#JoinRishi అంటూ 'ఉగాది'ని స్టైలిష్‌గా మార్చేసిన... మహేష్ బాబు 'మహర్షి' టీజర్

#JoinRishi అంటూ 'ఉగాది'ని స్టైలిష్‌గా మార్చేసిన... మహేష్ బాబు 'మహర్షి' టీజర్

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సినీ కెరీర్‌లో 25వ చిత్రంగా (#SSMB25) మన ముందుకి వస్తున్న మహర్షి (Maharshi) చిత్రానికి సంబందించిన మొదటి ఝలక్‌ను (#JoinRishi ) ఉగాది సందర్భంగా చిత్ర యూనిట్.. కొద్దిసేపటి క్రితమే ప్రేక్షకులకి అందించింది. అభిమానుల కేరింతల మధ్య ఈ సినిమా టీజర్ విడుదలైంది.


ఇంతకీ టీజర్ ఎలా ఉందంటే -


టీజర్ మొదలవుతూనే హెలికాప్టర్ నుండి మహేష్ బాబు దిగే.. స్టైలిష్ షాట్ ప్రేక్షకులకు కనువిందు చేయగా"రిషి కుమార్ సక్సెస్ స్టోరీ ఇక్కడితో ఆగిపోయినట్టేనా?" అన్న ప్రశ్నకి"సక్సెస్ స్టోరీ‌లో ఫుల్ స్టాప్స్ ఉండవు... కామాస్ మాత్రమే ఉంటాయి...సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్ ... సక్సెస్ ఈజ్ ఏ జర్నీ...." (Success is not a destination.... Success is a Journey)


అనే Inspiring Quotation ను మహేష్ బాబు చేత చెప్పించడం విశేషం.


దీనితో మనకి ఈ సినిమా కథ రిషి అనే ఓ యువకుడి ప్రయాణం అని అర్ధమైపోగా.. ఆ తరువాత వచ్చే డైలాగ్‌తో రిషి (Rishi) మనస్తత్వాన్ని కూడా మనకి దర్శకుడు పరిచయం చేసే ప్రయత్నం చేశాడు.


 
 

 

 


View this post on Instagram


Here's RISHI for you... Wishing you all a Happy Ugadi 😊 #JoinRishi #Maharshi ( Link in bio )


A post shared by Mahesh Babu (@urstrulymahesh) on
ఆ డైలాగ్ కూడా చదివేయండి మరి -


నాకొక ప్రాబ్లెమ్ ఉంది సార్... ఎవడైనా నువ్వు ఓడిపోతావంటే.. గెలిచి చూపించడం నాకు అలవాటు!! అనే డైలాగ్‌కు కూడా ప్రస్తుతం అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.


ఈ విధంగా 80 సెకన్ల టీజర్‌లో.. చిత్రంలో కథానాయకుడి వ్యక్తిత్వం గురించి దర్శకుడు చెప్పడానికి ప్రయత్నించడం జరిగింది. దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamsi Paidipally) ఈ చిత్రంలో మహేష్  బాబు‌ని స్టైలిష్‌గా చూపెట్టాడనే విషయం.. ఇటీవలే విడుదలైన పోస్టర్స్‌లో కనిపిస్తే.. ఈ టీజర్ చూసాక ఆ స్టైల్ ఏ రేంజ్‌లో ఉందనే విషయం మనకి అర్ధమవుతుంది.


ఇక మహర్షి చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలైన పూజ హెగ్డే (Pooja Hegde) & అల్లరి నరేష్‌ల (Allari Naresh) గురించి రాబోయే టీజర్స్‌లో చెప్పే ఉద్దేశ్యంతో.. ఈ టీజర్‌ని మహేష్ బాబు‌కి మాత్రమే పరిమితం చేశారు.


ఈ టీజర్ చూసాక మనకి కూడా ఈ సినిమా రేంజ్ ఎలా ఉండబోతుందనే విషయం అర్ధమైపోయింది కదా. మే 9న విడుదలకాబోయే ఈ చిత్రం అటు ప్రేక్షకులని.. ఇటు అభిమానులని అలరిస్తుంది అని ఈ టీజర్ మనకి హింట్ ఇచ్చేసింది.

Subscribe to POPxoTV

ఇక ఈ చిత్రానికి మంచి సాంకేతిక వర్గాన్నే ఎంపిక చేశారు నిర్మాతలు. సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహకుడిగా మోహనన్ మహర్షి చిత్రానికి పనిచేస్తుండగా..  మహేష్ బాబు‌కి ఇష్టమైన యాక్షన్ డైరెక్టర్స్ రామ్-లక్ష్మణ్‌లు ఈ చిత్రానికి వర్క్ చేయడం గమనార్హం.


తెలుగు చిత్రపరిశ్రమలో మూడు భారీ నిర్మాణ సంస్థలుగా పేరెన్నిక గల దిల్ రాజుకి (Dil Raju)  చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ, అశ్వినిదత్ సంస్థ వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) &  పీవీపీ సినిమాలు (PVP Cinema) కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఆ అంచనాలని పెంచే విధంగానే సినిమాని తీశారని తెలుస్తోంది. 


ఇంకొక నెల రోజుల్లో రిషి తన స్నేహితులతో కలిసి మహర్షిగా మన ముందుకి రాబోతున్నాడు...


ఇవి కూడా చదవండి


మహేష్ బాబు వర్సెస్ మహేష్ బాబు: క్రేజీ ఫ్యాన్స్ సమక్షంలో.. ప్రిన్స్ విగ్రహం ఆవిష్కరణ..!


టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన... బాలీవుడ్ క్వీన్ కత్రినా కైఫ్ నటిస్తోందా..?


ఇండియన్ సూపర్ స్టార్స్ సరసన.. మహేష్ బాబుకి దక్కిన అరుదైన అవకాశం..!