అన్ని కలిసిపోయి ఉంటాయి. అందుకే మొదటిసారి సెక్స్‌లో మీకు కాస్త మూడ్ వచ్చినా మీరు లక్కీ అనుకోవాలి. సాధారణంగా చాలామందికి సెక్స్‌లో పాల్గొనే సమయంలో ఉండే భయాలు, అపోహలు, సిగ్గు వంటివాటి వల్ల వారికి మొదటిసారి మూడ్ రావడం కష్టంగా మారుతుంది. సినిమాల్లో మొదటిసారి సెక్స్‌లో పాల్గొనగానే ఎంతో ఎంజాయ్ చేసినట్లుగా కనిపిస్తుంది కానీ ఇదంతా నిజం కాదు. ప్రాక్టీస్ చేస్తేనే మూడ్ రావడం, ఆనందంగా సెక్స్‌లో పాల్గొనడం ఎక్కువవుతుంది.
8. సైజ్‌కి అంత ప్రాముఖ్యత ఉంటుందా?
ఇది మీ ఫీలింగ్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఎలాగైతే వక్షోజాల సైజ్ విషయంలో అబ్బాయిలందరికీ ఒకే ఫీలింగ్ ఉండదో.. పురుషాంగం సైజ్ విషయంలో అమ్మాయిలందరి ఆలోచన ఒకలా ఉండదు. అయితే నిజం చెప్పాలంటే పురుషాంగం మరీ పెద్దగా ఉంటే మొదటిసారి సెక్స్ చాలా నొప్పిగా ఉంటుందనేది మాత్రం నిజం.
9. అన్నింటికంటే ఉత్తమమైన సెక్స్ పొజిషన్ ఏది?
సాధారణంగా సెక్స్‌లో పాల్గొనేటప్పుడు ఎన్నో పొజిషన్లు ప్రయత్నించవచ్చు. కానీ మొదటిసారి సెక్స్‌లో పాల్గొనేటప్పుడు వీలైనంత సౌకర్యంగా, తక్కువ నొప్పిని కలిగించే పొజిషన్ ని ఎంచుకోవడం మంచిది. దీనికోసం మిషనరీ పొజిషన్ (అమ్మాయిపై అబ్బాయి ఉండే పొజిషన్) అయితే సౌకర్యంగా ఉంటుంది. మొదటిసారే ప్రయోగాల జోలికి వెళ్లకుండా బేసిక్స్ నుంచి ప్రారంభించడం మంచిది కదా.. ఇది ఇద్దరికీ సౌకర్యంగా ఉంటూ, సుఖాన్ని అందిస్తుంది కూడా..
ఇవి కూడా చదవండి.
ముద్దులోనూ ఎన్నో రకాలున్నాయి.. వాటి అర్థాలేంటో మీకు తెలుసా?
ఈ తొలి వార్షికోత్సవ రొమాన్స్ ముచ్చట్లు.. ఆలుమగలకు ప్రత్యేకం..!
ఈ ట్రావెల్ రొమాన్స్ స్టోరీలు.. ప్రేమికులకు, ఆలుమగలకు ప్రత్యేకం..!