ADVERTISEMENT
home / Budget Trips
ఈ సమ్మర్ అడ్వెంచర్ డెస్టినేషన్స్.. మీకోసం ఎదురుచూస్తున్నాయి..

ఈ సమ్మర్ అడ్వెంచర్ డెస్టినేషన్స్.. మీకోసం ఎదురుచూస్తున్నాయి..

వేసవి కాలం వచ్చేసింది..! అప్పుడే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇంకా కొన్ని రోజులు ఆగితే ఎండలు మండిపోతుంటాయి. అందుకే వేసవిలో కాస్త సేదతీరడానికి చాలామంది చల్లని ప్రదేశాలకు టూర్లకు వెళుతుంటారు. మీరు కూడా summer trip ప్లానింగ్ లో ఉన్నారా? అయితే ఈ సారి కాస్త ఎడ్వెంచరస్ ట్రిప్ ప్లాన్ చేసుకోండి. దీని కోసం ఏం చేయాలనుకొంటున్నారా? మా సమ్మర్ ట్రావెల్ బకెట్ లిస్ట్ ఓ సారి చూడండి. ఇది మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది.

దీనిలో కొన్ని రకాల అడ్వెంచర్ గేమ్స్(adventure games) ఆధారంగా.. కొన్ని ప్రదేశాలను ఎంచుకొన్నాం. అక్కడికి వెళితే కచ్చితంగా మీరు వావ్ గ్రేట్ ట్రిప్ అని అనుకొంటారు. అవేంటో తెలుసుకోవాలని ఎక్సైటింగ్ గా ఉంది కదా..! ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయానికొచ్చేద్దాం.

ఇటీవలి కాలంలో మన దేశంలో పర్యటక ప్రదేశాలకు టూరిస్ట్ లను ఆకర్షించడానికి కొన్ని సాహసక్రీడలను పరిచయం చేస్తున్నారు. వాటిని పూర్తి చేయడానికి కాస్త భయంగానే ఉన్నా.. థ్రిల్లింగ్ గా ఉండటంతో ఎక్కువ మంది వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఎప్పుడూ సినిమాల్లో చూసి ఆనందించే వాటిని రియల్ లైఫ్ లో అనుభవంలోకి తెచ్చుకొంటున్నారు. అలాంటి కొన్ని టూరిస్ట్ స్పాట్ లను చూద్దాం. జంటగా వెళ్లేవారు దీన్ని ఎడ్వెంచర్ ట్రిప్ గా మాత్రమే చూడకుండా మీ భాగస్వామితో రొమాంటిక్ గా హనీమూన్ జరిపేసుకోండి. స్నేహితులతో కలసి వెళ్లేవారు.. అతికి పోకుండా.. ఎంత సేఫ్ గా వెళుతున్నారో.. అంతే సురక్షితంగా ఇంటికి తిరిగి రండి.

స్కూబా డైవింగ్

ADVERTISEMENT

adventure-summer-scubadiving

Image: Andaman Tourism Facebook

సముద్ర అంతర్భాగంలో చేపలతో కలసి విహరిస్తూ.. పగడపు దీవుల సోయగాలను చూడాలంటే స్కూబా డైవింగ్ చేయాల్సిందే. ఈ స్కూబా డైవింగ్ చేయడానికి మన దేశంలోనే ఉన్న బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఏంటో తెలుసా? ఇంకేంటి.. అండమాన్ నికోబార్ దీవులు. ఇక్కడ ఉన్న ఆకర్షణీయమైన బీచ్ లు, అందమైన రిసార్ట్ లు, రుచికరమైన ఆహారం, ఇంతకు మించి ఏం కావాలి? మీ సమ్మర్ హనీమూన్ కి..! మరి, ఇక్కడికి షిప్ పై చేరుకొంటే ఇంకా బాగుంటుంది కదా.. చెన్నై నుంచి నెలకు రెండు సార్లు, విశాఖపట్నం నుంచి నెలకోసారి అండమాన్ కు నౌక వెళుతుంటుంది.

స్కూబా డైవింగ్ కి లక్షద్వీపాలు సైతం అనుకూలంగానే ఉంటాయి. అరేబియా సముధ్రంలోని పగడపు దీవుల అందాలు.. అక్కడి జలచరాల సొగసులు చూడాలంటే రెండు కళ్లూ సరిపోవు. కొచ్చిన్ వరకు విమానం లేదా ట్రైన్ లో చేరుకొని అక్కడి నుంచి ఫెర్రీలో లక్షద్వీపాలకు చేరుకోవచ్చు. లేదా లక్షద్వీప్ లోని అగట్టీ ఎయిర్ పోర్ట్ వరకు విమానంలో చేరుకోవచ్చు.

ADVERTISEMENT

రివర్ రాఫ్టింగ్

summer-adventure-rafting

Image: Pexels

ఇటీవలి కాలంలో.. మన దేశంలో రివర్ రాఫ్టింగ్ బాగా పాపులర్ అవుతోంది. ఉరకలు వేస్తూ సాగే నదిలో రాఫ్ట్ పై సాగించే ఈ సాహస క్రీడ మీకు ఎప్పటికీ మంచి జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ప్రస్తుతం ఈ రివర్ రాఫ్టింగ్ మన దేశంలో చాలా చోట్ల నిర్వహిస్తోన్నప్పటికీ మనాలీలో అయితే చాలా బాగుంటుంది.

ADVERTISEMENT

పైగా వేసవి కాబట్టి కాస్త చల్లగానూ ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ లోని ఈ ప్రాంతాన్ని ది బెస్ట్ హనీమూన్ స్పాట్ గా పిలుస్తారు. ముగ్ధమనోహరమైన పిర్ పంజాల్ పర్వతశ్రేణులు మీ మనసులను గిలిగింతలు పెడుతుంటాయి. ఇక్కడ రివర్ రాఫ్టింగ్ మాత్రమే కాదు.. ఇంకా మిమ్మల్ని ఆకట్టుకొనే ఎన్నో అడ్వెంచరస్ గేమ్స్ ఉంటాయి. అన్ని ప్రధాన నగరాల నుంచి కులు-మనాలీకి విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

హైకింగ్, ట్రెక్కింగ్

adventure-summer-trip-trek

Photo: Pexels

ADVERTISEMENT

హైకింగ్, ట్రెక్కింగ్ చేయాలంటే.. కూర్గ్ వెళ్లాల్సిందే. పచ్చదనం పరుచుకొన్న పశ్చిమకనుమల్లో కొండలెక్కతూ.. మధ్య మధ్యలో ఎదురయ్యే అందమైన పక్షులను పలకరిస్తూ.. ముందుకు సాగిపోతుంటే.. కలిగే ఆనందానికి వెల కట్టగలమా? పచ్చటి కొండలపైకి దారి తీసే సన్నని మార్గంలో సాగే ఈ సాహస ప్రయాణం అనుభవంలోకి వస్తే గానీ దాని మజా మనకు తెలీదు.

దీనికి తోడు అక్కడి కాఫీ తోటలు, వైల్డ్ లైఫ్ నేషనల్ పార్క్ చూసి తీరాల్సిందే. అక్కడి ఆహారం రుచి చూడాల్సిందే. మెట్టుపాళ్యం వరకు ట్రెయిన్లో చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కూర్గ్ చేరుకోవచ్చు. కోయంబత్తూర్, మంగుళూర్ ఎయిర్ పోర్ట్ లకు అన్ని ప్రధాన నగరాల నుంచి విమాన సర్వీసులుంటాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కూర్గ్ చేరుకోవచ్చు.

క్లిఫ్ జంపింగ్

adventure-summer-rishikesh

ADVERTISEMENT

Image: Uttarakhand Tourism Facebook

రిషికేష్ అంటే ఆధ్యాత్మిక ప్రాంతంగానే మనకు తెలుసు. చుట్టూ పచ్చటి కొండలు.. వాటి మధ్య గలగలా పారే గంగానది.. ముగ్ధమనోహరమైన ప్ర‌కృతి.. కొత్తగా పెళ్లయిన జంటకు ఇంతకు మించిన హనీమూన్ స్పాట్ ఉంటుందా? ఇక్కడ స్పెషాలిటీ ఏంటో తెలుసా? క్లిఫ్ జంపింగ్. వినడానికి సింపుల్ గానే ఉన్నప్పటికీ చాలా కష్టమైన సాహసమిది.

ఎత్తైన ప్రదేశం నుంచి నీటిలోకి దూకడమే క్లిఫ్ జంపింగ్. రిషికేశ్ లో క్లిఫ్ జంపింగ్ చాలా ఫేమస్. దీనితో పాటుగా బంగీ జంపింగ్, రివర్ రాఫ్టింగ్ కూడా ఇక్కడ చేయచ్చు. డెహ్రాడూన్ వరకు ఫ్లైట్ లో, హరిద్వార్ వరకు ట్రైన్లో చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రిషికేష్ చేరుకోవచ్చు.

జంగిల్ సఫారీ

ADVERTISEMENT

adventure-summer-kali-tiger-reserve

Image: Karnataka Tourism Facebook

జంగిల్ సఫారీ చేస్తూ.. పులులు, జింకలు, లేడి వంటి వన్యమృగాలను దగ్గర నుండి చూస్తే కలిగే సంతోషమే వేరు. మరి దాన్ని మీ జీవితంలో అనుభవంలోకి తెచ్చుకోవాలనుకొంటున్నారా? అయితే కర్ణాటకలోని కాళి టైగర్ రిజర్వ్ కు వెళ్లాల్సిందే. ఇక్కడ టైగర్ రిజర్వ్ లో బ్లాక్ పాంథర్స్ ప్రత్యేక ఆకర్షణ. అలాగే అస్సాంలోని హోల్లంగపర్ గిబ్బన్ సాంక్చుయరీ (Hoollongapar Gibbon Sanctuary) కూడా వేసవిలో సందర్శించడానికి అనువుగా ఉంటుంది.

కేవలం 20 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న ఈ అభయారణ్యంలో హూలాక్ గిబ్బన్స్ ఉంటాయి. భారతదేశం మొత్తంలో ఇవి ఇక్కడ మాత్రమే ఉంటాయి. అలాగే మహారాష్ట్రలోని తాడోబా అంధేరీ టైగర్ రిజర్వ్(Tadoba Andhari Tiger Reserve) కూడా ఈ వేసవిలో సందర్శించడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ పులులు, చిరుత పులులు, స్లాత్ బేర్స్ వంటి వాటిని చూడొచ్చు.

ADVERTISEMENT

Feature Image: Pexels

ఇవి కూడా చ‌ద‌వండి

భార్యాభ‌ర్త‌ల బంధం ఎలా ఉండాలో ఈ అక్కినేని జంటను చూసి నేర్చుకోవాల్సిందే..

ఈ న్యాయవాది.. మనదేశంలోనే కులం, మతం లేని మొదటి వ్యక్తి

ADVERTISEMENT

కూతురిపై ప్రేమ‌తో.. అమ్మ ఎక్కువ‌గా అడిగే ప్ర‌శ్న‌లు, ఇచ్చే సూచ‌న‌లు ఇవే..!

21 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT