భిన్నమైన లెహెంగా డిజైన్స్ తో స్టైల్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకున్న కియారా.. | POPxo

భిన్నమైన లెహెంగా డిజైన్స్ తో స్టైల్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకున్న కియారా..

భిన్నమైన లెహెంగా డిజైన్స్ తో స్టైల్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకున్న కియారా..

కియారా అద్వాణీ (Kiara Advani).. ఎం.ఎస్.ధోనీ చిత్రంతో తన నటప్రతిభను చాటిన ఈ ముద్దుగుమ్మ భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఆ తర్వాత వినయ విధేయ రామ చిత్రంతో మరోసారి అందరినీ తన అందచందాలు, అభినయంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం హిందీ అర్జున్ రెడ్డి.. అదేనండీ.. షాహిద్ కపూర్ నటిస్తోన్న కబీర్ సింగ్ సినిమాలో కథానాయికగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రడీ అవుతోంది. అయితే ఈ అమ్మడు వెండితెరపై అనుసరించే ఫ్యాషన్స్ చూడచక్కగా ఉంటాయన్న విషయం మనకు విదితమే. అది కేవలం సిల్వర్ స్క్రీన్ కే పరిమితం అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే కియారా బయట కూడా సందర్భానికి తగినట్లుగా డ్రస్ చేసుకుంటూ నలుగురి చూపునీ ఆకర్షించడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది. ముఖ్యంగా ఆమె ధరించే లెహెంగా డిజైన్స్ అయితే అమ్మాయిలందరినీ కూడా ఇట్టే మాయ చేసేస్తాయి. మరి, కియారా ధరించిన టాప్ అవుట్ ఫిట్స్ లో స్థానం సంపాదించుకున్న కొన్ని లెహెంగా డిజైన్స్ ని మనమూ చూసేద్దామా..
 

 

 


View this post on Instagram


MM🖤


A post shared by KIARA (@kiaraaliaadvani) on
సాధారణంగా లెహెంగా అనగానే లైట్ కలర్స్ లేదా పేస్టల్ షేడ్స్ లోనే ఎక్కువగా మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ నలుపు రంగు లెహెంగా ధరించి కూడా అద్భుతంగా మెరిసిపోవచ్చని కొందరు ముద్దుగుమ్మలు చెప్పకనే చెప్పారు. అలాంటి అందాల బొమ్మల జాబితాలో కియారా కూడా ఒకరు. కావాలంటే ఆమె ధరించిన ఈ లెహెంగా చూడండి.. బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ కు మ్యాచయ్యేలా సిల్వర్ లేదా క్రిస్టల్ వర్క్ ఉన్న లెహెంగాకు సింపుల్ గా డైమండ్ జ్యుయలరీ జత చేసి కుందనపు బొమ్మలా మెరిసిపోతోంది కదూ..
 

 

 


View this post on Instagram


MM🌸


A post shared by KIARA (@kiaraaliaadvani) on
తెలుపు రంగు దుస్తులు ఎవరు ధరించినా చూడచక్కగా దేవకన్యలా మెరిసిపోవడం సహజమే. మరి, మంచి డిజైనర్ లెహెంగా ధరిస్తే ఎలా ఉంటుందో తెలియాలంటే కియారాని చూడాల్సిందే.. స్లీవ్ లెస్ టాప్, సీక్వెన్స్ వర్క్ ఉన్న లెహెంగాకు డైమండ్ జ్యుయలరీ జత చేసి సింపుల్ హెయిర్ స్టైల్ తో ఎంత అందంగా కనిపిస్తోందో మీరే చూడండి.
 

 

 


View this post on Instagram


@kanikakapoor_houseofchikankari ✨


A post shared by KIARA (@kiaraaliaadvani) on
తెలుపు రంగు అవుట్ ఫిట్స్ పై మిర్రర్ వర్క్ ఉంటే ఆ లుక్కే వేరు. అందులోనూ రాత్రి సమయంలో జరిగే ఫంక్షన్లు, పార్టీలకు ఇలాంటి డ్రస్ వేసుకెళ్తే ఎలా ఉంటుందంటారు?? మన కియారా కూడా ఇదే స్టైల్ ని ట్రై చేసింది. అయితే ఆ అవుట్ ఫిట్స్ కి జతగా పెర్ల్స్ ఉన్న గాజులతో పాటు, చక్కని చోకర్ కూడా పెట్టుకుంది.
 

 

 


View this post on Instagram


The one that made it to the post! Red alert❤️ @karanjohar


A post shared by KIARA (@kiaraaliaadvani) on
లెహెంగా అనగానే చాలామంది అమ్మాయిలు ఎంచుకోవడానికి మొగ్గుచూపే కలర్ ఎరుపు. అలాంటి ప్రకాశవంతమైన రంగుకి మిర్రర్ లేదా సిల్వర్ షేడ్ కూడా జత చేస్తే ఎలా ఉంటుంది?? కియారా కూడా ఈ కాంబినేషన్ ప్రయత్నించి భలే అందంగా కనిపిస్తోంది చూడండి.
 

 

 


View this post on Instagram


@shyamalbhumika #Indiacoutureweek2018 #debut✨


A post shared by KIARA (@kiaraaliaadvani) on
కియారా ధరించిన ఈ లెహెంగా చాలా బాగుంది కదూ.. పేస్టల్ షేడ్ కి దగ్గరగా ఉన్న ఈ లెహెంగాపై పెద్దగా వర్క్ ఏమీ లేకపోయినా దానిపై ఉన్న ఫ్లోరల్ డిజైన్స్ మాత్రం డ్రస్ కి మంచి లుక్ తెచ్చిపెట్టాయి. అలాగే బ్లౌజ్ కి ఉన్న నెట్టెడ్ హ్యాండ్స్ కూడా అవుట్ ఫిట్ అందాన్ని మరింత ఇనుమడించేలా చేశాయి. ఇక డ్రస్ కి మ్యాచింగ్ గా కియారా ధరించిన చోకర్ అయితే హైలైట్ అని చెప్పచ్చు.

కాస్త ప్రత్యేకమైన సందర్భమైనా లేదా రాత్రి వేళల్లో జరిగే స్పెషల్ పార్టీ అయినా ఈ మధ్య సెలబ్రిటీలు ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్న కలర్ గోల్డ్. దీనికి సిల్వర్ లేదా మిర్రర్ వర్క్ ని జత చేసి ధగధగలాడే లుక్ ని సొంతం చేసుకుంటున్నారు. కియారా కూడా ఇక్కడ అదే పని చేసింది. పైగా చేతికి గాజులు, ఉంగరం, చెవి రింగులు మ్యాచింగ్ ధరించి సెంటారఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది కదూ.

రఫెల్స్ ఏ అవుట్ ఫిట్ తో అయినా సరే ఇట్టే కలిసిపోయి డ్రస్ అందాన్ని మరింత పెంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కావాలంటే మీరే చూడండి. కియారా ధరించిన గ్రే కలర్ లెహెంగాకు జతగా ధరించిన టాప్ కు ఉన్న రఫెల్డ్ హ్యాండ్స్ డ్రస్ అందాన్ని పెంచడమే కాదు.. కియారాని అందాల బొమ్మలా మెరిసిపోయేలా చేశాయి..
 

 

 


View this post on Instagram


@ridhimehraofficial ✨❤️


A post shared by KIARA (@kiaraaliaadvani) on
లెహెంగా అంటే మరీ హెవీకే ఉండాల్సిన అవసరం లేదు. కియారా ధరించిన ఈ మెరూన్ కలర్ లెహెంగా విత్ నెట్టెడ్ టాప్ ని చూడండి. ప్లెయిన్ గా ఉన్నా చాలా అందంగా ఉంది కదూ.. పైగా దీనికి యాక్సెసరీస్ కూడా పెద్దగా అవసరం లేదు. చెవి రింగులు, గాజులు, చక్కని హెయిర్ స్టైల్ తో కుందనపు బొమ్మని తలపిస్తోంది కదూ..


ఇవి కూడా చదవండి


స్టైలిస్ట్ అవుట్ ఫిట్స్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా.. నిలుస్తోన్న సంజ‌నా గ‌ల్రానీ..!


నటనతోనే కాదు.. తన ఫ్యాషన్స్ తోనూ ఆకట్టుకుంటోన్న తెలుగమ్మాయి ఈషా రెబ్బా..


వావ్.. అనిపించే ఫ్యాషన్స్‌తో అదరగొడుతున్న విష్ణుప్రియ..!