మీరు తల్లి కాబోతున్నారా ? కంగ్రాచ్యులేషన్స్. మాకు తెలుసు మీరెంత సంతోషంగా ఉన్నారో..? ఈ శుభవార్త మీ కుటుంబ సభ్యులతో చెప్పే ఉంటారులే. స్నేహితులతో కూడా ఈ విషయం పంచుకొని ఆ సంతోషాన్ని మరింత పెంచుకోవాలనుకొంటున్నారు కదా..! అయితే మీరు తల్లి కాబోతున్నారనే వార్తను ప్రపంచానికి తెలియజెప్పే కొన్ని అందమైన మార్గాలు మీకోసం..
1. మొదట మీ బెస్టీకి చెప్పండి
మీరిద్దరూ ఒకే ప్రదేశంలో ఉన్నట్లయితే వారిని మీ ఇంటికి ఆహ్వానించి వారితో విషయం చెప్పండి. వారు మీకు దూరంగా ఉన్నట్లయితే.. కాల్ లేదా మెసేజ్ చేయండి. ఇంతకూ ఏమని చెబుతారు? ‘మనం షాపింగ్ చేేయడానికి వెళదాం. ఎక్స్‌ట్రా లార్జ్ సైజ్ టాప్స్, స్ట్రెచ్ డెనిమ్స్ కొనాలి. నాకు కాస్త కంఫర్టబుల్‌గా ఉండాలి కదా..’ అని మెసేజ్ చేయండి లేదా నేరుగా చెప్పండి. వారు దీని అంతరార్థాన్ని కనుగొని థ్రిల్లయిపోతారు. వారు తెలుసుకోలేకపోతే.. ఆ తర్వాత మీరే అసలు విషయం చెప్పొచ్చు.
2. కుకీస్‌తో..
మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు మీరు తల్లి కాబోతున్నారనే వార్తను కాస్త ఆశ్చర్యం కలిగించేలా చెబితే బాగుంటుంది కదా.. అయితే వారి కోసం కస్టమైజ్డ్ కుకీస్ ఆర్డరివ్వండి. మీరు తాతయ్య కాబోతున్నారు. నానమ్మ కాబోతున్నారు. అత్త కాబోతున్నారు… అని ఆ బిస్కెట్స్‌ని చూస్తే వారికి తెలియాలి.
3. ఫొటోతో..
‘బేబీ ఆన్ బోర్డ్’, ‘బంప్ ఎహెడ్’ ఇలా రాసి ఉన్న ప్లకార్డు పట్టుకొని.. ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి.
Also Read: సోషల్ మీడియాలో అమ్మాయిలకు.. ఈ ఆరు పనులూ చాలా చాలా ప్రత్యేకం
4. పుస్తకాలతో..
పిల్లల కథల పుస్తకాలతో మీరు ఓ ఫొటో దిగి.. ‘త్వరలో వీటి అవసరం నాకు చాలా ఉంది’ అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి.
5. సోనోగ్రామ్ రిపోర్ట్‌తో..
గర్భంలో బిడ్డ ఎదుగుదల ఎలా ఉందో తెలుసుకోవడానికి స్కానింగ్ తీస్తారు. దాన్నే సోషల్ మీడియాలో ‘పింక్.. బ్లూ.. మీరేమనుకొంటున్నారు?’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేయండి. Pregnancy News అందరికీ చెప్పేయండి.
6. ఆహారంతో..
అవునండీ.. మీరు తినే ఆహారంతోనూ మీరు తల్లి కాబోతున్నారనే వార్తను అందరికీ తెలియజేయవచ్చు. అదెలాగనుకొంటున్నారా? దానికీ ఓ మార్గం ఉంది. మీకు బాగా ఇష్టమైన ఫుడ్‌ను ఓ పేద్ద ప్లేట్‌లో లేదా బౌల్‌లో సర్దుకొని.. దాంతో ఓ ఫోటో దిగి.. ‘ఇద్దరి కోసం తింటున్నా’ అని క్యాప్షన్ ఇవ్వండి.
7. టీషర్ట్‌తో..
‘మామ్ టు బి’, ‘డాడ్ టు బి’ అని ప్రింట్ చేసి ఉన్న టీషర్ట్స్‌ను మీరు.. మీ భర్త ధరించి ఆ ఫొటోను షేర్ చేస్తే అందరికీ మీరు తల్లి కాబోతున్నారనే అనే వార్త ఇట్టే తెలిసిపోతుంది.
8. బెలూన్లతోనూ చెప్పొచ్చు..
పింక్, బ్లూ రంగుల్లోని బెలూన్లతో ఫొటో దిగి ‘Guess what?’ క్యాప్షన్‌తో పోస్ట్ చేయండి. ఇక అందరూ గెస్ చేయడం మొదలు పెడతారు. మీకు అబ్బాయి పుడతాడా? అమ్మాయి పుడుతుందా అని.
Also Read: ఒత్తిడి నివారణకు ఈ యోగాసనాలు.. గర్భిణులకు ప్రత్యేకం
9. అన్నీ బేబీసే..
బేబీ క్యారెట్స్, బేబీ కార్న్, బేబీ పొటాటోస్‌ను ఓ ప్లేట్లో అందంగా సర్ది.. వాటిని మీ బేబీ బంప్‌తో కలిపి అందమైన ఫొటో తీసి అందరితో పంచుకోండి. మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి.
10. క్యాలెండర్‌లో తేదీని రౌండప్ చేసి..
మీ స్నేహితులకు కాల్ చేసి మీ ఎక్స్‌పెక్టెడ్ డేట్‌ను వారితో చెప్పి.. మీకోసం దాన్ని మార్క్ చేసి ఉంచమని చెప్పండి. అయితే అది మీ డ్యూ డేట్ అని మాత్రం చెప్పొద్దు. అలా వారిలో ఆసక్తి పెరిగిన తర్వాత చివరిలో దాన్ని రివీల్ చేయండి. చాలా థ్రిల్లింగ్‌గా ఫీలవుతారు.
Also Read: హార్మోన్లు మీ బరువుని పెంచేస్తున్నాయా?