ADVERTISEMENT
home / Astrology
మీ రాశిఫలాలు వీక్షించండి.. మీ జీవితంలో జరిగే మార్పులను తెలుసుకోండి

మీ రాశిఫలాలు వీక్షించండి.. మీ జీవితంలో జరిగే మార్పులను తెలుసుకోండి

ఈ రోజు (ఏప్రిల్ 28) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..

 

మేషం (Aries) –  కొందరు మనుషులతో పాటు కొన్ని పరిస్థితుల నుండి దూరం జరగండి. ఎందుకంటే మీరు వ్యక్తులు లేదా వస్తువులతో అవసరం అయినదానికంటే ఎక్కువగానే బంధం ఏర్పరుచుకుంటారు. ఫలితంగా ఎక్కువగా బాధపడుతుంటారు. అది సరికాదు.

వృషభం (Tarus) – అనవసరమైన ఆలోచనలను మీ బుర్ర నుంచి వెంటనే తొలగించుకోండి. ముందే మీ బుర్రలో ఇన్ని ఆలోచనలు ఉంటే.. కొత్తవి ఆలోచించడానికి లేదా విశ్లేషించుకోవడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? ఓపెన్ మైండ్‌తో ఉండండి. అయినా కష్టపడితేనే ఫలితం దక్కుతుందనే విషయాన్ని నమ్మండి.

ADVERTISEMENT

మిథునం (Gemini) – మీకు ఏవైతే మంచి చేస్తాయో అవి మిమ్మల్ని త్వరలోనే వచ్చి చేరతాయి. కాబట్టి మీ వంతుగా మీరు ఏం చేయాలో అది చేయండి. మిగతా అంతా మంచే జరుగుతుందనే నమ్మకం కలిగి ఉండండి. మీ నమ్మకమే మీకు శ్రీరామరక్ష.

కర్కాటకం (Cancer) –  మీకేం కావాలో మీకు స్పష్టంగా తెలుసా?? ఏం చేస్తే మీరు సంతోషంగా ఉంటారో గ్రహించిన తర్వాతే మీరేం చేయాలనే విషయంలో ఒక నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయం బట్టే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

సింహం (Leo) –  మీ జీవితంలో మీరు ఏం మిస్ అయ్యారో దాని గురించే మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అలాగే ఇతరులతో మీ జీవితాన్ని పోల్చుకుంటూ లేని వాటి కోసం చింతిస్తున్నారు. ఒక్కసారి ఆ మార్గం నుంచి బయటకు వచ్చి మీ జీవితాన్ని మీరు ఆస్వాదిస్తూ.. మీరూ సంతోషించడం మొదలుపెట్టండి.

క‌న్య (Virgo) –  మీరు ఊహించని రూపాల్లో మీ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. కాబట్టి పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఇలానే ముందుకు వెళ్తూ ఉండండి. తప్పకుండా అంతా మంచే జరుగుతుంది.

ADVERTISEMENT

తుల (Libra) – మిమ్మల్ని బాధించే విషయాలన్నింటి గురించీ మీరు కూడా ఆలోచించడం ఆపేయండి. తద్వారా చాలా వరకు ఒత్తిడి తగ్గుతుంది. ఏం చేసినా సఫలత సాధిస్తారనే నమ్మకంతోనే పని చేయండి. తప్పక ఫలితం కనిపిస్తుంది.

వృశ్చికం (Scorpio) – రేపు ఎలా ఉంటుందా అని మీ భవిష్యత్తు గురించి మీరు బాధపడుతున్నారా? అవసరం లేదు. మీరు వెళ్లే దారి సరైనదైనప్పుడు మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే చాలు.. అన్నీ సవ్యంగా జరుగుతాయని నమ్మండి.

ధనుస్సు (Saggitarius) – మీ జీవిత ప్రయాణాన్ని, గతంతో ఒక వర్తమానాన్ని పోల్చుకొని.. ఓ సమీక్ష అనేది చేయండి. ఎంత దూరం ప్రయాణించారో మీకే తెలుస్తుంది. ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకుంటూ వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మిమ్మల్ని మీరు కోల్పోతున్నారని గమనించండి.

మకరం (Capricorn) – విజయం సాధించాలని ఎప్పట్నుంచో మీరు కంటున్న కలలు త్వరలోనే నిజం కానున్నాయి. మీకున్న ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అయితే కొన్ని విషయాల్లో మీకు సందేహంగా అనిపించినా ధైర్యంగా ఉండండి. మీరు కోరుకుంటుంది త్వరలోనే మిమ్మల్ని వచ్చి చేరుతుంది.

ADVERTISEMENT

కుంభం (Aquarius) – మీరు చేసే ప్రతి పనిలోనూ నిజాయితీగా వ్యవహరించడం చాలా ముఖ్యం. లేదంటే మీరు విజయం సాధించినా అది తాత్కాలికం కావచ్చు. మీ ఎమోషన్స్, కోరికల విషయంలో నిజాయతీ కలిగి ఉండడం చాలా అవసరం.

మీనం (Pisces) – మీరు చేసే పని కారణంగా మీకు తగిన గుర్తింపు లభిస్తుంది. అనేక రూపాల్లో రివార్డులు అందుకోనున్నారు. ఈ సమయంలో మీ ఈగో కారణంగా మీరు ప్రభావితం కావద్దు. మీకున్న నాలెడ్జ్‌ని ఇతరులతో పంచుకోండి.

Credit: Asha Shah

ఇవి కూడా చ‌ద‌వండి

ADVERTISEMENT

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

మకర రాశి అమ్మాయిల మనస్తత్వం.. ఎలా ఉంటుందో మీకు తెలుసా..!? – 

27 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT