మీ రాశిఫలాలు వీక్షించండి.. మీ విజయాలకు బాటలు వేయండి..!

మీ రాశిఫలాలు వీక్షించండి.. మీ విజయాలకు బాటలు వేయండి..!

ఈ రోజు (ఏప్రిల్ 30) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..


 


మేషం (Aries) –  మీ జీవితం ప్రస్తుతం చాలా నిదానంగా ముందుకు వెళ్తోంది. అయితే మీ శక్తి, సామర్థ్యాలను మరింత పెంచుకోవడం ద్వారా దానిని మరింత విజయవంతంగా మలచుకోవచ్చు. అప్పుడే మీకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించగలరు.


వృషభం (Tarus) –  మీ మనసులో మీకేం కావాలో బాగా తెలుసు. కానీ మీ మెదడులో ఉన్న లాజికల్ ఆలోచనలు మిమ్మల్ని ముందడుగు వేయకుండా ఆపుతున్నాయి. ఒక్కసారి మీ మనసు మాట విని ముందడుగు వేయండి. సరైన దారిని ఎంపిక చేసుకుని అనుకున్నది సాధించండి.


మిథునం (Gemini) –  భిన్నమైన కోణం నుంచి చూడడం ద్వారా పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ జీవితంలో ఇప్పుడున్న పరిస్థితి కేవలం తాత్కాలికం మాత్రమే. త్వరలోనే మీరు అనుకున్నది సాధిస్తారు.


కర్కాటకం (Cancer) –  మీరు చేస్తున్న పనిని బాగా ఇష్టపడుతుండడంతో దానితోనే బిజీగా ఉంటున్నారు. కానీ మిగతా పనులు కూడా ఉంటాయని గుర్తించండి. కాబట్టి మీరు ఇష్టపడే అభిరుచులు లేదా ప్రేమించే పనులు చేయండి. 


సింహం (Leo) –  మీరు చేసే ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. అనుకోనివిధంగా మీకు లాభదాయకమైన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తొలుత మీకు కొత్త వాతావరణం.. కాస్త ఇబ్బందిని కలిగించినా తర్వాత అన్నీ సర్దుకుంటాయి. మీరు మీ పనిని ఆస్వాదించడం మొదలుపెడతారు.


క‌న్య (Virgo) –  మీకున్న ఒత్తిడి, బాధల నుంచి విముక్తి పొందండి. అనవసర విషయాల గురించి ఆలోచించే మనస్తత్వం కారణంగా మీరు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. వ్యర్థమైన పనుల కోసం సమయాన్ని వేస్ట్ చేయకండి.


తుల (Libra) –  ఆర్థికపరమైన విషయాల గురించి మీకున్న కొన్ని నమ్మకాలను మార్చుకోవాలి. అవే మీకు అడ్డంకిగా మారుతున్నాయి. కాబట్టి వెంటనే వాటిని మార్చుకోండి. అప్పుడే మీ జీవితంలో మార్పు వస్తుంది. ముఖ్యంగా అప్పులు ఇచ్చే విషయంలో.. పుచ్చుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. 


వృశ్చికం (Scorpio) – మీ జీవితంలో నిలకడతనం లేదని మీకు అనిపించవచ్చు. ఒకేసారి చాలా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నించడం వల్ల కూడా మీకు ఇలా అనిపించవచ్చు. అందుకే కొన్నాళ్లు మల్టీటాస్కింగ్ చేయడం ఆపండి. 


ధనుస్సు (Saggitarius) – మీ శారీరక, మానసిక శక్తి, సామర్థ్యాలను హరించే వ్యక్తుల మధ్యలో మీరు ఉన్నారు. ఒంటరిగా సమయం గడపండి. ధ్యానం చేయండి. అప్పుడు మీకే ఓ స్పష్టత వస్తుంది. అలాగే మీరు ఆత్మస్థైర్యాన్ని ఎన్నడూ కోల్పోవద్దు. 


మకరం (Capricorn) – ప్రస్తుతం మీరు లాభాల బాటలో పయనిస్తున్నారు. మీరు అనుకొనే దానికన్నా మీరు చాలా ఎక్కువ సాధించగలరు. అయితే మీరు ఏం చేసినా అది పూర్తి పట్టుదల, ఏకాగ్రతతో చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా బద్దకాన్ని వీడి.. కొన్ని విషయాల్లో వివేకమైన నిర్ణయాలు తీసుకోవాలి. 


కుంభం (Aquarius) –  మీ గతం మీ జీవితంలో మిమ్మల్ని వెనక్కి లాగుతోంది. కాబట్టి దాన్ని అక్కడితో వదిలిపెట్టి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించండి. ఆత్మవిశ్వాసం, నమ్మకంతో ముందుడుగు వేస్తే ఏదైనా సాధించవచ్చు. మీ ఆత్మవిశ్వాసమే మీకు కొండంత బలం. 


మీనం (Pisces) –  ప్రేరణ కలిగించే లేదా మిమ్మల్ని మోటివేట్ చేసే వ్యక్తులను మీ చుట్టూ ఉండేలా చూసుకోండి. వారితో కలిసి ఉండడం వల్ల మీలో కూడా ఉత్సాహం నిండి లక్ష్యాలను సునాయాసంగా సాధిస్తారు. అప్పుడు మీ జీవితం కూడా గెలుపుబాటలో పయనిస్తుంది. 


Credit: Asha Shah


ఇవి కూడా చ‌ద‌వండి


మకర రాశి అమ్మాయిల మనస్తత్వం.. ఎలా ఉంటుందో మీకు తెలుసా..!


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?


ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!