అమ్మాయిలూ.. వీటి గురించి అస‌లు బాధ‌ ప‌డాల్సిన అవ‌స‌ర‌మే లేదు..!

అమ్మాయిలూ.. వీటి గురించి అస‌లు బాధ‌ ప‌డాల్సిన అవ‌స‌ర‌మే లేదు..!

సాధార‌ణంగా అమ్మాయిలు(Girls) చిన్న చిన్న విష‌యాల‌కే బాధ‌ప‌డిపోతుంటారు. "ఇలా మాట్లాడితే.. లేదా ఇలా చేస్తే.. ఎవ‌రైనా ఏమ‌న్నా అనుకుంటారేమోన‌ని ఇబ్బంది ప‌డ‌డం మ‌నం చాలాసార్లు ఎదుర్కొన్న‌దే".. అయితే మ‌న శ‌రీరం గురించి కానీ.. మ‌న చుట్టూ ఉన్న‌వాళ్ల గురించి కానీ.. లేదా మ‌నం మాట్లాడే మాట‌లు, చేసే ప‌నులు.. ఇలా దేని గురించైనా స‌రే.. ఇబ్బంది కానీ బాధ కానీ ప‌డాల్సిన (feel bad) అవ‌స‌రం ఏ మాత్రం లేదు. మ‌రి, ఎక్కువ మంది అమ్మాయిలు ఏ విష‌యంలో ఇబ్బంది ప‌డ‌తారో.. దాని గురించి అస‌లు అంత‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం ఎందుకు లేదో తెలుసుకుందాం రండి..


kissing


1. శృంగారంలో మొద‌టి అడుగు మీరే వేయ‌డం..


చాలామంది కేవ‌లం త‌మ భ‌ర్త‌లు మాత్ర‌మే మొద‌ట శృంగారం కోసం ప్ర‌య‌త్నించాల‌ని.. అప్పుడు తాము ఒప్పుకోవాల‌ని భావిస్తారు. తాము ముందు మొద‌టి అడుగు వేస్తే.. త‌న వ్య‌క్తిత్వం గురించి త‌ప్పుగా అనుకుంటారేమో అని ఇబ్బంది ప‌డ‌తారు. కానీ మ‌గ‌వాళ్ల‌లాగా మ‌న‌కీ హార్మోన్లు ఉన్నాయి. మ‌న‌కీ ఫీలింగ్స్ ఉంటాయి. బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం కానీ ఇబ్బందిప‌డాల్సిన విష‌యం కానీ ఇందులో ఏమీ లేదు.


2-things-no-girl-should-feel-bad-about


2. నో చెప్ప‌డం..


మీరు మీ ప‌నంతా పూర్తిచేసుకొని ఇంటికి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతూ ఉండ‌గా మీ కొలీగ్ "కాస్త ఈ ప‌ని చేసి పెట్ట‌వా.. నాకు చాలా ప‌ని ఉంది" అంటూ అడ‌గ‌గానే.. ఇంట్లో అర్జంట్ ప‌ని ఉన్నా.. ఒప్పుకోక‌పోతే అవ‌త‌లి వ్య‌క్తి ఏమ‌నుకుంటారో అని ఇబ్బందిప‌డుతూ ఒప్పుకుంటారు. త‌న ప‌నిని మీకు అప్ప‌గించిన కొలీగ్ మాత్రం కాసేప‌ట్లో ఇంటికి వెళ్లిపోతే.. మీరు త‌న ప‌నిని మీ భుజాల‌పై వేసుకొని రాత్రి వ‌ర‌కూ ప‌నిచేస్తూ ఉండిపోతారు. అందుకే కేవ‌లం ప‌ని విష‌యంలోనే కాదు.. మీకు న‌చ్చ‌ని విష‌యం ఏదైనా స‌రే.. దానికి ఖ‌రాఖండీగా నో చెప్పేయండి. అవ‌త‌లివారు ఏమ‌నుకుంటారో.. భ‌విష్య‌త్తులో మీకు ఏదైనా ఇబ్బంది ఎదుర‌వుతుందేమో.. అంటూ ఇలా కార‌ణాలు చెప్పుకొని మీకు న‌చ్చ‌ని ప‌ని చేయ‌కండి. కొన్నిసార్లు ఎదుటివాళ్లు మీరు మంచివాళ్లు కాద‌నుకున్నా త‌ప్పులేదు.


crying


3. బ్రేక‌ప్ త‌ర్వాత ఏడ‌వ‌డం, మ‌ర్చిపోవ‌డానికి కాస్త స‌మ‌యం తీసుకోవ‌డం..


ప్ర‌తిఒక్క‌రి జీవితంలో ఎత్తుప‌ల్లాలుంటాయి. మీ బంధం అద్భుత‌మైన‌ది అనుకున్న కొన్ని రోజుల‌కే వివిధ కార‌ణాల వ‌ల్ల ఇద్ద‌రూ విడిపోవాల్సి రావ‌చ్చు. దీంతో మ‌న‌సుకు బాధ‌నిపించ‌డం స‌హ‌జ‌మే. ఇలాంటి సంద‌ర్భాల్లో ఏడిస్తే మ‌నం బ‌ల‌హీనుల‌మ‌ని ఎదుటివారు ఎక్క‌డ అనుకుంటారో అని ఇబ్బందిప‌డితే న‌ష్టం మ‌న‌కే. కాబ‌ట్టి మీలోని బాధ‌ను క‌న్నీళ్ల రూపంలో బ‌య‌ట‌కు పంపించేయండి. మ‌ర్చిపోవ‌డానికి మీకంటూ కాస్త స‌మ‌యాన్ని ఇచ్చుకోండి. త్వ‌ర‌గా మ‌ర్చిపోలేక‌పోతుంటే మీరు బ‌ల‌హీనుల‌ని భావించొద్దు. మీరు అవ‌త‌లి వ్య‌క్తిని అంత బ‌లంగా ప్రేమించారు కాబ‌ట్టి మ‌ర్చిపోవ‌డానికి కాస్త స‌మ‌యం ప‌డుతుంద‌ని భావించి జీవితంలో ముందుకెళ్లండి.


4-things-no-girl-should-feel-bad-about


4. తాగి మాజీ ప్రియుడికి లేదా భ‌ర్త‌కి ఫోన్ చేయ‌డం..


చాలాసార్లు బ్రేక‌ప్‌ని త‌ట్టుకోవ‌డానికి స్నేహితులు మ‌ద్యాన్ని అందిస్తుంటారు. ఇలా మీరు తాగిన సంద‌ర్భంలో అత‌డికి ఫోన్ చేసి తిడితే.. ఆ త‌ర్వాత బాధ‌ప‌డుతూ కూర్చోకండి. ఇవ‌న్నీ మీ మ‌న‌సు ఎప్ప‌టి నుంచో ఫీల‌వుతున్న విష‌యాలు. అవే తాగిన మ‌త్తులో బ‌య‌ట‌కొచ్చేశాయి. కాబ‌ట్టి ఇలాంటి చిన్న చిన్న విష‌యాల గురించి ఆలోచించి మీరు బాధ‌ప‌డ‌కండి.


weight


5. బ‌రువు పెర‌గ‌డం..


కాస్త బ‌రువు పెరిగితే చాలామంది అమ్మాయిలు తెగ బాధ‌ప‌డిపోతుంటారు. అయితే ఆ బ‌రువు మీకు న‌చ్చిన రెస్ట‌రంట్ల‌లో, మీకెంతో ఇష్ట‌మైన వ్య‌క్తుల‌తో క‌లిసి కూర్చొని తిన‌డం వ‌ల్ల పెరిగార‌ని గుర్తుచేసుకోండి. ఆ అంద‌మైన జ్ఞాప‌కాల ముందు ఈ కొద్దిపాటి బ‌రువు ఏపాటిది? అందుకే దీని గురించి బాధ‌ప‌డ‌డం మానండి.


6-things-no-girl-should-feel-bad-about


6. మీకోసం ఎక్కువ ఖ‌ర్చుచేయ‌డం..


చాలామంది కుటుంబం గురించి ఖర్చు చేయ‌డానికి ఏ మాత్రం వెనుకాడరు. కానీ త‌మ‌కోసం ఏదైనా కొనాలంటే మ‌రీ ఎక్కువ ఖ‌ర్చు చేస్తున్నామ‌ని బాధ‌ప‌డుతూ ఉంటారు. అయితే మీరు ఖ‌ర్చు చేసేది మీరు క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బు. దాన్ని మీకోసం ఖ‌ర్చు చేయ‌డంలో ఏమాత్రం త‌ప్పు లేద‌ని గుర్తుంచుకొని బాధ‌ప‌డ‌డం మానేయండి.


job


7. న‌చ్చ‌ని ఉద్యోగంలో కొన‌సాగ‌డం..


చాలామంది చేసే ఉద్యోగం త‌మ‌కు న‌చ్చ‌క‌పోయినా చేయాల్సి వ‌స్తోంది అని బాధ‌ప‌డుతూ ఉంటారు. కానీ చేసే ఉద్యోగం పెద్ద‌గా న‌చ్చ‌క‌పోయినా మ‌నం చేసే ప్ర‌తి ఉద్యోగం మ‌న‌కు ఎన్నో పాఠాల‌ను నేర్పుతుంది. అందుకే ఈ పాఠాల‌ను నేర్చుకుంటూ మీకు న‌చ్చిన ఉద్యోగం కోసం వెతుక్కోవాలే త‌ప్ప‌.. న‌చ్చ‌ని ఉద్యోగంలో ఉన్నామ‌ని బాధ‌ప‌డ‌కూడదు.


dont like


8. అలాంటి ఫ్రెండ్స్‌కి గుడ్‌బై చెప్ప‌డం.


మీ బెస్ట్‌ఫ్రెండ్‌, మీరు కొన్నేళ్ల నుంచి క‌లిసి ఉన్నారు. కానీ మీ ముందు బాగుంటూ మీ వెనుక మీ గురించి త‌ప్పుగా చెబుతోంద‌ని తెలిసిందా? లేక మీ ఇద్ద‌రి మ‌ధ్యా ఏదైనా గొడ‌వ వ‌చ్చి విడిపోయారా? అయితే దీని గురించి త‌ప్పుగా మాట్లాడే వ్య‌క్తితో విడిపోవ‌డం మీకే మంచిది. కొన్ని రోజులు స్నేహితురాలు లేని లోటు తెలుస్తుంది. కానీ త‌న‌ని వ‌దులుకోవ‌డం.. మీ త‌ప్పుకాదు కాబ‌ట్టి బాధ‌ప‌డ‌కండి.


8-things-no-girl-should-feel-bad-about


9. త‌ప్పుగా ట్రీట్ చేసే వాళ్ల‌కు దూరంగా ఉండ‌డం..


మిమ్మ‌ల్ని త‌క్కువ‌గా చూసేవారికి దూరంగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంటుంది. ఇలాంటి సంద‌ర్భంలో వేరే మ‌హిళ‌లు ఉంటే వారికి మీ స‌హ‌కారం అందించ‌డంతో పాటు ఇలాంటి సంద‌ర్భంలో మీరుంటే మీకోసం మీరు నిల‌బ‌డ‌డం ఎంతో అవ‌స‌రం. దీని గురించి మీరేమీ త‌ప్పుగా భావించాల్సిన అవ‌స‌రం లేదు. ఎవ‌రితోనైనా అభిప్రాయాల్లో బేధాలొస్తే మీ నిర్ణ‌యంపై మీరు నిల‌బ‌డ‌డం అవ‌స‌రం. మీరు పెద్ద‌వారు కాబ‌ట్టి మీకు ఏం కావాలో మీకు తెలుసు. కానీ మీ అభిప్రాయ‌భేదాలను గొడ‌వ వ‌ర‌కూ తీసుకురాకుండా ప్ర‌య‌త్నించ‌డం మంచిది.


12-things-no-girl-should-feel-bad-about


10. స‌క్సెస్ సాధించ‌డం..


ఒక మ‌హిళ స‌క్సెస్ సాధిస్తోందంటే కేవ‌లం ప‌ని వ‌ల్లే కాద‌ని.. ఇంకేదో చేస్తోంద‌ని అనే వాళ్లు ఎంతోమంది. కానీ మీరు ఎలాంటి ప‌నులు చేశారో మీకు తెలుసు కాబ‌ట్టి.. వారు అనే మాట‌ల‌ను ప‌ట్టించుకొని బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. మీరు ప‌డే క‌ష్టానికి మీ దారిలో వ‌చ్చే ప్ర‌తి విజ‌యాన్ని మీరు పొందాల్సిందే..!


ఇవి కూడా చ‌ద‌వండి.


డియర్ మమ్మీ... నా మనసు చెప్పే మాటలు వింటావా ప్లీజ్..?


సహజమైన చిత్రకళతో.. అద్భుతాలు సృష్టిస్తున్న "కీర్తి ప్రత్యూష"


బ్రేక‌ప్ త‌ర్వాత.. ఇలాంటి ప్ర‌శ్న‌ల‌తో ఇబ్బందే మ‌రి!