అను ఇమ్మాన్యుయెల్ (Anu Emmanuel).. మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ. కళ్లు మూసి తెరిచే లోపే "గుండెలోకే చేరావె.." అంటూ సినిమాలో హీరోతోనే కాదు.. తనదైన అందచందాలు, ఫ్యాషన్స్‌తో కుర్రకారుని కూడా తనవైపు తిప్పుకుందీ అందాల భామ.
మజ్ను తర్వాత ఆక్సిజన్, నా పేరు సూర్య వంటి చిత్రాల్లో నటించిన అను.. కిందటి ఏడాది శైలజారెడ్డి అల్లుడు చిత్రంలో నాగచైతన్యకు జంటగా, ఈగో ఎక్కువగా ఉన్న అమ్మాయిగా నటించి అందరి మెప్పును పొందింది.
అయితే ఈ అందాల భామ కేవలం వెండితెరపై మాత్రమే కాదు.. సాధారణ సందర్భాలు, ప్రత్యేక కార్యక్రమాలకు హాజరయ్యే క్రమంలో సైతం తన ఫ్యాషన్స్ సెన్స్‌ను అందరికీ చాటుతూ ఉంటుంది. మరి, టాలీవుడ్ సొగసరిగా పేరు తెచ్చుకున్న ఈ భామ స్టైల్ ఫైల్‌లో కొన్ని ఫ్యాషన్స్‌ను మనం కూడా ఓసారి చూద్దామా..
అమ్మాయిల వార్డ్ రోబ్‌లో ఒక బ్లాక్ డ్రస్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అది సంప్రదాయ ధోరణిలో ఉన్నది కావచ్చు లేదా వెస్ట్రన్ తరహాది కావచ్చు. అయితే కాలేజీ అమ్మాయిలకు మాత్రం ఎక్కువగా ఫ్యాంట్, బాటమ్స్ అంటే బాగా ఇష్టం. అందుకే మన అను కూడా అదే స్టైల్‌ని ఫాలో అయ్యింది. ప్లెయిన్ బ్లాక్ టాప్, బాటమ్‌కు గ్రే కలర్ ష్రగ్ జత చేసి హీల్స్ అండ్ కూల్ గ్లాసెస్‌తో భలే అందంగా మెరిసిపోయింది.
చక్కనమ్మ ఏం కట్టుకున్నా చాలా అందంగా మెరిసిపోతుంది.. మన అను కూడా అంతే. అందుకే ఆరు గజాల చీరలో కూడా చూడచక్కని ముద్దుగుమ్మలా కనిపిస్తూ అచ్చం మన తెలుగింటి అమ్మాయిలా అనిపిస్తోంది కదూ. పైగా ఆమె కట్టుకున్నది ప్లెయిన్ శారీ అయినా.. లుక్ మాత్రం క్లాసీగా కనిపిస్తోంది.
View this post on InstagramGuys I'm officially on Twitter!! Click the link in my bio to follow 😉 @itsanuemmanuel
అమ్మాయిలంతా ఎక్కువగా ధరించే అవుట్ ఫిట్స్‌లో చుడీదార్ కూడా ఒకటి. మోము కాస్త కళగా ఉంటే చాలు.. కొంతమంది అమ్మాయిలకు ఎలాంటి డ్రస్ అయినా ఇట్టే నప్పేస్తుంది. మన అనుకి కూడా అంతే.. లైట్ స్కై బ్లూ కలర్ నార్మల్ చుడీదార్ లో కూడా ఈ అమ్మడు అందాల శిల్పాన్ని తలపిస్తోంది కదూ!
కేరళ చీరలంటే ఇష్టపడే అమ్మాయిలు చాలామందే ఉంటారు. అందుకే ఒక్క చీరైనా తప్పనిసరిగా కొనుగోలు చేసి.. తమ వార్డ్ రోబ్‌లో భాగం చేసుకుంటూ ఉంటారు. అయితే దానిని కట్టుకోవడం మాత్రం కొందరికే బాగా తెలుస్తుంది. కేరళ చీర ఎలా కట్టుకోవాలి? దానికి ఎలాంటి యాక్సెసరీస్ జత చేయాలి? హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి??.. మొదలైన విషయాల్లో మీకూ ఏమైనా సందేహాలున్నాయా? అయితే ఇక ఏ మాత్రం ఆలోచించకుండా అనుని ఫాలో అయిపోండి. కుందనపు బొమ్మలా మెరిసిపోండి.
View this post on Instagram
అమ్మాయిలు బాగా ఇష్టపడే ట్రెండ్స్‌లో లేయరింగ్ కూడా ఒకటి. మీకూ అంతేనా? అయితే అను వేసుకున్నట్లుగా ఒక మంచి లేయర్ టాప్ సెలక్ట్ చేసుకుని చక్కని సిల్వర్ మెటాలిక్ జ్యుయలరీ పెట్టుకోండి. సింపుల్ లుక్‌తో భలే హుందాగా మెరిసిపోవచ్చు. ఏమంటారు?
View this post on Instagram
అసలే ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి.. ఈ సమయంలో లేయర్డ్ ఫ్యాషన్స్, జీన్స్ అంటే కష్టం కదా అంటారా? అయితే కాటన్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన ఆకర్షణీయమైన టాప్స్ ఎంపిక చేసుకుని కూడా చూడముచ్చటగా తయారుకావచ్చు. కాకపోతే మ్యాచింగ్ హెయిర్ స్టైల్ జత చేయాలి.
View this post on Instagram
సమ్మర్‌లో ఎక్కువమంది ఎంపిక చేసుకునే ఇక్కత్‌తో కూడా మనం ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవచ్చని నిరూపించిందీ సుందరి. స్కై బ్లూ కలర్ శారీకి డార్క్ బ్లూ బ్లౌజ్ జత చేసి, అదే ఫ్యాబ్రిక్‌తో పాకెట్‌లా కూడా డిజైన్ చేసిన ఈ చీరను చూశారా? భలేగా ఉంది కదూ!
View this post on Instagram
ఫ్రెష్ లుక్‌తో తాజాగా, అందంగా కనిపించాలని ఆశపడని అమ్మాయిలుంటారా చెప్పండి. అలాంటి వారంతా ఎక్కువగా ఎంపిక చేసుకునే కలర్ మ్యాంగో ఎల్లో. అను కూడా అదే రంగు చీరలో ఎంత అందంగా మెరిసిపోయిందో చూడండి. పైగా దానికి మ్యాచింగ్‌గా ఆమె ఎరుపు రంగు లిప్ స్టిక్, హూప్ ఇయర్ రింగ్స్‌తో.. ఇది కూల్ గాల్ లుక్ అనిపించేలా కనిపిస్తోంది.
ఇవన్నీ అను ఫ్యాషన్ ఫైల్‌లో ఉన్న కొన్ని స్టైల్స్ మాత్రమే. ఈ అమ్మడు ట్రెండీ ఫ్యాషన్స్‌ను కూడా బాగానే ఫాలో అవుతుంది. కావాలంటే ఆమె ఇన్ స్టాగ్రామ్ పై మీరూ ఓసారి లుక్కేయండి..
ఇవి కూడా చదవండి
అందంలోనే కాదు.. ఫ్యాషన్స్‌లో కూడా అనుపమ పరమేశ్వరన్ అదుర్సే..!
మన అందాల 'వర్షిణి' ఫ్యాషన్స్ ఫాలో అయిపోండి.. మీరూ క్యూట్ అనిపించుకోండి..!
ఫ్యాషన్స్‌లో కూడా "హనీ ఈజ్ ది బెస్ట్" అనిపిస్తోన్న మెహరీన్..!