ADVERTISEMENT
home / సౌందర్యం
అంద‌మైన‌, మెరిసే చ‌ర్మం కోసం నలుగు పిండిని ఇలా ఉప‌యోగించండి..!

అంద‌మైన‌, మెరిసే చ‌ర్మం కోసం నలుగు పిండిని ఇలా ఉప‌యోగించండి..!

మన పూర్వీకులు సంప్రదాయ పద్ధతిలో(traditional method).. కొన్ని పదార్థాలు ఉపయోగించి తయారు చేసిన అద్భుతమైన సౌందర్య సాధనం నలుగు పిండి. చాలా సులభంగా.. మనకు నిత్యం అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలతో తయారైన నలుగు పిండి చర్మాన్ని శుభ్రం చేస్తుంది. పోషణ ఇస్తుంది. మృత‌క‌ణాల‌ను తొలగించి చర్మానికి కొత్త కళ అందిస్తుంది. అందుకే పెళ్లిలో ప్రత్యేక్యంగా వధువుకి, వరుడికి నలుగు పెట్టి స్నానం చేయిస్తారు. పెళ్లి అనే కాదు.. పండగల సమయంలోనూ కొందరు ఒంటికి నూనె రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేస్తారు. అసలు నలుగు పిండికి మన సంస్కృతిలో ఎందుకు ఇంత ప్రత్యేక స్థానం కల్పించారు? ఎందుకు ఈ హెర్బల్ ఉత్పత్తి ఇంత గొప్పతనాన్ని పొందింది? చర్మ సంరక్షణ(skincare) విషయంలో నలుగు ఎందుకు ప్రత్యేకంగా నిలుస్తోంది? తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.

ఏంటీ నలుగు పిండి?

కొన్నేళ్లు మనం వెనక్కి వెళితే.. సబ్బులు, షాంపూలు, ఫేస్ క్రీంలు లేని రోజులు వస్తాయి. మరి, ఆ రోజుల్లో శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి.. చర్మం సౌందర్యాన్ని(beauty) కాపాడుకోవడానికి అప్పట్లో వారు ఏం ఉపయోగించేవారు? ఇంకేంటి.. నలుగు పిండే. కొన్ని రకాల పప్పు ధాన్యాలను తిరగలిలో వేసి పిండిగా మార్చి దాన్ని ఉపయోగించేవారు. ఆయుర్వేదంలోనూ దీనికి ప్రాధాన్యం కల్పించారు. ఆయుర్వేదం ప్రకారం మీ శరీరతత్వానికి అనుగుణంగా నలుగు పిండి తయారు చేసుకోవాలి. అప్పుడే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. సాధారణంగా ఆయుర్వేదంలో వాతం, పిత్తం, కఫం అనే మూడు దోషాలకనుగుణంగా ఔషధాలను ఇస్తారు. ఇదే సూత్రం చర్మ సౌందర్యానికీ వర్తిస్తుంది.

1-nalugupindi-lemon-turmeric-milk

ADVERTISEMENT

వాత దోషం ఉన్నవారు ఉపయోగించే నలుగు పిండి చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసేలా ఉండాలి. పిత్త దోషమున్నవారు చర్మం ఉష్ణోగ్రతలు తగ్గించే నలుగు పిండి ఉపయోగించాల్సి ఉంటుంది. అంతేకాదు.. చర్మాన్ని చల్లబరిచి సాంత్వన కలిగించేలా అది ఉండాలి. కఫ దోషం ఉన్నవారు గోరువెచ్చగా ఉన్న నీరు లేదా నీటిలో నలుగు పిండి కలిపి ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది శరీరంలో రక్త ప్రవాహాన్ని క్రమబద్ధం చేస్తుంది.

సాధారణంగా నలుగు పిండిని శెనగపిండి, పసుపు, పాలు వంటి వాటితో తయారు చేస్తారు. అయితే ఇటీవలి కాలంలో శెనగపిండి, చందనం, పాలు లేదా పాలపొడి, బాదం పొడి, మిల్క్ క్రీం, నిమ్మరసం, రోజ్ వాటర్, పసుపు వంటి వాటితో తయారు చేస్తున్నారు. ఇవన్నీ మన ఇంట్లో ఎప్పుడూ ఉండేవే. కాబట్టి చాలా చౌకగా, తక్కువ సమయంలో తయారుచేసుకోవచ్చు. పైగా దీన్ని ఉపయోగించడం సులభం.

Also Read: సన్ టానింగ్ తగ్గించడానికి సహజ మార్గాలు (Natural Ways To Reduce Sun Tanning)

నలుగు పిండి వల్ల కలిగే ప్రయోజనాలు

ADVERTISEMENT

ప్రకాశవంతమైన చర్మం

నలుగు పిండి సహజమైన పదార్థాలతో తయారైన సౌందర్య ఉత్పత్తి. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మీ చర్మం మృదువుగా తయారవుతుంది. ఫ్రెష్ గా కనిపిస్తుంది. తగిన పోషణ సైతం అందుతుంది. నలుగు పిండిలో ఉన్న శెనగపిండి ఎక్స్ఫోలియేటర్ గా పనిచేస్తుంది. చందనం చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. పాలు.. మచ్చలను చర్మంలో కలిసిపోయేలా చేస్తాయి. మొత్తంగా చర్మం ప్రకాశ‌వంతంగా, స్పాట్ లెస్ గా తయారవుతుంది.

మచ్చల్లేని చర్మం..

మనలో చాలామంది చర్మ సంబంధిత సమస్యల వల్ల చర్మంపై మచ్చలు ఏర్పడతాయి. పిగ్మెంటేషన్, మొటిమలు, గాయాల వల్ల కూడా మచ్చలు ఏర్పడతాయి. వాటన్నింటినీ తగ్గించే ఏకైక దివ్వౌషధం నలుగు పిండి. అంతేకాదు.. సూర్యరశ్మి ప్రభావానికి గురైన చర్మానికి తిరిగి జీవం పోస్తుంది.

ADVERTISEMENT

చర్మం యవ్వనంగా కనిపిస్తుంది..

నలుగు పిండి తయారు చేయడానికి ఉపయోగించే వాటిలో అతి ముఖ్యమైనది పసుపు. దీనిలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్, యాంటీ ఆక్సిడేటివ్ గుణాల వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. చర్మం పొడిగా మారడం, తేమ కోల్పోవడం వంటివన్నీ చర్మం వృద్ధాప్య ఛాయ‌ల‌కు సూచన. పసుపు ఈ లక్షణాలన్నింటినీ తగ్గిస్తుంది. నలుగు పిండిలో ఉన్న ఇతర పోషకాలు.. చర్మానికి పోషణ అందించి మాయిశ్చరైజ్ చేస్తాయి.

2-nalugupindi-massage

అవాంఛిత రోమాలు తొలగిస్తుంది

ADVERTISEMENT

క్రమం తప్పకుండా నలుగు పిండి ఉపయోగించడం వల్ల చర్మంపై ఉన్న అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. ఫేషియల్ హెయిర్ తొలగించుకోవడానికి ఇది అత్యంత సులువైన మార్గం. అందుకే ఇప్పటికీ పసిపాపలకు రోజూ నలుగు పెట్టి స్నానం చేయిస్తారు. ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

మొటిమలు తగ్గిస్తుంది

నలుగు పిండి మీ చర్మాన్ని సున్నితంగా మార్చేస్తుంది. దీనిలో మనం ఉపయోగించేే పసుపు, గంధంలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాల వల్ల ముఖంపై మొటిమలు తగ్గుముఖం పడతాయి. కొత్తవి రాకుండా ఉంటాయి.

చర్మం సాగిపోకుండా ఉంటుంది.

ADVERTISEMENT

గంధం పొడి లేదా అరగదీసిన గంధంలో నేచురల్ ఆస్ట్రింజెంట్ గుణాలుంటాయి. ఇవి చర్మాన్ని సాగిపోకుండా చేస్తాయి. రోజూ నలుగుపిండి ఉపయోగించడం వల్ల చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి. చర్మం టోనింగ్ అవుతుంది. ఫలితంగా యూత్ ఫుల్ లుక్ మీ సొంతమవుతుంది.

నలుగు పిండి ఎలా తయారు చేయాలి?

మీ రోజువారి చర్మ అవసరాలను తీర్చడానికి నలుగు పిండి ఉపయోగించడం మీ దినచర్యలో భాగంగా చేసుకోండి. అది మీచర్మాన్ని మృదువుగా, ఆరోగ్యకరంగా మార్చేస్తుంది. దాని కోసం నాణ్యత కలిగిన నలుగుపిండి ఎంచుకోవాలి. అప్పుడే చర్మంపై డార్క్ స్పాట్స్, వైట్ హెడ్స్, పిగ్మెంటేషన్, పొడిబారడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాదు సూర్యరశ్మి ప్రభావం కారణంగా చర్మకణాలు పాడవకుండా కాపాడుతుంది.

అయితే మీ చర్మానికి సరిపోయేలా నలుగుపిండి తయారుచేసుకొనే ముందు ఓ విషయం గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కరి చర్మం ఒక్కో తీరుగా ఉంటుంది కాబట్టి.. ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. నలుగు పిండికి మాత్రమే కాదు.. ఏ కొత్త బ్యూటీ ప్రొడక్ట్ ఉపయోగించాలన్నా.. ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాల్సిందే. అప్పుడే మీ చర్మానికి నప్పే ఆరోగ్యకరమైన ఉత్పత్తులను ఎంపిక చేసుకోవచ్చు. ఫలితంగా మీ చర్మం అందంగా ఉంటుంది.

ADVERTISEMENT

బ్యూటీ రొటీన్ లో నలుగు పిండిని ఎలా భాగం చేసుకోవాలి?

టేబుల్ స్పూన్ చందనం పొడి, రెండు టేబుల్ స్పూన్ల శెనగపిండి, అర టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపాలతో రోజూ నలుగు పిండిని తయారుచేసుకోవాలి.

ఒక గిన్నెలో వీటన్నింటినీ వేసి మరీ చిక్కగా లేదా మరీ పలుచగా లేకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని పావుగంట ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉపయోగించినప్పుడు సబ్బు, ఫేస్ వాష్ వంటివి ఉపయోగించకూడదు. ముఖానికి మాత్రమే కాదు.. శరీరం మొత్తానికి దీన్ని అప్లై చేసుకోవచ్చు. దీన్ని సబ్బు, ఫేస్ వాష్ వంటి వాటికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు. వారంలో కనసీం మూడు రోజుల పాటు దీన్ని ఉపయోగించడం వల్ల చక్కటి ఫలితాన్ని పొందవచ్చు.

ఈ మిశ్రమంలో ఉపయోగించిన పచ్చిపాలు పిగ్మెంటేషన్, మచ్చలను తగ్గిస్తుంది. అంతేకాదు.. చర్మానికి అవసరమైన తేమనందించి జిడ్డుగా మారకుండా చూస్తుంది. చందనం చర్మాన్ని స్మూత్ గా మార్చేస్తుంది. శెనగపిండి చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేేసి మృతకణాలను తొలగిస్తుంది. పసుపు యాంటీ సెప్టిక్ గా పనిచేసి మొటిమలు రాకుండా చేస్తుంది.

ADVERTISEMENT

పెళ్లి కూతురి కోసం ఈ నలుగు పిండి ప్రత్యేకం..

త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారా? అయితే చర్మ సౌందర్యం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొంటున్నారు కదా. ఇప్పటి నుంచి అప్పడప్పుడూ నలుగు పిండితో ఫేస్ ప్యాక్ వేసుకొంటూ ఉండండి. ఇది మీ స్కిన్ ను ఎక్స్ఫోలియేట్ చేయడంతో పాటు మీకు పెళ్లి కళను ఇస్తుంది. పైగా పెళ్లి సమయంలో సంప్రదాయం ప్రకారం నలుగు పిండి పెట్టి స్నానం చేయిస్తారు. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి.. చర్మం సాఫ్ట్ గా తయారవుతుంది. శెనగపిండి, గోధుమ పొట్టు(కొన్ని ప్రాంతాల్లో దీన్ని ఊక అని కూడా పిలుస్తారు), పెరుగు, పసుపు మిశ్రమంగా చేసి చర్మానికి అప్లై చేసుకొని 20 నుంచి 30 నిమిషాల తర్వాత రోజ్ వాటర్ కలిపిన నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకొంటే మీ చర్మం ప్రకాశవంతంగా మారిపోతుంది.

Also Read: కొత్త కోడలికి సరికొత్త లుక్ ఇచ్చే డిజైనర్ నగలు

నవ వధువు కోసం మరో నలుగు పిండి..

ADVERTISEMENT

నవ వధువుని మరింత కళగా మార్చేసే మరో నలుగు పిండి ఇది. శెనగ పిండి, ఓట్ మీల్, చందనం వంటి వాటితో దీన్ని తయారుచేస్తారు. దీని కోసం టేబుల్ స్పూన్ గోధుమ పిండి, టేబుల్ స్పూన్ శెనగపిండి, టేబుల్ స్పూన్ చందనం పొడి, అర టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోవాలి. వీటన్నింటినీ కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. దీన్ని కలిపేటప్పుడు మరీ చిక్కగా లేదా మరీ పలుచగా లేకుండా.. శరీరంపై సులభంగా అలముకొనేలా కలపాలి. ఈ పేస్ట్ ను చర్మానికి అప్లై చేసుకొని 20 నుంచి 30 నిమిషాల తర్వాత రోజ్ వాటర్ కలిపిన నీటితో శుభ్రం చేసుకోవాలి.

ముఖారవిందం పెంచే నలుగు ఇది..

దీని కోసం టేబుల్ స్పూన్ ఓట్ మీల్, మూడు టేబుల్ స్పూన్ల శెనగపిండి, రెండు టేబుల్ స్పూన్ల చందనం పొడి, అర టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ల కీరా గుజ్టు తీసుకోవాలి. కీరాలో పావు వంతు మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేస్తే రెండు టేబుల్ స్పూన్ల కీరా గుజ్టు వస్తుంది. కీరా గుజ్జు మినహా మిగిలినవన్నీ గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కీరా కూడా వేసి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత ఉపయోగించాలి.

ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని ముఖానికి రాసి గుండ్రంగా రుద్దుతూ మసాజ్ చేసుకోవాలి. ఇలా 5 నుంచి 10 నిమిషాల పాటు చేసిన తర్వాత గోరువెచ్చిని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం అప్లై చేసుకొన్న తర్వాత సబ్బు లేదా ఫేస్ వాష్ ఉపయోగించకూడదు.

ADVERTISEMENT

ఇది స్క్రబ్ లా పనిచేసి చర్మంపై ఉన్న మృతకణాలు, ఇతర కాలుష్య పదార్థాలను తొలగిస్తుంది. ఈ స్క్రబ్ ను వారం లేదా పది రోజులకోసారి ఉపయోగించడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. దీన్ని ఉపయోగించిన తర్వాత చర్మానికి టోనర్ అప్లై చేసుకోవడం లేదా ఫేస్ ప్యాక్ వేసుకోవడం.. వంటివి చేస్తే చర్మం మరింత అందంగా తయారవుతుంది.

ఈ మిశ్రమంలో ఉపయోగించిన పదార్థాలన్నీ చర్మానికి మేలు చేసేవే. కీరా చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంటల్ గుణాలు చర్మంపై ఉన్న మృతకణాలను తొలగిస్తాయి. అలాగే సూర్యరశ్మి ప్రభావం కారణంగా పాడైన చర్మకణాలకు తిరిగి జీవం పోస్తాయి. ఓట్ మీల్ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసి చర్మాన్ని మెరిపిస్తుంది.

Also Read: పెళ్లి తర్వాత హనీమూన్ కి ప్లాన్ చేసుకొన్నారా? హాట్ లుక్ ఇచ్చే క్యూట్ డ్రస్సులు మీకోసమే

మెరిసే చర్మం కోసం నలుగు

ADVERTISEMENT

మెరిసే చర్మం కావాలని కోరుకొనే వారు ఈ నలుగు ప్రయత్నిస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది. దీని కోసం మీకు కావాల్సినవి 6 నుంచి 7 బాదం పప్పులు, తాజా పాలు, టేబుల్ స్పూన్ నువ్వుల నూనె, టేబుల్ స్పూన్ తులసి ఆకుల పొడి, మూడు టేబుల్ స్పూన్ల శెనగపిండి, రెండు టేబుల్ స్పూన్ల చందనం పొడి, అర టీస్పూన్ పసుపు.

ఈ నలుగు పిండిని తయారుచేసుకోవడానికి ముందుగా గిన్నెలో బాదం గింజలు వేసి అవి మునిగేంత వరకు పాలు పోసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం బాదం గింజల పై తొక్కలను తొలగించి దీనికి నువ్వుల నూనె, తులసి పొడి, ఇతర పదార్థాలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. దీన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకొని పది నుంచి పదిహేను నిమిషాలు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ ను ఉపయోగించడం ద్వారా చర్మం మాయిశ్చరైజ్ అవడంతో పాటు స్కిన్ టెక్స్చర్ కూడా మెరుగుపడుతుంది.

ఈ ప్యాక్ లో ఉన్న బాదం గింజల్లో ఉన్న విటమిన్ ఎ చర్మానికి పోషణ అందిస్తుంది. అంతేకాదు.. చర్మంపై ర్యాషెస్ తగ్గిస్తుంది. తులసిలో ఉన్న యాంటిసెప్టిక్ గుణాలు మొటిమలు, ఇతర ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తాయి. నువ్వుల నూనెలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఈ నలుగు పిండి ఫేస్ ప్యాక్ బాగా పనిచేస్తుంది.

3-nalugupindi-tulsai-almond-milk

ADVERTISEMENT

ముఖ్య‌మైన చిట్కా

ఈ ప్యాక్ లో నువ్వుల నూనె, తులసి ఆకుల పొడి ఉపయోగిస్తున్నాం కాబట్టి.. ఇది అందరికీ సరిపడకపోవచ్చు. కాబట్టి ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మరచిపోవద్దు. మోచేతి దగ్గర ఈ మిశ్రమాన్ని కొద్దిగా అప్లై చేసి ఐదు నిమిషాల పాటు ఆగాలి. ఆ తర్వాత ప్యాచ్ టెస్ట్ చేేసుకొన్న ప్రదేశంలో దురద, మంట లేకపోతే.. నిరభ్యంతరంగా ఈ ప్యాక్ వేసుకోవచ్చు. దురద, మంట ఉన్నట్లయితే.. వెంటనే శుభ్రం చేసుకొని ఐస్ పెట్టుకోవాలి.

రోజూ ఉపయోగించేందుకు ప్రత్యేకం ఈ నలుగు పిండి..

దీనికోసం కావాల్సినవి:

ADVERTISEMENT

టేబుల్ స్పూన్ గోధుమ పిండి, టేబుల్ స్పూన్ శెనగ పిండి, టేబుల్ స్పూన్ చందనం, అర టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్

ఒక గిన్నెలో వీటన్నింటినీ వేసి మిశ్రమంగా చేయాలి. మిశ్రమం చిక్కగా ఉంటే మరికొంత రోజ్ వాటర్ వేసి కొంచెం పలుచన చేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేసుకొని పూర్తిగా ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. మీది పొడి చర్మం అయితే.. రోజ్ వాటర్ కి బదులుగా పాలు ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. దీన్ని ప్యాక్ లానే కాకుండా.. శరీరానికి నలుగు పెట్టుకోవడానికి ఉపయోగించవచ్చు. ధీని వల్ల కలిగే ఫలితాలను పొందడానికి కనీసం పది నుంచి పదిహేను రోజుల పాటు ఉపయోగించాలి.

నేచురల్ ఫేస్ వాష్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చదవండి.

ట్యాన్, డార్క్ ప్యాచెస్ తొలగించుకోవడానికి ఓ నలుగు పిండి

ADVERTISEMENT

ట్యాన్, డార్క్ ప్యాచెస్ ఉంటే చర్మం అంత ప్రకాశవంతంగా కనిపించదు. మరి, వాటిని తొలగించుకోవాలంటే ఎలా? దానికీ ఓ నలుగు పిండి ఉంది. దీని కోసం టేబుల్ స్పూన్ శెనగపిండి, టేబుల్ స్పూన్ పాల పొడి, టేబుల్ స్పూన్ చందనం పొడి, అర టీస్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ల తేనె, టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకొని ఓ గిన్నెలో వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి 15-20 నిమిషాల పాటు ఆరనిచ్చిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. దీన్ని వారానికి రెండు సార్లు ఉపయోగించడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ మిశ్రమంలో ఉన్న నిమ్మరసం ట్యాన్, పిగ్మెంటేషన్ తొలగిస్తుంది.

మీ చర్మతత్వానికి సరిపోయేలా నలుగుపిండి ఇలా తయారుచేసుకోండి

జిడ్డు చర్మానికి

ఆయిలీ స్కిన్ ఉన్నవారు పెరుగు, శెనగపిండి, పసుపు, నిమ్మరసంతో నలుగు పిండి తయారుచేసి ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమం చర్మగ్రంథులు విడుదల చేసే నూనెలను క్రమబద్ధీకరించి చర్మం జిడ్డుగా మారకుండా చూస్తుంది.

ADVERTISEMENT

పొడి చర్మానికి

మీది పొడి చర్మం అయితే.. మీరు ఉపయోగించే నలుగు పిండిలో తేనె, పాలు, వెన్న, పెరుగు వంటివి కలుపుకోవాలి. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి పొడిగా మారకుండా చేస్తుంది.

సాధారణ చర్మానికి

సాధారణ చర్మం పీహెచ్ విలువలు ఎప్పుడూ సమతూకంగా ఉంటాయి. అందువల్ల వీరికి చర్మసమస్యలు తక్కువగా ఉంటాయి. అయినా నలుగు పిండి ఉపయోగించడం వల్ల చర్మం మరింత అందంగా తయారవుతుంది. దీనికోసం నలుగు పిండిలో అరటి పండు, నిమ్మరసం, తేనె, పెరుగు వంటివి కలపడం ద్వారా చర్మం చాలా స్మూత్ గా తయారవుతుంది.

ADVERTISEMENT

నలుగు పిండి  ఉపయోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

సాధారణంగా నలుగు పిండి ఉపయోగించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగవు. అయితే దాని తయారీలో ఉపయోగించే కొన్ని పదార్థాల వల్ల కొన్ని సార్లు దురద, మంట వంటివి కలిగే అవకాశం ఉంది. అందుకే ఏ రకమైన నలుగు పిండి ఉపయోగించినా.. ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. అలాగే మీ చర్మతత్వానికి సరిపడిన ఉత్పత్తులనే నలుగు పిండిలో భాగం చేసుకోవడం మంచిది.

POPxo రికమెండ్ చేసే రెడీ టు యూజ్ నలుగు పిండి

ఫేషియల్ ఉబ్తన్ ముల్తానీ మట్టి 85జి

ADVERTISEMENT

4-nalugupindi-facial-ubtan

తులసి, పసుపు, మెంతులు, ముల్తానీ మట్టి తో తయారైన ఈ నలుగు పిండి చర్మాన్ని లోతుగా క్లెన్స్ చేస్తుంది. మొటిమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నవారు దీన్ని ఉపయోగించడం మంచిది.

కామా ఆయుర్వేద ఉబ్తన్ సోప్ ఫ్రీ బాడీ క్లెన్సర్

5-nalugupindi-kama-ayurveda

ADVERTISEMENT

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే మూలికలు ఉన్న ఈ నలుగు పిండి జిడ్డు చర్మం కలిగిన వారికి బాగా ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడం మాత్రమే కాకుండా.. చర్మాన్ని ఫ్రెష్ గా ఉంచుతుంది. దీన్ని రోజూ ఉపయోగించడం వల్ల మీ చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.

ప్లంప్ బ్రైడల్ ఉబ్తన్

6-nalugupindi-plump

పెళ్లికి ముందు నలుగు పెట్టే ఆచారం మనకుంది. ఆ సమయంలో ఈ ప్లంప్ బ్రైడల్ ఉబ్తన్ ఉపయోగించండి. మీ చర్మం అందంగా మెరిసిపోతుంది.

ADVERTISEMENT

రూట్స్ & హెర్బ్స్ ఆయుర్వేదిక్ నేచురల్ ట్రీట్మెంట్

7-nalugupindi-faceubtan

కొందరు వేగన్ గా జీవనం సాగిస్తుంటారు. అంటే పూర్తిగా శాఖాహారిగా జీవనం సాగిస్తుంటారు. పాలు, వెన్న, పెరుగు వంటివి కూడా ఉపయోగించరు. ఇలాంటి వారికి ఈ నలుగు పిండి సరైన ఎంపిక. 

అలో వేదా టర్మరిక్ ఫేషియ‌ల్ ఉబ్తన్

ADVERTISEMENT

8-nalugupindi-aloe-veda

అలో వేదా అందిస్తోన్న ఈ నలుగు పిండి కమలాఫల తొక్కల పొడి, గులాబీ రేకుల పొడి, వేప పొడి, ముల్తానీ మట్టి, రోజ్ హిప్ ఆయిల్.. వంటి ఎన్నో సహజసిద్ధమైన వాటితో తయారైంది. దీనిలో పారాబెన్లు లేవు. పైగా ఏ రకమైన చర్మతత్వం కలిగినవారైనా దీన్ని ఉపయోగించవచ్చు.

తరచూ అడిగే ప్రశ్నలు

1. నలుగు పిండి వాడితే చర్మం ఫెయిర్ గా తయారవుతుందా?

ADVERTISEMENT

జవాబు: చర్మం ఏ రంగులో ఉన్నా అందంగానే ఉంటాం. కానీ మీ స్కిన్ ఫెయిర్ గా అవ్వాలని మీరు భావిస్తే.. మా సమాధానం. యెస్.. క్రమం తప్పకుండా నలుగుపిండి ఉపయోగిస్తే చర్మం ఫెయిర్ గా మారుతుంది.

2. ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను నలుగు పిండి తొలగిస్తుందా?

జవాబు: కచ్చితంగా. నలుగు పిండి చర్మంపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగిస్తుంది. నలుగు పిండిని తగినంత నీటిలో కలిపి పేస్ట్ లా చేసి ముఖంపై ఫేస్ ప్యాక్ మాదిరిగా వేసుకోవాలి. ఆరిన తర్వాత పలుచని వస్త్రంతో సున్నితంగా రుద్దుకొంటూ ప్యాక్ ను తొలగించాలి. ఇలా తరచూ చేస్తుంటే.. ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. అలాగే రోజూ స్నానం చేసేటప్పుడు సబ్బుకి బదులుగా శరీరానికి నలుగు పెట్టుకొని స్నానం చేసినా చర్మంపై ఉన్న అవాంఛిత రోమాలు క్రమంగా తొలగిపోతాయి.

నలుగు పిండిలో పసుపు కలిపి ఉపయోగిస్తే.. చర్మంపై హెయిర్ గ్రోత్ తగ్గడంతో పాటు చర్మం ఛాయ సైతం మెరుగుపడుతుంది.

ADVERTISEMENT

3. నలుగు పిండి ఉపయోగించడం వల్ల చర్మం ప్రకాశవంతంగా తయారవుతుందా?

జవాబు: అవును.. నలుగు పిండి ఉపయోగిస్తే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. చర్మం సహజసిద్ధంగా మెరిసిపోతుంది. అందుకే పెళ్లి సమయంలో వధువు, వరుడికి నలుగు పెట్టి స్నానం చేయిస్తారు.

నలుగు పిండి పెట్టుకోవడం మన సంస్కృతిలో భాగం. కాబట్టి గతంలో మన పెద్దలు ఉపయోగించిన ఈ సౌందర్యసాధనాన్నిఉపయోగించండి. మీరు తప్పకుండా మంచి ఫలితం పొందుతారు.

 

ADVERTISEMENT
19 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT