ADVERTISEMENT
home / సౌందర్యం
ఓ అందమైన అమ్మాయి చెబుతోన్న ఈ మేకప్ టిప్స్  మీరు కూడా తెలుసుకోవాల్సిందే..

ఓ అందమైన అమ్మాయి చెబుతోన్న ఈ మేకప్ టిప్స్ మీరు కూడా తెలుసుకోవాల్సిందే..

మేకప్ ఉత్పత్తులు(makeup products) కొనుగోలు చేసేటప్పుడు.. వాటిని అప్లై చేసుకొనేటప్పుడు.. వీటి గురించి నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందనిపిస్తుంది. కొంతమంది అమ్మాయిలు చాలా అందంగా, నీట్ గా, చాలా సహజంగా కనిపించేలా మేకప్ వేసుకొంటారు. అలాంటి వారిని చూసి మనం కూడా అలాగే మేకప్ వేసుకొంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అంతేనా కొత్తగా మేకప్ వేసుకొనే మార్గాల కోసం సైతం అన్వేషిస్తుంటారు. ఈ విషయంలో మీ సంగతి నాకైతే తెలియదు కానీ.. నేను మాత్రం సరికొత్త మేకప్ టిప్స్ కోసం అన్వేషిస్తుంటాను. వాటిని ప్రయత్నింస్తుంటాను. ముఖ్యంగా సమయం ఆదా చేసే మేకప్ టెక్నిక్స్ నేర్చుకోవడానికి నేను ప్రయత్నిస్తుంటాను. నేను అలా ప్రయత్నించిన కొన్ని మేకప్ చిట్కాలను మీక్కూడా చెబుతాను. నాకు తెలుసు.. వాటి గురించి మీరు పూర్తిగా తెలుసుకొన్న తర్వాత కచ్చితంగా థ్యాంక్స్ చెబుతారు.

మేకప్ చిట్కాల గురించి తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదా? ఓ కప్పు కాఫీ సిప్ చేస్తూ.. ఈ కథనం చదవడం ప్రారంభించండి. చదవడం పూర్తయిన తర్వాత ‘మైండ్ బ్లోయింగ్ మేకప్ టిప్స్’ అని మెచ్చుకోకుండా ఉండలేరు.

ఐ మేకప్ చిట్కాలు

1-beauty-blogger-makeup-tips-Eye-makeup

ADVERTISEMENT

పెన్సిల్ ఐలైనర్ ను జెల్ ఐలైనర్ గా మార్చేయండి.

మీ దగ్గర జెల్ ఐలైనర్ లేదా? దానికోసం మీరు వెంటనే మార్కెట్ కి వెళ్లి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న పెన్సిల్ ఐలైనర్ నే జెల్ ఐలైనర్ గా మార్చేసుకోవచ్చు. దీని కోసం మీరు చేయాల్సిందల్లా.. ఐలైనర్ పెన్సిల్ మొనను లైటర్ లేదా కొవ్వొత్తి మంటపై కొన్ని సెకన్ల పాటు వేడి చేయాలి. టిప్ వేడిగా ఉందో లేదో ఓసారి చెక్ చేసుకొని ఐలైనర్ అప్లై చేసుకోవాలి. పెన్సిల్ టిప్ వేడి చేయడం వల్ల అది జెల్ ఐలైనర్ గా మారిపోతుంది.

ఐషాడో బేస్ గా వైట్ ఐలైనర్ ఉపయోగించండి

లేత రంగుల్లోని ఐషాడో అప్లై చేసుకొంటే అది మీరు కోరుకొన్న బ్రైట్ లుక్ ఇవ్వకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో వైట్ ఐలైనర్ మ్యాజిక్ చేస్తుంది. ఐషాడో అప్లై చేసుకొనే ముందు బేస్ గా వైట్ ఐలైనర్ అప్లై చేయండి. ఆ తర్వాత ఐషాడో అప్లై చేస్తే చాలా బ్రైట్ గా కనిపిస్తుంది.

ADVERTISEMENT

తెల్లని ఐలైనర్ తో మీ కళ్లు ప్రకాశవంతంగా

నిద్ర సరిగ్గా లేనట్లయితే కళ్లు అలసిపోయినట్లుగా కనిపిస్తాయి. అలా కనిపించకుండా ఉండాలంటే.. వైట్ ఐలైనర్ ఉపయోగించాల్సిందే. దీన్ని వేసుకోవడం వల్ల కళ్లు తాజాగా, ప్రకాశవంతంగా, పెద్దవిగా కనిపిస్తాయి.

ఐలైనర్ వింగ్స్ పర్ఫెక్ట్ గా 

వింగ్డ్ ఐలైనర్ వేసుకోవాలనుకొంటున్నారా? అయితే మీకో చిన్న టిప్ చెప్పనా? దాంతో మీరు చాలా సులువుగా వింగ్డ్ ఐలైనర్ వేసుకోవచ్చు. దీని కోసం స్పూన్ ను కళ్ల మీద బోర్లించినట్లుగా పెట్టాలి. ఇప్పుడు దాని అంచుల వెంబడే ఐలైనర్ వేసుకొంటే వింగ్డ్ ఐలైనర్ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. వింగ్డ్ ఐలైనర్ అందంగా రావడానికి మరో చిట్కా కూడా ఉంది. స్కాచ్ టేప్ నుంచి చిన్న ముక్క తీసుకొని దాన్ని కనుకొనల చివరి భాగంలో కింది రెప్ప నుంచి పైకి వచ్చేలా  అతికించాలి. ఐలైనర్ వేసుకొన్న తర్వాత టేప్ తొలగిస్తే.. పర్ఫెక్ట్ వింగ్డ్ ఐలైనర్ మీ సొంతమవుతుంది.

ADVERTISEMENT

ఐలైనర్ గా మస్కారా

ఎక్కడికైనా వెళ్లినప్పుడు వెంట ఐలైనర్ తీసుకెళ్లడం మరచిపోయారా? మరేం ఫర్లేదు.. మీ దగ్గర ఉన్న మస్కారానే ఐలైనర్ గా ఉపయోగించవచ్చు. మస్కారాను ఐలైనర్ గా వేసుకోవడం ఎలా? దాని కోసం సన్నని బ్రష్ ఉపయోగిస్తే సరిపోతుంది.

ఆరిపోయిన ఐలైనర్ కు ఫేషియల్ ఆయిల్ కలిపి ఉపయోగించండి

మీరు ఉపయోగించే జెల్ ఐలైనర్ ఆరిపోయిందా? అయితే దానిలో ఓ చుక్క ఫేషియల్ ఆయిల్ లేదా బేబీ ఆయిల్ వేసి ఒక నిమిషం పాటు మైక్రోవేవ్ లో ఉంచి వేడి చేయండి. ఐలైనర్ పూర్తిగా కరిగిన తర్వాత మరోసారి బాగా కలిపి చల్లారనిస్తే మీ జెల్ ఐలైనర్ ఉపయోగించడానికి సిద్ధమవుతుంది.

ADVERTISEMENT

హ్యాష్ ట్యాగ్ తో పర్ఫెక్ట్ స్మోకీ ఐమేకప్

మీ కనురెప్పల చివర్లో ఐలైనర్ పెన్సిల్ తో హ్యాష్ ట్యాగ్ గీసి పర్ఫెక్ట్ స్మోకీ ఐమేకప్ వేసుకోవచ్చు. అయితే మీరు కనురెప్పలపై గీచే ‘#’ కనుకొనల చివర్లు దాటకుండా చూసుకోవాలి. ఆ తర్వాత దాన్ని చేతివేళ్లు లేదా బ్రష్ తో బ్లెండ్ చేస్తే సరిపోతుంది.

కనురెప్పలపై స్పూన్ ఉంచి మస్కారా వేసుకోండి..

మీ కళ్లు చిన్నవిగా ఉంటే మీ కనురెప్పలకు వేసే మస్కారా కచ్చితంగా క‌ళ్ల‌కు అంటుకొంటుంది. అలా జరగకుండా ఉండాలంటే.. కనురెప్పల పైభాగంలో స్పూన్ ఉంచి మస్కారా అప్లై చేసుకోండి. ఇలా చేయడం వల్ల మస్కారా క‌ళ్ల‌ పైభాగానికి అంటుకోకుండా ఉంటుంది.

ADVERTISEMENT

మస్కారా ఎండిపోతే ఇలా తిరిగి వాడుకోవచ్చు..

మస్కారా ఎండిపోతే.. దానిలో కొన్ని చుక్కల లెన్స్ సొల్యూషన్ వేసి ఉపయోగించుకోవచ్చు. లెన్స్ సొల్యూషన్ మీకు అందుబాటులో లేనట్లయితే… వేడినీటిలో మస్కారా బాటిల్ ను వేసి కాసేపు ఉంచితే.. మస్కారా కరుగుతుంది. దాన్ని మనం తిరిగి ఉపయోగించుకోవచ్చు.

పర్ఫెక్ట్ ఐలాష్ కర్ల్ కావాలంటే..

ఐలాష్ కర్లర్ ను బ్లో డ్రయర్ తో హీట్ చేయండి. ఆ తర్వాత ఐలాష్ కర్ల్ చేసుకొంటే.. చాలా చక్కగా అందంగా వస్తాయి.

ADVERTISEMENT

కనురెప్పలు ఒత్తుగా..

కనురెప్పలు ఒత్తుగా కనిపించాలంటే ఫాల్స్ ఐలాష్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిట్కాతో కూడా కనురెప్పలు ఒత్తుగా కనిపించేలా చేసుకోవచ్చు. దీని కోసం మీరు చేయాల్సిందల్లా.. మస్కారా అప్లై చేసుకొన్న తర్వాత కాస్త బేబీ పౌడర్ లేదా టాల్కమ్ పౌడర్ కనురెప్పలకు అద్దుకోవాలి. ఆ తర్వాత మరోసారి మస్కారా అప్లై చేస్తే సరిపోతుంది.

కన్సీలర్ త్రిభుజాకారంలో..

కళ్ల కింద ఏర్పడిన డార్క్ సర్కిల్స్ ను కవర్ చేయడానికి కన్సీలర్ అప్లై చేసుకొంటాం. అయితే ఈ సారి కళ్ల కింద కన్సీలర్ ను ట్రైయాంగిల్ షేప్ లో అప్లై చేయండి.

ADVERTISEMENT

డార్క్ సర్కిల్స్ కవర్ చేయడానికి లిప్స్టిక్

నిద్ర లేకపోవడం వల్ల కళ్లు ఉబ్బినా లేదా కళ్ల కింద నల్లటి వలయాలను కవర్ చేయడానికి కన్సీలర్ మీ దగ్గర లేకపోతే.. రెడ్ లేదా ఆరెంజ్ లిప్స్టిక్ ఉపయోగిస్తే సరిపోతుంది. ఫౌండేషన్ వేసే ముందు కొద్దిగా లిప్స్టిక్ కళ్ల కింద అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్ కనిపించవు.

లిప్స్టిక్ తో డార్క్ సర్కిల్స్ కవర్ చేయడం ఎలాగో తెలుసుకోవాలనుంటే ఇక్కడ చదవండి.

ఐబ్రోస్ చుట్టూ కన్సీలర్

ADVERTISEMENT

ఐబ్రోస్ ను తీర్చిదిద్దుకొన్న తర్వాత వాటి చుట్టూ కొద్దిగా కన్సీలర్ అప్లై చేసి బ్లెండ్ చేస్తే.. మీ ఐబ్రోస్ చాలా అందంగా కనిపిస్తాయి. ముఖ్యంగా త్రెడ్డింగ్ కు ముందు కనురెప్పలు పెరిగినప్పుడు అవి కనబడకుండా కవర్ చేయడానికి కన్సీలర్ అప్లై చేసుకోవచ్చు.

కనుబొమ్మలు ఒత్తుగా కనబడటానికి పౌడర్ ఉపయోగించడం..

కనుబొమ్మలు పలచగా ఉన్నవారికి ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. డార్క్ బ్రౌన్ ఐషాడో లేదా పౌడర్ బ్రో ప్రొడక్ట్ ఉపయోగించడం ద్వారా మీ కనుబొమ్మలు ఒత్తుగా కనిపించేలా చేసుకోవచ్చు.

లిప్ మేకప్ చిట్కాలు

ADVERTISEMENT

2-beauty-blogger-makeup-tips-lip-makeup

పెదవులు నిండుగా కనిపించాలంటే..

మీ లిప్స్టిక్ కంటే కాస్త తక్కువ షేడ్ ఉన్న లిప్ లైనర్ తో పెదవుల చుట్టూ అవుట్ లైన్ గీయాలి. ఆ తర్వాత లిప్స్టిక్ అప్లై చేసుకొంటే సరిపోతుంది. లిప్ లైనర్ వల్ల పెదవులు అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అదేవిధంగా అప్పర్ లిప్ కు కొద్దిగా లిప్ గ్లాస్ కూడా అప్లై చేస్తే పెదవులు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

లిప్స్టిక్ ఎక్కువ సమయం నిలిచేలా

ADVERTISEMENT

లిప్స్టిక్ అప్లై చేసుకొన్న తర్వాత టిష్యూ పేపర్ తో పెదవులను అద్దుకోవాలి. మరోసారి లిప్స్టిక్ అప్లై చేసి.. మళ్లీ టిష్యూ పేపర్తో అద్దుకోవాలి. ఇలా కొన్నిసార్లు చేస్తే మీ లిప్స్టిక్ రోజంతా నిలిచి ఉంటుంది. ఇలా చేయడం కుదరదనిపిస్తే.. టిష్యూపేపర్ పై కొద్దిగా పౌడర్ జల్లి దాంతో పెదవులపై అద్దుకొంటే లిప్స్టిక్ ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది.

మీ లిప్స్టిక్ మీరే తయారుచేసుకోండి

కొద్దిగా ఐ షాడో, బ్లష్ ను వ్యాజలీన్ తో కలిపి మీకు నచ్చినట్టుగా మీరు లిప్స్టిక్ తయారుచేసుకోవచ్చు. మెటాలిక్ షేడ్ లో లిప్స్టిక్ తయారుచేసుకోవాలంటే.. దానికోసం మెటాలిక్ షేడ్ ఉన్న ఐషాడో ఉఫయోగిస్తే సరిపోతుంది.

లిప్ బామ్ గా ఫేషియల్ నూనె

ADVERTISEMENT

ఫేషియల్ నూనెను లిప్ బామ్ గా ఉపయోగించవచ్చు. లిప్స్టిక్ వేసుకోవడానికి ముందు ఒక చుక్క ఫేషియల్ నూనెతో మర్ధన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదవులు మృదువుగా, తాజాగా కనిపిస్తాయి. అలాగే రోజంతా హైడ్రేటెడ్ గా ఉంటాయి. అంతేకాదు.. లిప్స్టిక్ సమానంగా పరుచుకొంటుంది.

కన్సీలర్ తో పర్ఫెక్ట్ లిప్ లుక్

బోల్డ్ షేడ్ లిప్స్టిక్ వేసుకొన్నప్పుడు కొద్దిగా కన్సీలర్ అప్లై చేసుకొంటే.. చాలా అందంగా కనిపిస్తుంది. లిప్స్టిక్ అప్లై చేసుకొన్నప్పుడు జరిగిన పొరపాట్లను కన్సీలర్ తో కవర్  చేసుకోవచ్చు. ఫ్లాట్ బ్రష్ తో కొద్దిగా కన్సీలర్ తీసుకొని పెదవుల చుట్టూ బ్లెండ్ చేయడం ద్వారా లిప్స్టిక్ అందంగా కనిపిస్తుంది.

డీఐవై మోనోటోన్ మేకప్

ADVERTISEMENT

మీరు వేసుకొన్న బ్లష్ మాదిరిగానే లిప్స్టిక్ కూడా వేసుకోవాలనుకొంటే.. బ్లష్ ను లిప్ బామ్ తో కలిపి పెదవులకు లిప్స్టిక్ గా అప్లై చేసుకోవాలి. అలాగే బ్లష్ ను ఐషాడో కూడా అప్లై చేసుకొంటే మోనోటోన్ లుక్ మీ సొంతమవుతుంది.

లిప్స్టిక్ పళ్లకు అంటుకోకుండా ఉండాలంటే..

లిప్స్టిక్ అప్లై చేసుకొనేటప్పుడు కొందరిలో పళ్లకు కూడా అది అంటుకుపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే.. చూపుడు వేలిని పెదవుల మధ్య ఉంచి పౌట్ లా మూయాలి. ఇప్పుడు లిప్స్టిక్ అప్లై చేసుకొంటే పళ్లకు అంటుకోదు.

లిప్స్టిక్ విరిగిపోతే..

ADVERTISEMENT

మీ లిప్స్టిక్ విరిగిపోతే.. ఓ స్పూన్లో దాన్ని వేసి కరిగించి లిప్ బామ్ కంటైనర్ లో వేసి గడ్డ కట్టిన తర్వాత మళ్లీ ఉపయోగించకోవచ్చు. లేదా విరిగిన భాగాన్ని కొద్దిగా వేడి చేసి తిరిగి లిప్స్టిక్ బుల్లెట్లో పెట్టేస్తే సరిపోతుంది.

పర్ఫెక్ట్ పౌట్ లిప్స్ కోసం లిప్ మేకప్ ఇలా వేసుకోండి.

ఇదుగో ఈ వీడియోలో కొన్ని అద్భుతమైన బ్యూటీ టిప్స్ మీకు అర్థమయ్యేలా చూపిస్తున్నాం. ఓసారి దీన్ని వీక్షించండి.

 స్కిన్ ఫౌండేషన్ మేకప్ చిట్కాలు:

ADVERTISEMENT

3-beauty-blogger-makeup-tips-skin-foundation

 ఫౌండేషన్ సహజంగా కనిపించాలంటే..

ముఖం మధ్యభాగం నుంచి ఫౌండేషన్ అప్లై చేసుకోవడం మొదలుపెడితే.. చూడటానికి నేచురల్ గా ఉంటుంది. అలా కాకుండా.. ముందు చివరి భాగాల్లో ఫౌండేషన్ అప్లై చేసుకొంటే అక్కడ అది ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల మీరు అతిగా మేకప్ వేసుకొన్నట్టుగా కనిపిస్తుంది. అంతేకాదు.. సమానంగా బ్లెండ్ చేయడానికీ వీలవదు. ఇలా జరగకుండా ఉండాలంటే.. ముఖం మధ్యభాగం నుంచి ఫౌండేషన్ వేసుకోవడం మొదలుపెట్టడమే మంచిది.

మీకు నప్పే షేడ్ ఎంచుకోండి..

ADVERTISEMENT

ఫౌండేషన్ కొనుగోలు చేసేముందు అది మీ చర్మానికి నప్పుతుందో లేదో తెలుసుకోవడం మంచిది. దీనికోసం మీరు ఏం చేయాలంటే.. కొద్దిగా ఫౌండేషన్ ను మీ దవడ ఎముకకు రాసి దాన్ని మెడ వరకు సమానంగా పరచుకొనేలా చేయండి. ఇలా చేసినప్పుడు ఆ షేడ్ పూర్తిగా మీ చర్మం రంగులో కలిసినట్లైతే.. ఆ ఫౌండేషన్ షేడ్ మీకు కచ్చితంగా నప్పుతుంది. ఫౌండేషన్ కొనే ప్రతిసారి మీరు ఈ చిట్కా ఫాలో అయితే.. నప్పని షేడ్ కొనుగోలు చేయరు.

కన్సీలర్, ఫౌండేషన్ అప్లై చేసుకొన్న తర్వాత ఐదు నిమిషాలు వేచి చూడండి.

ఫౌండేషన్ లేదా కన్సీలర్ కొనుగోలు చేసేటప్పుడు ఈ సూత్రాన్ని కూడా పాటించండి. ఫౌండేషన్ లేదా కన్సీలర్ అప్లై చేసుకొన్న తర్వాత ఐదు నిమిషాల పాటు వేచి చూడండి. ఎందుకంటే.. ఫౌండేషన్ లేదా కన్సీలర్ అప్లై చేసుకొన్న తర్వాత అవి ఆక్సిడైజ్ అవుతాయి. అంటే అవి డ్రైగా మారే క్రమంలో గాలితో చర్య జరిపి డార్క్ గా తయారవుతాయి. అంటే ఒక షేడ్ లేదా రెండు షేడ్ ల వరకు ఇవి డార్క్ గా మారొచ్చు. ఇలాంటప్పుడు మీరు ఫౌండేషన్ కొన్నా దానివల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. అందుకే ఫౌండేషన్ లేదా కన్సీలర్ అప్లై చేసుకొన్న తర్వాత ఓ ఐదు పదినిమిషాలు వెయిట్ చేయండి. ఇప్పుడు ఫౌండేషన్ మీ చర్మం రంగులో కలిసినట్లుగా లేకపోయినా.. లేదా మీ చర్మం కంటే డార్క్ గా ఉన్నా దాన్ని కొనుగోలు చేయవద్దు. మరో ఫౌండేషన్ ప్రయత్నించి చూడండి.

ఓ చుక్క ఫేషియల్ నూనె ఫౌండేషన్ లో కలిపి

ADVERTISEMENT

ఫౌండేషన్ అప్లై చేసుకొనేటప్పుడు ఓ చుక్క ఫేషియల్ నూనెను దానిలో కలపడం వల్ల దాన్ని సులభంగా అప్లై చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మంపై ఫౌండేషన్ సమానంగా పరుచుకొంటుంది. సాధారణంగా పొడిచర్మం కలిగిన వారు ఫౌండేషన్ అప్లై చేసుకొనేటప్పుడు అది సమానంగా బ్లెండ్ అవకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. మీదీ పొడి చ‌ర్మ‌త‌త్వ‌మే అయితే మీకూ ఈ చిట్కా చాలా ఉపయోగపడుతుంది. మీ చేతి వెనక భాగంలో ఫౌండేషన్తో పాటు ఓ చుక్క ఫేషియల్ నూనెను బాగా కలిపి దాన్ని ముఖానికి అప్లై చేసుకోండి. మీ మేకప్ చాలా సహజంగా కనిపిస్తుంది.

చర్మం మెరిసేలా..

కొద్ది మొత్తంలో లిక్విడ్ హైలైటర్ ను ఫౌండేషన్ లో కలిపి వేసుకొంటే.. చర్మం మెరుస్తూ ఉంటుంది. హైలైటర్ ను మాయిశ్చరైజర్ లో కలిపి అప్లై చేసుకొన్నా ఇదే ఫలితం కనిపిస్తుంది.

కన్సీలర్ కంటే ముందే ఫౌండేషన్

ADVERTISEMENT

ఫౌండేషన్ అప్లై చేసుకొన్న తర్వాత కన్సీలర్ వేసుకోండి. దీనివల్ల మరీ ఎక్కువ లేదా మరీ తక్కువగా కాకుండా అవసరమైనంత మేరకు కన్సీలర్ వేసుకోవచ్చు.

మేకప్ సెట్టింగ్ స్ప్రేగా రోజ్ వాటర్

మీ మేకప్ సెట్టింగ్ స్ప్రే అయిపోయిందా? అయితే మీ దగ్గరున్న రోజ్ వాటర్ నే మేకప్ సెట్టింగ్ స్ప్రేగా వాడుకోవచ్చు. ఇది మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడంతో పాటు.. మీ మేకప్ అందంగా క‌నిపించేలా చేస్తుంది.

పర్ఫెక్ట్ ఐషాడో మేకప్ లుక్ కోసమూ మేకప్ సెట్టింగ్ స్ప్రే

ADVERTISEMENT

హైలైటర్ లేదా ఐషాడో అందంగా కనిపించాలంటే.. దాని కోసం కూడా మేకప్ సెట్టింగ్ స్ప్రే వాడుకోవచ్చు. దీని కోసం మేకప్ బ్రష్ తో ఐ షాడో లేదా హైలైటర్ తీసుకొని దానిపై కొద్దిగా స్ప్రే చేసి అప్లై చేసుకోండి.

కన్సీలర్ లిప్ ప్రైమర్ గా..

లిప్స్టిక్ వేసుకొనే ముందు కొద్దిగా కన్సీలర్ ను పెదవులకు అప్లై చేసుకోండి. దీనివల్ల మీ లిప్స్టిక్ మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. పెదవులు కాస్త డార్క్ గా ఉండేవారు ఈ చిట్కా పాటించడం వల్ల మీ పెదవులు మరింత అందంగా కనిపిస్తాయి.

విరిగిపోయిన మేకప్ ఉత్ప్తత్తులు తిరిగి అతికించడం ఎలా?

ADVERTISEMENT

అదెలా చేయాలో ఈ వీడియో వీక్షించండి.

పౌడర్ ఉత్పత్తులైన ఐషాడో, కాంపాక్ట్ పౌడర్, హైలైటర్ వంటివి పొరపాటున చేతిలోంచి జారిపడటం వల్ల విరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి, వాటిని తిరిగి అతికించుకొనేదెలా? దానికోసమూ సులభమైన చిట్కా ఉంది. దీనికోసం మీకు కావాల్సినవి ఓ స్పూన్, కాస్త రబ్బింగ్ ఆల్కహాల్.

విరిగిపోయిన మేకప్ ఉత్పత్తిని చెంచాతో పూర్తిగా పొడిగా మారేలా చేయండి. ఆ తర్వాత దీనిలో కొద్దిగా రబ్బింగ్ ఆల్కహాల్ వేసి ఉండలు లేకుండా బాగా కలపండి. ఆ తర్వాత దాన్ని ఓ రాత్రంతా అలా వదిలేస్తే.. మునుపటి లానే తయారవుతుంది. రబ్బింగ్ ఆల్కహాల్ మేకప్ ఉత్పత్తి రంగు, దాని ప్రభావాన్ని మార్చకుండా.. కేవలం దాన్ని తిరిగి అతుక్కునేలా చేస్తుంది. విరిగిపోయిన మేకప్  ఉత్పత్తి తిరిగి అతుక్కొన్న తర్వాత మీరు దాన్ని యదావిధిగానే వాడుకోవచ్చు.

మేకప్ వేసుకోవడానికి బ్యూటీ బ్లెండర్ ఉపయోగించండి

ADVERTISEMENT

సెలబ్రిటీలు లేదా ఇన్స్టాగ్రాం ఇన్ఫ్లుయెన్సర్లు వేసుకొనే మేకప్ చాలా అందంగా, పర్ఫెక్ట్ గా రావడానికి కారణమేంటో తెలుసా? చాలా సింపుల్.. దానికోసం వారు బ్యూటీ స్పాంజ్ ఉపయోగిస్తారు. దీన్ని ఉపయోగించడం ద్వారా మేకప్ అప్లై చేసుకోవడం సులభం. ముఖ్యంగా దీన్ని ఫౌండేషన్ అప్లై చేసుకోవడానికి ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

పెన్సిల్ లేదా స్పూన్ తో కాంటౌరింగ్

కాంటౌరింగ్ చేసుకోవడానికి పెన్సిల్ లేదా స్పూన్ ఉపయోగించండి. దవడ ఎముకలకు వీటితో కాంటౌరింగ్ చేసుకోవడం ద్వారా అవి షార్ప్ గా కనిపించడంతో  పాటు.. మీకు సెలబ్రిటీ లుక్ సొంతమవుతుంది.

మొటిమలు కనబడకుండా చేయాలంటే..

ADVERTISEMENT

పీరియడ్స్ కి ముందు మొటిమలు రావడం సహజం. అయితే వాటిని కనిపించకుండా చేయాలంటే.. దానికోసం మొటిమలు వచ్చిన చోట కొన్ని నిమిషాల పాటు ఐస్ క్యూబ్స్ ఉంచాలి. దీని వల్ల వాపు, నొప్పి తగ్గుతాయి. రోజులో రెండు నుంచి మూడు సార్లు ఇలా చేయడం వల్ల మొటిమలను మేకప్ తో కవర్ చేయడం సులభతరమవుతుంది.

డీఐవై బీబీ క్రీం..

కాంపాక్ట్ పౌడర్ లేదా లిక్విడ్ ఫౌండేషన్ ను మాయిశ్చరైజర్ లో గానీ, సన్ స్క్రీన్ లోషన్ లో గానీ కలిపితే బీబీ క్రీం తయారవుతుంది.

నెయిల్ పాలిష్ త్వరగా ఆరాలంటే..

ADVERTISEMENT

నెయిల్ పాలిష్ త్వరగా ఆరిపోవాలంటే… గోళ్ల రంగు వేసుకొన్న తర్వాత దానిపై కుకింగ్ స్ప్రే ను స్ప్రే చేయాలి. మీ దగ్గర కుకింగ్ స్ప్రే లేనట్లయితే.. ఐస్ వాటర్ లో రెండు నుంచి మూడు నిమిషాలు గోళ్లను ముంచి ఉంచితే సరిపోతుంది.

కాంటౌరింగ్ కోసం ఐబ్రో పెన్సిల్

ఐబ్రో పెన్సిల్ తో కాంటౌరింగ్ చాలా చక్కగా చేసుకోవచ్చు. మీరు ఇప్పుడిప్పుడే మేకప్ వేసుకోవడం మొదలుపెట్టినట్లయితే.. కాంటౌరింగ్ కోసం ఐబ్రో పెన్సిల్ ఉపయోగించండి. ఇది సులభంగా బ్లెండ్ అవుతుంది. పైగా ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.

హెయిర్ కేర్ టిప్స్

ADVERTISEMENT

4-beauty-blogger-makeup-tips-haircare-hacks

రాత్రి డ్రై షాంపూ అప్లై చేసుకోవాలి..

మీది ఆయిలీ హెయిర్ అయితే.. డ్రై షాంపూ ఉపయోగించడం మంచిది. అయితే దీన్ని రాత్రి నిద్రపోయే ముందు అప్లై చేసుకొంటే చాలా మంచి ఫలితం కనిపిస్తుంది. డ్రై షాంపూను తలపై కొద్దిగా వేసుకొని.. దువ్వెనతో దువ్వుకొని నిద్రపోవాలి. మరుసటి రోజు ఉదయం మీ జుట్టు సహజమైన మెరుపు సంతరించుకొంటుంది. వెంట్రుకల జిడ్డును డ్రై షాంపూ పీల్చుకోవడం వల్లే ఇది సాధ్యమవుతుంది.

టవల్ కి బదులుగా టీషర్ట్

ADVERTISEMENT

తలస్నానం అనంతరం జుట్టును టవల్ తో కాకుండా మీ పాత టీషర్ట్ తో తుడుచుకోండి. దీనివల్ల మీ జుట్టు పొడిగా మారకుండా ఉంటుంది. చలి ఎక్కువగా ఉన్న రోజుల్లో ఈ చిట్కాను పాటించడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.

చిన్న వెంట్రుకలను టూత్ బ్రష్ తో దువ్వి..

మన తలపై ఉన్న చిన్న చిన్న వెంట్రుకలు దువ్వినప్పుడు బాగానే ఉన్నా.. ఆ తర్వాత పైకి  లేచి నుంచుంటాయి. దీనివల్ల తల దువ్వుకొన్నా దువ్వుకోనట్టుగానే ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే.. ఈ చిట్కాను పాటించండి. ఓ టూత్ బ్రష్ పై హెయిర్ స్ప్రే జల్లి.. దాంతో మీ చిన్న చిన్న వెంట్రుకలను దువ్వండి. ఫలితంగా అవి రోజంతా అలాగే ఉంటాయి. కాబట్టి మీరు అస్త‌మానూ సరిచేసుకోవాల్సిన అవసరం ఉండదు.

బేబీ పౌడర్ తో కురులు అందంగా..

ADVERTISEMENT

మీ కురులు ఎప్పుడైనా జిడ్డుగా, నిర్జీవంగా ఉన్నట్టుగా అనిపిస్తే.. మీరు ఈ చిట్కాను పాటించి మంచి ఫలితం పొందవచ్చు. దీని కోసం మీరు కొద్దిగా బేబీ పౌడర్ ను తలపై జల్లుకొని హెయిర్ బ్రష్ లేదా దువ్వెన తో దువ్వుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలపై అదనంగా చేరిన జిడ్డు తొలగిపోతుంది. అలాగే మంచి టెక్స్చర్ కూడా తోడవుతుంది.

ఫన్నీ మేకప్ టిప్స్ కోసం చూస్తున్నారా? అయితే ఈ రెండు వీడియోలను ఓ సారి వీక్షించండి. వీటిలో మా మేకప్ ప్రొడ్యూసర్ శ్రద్ద కొన్ని మేకప్ టిప్స్ అందిస్తున్నారు.

నేనెప్పుడూ సమయాన్ని ఆదా చేసే మేకప్ చిట్కాల కోసం చూస్తుంటాను. ఈ విషయంలో ఎవరైనా నాకు సలహా ఇస్తే నేను దాన్ని వెంటనే పాటించడానికి సిద్ధంగా ఉంటాను. ఈ మధ్యే ఈ వీడియో బ్లాగర్ తన సబ్ స్క్రైబర్స్ చెప్పిన కొన్ని మేకప్ చిట్కాలను ప్రయత్నించి చూసింది. అంతే కాదు.. అవి పనిచేస్తాయో లేదో కూడా తేల్చేసింది. మీరు కూడా ఆ వీడియోను ఓ సారి వీక్షించండి.

ఆమె ప్రయత్నించిన అన్ని బ్యూటీ టిప్స్ లోనూ నన్ను బాగా ఆకర్షించిందేంటో తెలుసా? ఫౌండేషన్, ప్రైమర్, మాయిశ్చరైజర్ మూడింటినీ కలిపి ఒకేసారి అప్లై చేసుకోవడం. దీనివల్ల సమయం ఆదా అవడంతో పాటు.. మేకప్ వేసుకోవం చాలా సులభమవుతుంది. ఈ మూడింటికి విడివిడిగా పావుగంట సమయం పడితే.. ఈ చిట్కాతో మూడు నిమిషాల్లో మేకప్ పూర్తయిపోతుంది. అలాగే నాకు నచ్చిన మరో మేకప్ టిప్.. ఫౌండేషన్ అప్లై చేసుకోవడానికి ముందే బ్లష్ అప్లై చేసుకోవడం. ఎందుకంటే.. నేనెప్పుడు బ్లష్ అప్లై చేసుకొన్నా.. అది కాస్త ఎక్కువైనట్టుగా కనిపిస్తుంది. అందుకే ఇకపై ఈ చిట్కాను పాటిస్తాను. ముందుగా క్రీం బ్లష్ ను మీ బుగ్గలకు అప్లై చేసుకొని ఆ తర్వాత ఫౌండేషన్ లేదా బీబీ క్రీం రాసుకోవడం వల్ల మీ ముఖం చాలా నేచురల్ గా కనిపిస్తుంది.

ADVERTISEMENT

నేను మేకప్ వేసుకొనేటప్పుడు ఈ టిప్స్ లో కొన్ని పాటిస్తాను. మరి మీరు?

అద్భుతమైన వార్త..! POPxo SHOP లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో లభిస్తున్నాయి. POPXOFIRST కూపన్ కోడ్ ఉపయోగించి 25% తో వాటిని కొనుగోలు చేయండి. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఆన్ లైన్ షాపింగ్ ను ఎంజాయ్ చేయండి.

16 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT