అందంలోనే కాదు.. ఫ్యాష‌న్స్‌లో కూడా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ అదుర్సే..!

అందంలోనే కాదు.. ఫ్యాష‌న్స్‌లో కూడా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ అదుర్సే..!

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ (Anupama Parameshwaran).. ప్రేమ‌మ్‌తో మంచి గుర్తింపు ద‌క్కించుకున్న ఈ అందాల భామ తెలుగులో త్రివిక్రమ్ శ్రీ‌నివాస్ రూపొందించిన అ.. ఆ.. సినిమాతో పరిచ‌య‌మైంది. నాగ‌వ‌ల్లి అనే గ‌డుసు ప‌ల్లెటూరి భామ పాత్ర‌లో అల‌రించిన అనుప‌మ ఆ త‌ర్వాత శ‌త‌మానంభ‌వ‌తి చిత్రంలో నిత్య పాత్రతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌రైపోయింది.


ఇంకేముంది.. అందం, అమాయ‌కత్వం క‌ల‌బోసిన ఈ అందాల బొమ్మ అభిన‌యానికి అంతా ఫిదా అయిపోయారు. అయితే ఈ చిన్న‌ది కేవ‌లం వెండితెరపైనే కాదు.. బ‌య‌ట కూడా సింపుల్‌గా ఉండ‌డానికే ఇష్ట‌ప‌డుతుంది. యాక్సెస‌రీస్ ఎంతో మితంగా ఉప‌యోగిస్తూ తాను ధ‌రించే అవుట్ ఫిట్స్ ద్వారానే ఫ్యాష‌న‌బుల్‌గా, స్టైలిష్‌గా క‌నిపించేందుకు ఇష్ట‌ప‌డుతుంది. మ‌రి, ఈ అమ్మ‌డి స్టైల్ ఫైల్‌లో కొన్ని టాప్ ఫ్యాష‌న్స్‌ని మ‌న‌మూ చూసేద్దామా..
 

 

 


View this post on Instagram


👩🏻‍🦱👩🏻‍🦱👩🏻‍🦱 Clicked by @saj_fotography OUtfit by @agrajain Styled by @lavanyabathina & @venkatesh_93


A post shared by anupamaparameswaran (@anupamaparameswaran96) on
లాంగ్ మిడీస్.. అమ్మాయిలు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే ఎవ‌ర్ గ్రీన్ ఫ్యాష‌న్స్‌లో ఇదీ ఒక‌టి. మారుతున్న ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టుగా టాప్స్ జ‌త చేస్తూ వీటిని ధ‌రిస్తున్నారు నేటిత‌రం అమ్మాయిలు. అనుప‌మ కూడా అదే ఫాలో అయింది. అయితే రెడ్ క‌ల‌ర్ లాంగ్ మిడీకి ప్లెయిన్ బ్లాక్ క‌ల‌ర్ ఫుల్ స్లీవ్స్ ఉన్న టాప్‌ని జ‌త చేసింది. దీనికి మ్యాచింగ్‌గా మెడ‌లో ఒక లాంగ్ చెయిన్ లాంటిది ధ‌రించిన ఆమె సింప్లీ సూప‌ర్బ్ అనేలా ఉంది క‌దూ!

బ్లాక్ అండ్ వైట్ కాంబినేష‌న్ అంటే అంద‌రికీ ఇష్ట‌మే! అయితే అనుప‌మ మాత్రం దీనికి త‌న‌దైన శైలిలో ట‌చ్ ఇచ్చింది. బ్లాక్ అండ్ సిల్వ‌ర్ మిక్స్డ్ బాట‌మ్‌కు తెలుపు రంగు టాప్‌ని జ‌త చేసి చాలా అందంగా క‌నిపిస్తుంది క‌దూ! పైగా చెవుల‌కు మ్యాచింగ్ హ్యాంగింగ్స్, పాదాల‌కు బ్లాక్ క‌ల‌ర్ ఫుట్ వేర్ త‌ప్ప వేరే యాక్సెస‌రీస్ ఏవీ పెట్ట‌క‌పోయినా లుక్ మాత్రం అదిరిపోయింది.


Learn More: Special hair hairstyles for ladies

ఫ్లోర‌ల్ ప్రింటెడ్ అసిమెట్రిక‌ల్ ఫ్రాక్‌లో ఉన్న అనుప‌మ‌ను చూశారా?? అవుట్ ఫిట్‌కు మ్యాచ‌య్యేలా ఫ్లోర‌ల్ నెక్ పీస్ పెట్టుకొని క్యూట్ లుక్‌తో భ‌లేగా ఉంద‌నిపిస్తోంది క‌దూ!
 

 

 


View this post on Instagram


Stardust ✨


A post shared by anupamaparameswaran (@anupamaparameswaran96) on
ఈ రోజుల్లో కాస్త స్పెష‌ల్ అకేష‌న్ అన‌గానే చాలామంది అమ్మాయిలు చూసేది లెహెంగా వైపే! మీరూ అంతేనా?? అయితే ఈసారి రెగ్యుల‌ర్‌కి భిన్నంగా ఉండేలా క‌ల‌ర్ కాంబినేష‌న్‌లో ఉన్న లెహెంగాను సెల‌క్ట్ చేసుకోండి. దానిని మ‌న అందాల అనుప‌మ‌లా స్టైల్ చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించండి. డ్ర‌స్‌కు మ్యాచ‌య్యేలా హెయిర్ స్టైల్‌తో త‌న లుక్‌‌ని చాలా సింపుల్‌గా పూర్తి చేసేసింది చూడండి.

జీన్స్ అంటే ఇష్ట‌ప‌డ‌ని అమ్మాయిలుంటారా చెప్పండి?? అయితే దానిని అంద‌రిలా ప్యాంట్‌గా కాకుండా కాస్త భిన్నంగా ట్రై చేయాల‌ని అనుకుంటున్నారా? మ‌న అనుప‌మ‌ను ఫాలో అయిపోతే స‌రి..! డార్క్ అండ్ లైట్ బ్లూ క‌ల‌ర్ డెనిమ్ క్లాత్‌ను సాధార‌ణ ఫ్యాబ్రిక్‌తో మిక్స్ చేసి స్నీక‌ర్స్‌తో ఆహా అనిపించే లుక్‌లో మెరిసిపోయింది.

స‌మ్మ‌ర్ వ‌చ్చేసింది.. ఇప్పుడు జీన్స్, డెనిమ్స్.. అంటారేంటి అంటారా?? అయితే కాట‌న్ ఫ్యాబ్రిక్ ఉండనే ఉంది క‌దా! దానిలో ఎలా అందంగా మెరిసిపోయేది అని ఆలోచిస్తున్నారా?? మ‌రేం ఫ‌ర్వాలేదు.. సెల‌బ్రిటీలు కూడా కాట‌న్, చేనేత‌, ఇక్క‌త్.. వంటి ఫ్యాష‌న్స్ ఫాలో అవుతారుగా! అనుప‌మ కూడా అలాగే ఫాలో అయింది చూడండి..

ధ‌రించే డ్ర‌స్ ఏదైనా స‌రే.. దానికి లుక్ వ‌చ్చేది మాత్రం మ‌న ఆత్మ‌విశ్వాసం ద్వారానే క‌దా! కాదంటారా? అనుప‌మ‌ను చూస్తే అస్స‌లు కాద‌న‌లేరు. ఎంత సింపుల్‌గా ఉన్న డ్ర‌స్ అయినా స్టైలిష్‌గా క్యారీ చేయాలంటే అది అనుప‌మ త‌ర్వాతే! పోల్కా డాట్స్ టాప్‌కు ప్యాట్ర‌న్ బాట‌మ్ జ‌త చేసి భ‌లే క్యూట్‌గా క‌నిపిస్తోంది క‌దూ!

సింపుల్ అవుట్ ఫిట్‌ని కూడా స్టైలిష్ లుక్‌లో మెరిపించాలంటే అది మ‌న అనుప‌మ‌కే సాధ్యం. కావాలంటే చూడండి.. ఎంతో సింపుల్‌గా ఉన్న శారీకి ష‌ర్ట్ త‌ర‌హా బ్లౌజ్‌ని జ‌త చేసి స్టేట్ మెంట్ ఇయ‌ర్ రింగ్స్‌తో చాలా అందంగా త‌యారైంది. ఈ ఫ్యాష‌న్ ఎవ‌రైనా ఫాలో అవ్వ‌చ్చు కూడా! ఏమంటారు??


ఇవి కూడా చ‌ద‌వండి


ఫ్యాష‌న్స్‌లో కూడా "హ‌నీ ఈజ్ ది బెస్ట్" అనిపిస్తోన్న మెహ‌రీన్..!


క‌ళ్లు చెదిరే అంద‌మే కాదు.. చ‌క్క‌ని ఫ్యాష‌న్ సెన్స్ కూడా పాయ‌ల్ సొంతం..!


శ్రీ‌ముఖి ఫ్యాష‌న్స్.. భిన్న‌మే కాదు.. భ‌లే అందంగా కూడా ఉంటాయి..!