బుల్లితెరను ఏలుతోన్న ఈతరం వ్యాఖ్యాతల్లో శ్రీముఖి (Sreemukhi) పేరు కూడా కచ్చితంగా ముందువరుసలోనే ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన జులాయి సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెల్లెలిగా వెండితెరకు పరిచయమైన ఈ భామ ఆ తర్వాత ఇటు వెండితెరపై మెరుస్తూనే బుల్లితెరను శాసించేందుకు సిద్ధమైపోయింది. అలా అదుర్స్ అనే షోతో వ్యాఖ్యాతగా తన కెరీర్ ప్రారంభించిన శ్రీముఖి కేవలం షోలలో మాత్రమే కాకుండా బయట జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో కూడా తనదైన ఫ్యాషన్స్‌తో అందరినీ అలరిస్తూ ఉంటుంది.
సంప్రదాయబద్ధంగా బుట్టబొమ్మలా కనిపించాలన్నా.. చిక్ అవుట్ ఫిట్స్‌లో హాట్ లుక్స్‌తో మెరిసిపోవాలన్నా శ్రీముఖి తర్వాతే ఇంకెవరైనా అనిపించేలా ఉంటుంది. మరి, ఈ అమ్మడు ఇప్పటి వరకు ఫాలో అయిన ఫ్యాషన్స్‌లో కొన్నింటిని మనమూ చూసేద్దామా..
View this post on Instagram
* వస్త్రధారణ క్లాస్‌గా ఉండాలి.. కానీ లుక్ మాత్రం మాస్‌గా అనిపించాలి. మీదీ ఇదే ఆలోచన?? అయితే ఇంకో ఆలోచన ఏమీ లేకుండా శ్రీముఖిని ఫాలో అయిపోండి. వెల్వెట్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన ఈ సెమీ ట్రెండీ అవుట్ ఫిట్ కాలేజీ అమ్మాయిలకు చక్కని ఎంపిక అని చెప్పచ్చు. పైగా యాక్సెసరీస్ కూడా పెద్దగా అవసరం ఉండవు.
* తెలుపు రంగు ఎలా ధరించినా ఒక రకమైన మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది. మనల్ని సమ్ థింగ్ స్పెషల్ అనిపించేలా చేయడంలో దీని తర్వాతే మరే రంగైనా అని చెప్పచ్చు. కావాలంటే శ్రీముఖి ధరించిన ఈ లాంగ్ ఫ్రాక్ చూడండి.. భలే అందంగా మెరిసిపోతోంది కదూ!
View this post on InstagramPataas in this trendy jumpsuit today! Outfit by @rekhas_couture @kirthana_sunil ☺️
* కాలేజీకి వెళ్లే అమ్మాయిలైనా లేదా ఆఫీసుకు వెళ్లే మహిళలైనా.. తమ వార్డ్ రోబ్‌లో ఒక జంప్ సూట్ కచ్చితంగా భాగం చేసుకుంటారు. అయితే మరీ రెగ్యులర్ తరహాలో కాకుండా ఇలా శ్రీముఖిలా కాస్త భిన్నంగా ప్రయత్నిస్తే మీ లుక్ కచ్చితంగా వైవిధ్యంగా కనిపించడం ఖాయం. ఇక ఆమెలా టాప్ నాట్ హెయిర్ స్టైల్ కూడా వేసుకుంటే క్యూట్ & నాటీ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకోవచ్చు.
View this post on InstagramJumpsuit love! 😍☺️ In @rekhas_couture outfit! PC- @pramod_captures #jumpsuits #casual #trendy
* లేదు.. జంప్ సూట్‌ని ఇంకా భిన్నంగా కనిపించేలా ప్రయత్నించాలని అనుకుంటున్నారా?? అయితే శ్రీముఖి ధరించిన విధంగా ఒక లాంగ్ ఓవర్ కోట్ ధరించి కూడా భిన్నమైన లుక్ సొంతం చేసుకోవచ్చు. ప్లెయిన్ బ్లూ కలర్ జంప్ సూట్‌కి రెడ్ కలర్ చెక్స్ ఓవర్ కోట్ జత చేసి ఎంత కూల్‌గా కనిపిస్తోందో చూడండి.
View this post on Instagram
* ఈస్ట్ ఆర్ వెస్ట్.. చుడీదార్ ఈజ్ ద బెస్ట్.. అంటారా?? ఆ చుడీదార్‌నే మరింత స్పెషల్ గా కనిపించేలా చేయాలంటే అందుకు కూడా కొన్ని టిప్స్ ఫాలో కావాల్సిందే. ప్లెయిన్ చుడీదార్‌కు పట్టు లేదా వర్క్ ఉన్న చున్నీ జత చేయడం కూడా వాటిలో ఒకటి. శ్రీముఖి కూడా అదే ఫాలో అయింది మరి..!
* ధరించిన దుస్తులకు మ్యాచింగ్ యాక్సెసరీస్ పెట్టుకోవడం చాలామందికి ఇష్టం. మీకూ అంతేనా?? అయితే ఇలా ప్లెయిన్ కలర్ శారీ ఎంపిక చేసుకుని దానికి మల్టీ కలర్ పామ్ పామ్ బాల్స్‌ని జత చేస్తే సరి..! చూడచక్కని అవుట్ ఫిట్‌తో అందంగా మెరిసిపోవచ్చు.. అచ్చు మన శ్రీముఖిలా..!
* ఇలాంటి పనులేవీ చేసేందుకు మీ వద్ద అంత సమయం లేదా?? అయినా సరే.. ప్లెయిన్ శారీతోనే స్టైలిష్ లుక్ మీ సొంతం చేసుకోవచ్చు. అదెలా అంటారా?? ఇదుగో.. మన శ్రీముఖిలా ప్లెయిన్ శారీకి వర్క్ బ్లౌజ్ జత చేస్తే సరి..!
View this post on Instagram
* డ్రస్సింగ్ సింపుల్‌గా ఉండాలి. కానీ లుక్ మాత్రం హాట్‌గా కనిపించాలి అంటే ఇలాంటి సూట్ తరహా అవుట్ ఫిట్స్‌ని ప్రయత్నించి చూడండి. ప్లెయిన్ బ్లాక్ కలర్ సూట్‌లో శ్రీముఖి కిల్లింగ్ లుక్స్‌తో రాక్ చేసేస్తోంది కదూ!
View this post on Instagram
* మీకు ఇండో వెస్ట్రన్ అవుట్ ఫిట్స్ అంటే ఇష్టమా?? చేనేత లేదా కాటన్ ఫ్యాబ్రిక్‌ను మిగతా వాటితో మిక్స్ చేసి ధరించడం ఎలా అని ఆలోచిస్తున్నారా? అయితే శ్రీముఖి ధరించిన ఈ అవుట్ ఫిట్‌ను ఫాలో అయిపోవాల్సిందే.. బ్లాక్ కలర్ బాటమ్‌కు ప్లెయిన్ కలర్ టాప్, బ్లాక కలర్ బెల్ట్ జత చేసిన ఈ అందాల భామ దానికి జతగా ఒక చక్కని దుపట్టా ధరించి మరింత అందంగా మెరిసిపోయింది. ఇక వాటికి జతగా ధరించిన ఇయర్ రింగ్స్ డ్రస్ అందాన్ని మరింత పెంచేశాయనే చెప్పాలి.
Images: https://www.instagram.com/sreemukhi
ఇవి కూడా చదవండి
రష్మీ గౌతమ్ ఫ్యాషన్స్ .. సింపుల్ & స్టైలిష్.. మీరూ చూడండి..!
బ్లాక్ అండ్ వైట్.. ఆల్ టైం బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అంటే ఇదే.!