స్టైలిస్ట్ అవుట్ ఫిట్స్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా.. నిలుస్తోన్న సంజ‌నా గ‌ల్రానీ..!

స్టైలిస్ట్ అవుట్ ఫిట్స్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా.. నిలుస్తోన్న సంజ‌నా గ‌ల్రానీ..!

తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న న‌టీమ‌ణుల్లో సంజ‌నా గ‌ల్రానీ (Sanjjanna galrani) కూడా ఒక‌రు. బుజ్జిగాడుతో తెరంగేట్రం చేసిన ఈ చిన్న‌ది ఆ త‌ర్వాత కూడా తెలుగులో స‌త్య‌మేవ జ‌య‌తే, స‌మ‌ర్థుడు, దుశ్శాస‌న‌, ముగ్గురు, దండుపాళ్యం.. మొద‌లైన చిత్రాల్లో న‌టించి మెప్పించింది.


అయితే తెలుగు కంటే క‌న్న‌డ చిత్ర ప‌రిశ్రమ‌లోనే సంజ‌న‌కు చ‌క్క‌ని గుర్తింపు ల‌భించింది. ప్ర‌స్తుతం సినిమాల్లోనే కాదు.. బుల్లితెర‌పై కూడా ప్రేక్ష‌కుల‌ను బాగా అల‌రిస్తోంది. ఈ అమ్మ‌డు ఎక్క‌డికి వెళ్లినా సంద‌ర్బానికి త‌గ్గ‌ట్లుగా డ్ర‌స్ చేసుకుంటూ అంద‌రి దృష్టినీ ఆకర్షిస్తుంది. మ‌రి, ఈ సుంద‌రి స్టైల్ ఫైల్‌లో కొన్ని ఫ్యాష‌న్స్‌ను మ‌న‌మూ ఓసారి చూసేద్దామా..
 

 

 


View this post on Instagram


Sparkle ✨ #throwback #excitedme #kannadamovies ❤️#loveforkannada 😍


A post shared by Sanjjanaa Galrani (@sanjjanaagalrani) on
బ్లూజీన్ & వైట్ టీ ష‌ర్ట్.. అమ్మాయిల ఫేవ‌రెట్ కాంబో. దీనిని ఒక్కొక్క‌రు ఒక్కోలా ధ‌రిస్తుంటారు. కొంద‌రు స్టైలిష్ లుక్‌లో మెరిసిపోతే; ఇంకొంద‌రు సింపుల్ లుక్‌తో అద‌ర‌గొడుతుంటారు. కానీ సింపుల్‌గా, స్టైలిష్‌గా క‌నిపించాలంటే మాత్రం మ‌న సంజ‌న‌ను ఫాలో కావాల్సిందే. చూడండి.. బ్లూ జీన్‌కు తెలుపు రంగు ష‌ర్ట్ జ‌త చేసి స్టేట్ మెంట్ నెక్లెస్‌తో భ‌లేగా మెరిసిపోతుంది క‌దూ..!
 

 

 


View this post on Instagram


Sparkle ✨ #throwback #excitedme #kannadamovies ❤️#loveforkannada 😍


A post shared by Sanjjanaa Galrani (@sanjjanaagalrani) on
ఫంక్ష‌న్ లేదా పార్టీ వంటివి జ‌రిగే సంద‌ర్భాల్లో బార్బీ డాల్‌లా మెరిసిపోవాల‌ని ప్ర‌తి అమ్మాయి ఆశ‌ప‌డ‌డం స‌హ‌జ‌మే క‌దా.. అయితే అలా అందాల బొమ్మ‌లా మెరిసిపోవాలంటే కేవ‌లం డ్ర‌స్ మాత్ర‌మే కాదు.. దానికి త‌గ్గ మేక‌ప్ కూడా తోడు కావాల్సిందే.. అదెలా ఉండాలో తెలియాలంటే మాత్రం సంజ‌న ధ‌రించిన ఈ అవుట్ ఫిట్ చూడాల్సిందే.. రాయ‌ల్ బ్లూ క‌ల‌ర్ లేయ‌ర్డ్ లాంగ్ గౌన్‌కి క‌ర్లీ హెయిర్, స్మోకీ ఐస్‌తో మ‌త్తెక్కిస్తోంది క‌దూ..
 

 

 


View this post on Instagram


Black and white !! ❤️ the greatest combination ever 😍


A post shared by Sanjjanaa Galrani (@sanjjanaagalrani) on
ఎవ‌ర్ గ్రీన్ ఫ్యాష‌న్స్‌లో బ్లాక్ అండ్ వైట్ కాంబినేష‌న్ కూడా ఒక‌టి. దీనిని ఒక్కొక్క‌రూ ఒక్కో శైలిలో ధ‌రిస్తూ ఉంటారు. అయితే స్టైలిష్ లుక్ రావాలంటే మాత్రం అది కొంద‌రికే సాధ్యం. వారిలో సంజ‌న కూడా త‌ప్ప‌కుండా ఒక‌ర‌ని చెప్పాలి. కావాలంటే మీరే చూడండి.. వైట్ క‌ల‌ర్ టాప్‌కి అసిమెట్రిక్ స్క‌ర్ట్‌ని బాట‌మ్‌గా జ‌త చేసి, వైట్ హీల్స్, స్టోన్డ్ రింగ్స్‌తో చాలా అందంగా క‌నిపిస్తోంది.

కొత్త ఫ్యాష‌న్స్ ధ‌రించే వారి కంటే ఏ ఫ్యాష‌న్ అయినా త‌మ‌దైన శైలిలో ఫాలో అయ్యేవారే ఎక్కువ ఫ్యాష‌నబుల్‌గా క‌నిపిస్తారు. ఇందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ సంజ‌నే. చూడండి.. బ్లూ అండ్ బ్లాక్ క‌ల‌ర్ చుడీదార్‌లో ఎంత సింపుల్ గా మెరిసిపోయిందో...

అస‌లే స‌మ్మ‌ర్.. మీరు చూస్తే లాంగ్ ఫ్రాక్స్, ప్యాంట్స్ అంటున్నారు అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా?? స‌మ్మ‌ర్ ఫ్యాష‌న్స్ విష‌యానికి వ‌స్తే ప్లెయిన్ అవుట్ ఫిట్స్ ధ‌రించ‌వ‌చ్చు. కాట‌న్ లేదా మెత్త‌ని ఫ్యాబ్రిక్‌తో త‌యారుచేసిన వ‌దులైన దుస్తులు ఈ సీజ‌న్‌కు మంచి ఎంపిక‌. సంజ‌న కూడా ప్లెయిన్ క‌ల‌ర్ జంప్ సూట్ త‌ర‌హా అవుట్ ఫిట్ ఈ కోవ‌కు చెందిందే.

వేడి పుట్టించే వేస‌విలో ఫుల్ హ్యాండ్స్ క‌న్నా స్లీవ్ లెస్ లేదా కోల్డ్ షోల్డ‌ర్ మోడ‌ల్స్ సౌక‌ర్య‌వంతంగా ఉంటాయి. అందుకే ఈ సీజ‌న్‌లో ఫ్రాక్స్ ధ‌రించాల్సి వ‌స్తే.. లైట్ క‌ల‌ర్స్‌తో పాటు.. స్ట్రాప్డ్ ఫ్రాక్ త‌ర‌హావి ధరిస్తే బాగుంటుంది. సంజ‌న ధ‌రించిన లైట్ పింక్ క‌ల‌ర్ స్ట్రాప్డ్ ఫ్రాక్ దీనికి ఉదాహ‌ర‌ణ‌.

ప్ర‌స్తుతం ట్రెండ్ అవుతున్న ప‌లాజోని కూడా స‌మ్మ‌ర్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవ‌చ్చు. దీనికి కూడా త‌గిన బాట‌మ్స్‌ని జ‌త చేస్తూ మ్యాచింగ్ స్కార్ఫ్‌తో మ్యాజిక్ చేయ‌చ్చంటే న‌మ్ముతారా?? నిజం.. కావాలంటే మీరే చూడండి.. సంజ‌న ధ‌రించిన ఈ బ్లాక్ అండ్ వైట్ అవుట్ ఫిట్ ఇందుకు ప్ర‌త్య‌క్ష సాక్ష్యం.


ఈ ఫ్యాష‌న్స్ ఆమె స్టైల్ ఫైల్‌లో కొన్ని మాత్ర‌మే. ఇలాంటివి ఆమె ఇన్ స్టాగ్రామ్‌లో ఇంకా చాలా ఉన్నాయి. కావాలంటే మీరే చూడండి..


ఇవి కూడా చదవండి


నటనతోనే కాదు.. తన ఫ్యాషన్స్ తోనూ ఆకట్టుకుంటోన్న తెలుగమ్మాయి ఈషా రెబ్బా..


వావ్.. అనిపించే ఫ్యాషన్స్‌తో అదరగొడుతున్న విష్ణుప్రియ..!


ఫ్యాషన్ క్వీన్ 'అను ఇమ్మాన్యుయెల్'ను ఫాలో అవ్వండి .. మీరూ స్టైలిష్ లుక్‌లో మెరిసిపోండి..!