పుట్టిన తేదీ ప్ర‌కారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా...?

పుట్టిన తేదీ ప్ర‌కారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా...?

ప్ర‌తి బిడ్డ‌కు వాళ్ల త‌ల్లిదండ్రులే రోల్ మోడ‌ల్స్‌గా ఉంటూ ఉంటారు. అయితే పిల్ల‌లతో మెలిగే విష‌యంలో ప్ర‌తి తండ్రి ఎంతో స‌హ‌నంతో వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. అందుకే పిల్ల‌ల‌ను పెంచే తీరును బ‌ట్టి వారి తండ్రి ఎలాంటి వారో చెప్ప‌చ్చ‌ని అంటూ ఉంటారు. అయితే ఇది ఎంత‌వ‌ర‌కు నిజ‌మో మేము మీకు చెప్ప‌లేం. కానీ.. ఒక వ్య‌క్తి .. ముఖ్యంగా పురుషుల పుట్టిన తేదీ (Zodiac) ప్ర‌కారం వారు ఎలాంటి తండ్రి కాగ‌ల‌రో చెప్తాం.


కానీ ఒక్క విష‌యం.. మేము ఈ అంశాలన్నీ న్యూమ‌రాల‌జీని ఆధారంగా చేసుకుని చెబుతున్న‌వి మాత్ర‌మే. వాస్త‌వానికి ప్ర‌తి మ‌నిషి త‌న పిల్ల‌ల‌ను ఎలా పెంచుతార‌నే విష‌యాన్ని చాలా విష‌యాలు ప్ర‌భావితం చేస్తాయి. ముఖ్యంగా చిన్న‌ప్పుడు వారు పెరిగిన తీరు, ప్ర‌స్తుతం వారికి స‌మాజంలో ఉన్న గుర్తింపు, వారు చ‌దివిన చ‌దువు, చేస్తున్న ఉద్యోగం.. ఇవ‌న్నీ అందులో భాగ‌మే. వీటి ఆధారంగానే పురుషులు త‌మ పిల్ల‌ల‌ను పెంచే తీరు కూడా ఉంటుంద‌ని చెబుతున్నారు నిపుణులు. మ‌రి, న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం ఆయా తేదీల్లో పుట్టినవారు.. తండ్రిగా ఎలా మెలుగుతారో చూద్దామా..


 1. పుట్టిన తేదీలు - 1, 10, 19, 28


వీరిని మొద‌టి కేట‌గిరీకి చెందిన వ్య‌క్తులుగా భావిస్తారు. వీరు ఏ విష‌యంలోనైనా మొద‌టి స్థానంలో ఉండ‌డానికే ప్ర‌య‌త్నిస్తారు. వేరొక‌రి నియంత్ర‌ణ‌లో ఉండ‌డానికి వీరు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు. వారికి న‌చ్చిన‌ట్లు ఉండ‌డానికే ప్ర‌య‌త్నిస్తారు.


అయితే మామూలు స‌మ‌యంలో వీరు బాగానే ఉన్నా.. వేళ కాని వేళల్లో పిల్ల‌లు కోరే కోర్కెలు తీర్చ‌డానికి మాత్రం అస్స‌లు ముందుకు వ‌చ్చేందుకు ఇష్ట‌ప‌డ‌రు. ఒక్కోసారి వీరు స‌హ‌నం కూడా కోల్పోతుంటారు. పిల్ల‌ల ప‌ట్ల చాలా కోపాన్ని కూడా ప్ర‌ద‌ర్శిస్తూ ఉంటారు. కానీ వీరు చూపించే ప్రేమ‌, వాత్సల్యం ముందు ఇవ‌న్నీ దిగ‌దుడుపే అని చెప్ప‌చ్చు. ఇవే పిల్ల‌ల‌తో వారిని స‌ర్దుకుపోయేలా చేస్తాయి.


 2. పుట్టిన తేదీలు - 2, 11, 20, 29


ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు పూర్తిగా ఫ్యామిలీ మెన్‌లా ఉంటారు. కుటుంబానికి, అనుబంధాల‌కు ఉన్న ప్రాధాన్యం వీరికి బాగా తెలుసు. పిల్ల‌ల్ని పెంచే విష‌యంలో వీరు త‌మ భాగ‌స్వామికి పూర్తిగా స‌హ‌క‌రిస్తారు.


అంతేకాదు.. వ‌ర్క్ లోడ్ కూడా షేర్ చేసుకుంటారు. పిల్ల‌లతో త‌గినంత స‌మ‌యం గ‌డుపుతూ వారి అవ‌స‌రాల‌ను తీర్చ‌డ‌మే ప్రాధాన్యంగా మార్చుకుంటారు. పిల్ల‌ల‌ను సంర‌క్షించ‌డం వీరికి స‌హ‌జంగానే వ‌చ్చినా.. ఒక్కోసారి వీరు కాస్త హైప‌ర్ సెన్సిటివ్‌గా ప్ర‌వ‌ర్తిస్తుంటారు.


 father


3. పుట్టిన తేదీలు - 3, 12, 21, 30


ఈ కేట‌గిరీకి చెందిన వ్య‌క్తులు త‌మ జీవితాన్ని చ‌క్క‌గా కొన‌సాగించేందుకు ప్రాధాన్యం ఇస్తారు. ఇత‌రుల‌తో స‌ఖ్యత‌తో మెలుగుతూ న‌లుగురి మెచ్చుకోలు పొంద‌డ‌మే కాదు.. వీరి చుట్టూ జ‌నం ఉండాల‌ని ఎప్పుడూ కోరుకుంటారు. అందుకే ఇల్లంతా బంధువుల‌తో నిండి సంతోషంగా ఉండాల‌ని అనుకుంటారు.


తండ్రిగా త‌మ పిల్ల‌ల‌ను చాలా సంతోషంగా, క్రియేటివ్‌గా ఉండేలా పెంచుతారు. అయితే పిల్ల‌ల సంర‌క్షణ విష‌యంలో వారు చేయాల్సిన వాటి కంటే ఎక్కువ ప‌నులు/బాధ్య‌త‌లు పంచుకోవాల్సి వ‌స్తే మాత్రం వీరు కాస్త చిరాకు ప‌డ‌తారు. కానీ ఎప్పుడూ సంతోషంగా ఉండేందుకు అస్స‌లు వెనుకాడ‌రు.


 4. పుట్టిన తేదీలు - 4, 13, 22, 31


వీరు చాలా బాధ్య‌తాయుతంగా మెలిగే వ్యక్తులు. ఏ ప‌ని చేసే విష‌యంలోనైనా చాలా ప‌ద్ధ‌తిగా న‌డుచుకుంటారు. వ్య‌క్తిగ‌త లేదా వృత్తిప‌రమైన జీవితాల్లో వాళ్ల‌ క‌మిట్ మెంట్స్ పూర్తి చేసే విష‌యంలో ఎంత క‌ష్ట‌ప‌డ‌డానికైనా వీరు ఎప్పుడూ సిద్ధ‌మే! వీళ్ల‌ని చాలా సుల‌భంగా న‌మ్మ‌వ‌చ్చు. అంతేకాదు.. మంచి తండ్రులు కూడా అవుతారు.


పిల్ల‌లు, వారి జీవితాల ప‌ట్ల వీరికి ఉన్న బాధ్య‌త‌ల‌ను వీరు సంతోషంగా అంగీక‌రిస్తారు. వాటిని జీవితాంతం నిర్వ‌ర్తిస్తూనే ఉంటారు. అయితే ఒక్కోసారి వీరు కాస్త అస‌హ‌నానికి గుర‌వుతుంటారు. అలాగే మొండిగా కూడా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. ఇవి పిల్ల‌ల‌కు కాస్త ఇబ్బందిగా అనిపించిన‌ప్ప‌టికీ వారితో దృఢ‌మైన బంధాన్ని ఏర్ప‌రుచుకోవ‌డంలో అస్స‌లు అడ్డంకి కావు.


 5. పుట్టిన తేదీలు - 5, 14, 23


వీరు బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలులు. చాలా తెలివైనవారు. జీవితమంతా పార్టీలా స‌ర‌దాగా గ‌డిచిపోవాల‌ని కోరుకుంటారు. అందుకే జీవితంలో త‌లెత్తే ప‌రిస్థితుల‌కు అనుగుణంగా త‌మ‌ని తాము మార్చుకుంటూ ఉంటారు. అందుకే బిడ్డ పుట్టిన మొద‌ట్లో వీరు ప‌ర్ఫెక్ట్ తండ్రులుగా ప్ర‌వర్తిస్తారు.


కానీ కాల‌క్ర‌మేణా వారు జీవితంలో కొత్త‌దనాన్ని కోరుకుంటూ దాన్ని అన్వేషించే ప‌నిలో ప‌డిపోతారు. క‌మ్యూనికేష‌న్ విషయంలో వీరే చాలా బెస్ట్.  అందుకే త‌మ‌తో పాటు చుట్టూ ఉన్న వారి జీవితాల్లో కూడా సంతోషం నింపేందుకు ప్ర‌య‌త్నిస్తారు. పిల్ల‌ల‌ను ఆనందంగా ఉంచుతూనే త‌మ ప‌నుల‌కు స‌మ‌యం కేటాయించుకుంటారు.


 6. పుట్టిన తేదీలు - 6, 15, 24


6


ప్ర‌పంచంలో ఉత్త‌మ తండ్రులు ఎవ‌రు అంటే వీరే అని చెప్ప‌చ్చు. ఇత‌రుల ప‌ట్ల ప్రేమానురాగాల‌తో మెల‌గ‌డం, అవ‌స‌ర‌మైన స‌హాయం చేయ‌డం, బాధ్య‌తాయుతంగా మెల‌గ‌డం.. ఇవ‌న్నీ వీరికి స‌హ‌జంగానే వ‌స్తాయి. అందుకే పిల్ల‌ల‌ను ఎంతో చ‌క్క‌గా చూసుకుంటారు. అంతేకాదు.. వారి పిల్ల‌లు కూడా త‌మ‌లానే ఉండాల‌ని ఆశిస్తారు. కానీ పిల్ల‌ల ఆనందానికి ప్రాధాన్యం ఇచ్చే కార‌ణంగా ప్ర‌తి సంద‌ర్భంలోనూ వీరు స‌ర్దుకుపోతుంటారు. వారికి ఇష్టం ఉన్నా, లేక‌పోయినా పిల్ల‌ల‌కు న‌చ్చిన విధంగా న‌డుచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు.


 7. పుట్టిన తేదీలు - 7, 16, 25


వీళ్లు చాలా తెలివైన‌వారు. అలాగే లాజికల్‌గా ఆలోచిస్తారు. ప్ర‌పంచానికి సంబంధించిన చాలా విష‌యాల గురించి వీరు తెలుసుకుంటారు. ప్ర‌తి విష‌యం గురించీ వీరికంటూ ఒక నిర్దిష్ట‌మైన అభిప్రాయం ఉంటుంది. అలాగ‌ని వాటిని ఇత‌రుల‌పై అస్స‌లు రుద్ద‌రు. అందుకే వీరు కూడా మంచి తండ్రులు అవుతారు. పిల్ల‌ల‌కు అవ‌స‌ర‌మైన విష‌యాలు నేర్పిస్తూ, అన‌వ‌స‌ర విష‌యాల గురించి చ‌ర్చించ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌తారు. జీవించు.. జీవించ‌నివ్వు.. అనే సిద్ధాంతాన్ని వీరు బాగా న‌మ్ముతారు.


 8. పుట్టిన తేదీలు - 8, 17, 26


ఊహ‌ల్లో ఉన్న దాన్ని వాస్త‌వ ప్రపంచంలోకి తీసుకురావ‌డంలో వీరు సిద్ధ‌హ‌స్తులు. అనుకున్న‌ది సాధించ‌కుండా వీరు అస్స‌లు ఊరుకోరు. ఆశించిన విజ‌యాలు సాధించే క్ర‌మంలో పిల్ల‌ల‌ను వీరు అడ్డంకిగా భావించంచ్చు. అయితే ఈ భావాల‌ను కుటుంబ స‌భ్యుల‌కు లేదా పిల్ల‌ల‌కు అస్స‌లు తెలియ‌నీయ‌రు. జీవితంలో వ‌చ్చే స‌మ‌స్య‌ల సుడిగుండాల కార‌ణంగా పిల్ల‌లు ఇబ్బందిప‌డకుండా వీరు చ‌క్క‌ని ప్రణాళిక‌లు ర‌చిస్తారు. ఆర్థికంగా, ఎక‌నామిక‌ల్‌గా చాలా సుర‌క్షిత‌మైన జీవితాల‌ను పిల్ల‌ల‌కు అందిస్తారు.


 9. పుట్టిన తేదీలు - 9, 18, 27


9


ఇత‌రుల‌కు స‌హాయం చేయ‌డంలో వీరు ముందుంటారు. తండ్రులుగా వీళ్లు పిల్ల‌ల‌ను చ‌క్క‌గా అర్థం చేసుకోవ‌డ‌మే కాదు.. వారి ప‌ట్ల జాలితో మెలుగుతారు. పిల్ల‌ల‌కు అవ‌స‌ర‌మ‌య్యే స‌పోర్ట్ సిస్ట‌మ్‌గా వీరి మారిపోతారు. వీరికున్న ఈ ల‌క్ష‌ణాల కార‌ణంగా పిల్ల‌లు కూడా వీరిని అమితంగా ఇష్ట‌ప‌డ‌తారు.


ఇవి కూడా చ‌దవండి


వెడ్డింగ్ స్పెషల్: కొత్త కోడలికి సరికొత్త లుక్ ఇచ్చే డిజైనర్ నగలు


#నా ప్రేమకథ: బెదిరించారు.. భయపెట్టారు.. అయినా మా ప్రేమను గెలిపించుకున్నాం..!


పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఉండే.. ప్రత్యేకత ఏమిటంటే..?