సైనా నెహ్వాల్ పాత్ర పోషించేది శ్ర‌ద్ధాక‌పూర్ కాదు.. ప‌రిణీతి చోప్రా..!

సైనా నెహ్వాల్ పాత్ర పోషించేది శ్ర‌ద్ధాక‌పూర్ కాదు.. ప‌రిణీతి చోప్రా..!

సైనా నెహ్వాల్ (Saina Nehwal).. బ్యాడ్మింట‌న్ క్రీడలో మ‌న దేశానికి తొలి ఒలింపిక్ ప‌త‌కాన్ని అందించిన క్రీడాకారిణి. ప్ర‌స్తుతం న‌డుస్తోన్న బ‌యోపిక్ ల ప‌ర్వంలో సైనా జీవిత క‌థ ఆధారంగా రూపొంద‌నున్న చిత్రం కూడా ఒక భాగ‌మ‌ని, అందులో సైనా పాత్ర‌లో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాక‌పూర్ న‌టించ‌నుంద‌ని ఎప్ప‌ట్నుంచో వార్త‌లు వినిపించ‌డం మ‌న‌కు తెలిసిందే. గ‌తేడాది షూటింగ్ కూడా ప్రారంభించిన శ్ర‌ద్ధ ఆ త‌ర్వాత అనారోగ్యం బారిన ప‌డ‌డం, వైద్యులు ఆమె డెంగీ బారిన ప‌డిన‌ట్లు ధృవీక‌రించ‌డంతో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌కు బ్రేక్ ప‌డింది. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించి ఒక తాజా వార్త వెలువ‌డింది. అది మొత్తం సినీ అభిమానులంద‌రినీ కాస్త షాక్ కు గురి చేసింద‌నే చెప్పాలి. ఇంత‌కీ ఆ వార్త ఏంటంటే..


బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధాక‌పూర్ సైనా నెహ్వాల్ బయోపిక్ నుంచి త‌ప్పుకుంద‌ట‌! అంతేకాదు.. ఆమె స్థానంలో ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ప‌రిణీతి చోప్రాను తీసుకున్న‌ట్లు కూడా సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా స్ప‌ష్ట‌త ఇచ్చారు. ఇంత‌కీ శ్రద్ధా ఎందుకు ఈ చిత్రాన్ని వ‌దులుకున్న‌ట్లు అని ఆలోచిస్తున్నారా?? శ్ర‌ద్ధ ప్ర‌స్తుతం సైనా నెహ్వాల్ బ‌యోపిక్ తో పాటు మ‌రో మూడు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. డార్లింగ్ ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టిస్తోన్న సాహో కాకుండా బాలీవుడ్ లో వ‌రుణ్ ధావ‌న్ స‌ర‌స‌న స్ట్రీట్ డ్యాన్స‌ర్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో క‌లిసి చిచోరే చిత్రాల్లో న‌టిస్తోంది. సైనా బ‌యోపిక్ ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఈ చిత్రం షూటింగ్ ని మార్చి నెల‌ఖారున మొద‌లుపెట్టి ఈ ఏడాది చివ‌రిక‌ల్లా పూర్తి చేసి వ‌చ్చే ఏడాది ప్రారంభంలో సినిమాను విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కానీ ఇప్ప‌టికే మూడు సినిమాల‌తో బిజీగా ఉన్న శ్ర‌ద్ధ‌కు ఈ చిత్రం షూటింగ్ కోసం డేట్స్ స‌ర్దుబాటు చేయ‌డం కుద‌ర్లేదు. దాంతో చిత్రబృందంతో జ‌రిపిన చ‌ర్చ‌ల్లో ప‌ర‌స్ప‌ర ఒప్పందం మేర‌కు ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుంది శ్ర‌ద్ధ‌.
 

 

 


View this post on Instagram


#SAINA


A post shared by Shraddha (@shraddhakapoor) on
అయితే సైనా బ‌యోపిక్ కోసం శ్ర‌ద్ధ ప్ర‌త్యేకించి పుల్లెల గోపీచంద్ వ‌ద్ద బ్యాడ్మింట‌న్ కోచింగ్ కూడా తీసుకుంది. సైనా కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసి, వారితోనూ స‌మయం గ‌డిపింది. అంతేనా.. గ‌తేడాది సైనా లుక్ లో ఉన్న శ్ర‌ద్ధ ఫ‌స్ట్ లుక్ ని సైతం విడుద‌ల చేసిందీ చిత్ర‌బృందం. సైనా లుక్ లో శ్ర‌ద్ధను చూసి ఇద్ద‌రూ చాలా ద‌గ్గ‌ర పోలిక‌ల‌తో ఉన్నారు.. ఈ పాత్ర‌కు శ్ర‌ద్ధ స‌రైన ఎంపిక‌.. అంటూ సినిమాపై ఉన్న అంచనాల‌ను అమాంతం పెంచేశారు. కానీ ఇప్పుడు అనుకోని ప‌రిస్థితుల్లో ఇలా క‌థానాయికను మార్చాల్సి రావ‌డంతో అంతా కాస్త షాక్ కు గురయ్యారు. అయితే ఈ అవ‌కాశాన్ని అందిపుచ్చుకున్న ప‌రిణీతి చోప్రా మాత్రం చాలా సంతోషంగా ఉంది. దీని గురించి మాట్లాడుతూ- వ్య‌క్తిగ‌తంగా నాకు క్రీడ‌లంటే చాలా ఇష్టం ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కు క్రీడానేప‌థ్యం ఉన్న చిత్రాల్లో న‌టించే అవ‌కాశం మాత్రం రాలేదు. ఇప్పుడు ఆ అవ‌కాశం సైనా నెహ్వాల్ బ‌యోపిక్ రూపంలో వ‌చ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పాత్ర కోసం ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ కూడా తీసుకోవాల‌ని అనుకుంటున్నా.. త్వ‌ర‌లోనే నా ట్రైనింగ్ ను ప్రారంభించాల‌ని అనుకుంటున్నా.. అంటూ త‌న సంతోషాన్ని పంచుకుంది ప‌రిణీతి. ప్ర‌స్తుతం ఆమె అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న న‌టించిన కేస‌రి సినిమా త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.శ్ర‌ద్ధ స్థానంలో ప‌రిణీతిని తీసుకున్న‌ట్లుగా చిత్ర నిర్మాత భూష‌ణ్ కుమార్ కొద్దిసేప‌టి క్రిత‌మే సామాజిక మాధ్య‌మం వేదిక‌గా స్ప‌ష్ట‌త ఇచ్చారు. అనుకోని ప‌రిస్థితుల్లో శ్ర‌ద్ధ‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన తర్వాతే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలుపుతూ; అనుకున్న విధంగానే 2020 ప్రారంభంలో ఈ సినిమాను విడుద‌ల చేస్తామ‌ని మీడియాకు వివ‌రించారు.


టీ-సిరీస్ సంస్థ నిర్మాణ సార‌ధ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అమోల్ గుప్తె ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అంద‌రూ పెట్టుకున్న అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే ఈ చిత్రం భారీ విజ‌యం సాధించి సైనా పేరును, తద్వారా భార‌తీయ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ ఖ్యాతిని మ‌రింత పెంచేలా ఉండాల‌ని ఆశిద్దాం..!


ఇవి కూడా చ‌ద‌వండి


#RRR సినిమా గురించి.. ఎస్ ఎస్ రాజమౌళి చెప్పిన టాప్ 10 ఆసక్తికర పాయింట్స్..!


నా 14 ఏళ్ల సినీ ప్ర‌స్థానం.. ఒక‌ అంద‌మైన క‌ల‌: అనుష్క శెట్టితమిళ స్టార్ విజయ్ తెర పైనే కాదు.. నిజ జీవితంలో కూడా ఆయన ఫ్యాన్స్‌కి హీరోనే!