మీ రాశిఫలాలు వీక్షించండి.. మీ జీవన ప్రయాణంలో మలుపులను తెలుసుకోండి..!

మీ రాశిఫలాలు వీక్షించండి.. మీ జీవన ప్రయాణంలో మలుపులను తెలుసుకోండి..!

ఈ రోజు (ఏప్రిల్ 29) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..


 


మేషం (Aries) – ప్రేమ ఎంతటి గాయాన్నైనా ఇట్టే మాన్పగలదు. మీరు ఇష్టపడినవారు సంతోషంగా ఉండాలంటే మీరు కూడా సంతోషంగా ఉండడం ముఖ్యమే కదా. కాబట్టి అందరినీ అపరిమితంగా ప్రేమించండి.


వృషభం (Tarus) – ఇతరుల నుండి మీకు త్వరలో డబ్బు, గిఫ్ట్స్, అవకాశాలు, సలహాలు.. వర్షంలా కురవనున్నాయి లేదా ముఖ్యమైన విషయంలో ఇతరుల సహాయం మీకు అందుతుంది. ఇప్పుడు మీ ముందు చాలా అవకాశాలున్నాయి. కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తూ.. జాగ్రత్తగా ఎంచుకోండి.


మిథునం (Gemini) – మీ జీవితంలో ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందులు.. అన్నీ త్వరలోనే తొలగిపోనున్నాయి. ఫలితంగా మెరుగైన భవిత కోసం మీరు మరింత ధైర్యంగా ముందుకు వెళ్లవచ్చు. ఇకపై మీరు ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు.


కర్కాటకం (Cancer) – ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందు ఉండండి. తద్వారా మీరు కూడా కెరీర్‌లో మరింతగా ఎదగచ్చు. మీ మనసులో ఉన్న బాధను తగ్గించుకోవచ్చు. మీరు కోరుకున్న సంతోషాన్ని పొందవచ్చు.


సింహం (Leo) –  మీరు ప్రస్తుతం ఏవైనా సవాళ్లు ఎదుర్కొంటుంటే.. వాటిని ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో అధిగమించగలమని నమ్మండి. మీలో ఉన్న శక్తి, సామర్థ్యాలపై మీరు నమ్మకం కలిగి ఉండడం చాలా ముఖ్యం.


క‌న్య (Virgo) – పట్టుదలతో పని చేస్తే విజయం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది. అయితే మీరు పని విషయంలో క్రమశిక్షణ కలిగి ఉండడం కూడా చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. మీ లక్ష్యాలను సాధించడానికి అది కూడా అవసరమే.


తుల (Libra) – మీ జీవితంలో అద్భుతమైన పాజిటివ్ మార్పులు త్వరలోనే రానున్నాయి. మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు అవి మీ అనుభవంలోకి వస్తాయి. కనుక సిద్ధంగా ఉండండి. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా.. ఎదుర్కొని మీ లక్ష్యాన్ని చేరుకొనేలా ప్రణాళికలు రచించండి.


వృశ్చికం (Scorpio) – మీ జీవితాన్ని చక్కగా బ్యాలన్స్ చేసుకోండి. సంపాదనకు, ఖర్చుకు మధ్య బ్యాలన్స్ ఉండడం చాలా అవసరం. వర్షకాలం కోసం కాస్త పొదుపు చేయండి. అలాగే మీకున్న సంపాదనలోనే కాస్త సేవాకార్యక్రమాలకు కూడా వెచ్చించండి. అందరికీ ప్రేమను అందించండి.


ధనుస్సు (Saggitarius) – మీ గతాన్ని అక్కడితో వదిలేసి ప్రస్తుత పరిస్థితిని ముగించేయండి. దాని వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం లేదు. మిమ్మల్ని సంతోషంగా ఉండనివ్వని పరిస్థితులకు మీరు దూరంగా జరగడమే మేలు. మీరూ అందరినీ క్షమించండి. తప్పు చేస్తే ఇతరులను క్షమాపణ కోరండి.


మకరం (Capricorn) – మీకు ఎదురయ్యే సవాళ్లను చూసి అధైర్యపడకండి. మరింత స్పష్టంగా, సమర్థంగా పని చేసేందుకు ప్రయత్నించండి. మీరు పెట్టుకున్న హద్దులను ఇతరులు దాటలేరని నిరూపించండి. మీ కోసం మీరు నిలబడకపోతే ఇంకెవ్వరూ నిలబడరు. కనుక, మీరే చొరవ చూపాలి.


కుంభం (Aquarius) – మీరు ప్రస్తుతం ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. కానీ మీరిప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే మీ ముందు ఉన్న అవకాశాన్ని మరొకరు అందుకోవచ్చు. కాబట్టి మనసు, బుర్ర రెండూ ఓ దగ్గర పెట్టి ప్రశాంతంగా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండండి.


మీనం (Pisces) – మీరున్న ప్రస్తుత పరిస్థితుల్లో మీకు మరొకరి సహాయం తప్పనిసరిగా అవసరం అవుతుంది. కాబట్టి మీ చుట్టూ ఉన్నవారిని సహాయం అడగడానికి వెనకడుగు వేయకండి. ఇది మీరు ఒంటరిగా హ్యాండిల్ చేసే పరిస్థితి కాదని గుర్తుంచుకోండి.


Credit: Asha Shah


ఇవి కూడా చ‌దవండి


మకర రాశి అమ్మాయిల మనస్తత్వం.. ఎలా ఉంటుందో మీకు తెలుసా..!


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?


ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!